సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 813వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకు భక్తులుగా మలచిన అనుభవం
2. బాబాకు వదిలేస్తే, సాధ్యం కాని పనంటూ ఉండదు
3. బాబా తప్పక సహాయం అందిస్తారు

బాబాకు భక్తులుగా మలచిన అనుభవం


నేను సాయిభక్తురాలిని. ఆన్లైన్‌లో ఈ బ్లాగును చూసి నేను చాలా సంతోషపడి మొదటిసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. సాయి చరిత్ర పారాయణ చేసినప్పటినుండి ఎన్నో అనుభవాల ద్వారా మేము బాబా అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఒకప్పుడు మేముండే పట్టణానికి సమీపంలో మా నాన్నగారు ఒక స్థలం తీసుకున్నారు. మొదట అంతా సక్రమంగానే సాగింది. కానీ చివరిలో సమస్యలు ఎదురయ్యాయి. వాళ్ళు మా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి చాలా తక్కువ సమయం ఇచ్చారు. నాన్న చాలా టెన్షన్ అనుభవించారు. మేము బాబా లీలలు చాలా విన్నాము. ఒక శుభ గురువారంనాడు నాన్న బాబా చరిత్ర చదవడం మొదలుపెట్టారు. బాబా దయవల్ల నాల్గవరోజు మేము శుభవార్త విన్నాము. స్థలం విషయంలో వాళ్ళు తమ ఆమోదం తెలిపి దస్తావేజులు మాకు అందజేశారు. మేము చాలా చాలా ఆనందించాము. అంతటితో మేము బాబా భక్తులమయ్యాము. ఆనందంతో శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అలా మొదటిసారి మేము శిరిడీ పుణ్యభూమిలో అడుగుపెట్టాము. బాబా మాకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మేము శిరిడీ వెళ్లి, బాబా ఆరతికి తప్పనిసరిగా హాజరవుతున్నాము. అది మొదలు ఇప్పటికీ మేము బాబా చరిత్ర పారాయణ చేస్తున్నాము. బాబా మాకు చక్కటి అనుభవాలెన్నో ప్రసాదించారు. చాలా సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజూ వేకువఝామున బాబాకి ఆరతి ఇస్తున్నాము. మేము బాబాని చాలా చాలా ప్రేమిస్తాము. మేము ఎంతగా బాబాని ప్రేమిస్తామో మాటల్లో చెప్పలేను. నా పిల్లలిద్దరికీ 'సాయి' అని కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నాను. నాకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది. మా అత్తగారి వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఆమె కలహస్వభావి, చాలా ప్రతికూల మనస్తత్వం గలది, ఎవరిలోనూ మంచిని చూడలేదు. అందరినీ టెన్షన్ పెడుతుంది. ఆమె వల్ల ప్రతిరోజూ మేము సమస్యలు ఎదుర్కొంటున్నాము. అయితే బాబా దయవల్ల అంతా సజావుగా నడుస్తోంది. నా భర్త నాకు అండగా ఉంటారు. "బాబా! ఇప్పటికీ ఆమెలో మార్పు లేదు. దయచేసి వీలైనంత తొందరగా ఆమెలో మార్పు తెచ్చి మా సమస్యలను పరిష్కరించండి. టెన్షన్స్ లేకుండా మేమంతా ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించండి".


బాబాకు వదిలేస్తే, సాధ్యం కాని పనంటూ ఉండదు


నా పేరు శైలజ. నేను సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులకి, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం చూసేందుకు మామూలుగా అనిపించినా నాకు మాత్రం అది బాబా ప్రసాదించిన గొప్ప అనుభవం. మేముండే ప్రాంతంలో వాతావరణం ఏ మాత్రమూ బాగుండదు. ఎయిర్ కండిషనర్ లేకపోతే అస్సలు ఉండలేము. అలాంటిది అనుకోకుండా మా ఎయిర్ కండిషనర్ పాడైంది. కొత్తది కొనుక్కుందామంటే లాక్డౌన్ కాలం. పైగా ప్రస్తుతం వస్తున్న ఎయిర్ కండిషనర్ సైజులు మా కిటికీకి సరిపోయేటట్టు రావడం లేదు. ఎంత ప్రయత్నించినా మాకు కావలసిన సైజులో దొరకడం లేదు. అటువంటి స్థితిలో 'ఇప్పుడెలా?' అని ఆలోచిస్తుంటే బాబానే మాకు దారి చూపారు. బాబా ఒక షాపతని చేత మాకు ఫోన్ చేయించారు. అతను సరిగ్గా మా కిటికీకి సరిపోయే సైజు ఎయిర్ కండిషనర్ తనవద్ద ఉందని చెప్పాడు. మావారు ఆలస్యం చేయకుండా డబ్బులు అతనికి ట్రాన్స్‌ఫర్ చేసి ఎయిర్ కండిషనర్ కొనేశారు. అయితే, 'అది మా కిటికీకి సరిపోతుందా' అని నాకు అనుమానంగా ఉండేది. ఆ సాయంత్రానికల్లా ఎయిర్ కండిషనర్ ఇంటికి వచ్చేసింది. దాన్ని ఫిక్స్ చేసే పనివాళ్ళు కూడా వచ్చేశారు. దాని సైజు చూస్తూనే, ఒకప్రక్క 'అది మా కిటికీకి సరిపోతుందా' అని చాలా అనుమానం, మరోప్రక్క '4వ అంతస్థులో ఉన్న మా ఇంటి కిటికీకి అంత పెద్ద ఎయిర్ కండిషనర్ ఫిక్స్ చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా జరిగితే ఎలా' అని ఏదో తెలియని టెన్షన్. అప్పుడు బాబాను తలచుకుని, "తండ్రీ! ఈ పని ఏ టెన్షన్ లేకుండా సాఫీగా పూర్తయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి సమస్యా లేకుండా పదినిమిషాల్లో ఎయిర్ కండిషనర్ ఫిక్స్ చేసి పనివాళ్ళు వెళ్లిపోయారు. ఈ లాక్డౌన్‌ సమయంలో ఎయిర్ కండిషనర్ దొరకడం, అదీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఫిక్స్ అవడం గురించి నిజంగా నేను ఎంత టెన్షన్ పడ్డానో! అంతా నా తండ్రి బాబా దయనే. బాబాకు వదిలేస్తే, సాధ్యం కాని పనంటూ ఉండదు. మన పనులు చిన్నవైనా, పెద్దవైనా బాబా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


బాబా తప్పక సహాయం అందిస్తారు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు లక్కరామ్. బాబా ప్రసాదించిన నా అనుభవమొకటి మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2021, ఏప్రిల్ 18 ఉదయం నేను నిద్రలేచేసరికి మా ఇంటి ప్రక్కన ఉన్న బావిలో ఒక కుక్క పడింది. దానిని కాపాడటానికి ఏం చేయాలో నాకు తెలియలేదు. నా తండ్రి సాయి దగ్గరకు వెళ్లి, "తండ్రీ! నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. కానీ, ఆ కుక్క బావిలో నుంచి బయటపడాలి" అని బాబాకు నమస్కరించుకున్నాను. తరువాత బాబా నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎవరూ దానిని బయటకు తీయడం లేదు. నేను ఏమీ చేయలేక 'ఓంసాయి, ఓంసాయి' అనుకుంటూనే ఉన్నాను. బాబా దయవలన కొద్దిసేపటి తర్వాత కొందరు విద్యార్థులు వచ్చి ఆ కుక్కను బావిలో నుంచి బయటకు తీశారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ ఆనందంలో నా సాయితండ్రికి శతకోటి నమస్కారాలు తెలుపుకున్నాను. సాయి మనతో ఎప్పుడూ ఉంటారు. ఏదో ఒక విధంగా సహాయం అందిస్తారు.




10 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Kothakonda SrinivasJune 22, 2021 at 9:58 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om sai ram baba blessed all devotees in this group.that's why udi is medicine to all.baba cured all people. He is Lord. Om sai ram❤❤❤

    ReplyDelete
  4. You and i all are sai kids. He takes care of all. Why worry.baba i love you tandri. Om sai ram❤❤

    ReplyDelete
  5. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri please

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh Carrier bagundali day shifts ravali thandri

    ReplyDelete
  8. 🌺🌸🌺🌟🙏🙏🙏🌟🌺🌸🌺 OM Sai Ram

    ReplyDelete
  9. Namaneeswaram Sadgurum Sainatham 🔥🔥🔥🌼🌼🌼🌹🌹🌹💐💐💐🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo