- ఈరోజు నాకు బాబు ఉన్నాడు అంటే, అదంతా నా తండ్రి బాబా చలవే!
- సాయి కృప - కోమా నుండి బయటపడ్డ స్నేహితుడు
ఈరోజు నాకు బాబు ఉన్నాడు అంటే, అదంతా నా తండ్రి బాబా చలవే!
సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఎప్పటినుంచో ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఉన్నాను. ఇప్పుడు నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. నా పేరు జానకి. ఈరోజు నాకు మా బాబు ఉన్నాడు అంటే అదంతా నా తండ్రి బాబా చలవే. నేను గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగ్ చేసిన డాక్టర్, “గర్భసంచికి చీలిక ఉంది, లోపల బిడ్డ పెరుగుదల సరిగా ఉండదు” అని చెప్పారు. నాకు ఏం చేయాలో తోచక బాధపడుతూ ఉండేదాన్ని. 3వ నెలలో బాగా రక్తస్రావం జరిగి నాకు ఆందోళన ఎక్కువై తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నప్పుడు మా అత్తయ్య తమ్ముడు (నాకు బాబాయి వరుస అవుతారు) వచ్చి, “నీకేమీ కాదు. బాబాను నమ్ముకో! నీకు కొడుకు పుడతాడు, ఏం భయపడకు!” అని అన్నారు. తరువాత నేను, మా అత్తయ్య హాస్పిటల్‌కి వెళ్ళాము. ఆ డాక్టర్ స్కానింగ్ చేసి బ్లీడింగ్ కాకుండా మందులిచ్చారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ పరిశీలించిన డాక్టర్, “అంతా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. అంతా దేవుడి దయ” అని అన్నారు. ఒక ముఖ్య విషయం చెప్పాలి, నేను ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. స్కానింగ్ తీసేటప్పుడు కూడా నా ఎదురుగా బాబా ఫోటో ఉంది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నా బిడ్డని రక్షించు” అని వేడుకున్నాను.
ఇంటికి వచ్చిన తరువాత మా బాబాయ్ నాకు సాయిసచ్చరిత్ర, 9 గురువారాల పుస్తకాలు ఇచ్చారు. నేను 3 వారాలు మాత్రమే పారాయణ చేసి, ‘కడుపుతో ఉన్నప్పుడు పారాయణ చేయకూడదు’ అని అందరూ చెప్పేసరికి పారాయణ చేయడం ఆపేశాను. కానీ నా బాబాను స్మరించుకుంటూ ఉండేదాన్ని. ప్రతినెలా చెకప్‌కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారీ ఆ డాక్టర్, “బాబు పెరుగుదల సరిగా ఉంటుందని నమ్మకం లేదు, అంతా దేవుడి దయ” అని అనేవాళ్ళు. కానీ వాళ్ళకు తెలియదుగా, నా బాబా నాకు మేలు చేస్తాడని. అయినా నాకు లోపల మాత్రం భయంగానే ఉండేది. చివరికి 2015, ఫిబ్రవరి 15న డెలివరీ డేట్ ఇచ్చి, ఆరోజు సిజేరియన్ చేస్తామని చెప్పారు. ఈ 9 నెలలు ఎంత బాధపడ్డానో అది నా బాబాకు మాత్రమే తెలుసు. నా బాబా నాకు ఎంత పరీక్ష పెట్టినా చక్కని ఫలితాన్నే ఇస్తారని నాకు తెలుసు. ఆ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళేటప్పుడు ఒక్కటే అనుకున్నా, ‘బాబానే డాక్టర్ రూపంలో వచ్చి నా బిడ్డను రక్షిస్తారు’ అని. నాకు గర్భసంచి చీలిక ఉండేసరికి లోపల బాబు తల పైకి, కాళ్ళు క్రిందకి ఉండేవి. ఆపరేషన్ థియేటరులో డాక్టర్లు, “ఈ అమ్మాయి గర్భసంచికి చీలిక ఉంది, ఆపరేషన్ కొంచెం కష్టం” అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బాగా భయమేసి 'బాబా, బాబా' అని స్మరించుకుంటూ ఉన్నాను. చివరికి బాబా అనుగ్రహంతో ఆపరేషన్ సక్సెస్ అయింది. “నీకు బాబు పుట్టాడు” అని ఆ డాక్టర్ చెప్పేసరికి నాకు బాగా ఏడుపు వచ్చేసింది. “బాబాకు నేనంటే ఎంత ప్రేమో” అని ఎంతో ఆనందం వేసింది. “బాబు ఎదురుకాళ్ళతో పుట్టాడు, కృష్ణుడు కూడా ఎదురుకాళ్ళతోనే పుట్టాడు” అని అందరూ అన్నారు. కానీ ఎంతటి కష్టమైనా నా బాబాకు చెప్పుకుంటే అది కొంచెం ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. నా విషయంలో కూడా అలానే జరిగింది. ఎందుకంటే, ప్రతి 500 మంది అమ్మాయిలలో ఒకరికి గర్భసంచి సమస్యలు ఉంటాయి. నాలాంటి సమస్యలున్న అమ్మాయిలు కూడా అదే హాస్పిటల్లో జాయినయ్యారు. కానీ వాళ్ళలో ఒకరికి 3వ నెలలోను, ఇంకొకరికి 6వ నెలలోను అబార్షన్ అయింది. ఈ విషయం తెలిసి నేను బాధపడ్డాను. నాకు ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ నా బాబా నన్ను రక్షించారు. కాకపోతే, బాబు ఉమ్మనీరు బాగా మింగాడని హైదరాబాదుకి వెళ్ళి బాబుని చిన్నపిల్లల హాస్పిటల్లో చేర్చి 10 రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాము. బాబుని పరీక్షించిన డాక్టర్లు, “బాబు ఉమ్మనీరు బాగా త్రాగాడు. ఇన్‌ఫెక్షన్ బాగా చేరింది. బాబుకు 5 సంవత్సరాలు వచ్చేవరకు తనను జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పారు. బాబు పుట్టినప్పటినుంచి బాబాను తలచుకుంటూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబుకి బాబా ఊదీని పెట్టేదాన్ని. ఇప్పుడు మా బాబుకు 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు బాబానే నా కొడుకుని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇకముందు కూడా ఆయనే జాగ్రత్తగా చూసుకుంటారు. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ బాబానే అన్నీ చూసుకుంటూ ఉన్నారు. బాబా తన సూక్తుల్లో, “మీ భారం నా మీద పడవేయండి, నేను చూసుకుంటాను” అని అన్నారు కదా! ఆయన్ని(నా బాబాను) నమ్ముకుంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటారు.
సాయి కృప - కోమా నుండి బయటపడ్డ స్నేహితుడు
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పూజ. 2020, ఆగస్టు 20వ తేదీన నా స్నేహితుడు మరికొంతమందితో కలిసి బెంగళూరు వెళ్తుండగా ఒక మేజర్ యాక్సిడెంటుకి గురయ్యాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న అతను అక్కడికక్కడే చనిపోయాడు. నా స్నేహితుడు కోమాలోకి వెళ్లాడు. కారులో ఉన్న మిగిలిన ఇద్దరికీ పెద్ద దెబ్బలు తగిలాయి. ఈ వివరాలేవీ నాకు తెలియవు. ఈ సంఘటన జరిగిన పదిరోజుల తర్వాత, "నీ చావు నేను తీసివేశాను" అని బాబా మెసేజ్ ఒకటి నాకు వచ్చింది. ఇలా వచ్చిందేమిటని ముందు బాధపడ్డాను. తరువాత, 'ఎవరికైనా ఆరోగ్యం బాగలేదా ఏమిటి?' అని నేను చాలా ఆలోచించాను. అదే సమయంలో, "నా స్నేహితునికి యాక్సిడెంట్ అయి, కోమాలో ఉన్నాడ"ని నా స్నేహితుల గ్రూపునుండి మెసేజ్ వచ్చింది. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడి, "తనకి ఏమీ కాకూడదు" అని బాబాను చాలా ఆర్తిగా ప్రార్థించాను. అంతేకాదు, నా స్నేహితుని కోసం నిత్యం నేను బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్నిరోజులు గడిచాక సెప్టెంబరు 20వ తేదీన నాకు, "నీ ఆరోగ్యం కుదుటపడుతుంది" అని బాబా నుండి మరో మెసేజ్ వచ్చింది. అది చూసి, 'బాబా అనుగ్రహం వలన త్వరలోనే నా స్నేహితుడు పూర్తిగా కోలుకుంటాడ'ని నేను చాలా ఆనందపడ్డాను. తరువాత అక్టోబరు 4వ తేదీన నా స్నేహితుడు కోమాలో నుంచి బయటకు వచ్చినట్టు కబురు తెలిసింది. ఆరోజు సాయంత్రం తను మా అందరితో ఫోన్లో మాట్లాడాడు కూడా. మేమందరమూ చాలా ఆనందించాము. ఇదంతా సాయి కృప. "బాబా! మీ చల్లని చూపు అందరిమీదా ఉండాలని, ఎల్లప్పుడూ ఇలాగే మీరు మాకు రక్షణనిస్తూ ఉండాలని వేడుకుంటూ మీకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు".
om sai ram i love you nanna.you bless my son also
ReplyDeleteJai sairam
ReplyDeleteBabu maku arogyani prasadinchandi sai
ReplyDeleteJai sairam
ReplyDeleteజై సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeletesai always be with me
544 sairam
ReplyDeleteJai Sree Sai Ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl
ReplyDeleteOm sri sairam 🙏🙏💐💐
ReplyDeleteBAABAA SAYS...,
ReplyDelete"" TRUST ME..,
AND GO WHEREVER IN THE WORLD..., WATCH., HOW YOU WILL BE PROTECTED FROM ALL SIDES..."""
BAABAA SAYS...,
ReplyDelete"" ETA NEYNUNDAA NEEKU BHAYAMELAA.,
NEE BHAARAMUNU NAAPAI NIDIMU. ""