ఈ భాగంలో అనుభవాలు:
- సమస్యను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
- సమస్యకి తుదినిర్ణయం చూపిన బాబా
- సాయినాథుని దయతో తగ్గిన జ్వరం
సమస్యను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నాపేరు మాధవి. నేను సాయిభక్తురాలిని. నా ప్రతి అడుగులోనూ బాబా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఇలా ఉన్నాను అంటే కారణం బాబా. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబానే. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురింపబడే సాయిబంధువుల అనుభవాలు చదువుతూ బాబా ప్రేమను ఆస్వాదిస్తున్నాను. నేను కూడా బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకొనే అవకాశాన్ని బాబా నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
సమస్యకి తుదినిర్ణయం చూపిన బాబా
ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. సాటి సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఒక అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకోబోతున్నాను.
నాకు పుట్టుకతోనే గుండెకి రంధ్రం ఉన్నది. ఇప్పుడు నా వయస్సు 26 సంవత్సరాలు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ వద్దకు చెకప్‌కి వెళతాను. ఇప్పటివరకు నాకున్న ఈ సమస్యకి ఎలాంటి ఆపరేషన్ జరగలేదు. నేను బాబాను 7 సంవత్సరాల నుండి నమ్ముతున్నాను. మేము ఇద్దరం కవలపిల్లలం. మా సిస్టర్‌కి వివాహమైంది. ఇప్పుడు నాకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. నా పరిస్థితి చూసి నన్ను అర్థంచేసుకుని పెళ్ళి చేసుకునే వరుడి కోసం నా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నేను చూపించుకునే డాక్టర్, “పరిస్థితి బాగానే ఉంది, ఆపరేషన్ అవసరం లేదు” అని చెప్పేవారు. అయినప్పటికీ, నాకున్న సమస్య నా వివాహానికి ఏమైనా ఆటంకంగా ఉంటుందేమో అనే సందేహంతో ఆ విషయం గురించి మరో ఇద్దరు డాక్టర్లను అడిగి తెలుసుకోవాలనుకున్నాము. ఇంటినుంచి బయలుదేరేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నా కోసం ఒక మంచి డాక్టర్ని చూపించు. తను చెప్పే నిర్ణయమే నా సమస్యకి తుదినిర్ణయం అయ్యేలా చెయ్యి” అని పదేపదే వేడుకున్నాను. తరువాత బయలుదేరి ముందుగా ఒక హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడి డాక్టర్ చెప్పింది మాకు సవ్యంగా అనిపించలేదు. పైగా, ఆరోజు ఉదయం నుండి నాకు బాబా ఏ రూపంలోనూ దర్శనం ఇవ్వలేదు. నేను మనసులో బాబాను స్మరించుకుని, “నాకున్న సమస్యకి సరైన పరిష్కారం సూచించే మంచి డాక్టర్ని చూపిస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. తరువాత వేరొక హాస్పిటల్‌కి వెళ్తున్నప్పుడు చివరిగా ఒక వ్యాన్ మీద బాబా ఫోటో కనపడింది. ఆ రోజంతా ఎక్కడా కనపడని బాబా చివరికి ఆ హాస్పిటల్‌కి చేరుకోబోయే ముందు కనిపించారు. ఆ డాక్టర్ గారు నన్ను పరీక్షించి, “అంతా బాగుంది, నువ్వు సంతోషంగా పెళ్ళి చేసుకోవచ్చు. నీ పరిస్థితికి ఆపరేషన్ అవసరం లేదు. భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే అప్పుడు చూద్దాం” అని చెప్పారు. ఆ మాట వినగానే సంతోషంతో మనసులోనే బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.
“బాబా! నేను ఒక సమస్య గురించి మీతో చెప్పాను. సంవత్సరం నుండి ఆ సమస్యకు ఏ రూపంలోనూ మీ సమాధానం నాకు లభించలేదు. నాకు పూర్తిగా మీపైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. మీరు నాకేది మంచిదో అదే ఇస్తారు. నాకున్న సమస్య గురించి మీతో చెప్పుకుని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఓపెన్ చేస్తే మెసేజ్‌లు సానుకూలంగా వచ్చాయి. కానీ నా సమస్య మాత్రం పరిష్కారం దిశగా కొంచెం కూడా ముందుకు వెళ్ళట్లేదు. నేను వివాహం చేసుకోబోయే వ్యక్తిని మీరు ఆమోదించాలని నా కోరిక. దానికోసమే నేను ఎదురుచూస్తున్నాను. ఇక మీ దయ బాబా. నా జీవితంలోకి ఎవరిని పంపిస్తే నా జీవితం బాగుంటుందో మీకే బాగా తెలుసు. కానీ నాకు నచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. తను నాకోసం ఎదురుచూస్తున్నాడు. మీ ద్వారా మేము కలవాలని, ఒక్కటవ్వాలని అనుకుంటున్నాను బాబా”.
బాబా ఇచ్చిన సమాధానంతో మరలా మీ ముందుకు వస్తాను.
సాయినాథుని దయతో తగ్గిన జ్వరం
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథునికీ జై!
చక్కటి బ్లాగుని అందించిన సాయినాథునికి పాదాభివందనాలు. నా పేరు మల్లీశ్వరి. నేను సాయిభక్తురాలిని. నేను పదిహేను సంవత్సరాల నుంచి సాయిని పూజిస్తున్నాను. మా విషయంలో అన్నీ ఆ సాయినాథుడే చూసుకుంటున్నాడు. ఈమధ్య మావారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ రాత్రి ఆయనకు విపరీతమైన చలిజ్వరం, ఒళ్ళునొప్పులు వచ్చాయి. ఇంట్లో ఉండేది మేమిద్దరమే అయినందున మాకు చాలా ఆందోళనగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! సాయినాథా! ఈ పరిస్థితిలో నీవే మమ్మల్ని కరుణించాలి నాయనా. తెల్లవారేసరికల్లా మావారికి నయమైతే ఈ అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించి నిద్రపోయాను. బాబా దయవలన తెల్లవారేసరికి మావారికి పూర్తిగా తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ". ఇంకా నేను మీతో ఎన్నో అనుభవాలు పంచుకోవాలి. కానీ ఇలా పంచుకోవడం నాకు కొత్త. ఇదే నేను పంచుకుంటున్న మొదటి అనుభవం. కాబట్టి ఇంకోసారి మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
Om Sri Sai Ram ��������
ReplyDeleteOm sai ram leelas are nice.baba cured all problems to devotees.baba you can't see sufferings of your devotees. You will help and give blessings to them. You are GOD in human form.we are your children,please bless us. Om sai ram ������❤❤❤❤
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteTo the woman who has written the second experience: please see Dr.Khadar Vali vidoes. Siridhanyas are very good for curing and maintaining all health conditions.
ReplyDeleteBaba has suggested me the same and cured my pcod, thyroid & fatty liver problems.
om sairam
ReplyDeleteom sairam
om sairam
Om sai ram baba amma problem tondarga cure cheyi thandri please
ReplyDeleteBaba ee gadda ni tolginchu thandri
ReplyDeleteSai santosh ki day shifts ravali thandri enka samasayalu ani povali thandri bada ga vundhi thandri kapadu thandri sainatha
ReplyDeleteBaba motion lo blood padtundhi adhi taggipovali thandri please
ReplyDeleteOm Sairam
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయసాయి
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete