సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 815వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన అద్భుతాలు
2. బాబా అనుగ్రహంతో పరిష్కారమైన ఆరోగ్య సమస్య
3. ఊదీతో గొంతునొప్పి మాయం

బాబా ప్రసాదించిన అద్భుతాలు


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వరులు. నా భార్య సరోజినీదేవి అందరి దేవుళ్లను పూజిస్తుంది. బాబా అనుగ్రహంతో పదేళ్లుగా నేను బాబా ఫోటోను ఎదురుగా పెట్టుకుని, బాబా నామాన్ని వింటూ హోమియో మందులషాపు నడుపుతూ ఎంతో ఆనందంగా ఉన్నాను. అందుకు బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరేళ్ళ క్రితం నేను ‘బాబా దీక్ష’ తీసుకున్నాను. ఆ దీక్ష తీసుకోవడానికి నాలుగు రోజుల ముందు, రాత్రి మూడు గంటల సమయంలో నా భార్యకొక కల వచ్చింది. ఆ కలలో ఆమెకు బాబా దర్శనమిచ్చారు. సమాధిలో నుండి బాబా నవ్వుతూ బయటకి వచ్చి, నా భార్య చేత పూలమాలలు వేయించుకుని, హారతి ఇప్పించుకుని, మళ్ళీ సమాధిలోకి నవ్వుతూ వెళ్లిపోయారు. బాబా ఇచ్చిన స్వప్నదర్శనానికి మేమెంతో ఆనందభరితులమయ్యాము. తరువాత నేను దీక్ష తీసుకుని, దీక్షలో భాగంగా ఒకరోజు బాబా భజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. చాలామంది భక్తులు హాజరయ్యారు. భజన ప్రారంభమవడానికి ముందు ఒక దంపతులు తమ కూతురిని వెంటబెట్టుకుని భజన జరిగే చోటుకి వచ్చి, "ఇక్కడ ఏం జరుగుతోంది?" అని అడిగారు. అందుకు మేము "బాబా భజన జరుగుతోంది" అని చెప్పాము. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్లే కాదు, మేము కూడా ఎంతో సంతోషించాము. ఎందుకంటే, ఆ దంపతులు తమతో పాటు తెచ్చిన సైకిలు మీద బాబా ఫోటో ఉంది. వాళ్ల ద్వారా స్వయంగా బాబా మా భజన కార్యక్రమానికి విచ్చేశారని మా అందరికీ అనిపించి ఎంతగానో ఆనందించాము. బాబా ఆశీస్సులతో నేను నా దీక్షను విజయవంతంగా పూర్తిచేశాను.

 

మరో అనుభవం:


మా పాప బాగా చదువుతుంది. కానీ తను చాలా భయస్థురాలు. 2018-19లో తను తన పదవ తరగతి పరీక్షలకు చాలా బాగా సన్నద్ధమైంది. అయితే తనకున్న భయం కారణంగా చాలా ఆందోళనపడుతుండేది. అప్పుడు మేము, "పాపకు భయం పోయేలా అనుగ్రహించండి బాబా, శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటామ"ని బాబాకు మ్రొక్కుకున్నాము. తరువాత పరీక్షలు మొదలయ్యాయి. మేము నమ్మలేకపోయాము. బాబా మా పాపకు, 'నీకు భయం లేదు. నేను ప్రక్కనే ఉన్నాను' అంటూ ధైర్యాన్నిచ్చారు. అదెలా అంటే, పరీక్షా కేంద్రంలో మా పాప ప్రక్కసీటులోని విద్యార్థిని పేరు 'లీలానాగసాయి'. ఆ విధంగా తామే మా పాప ప్రక్కన ఉండేలా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు బాబా. బాబా చూపిన అద్భుతం వల్ల మాకు కలిగిన ఆనందానికి అవధులు లేవు. బాబా అనుగ్రహం వల్ల మా పాప పదవ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఫలితాలు వచ్చిన వెంటనే మేము కుటుంబసమేతంగా శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని మా మ్రొక్కు తీర్చుకున్నాము. మూడు రోజులు బాబా సన్నిధిలో ఆనందంగా గడిపి తిరిగి ఇల్లు చేరుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు, నా భార్యకు, మా పాపకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మా ఆర్థిక పరిస్థితి బాగుండేలా ఆశీర్వదించండి. బాబా! ఒక సంవత్సర కాలంగా నా ఛాతీ కుడివైపు క్రిందభాగంలో నొప్పి వస్తోంది. మందులు వాడినా నొప్పి తగ్గడం లేదు. నా ఈ సమస్యను మీ కృపాకటాక్షాలతో పరిష్కరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రీ".


బాబా అనుగ్రహంతో పరిష్కారమైన ఆరోగ్య సమస్య


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు మణి. సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. అయితే అవన్నీ నాకు స్పష్టంగా గుర్తులేనందుకు క్షమించాలి. కానీ ఈ బ్లాగ్ ద్వారా పంచుకుంటున్న అనుభవాలు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే, అవి నాకు చాలా అనుభూతినిచ్చాయి. ఎవరి సమస్యకై వాళ్ళు తమ అనుభవాలను ఈ బ్లాగులో పంచుకుంటున్నారు. కానీ విచిత్రంగా, నాకున్న సమస్య కోసమే బాబా వాటిని పంపించారని నాకనిపిస్తోంది. ఇకపోతే, ఇప్పుడు చెప్పబోయేది ఈ బ్లాగులో నేను పంచుకుంటున్న మొదటి అనుభవం.


2020, ఏప్రిల్ 26వ తేదీ నుండి నేను చాలా చాలా అస్వస్థతకు గురయ్యాను. ముక్కు ద్వారా ఊపిరి ఆడక నోటి ద్వారా ఊపిరి తీసుకుంటూండేదాన్ని. రాత్రిళ్ళు పడుకుంటే ఊపిరి అందేది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు వాడాను. కానీ వాటివలన ఎటువంటి ఫలితమూ కనిపించలేదు. ఇంక నేను, "తండ్రీ! నాకున్న ఈ అస్వస్థత పోయి, నా ఆరోగ్యం బాగుండాలి" అని బాబా మీదే భారం వేసి, ప్రతిరోజూ కొద్దిగా బాబా ఊదీ పెట్టుకుని, మరికొంత నీటిలో కలుపుకుని త్రాగుతుండేదాన్ని. అనుకోకుండా ఒకరోజు మా ఇంటి దగ్గర ఉన్న బాబా మందిరంలోని పంతులుగారి వద్ద నా సమస్య గురించి ప్రస్తావించాను. ఆయన పచ్చకర్పూరం నాకిచ్చి, నోటిలో వేసుకోమన్నారు. నేను అలాగే చేశాను. అప్పటినుండి నా ఆరోగ్యం కుదుటపడింది. ఆవిధంగా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన సాయిబాబాకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను.


ఊదీతో గొంతునొప్పి మాయం


అందరికీ నమస్కారం. నా పేరు సత్యసాయి. నేనిప్పుడు బాబా ఊదీ మహిమను మీతో పంచుకుంటున్నాను. 2021, మే 20 సాయంత్రం అకస్మాత్తుగా మా అమ్మగారికి గొంతునొప్పి రావడంతో మాకు చాలా భయం వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. రెండు, మూడు గంటలయ్యాక అమ్మ బాబాను తలచుకుని, "బాబా! మీ దయతో ఈ గొంతునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మనసులోనే అనుకుంది. తరువాత కొంచెం బాబా ఊదీ పెట్టుకుని, మరికొంత ఊదీని నీటిలో కలుపుకుని త్రాగి పడుకుంది. ఆశ్చర్యంగా కొన్ని గంటలుగా అమ్మ పడుతున్న బాధ కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత అమ్మ యథావిధిగా రాత్రి వంట కూడా చేసింది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. అమ్మలాగానే ఎంతోమంది అమ్మలు చాలా బాధలు పడుతున్నారు. వాళ్లందరికీ వారివారి బాధల నుంచి ఉపశమనం కలిగించు బాబా. అలానే కరోనా మహమ్మారి వలన భారతమాత పడుతున్న బాధను తొలగించు. ఇంకా కరోనా నుంచి మా అందర్నీ కాపాడుతార"ని ఆశిస్తూ... నమస్కారములు.



14 comments:

  1. Om Sai ram baba you are great.you are saving us from viruses. Om baba I like you and love you baba 🌹🌸🌺🌺🌷☘️

    ReplyDelete
  2. Om Sai ram please baba blessings are need to our family.my request is be with us and proctect us from this pandemic. Om Sai ram baba 🌹🌸🥀🌺🌺🌷☘️

    ReplyDelete
  3. Om sai ram, baba dady polam pani ayyaka chudandi na anubhavani blog lo panchukuntanu sai thandri

    ReplyDelete
  4. Om SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  5. Kothakonda SrinivasJune 24, 2021 at 1:28 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. 🌸🌺⚘🌷🌻OM SRI SAIRAM🌻🌷⚘🌺🌸

    ReplyDelete
  7. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  8. Baba santosh life bagundali thandri pleaseeee

    ReplyDelete
  9. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  10. Baba rakshinchu thandri please

    ReplyDelete
  11. Baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  12. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo