1. శ్రీసాయి అనుగ్రహ జల్లులు
2. కడుపునొప్పి తగ్గించిన బాబా
3. బాబా బ్లెస్సింగ్స్
శ్రీసాయి అనుగ్రహ జల్లులు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఈ బ్లాగు - 'ఆధునిక సచ్చరిత్ర'. దీనిని చదవడం ద్వారా 'మాయ'లో పడకుండా నిత్యమూ తమ సన్నిధిలో ఉండేలా అనుగ్రహిస్తూ బాబా మనల్ని రక్షిస్తున్నారు. నాపేరు చైతన్య. మనం రోజూ బాబా అనుగ్రహాన్ని ఎన్నో అనుభవాల రూపంలో అనుభవిస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఇది అనుభవం అని చెప్పడానికి లేదు. అంతా బాబాకు మనపై గల ప్రేమకు నిదర్శనం. ఆయన మన సమస్యలను పరిష్కరిస్తూ, కోరికలను తీరుస్తూ మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.
ఒకరోజు నాకు బాగా నడుము నొప్పి, కడుపు నొప్పి వచ్చాయి. హాస్పిటల్‍కి వెళ్తే డాక్టరు ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేసారు. రిపోర్టులో చిన్న 'సిస్ట్స్' (తిత్తులు) ఉన్నాయి అని వచ్చింది. దాంతో డాక్టరు సర్జరీ చేయాలన్నారు. మేము మాకు తెలిసిన డాక్టరుకి ఆ రిపోర్టులు చూపించి, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని అనుకున్నాము. అయితే ఆ డాక్టరు దగ్గరకి వెళ్ళేముందు నేను, "బాబా! హాస్పిటల్‍కి వెళ్తున్నాను. డాక్టరు రిపోర్టులు చూసి సర్జరీ అవసరం లేదని చెప్పేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన డాక్టరు, "సర్జరీ ఏమీ అవసరం లేదు" అని చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకరోజు మా చిన్నబాబుకి బ్రీతింగ్ సమస్య వచ్చి శ్వాస తీసుకోడానికి చాలా కష్టపడ్డాడు. మాకు చాలా భయమేసి బాబుని ENT డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్తే, డాక్టరు బాబుని పరిశీలించి, "గుండె సమస్య ఏమీ లేదు" అని చెప్పి ముక్కులో వేసుకునే నాసల్ డ్రాప్స్ ఇచ్చారు. బాబా దయవల్లే చిన్నదానితో సమస్య పరిష్కారమైంది. "ధన్యవాదాలు బాబా! మా పిల్లలకి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉండండి బాబా".
మా మామయ్యగారికి చాలారోజులు నుంచి ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే నేను, "బాబా! మామయ్యగారికి ఎక్కిళ్ళు తగ్గేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మామయ్యగారికి ఎక్కిళ్ళు ఆగిపోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
బాబా ఇచ్చే అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 2022లో మా చెల్లివాళ్ళ బాబుకి నూతన వస్త్రాలంకరణ చేద్దామనుకున్నాము. కాని అందరూ, "ఎండలు బాగా ఉన్నాయి. ఈ ఎండల్లో పిలిచిన వాళ్ళందరూ ఎలా వస్తారు? మరోసారి ఎప్పుడైనా పెట్టుకోవాల్సింది" అని అన్నారు. మా చెల్లి 'సాయి సచ్చరిత్ర' సప్తాహ పారాయణ చేసి, "బాబా! మా అబ్బాయి ఫంక్షన్‍కి అందరూ వచ్చేలా చూడండి" అని వేడుకుంది. మే 12న ఫంక్షన్ అనగా సరిగా అదే సమయంలో తుఫాను ఉందని వార్త వచ్చింది. అది వినగానే మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! ఫంక్షన్ ఏ ఇబ్బంది లేకుండా జరగాలి. ఇంకా అందరూ ఫంక్షన్‍కి వచ్చేలా చూడండి" అని అనుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. ముందురోజు అంతా వర్షం పడినప్పటికీ ఫంక్షన్ రోజు ఎండ, వాన రెండూ లేవు. ఆరోజు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. మేము అనుకున్నదానికంటే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అందరూ వచ్చి బాబుని ఆశీర్వదించారు. "థాంక్యూ బాబా. మీరు కూడా ఏదో ఒక రూపంలో ఫంక్షన్‍కి వచ్చి, అబ్బాయిని ఆశీర్వదించి ఉంటారు. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే అనుగ్రహిస్తూ ఉండండి. మా అందరి మీద మీ కృప సదా ఉండేలా దీవించండి బాబా".
కడుపునొప్పి తగ్గించిన బాబా
అందరికీ నమస్కారం. మన ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిజంగా చాలా పెద్ద అద్భుతం. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకరోజు సాయంత్రం నేను బాబా చరిత్ర పారాయణ చేస్తున్న సమయంలో మావారు, "హఠాత్తుగా కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను" అని అన్నారు. ఆయన అలా చెప్పేసరికి నాకు కొంచం టెన్షన్‍గా అనిపించినప్పటికీ, "సరేన"ని చెప్పి పారాయణ కొనసాగించాను. కాసేపటికి మావారు, "కాస్త కడుపునొప్పిగా ఉంద"ని చెప్పారు. ఇంకాసేపటికి ఆయనకి వాంతి కూడా అయింది. నేను, "బాబా! నువ్వే కాపాడు తండ్రి" అని చెప్పుకుని బాబా నామస్మరణ చేశాను. తరువాత మావారు తనకి "కడుపునొప్పి వస్తూ, తగ్గుతూ ఉంద"ని చెప్తే, బాబా ఊదీ ఆయనకి పెట్టాను. కానీ మనసులో కొంచం టెన్షన్‍గా అనిపించి బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. మావారు మొత్తం 3 సార్లు వాంతి చేసుకుని, "సమయం గడిచేకొద్ది నొప్పి ఎక్కువ అవుతుంద"ని చెప్పారు. నిజానికి మావారికి ముందునుంచి కడుపునొప్పి ఉంది. అందుకోసం ఆయన హోమియో డాక్టరు చెప్పిన మందులు వాడుతున్నారు. ఆ డాక్టరు ఏదైనా ఇబ్బంది ఉంటే వేసుకోమని వేరే టాబ్లెట్స్ కూడా ఇచ్చి ఉన్నారు. నేను ఆ టాబ్లెట్లు మావారికి వేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. పోనీ హాస్పిటల్‍కి వెళ్దామంటే, మావారు వద్దన్నారు. దాంతో నేను మళ్ళీ మావారికి బాబా ఊదీ పెట్టాను. తరువాత ఆయన 4వ సారి వాంతి చేసుకుంటునప్పుడు ఆయన పడుతున్న భాద చూసి నేను, "బాబా! నువ్వే కాపాడు తండ్రి. మీరు పిలిస్తే పలికే దైవం కదా బాబా. దయచేసి వెంటనే ఈయనకి నొప్పి, వాంతులు తగ్గేలా అనుగ్రహించు బాబా. నువ్వు తప్ప వేరే ఎవరూ కాపాడలేరు బాబా" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాను వేడుకున్న కాసేపటికే మావారికి కాస్త నిద్రపట్టింది. ఇంక మళ్ళీ మావారికి వాంతులు కాలేదు. కడుపునొప్పి కూడా తగ్గింది. బాబా దయుంటే ఎటువంటి ఇబ్బంది నుంచి అయిన మనం గట్టెక్కుతాము. "బాబా! మీకు శతకోటి నమస్కారాలు. మావారి కడుపునొప్పిని పూర్తిగా తొలగించండి. మిమ్మల్నే పూర్తిగా నమ్ముకుని భారమంతా మీపై వేస్తున్నాను తండ్రి. మీ ఆశీర్వాదం ఎప్పటికీ మావారి మీద ఉండాలి తండ్రి. ఇంకా అందరినీ సదా కాపాడు తండ్రి. ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేస్తూ ఎప్పటికీ మీ పాదాలను మరువకుండా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికీ ప్రసాదించండి. అలాగే ఎల్లవేళలా మీ ఆలోచనలు తప్ప వేరే ధ్యాస లేకుండా మమ్మల్ని అనుగ్రహిస్తూ మీ ప్రేమను ఎల్లవేళలా మా అందరి మీద వర్షించనీయండి తండ్రి. చివరిగా అన్నయ్యని చాలా పెద్ద కష్టం నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు తండ్రి. ఏమైనా తప్పులుంటే క్షమించండి సాయి". బాబా ప్రసాదించిన ఈ అనుభవాన్ని చదివిన అందరికీ ధన్యవాదాలు.
ఓం సాయి రక్షక శరణం దేవా!!!
లోకాసమస్తా సుఖినోభవంతు!!!
బాబా బ్లెస్సింగ్స్
నేను ఒక సాయి భక్తురాలిని. నేను చాలాకాలంగా బాబాని ఒక గురువుగా, దైవంగా పూజిస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కోకొల్లలు. ఈ బ్లాగులోని భక్తుల అనుభవాల అనుగ్రహప్రసాదాన్ని చదువుతుంటే మనసు పులకరించిపోతుంది. చెప్పాలంటే, నా అనుభవానుసారం ఈ బ్లాగుని స్వయంగా బాబానే నిర్వహిస్తున్నారు. బాబా ఆశీస్సులు సర్వకాల, సర్వావస్థల్లోనూ ఈ బ్లాగు నిర్వాహకులకు ఉంటాయి. ఇక నా అనుభవానికి వస్తే.. ఒకరోజు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు అవసరం చాలా ఉండి నేను దానికోసం వెతకటం మొదలుపెట్టాను. నేను సాధారణంగా పెట్టే అన్ని చోట్లా వెతికినప్పటికీ అది కనపడలేదు. ఆధార్, పాన్ కార్డ్ వంటి మిగతా ముఖ్యమైన కార్డులన్నీ ఉన్నాయి కాని, అది మాత్రమే లేదు. దానికోసం వెతికివెతికి విసుగు వచ్చింది. ఇంక చేసేది లేక డూప్లికేట్ కార్డుకోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ విధి విధానం చాలా కష్టంతో కూడుకున్నది, పైగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా. అందుచేత నేను చివరిగా బాబా కృపాకటాక్షాల కోసం వారిని అర్థించి, "కార్డు దొరికేలా అనుగ్రహించమ"ని బాబాతో చెప్పుకుని కాసేపు ధ్యానం చేసి పడుకున్నాను. నిద్రలేస్తూనే, 'ఫలానా చోట వెతుకు, దొరుకుతుంది' అన్న స్ఫురణను మనసులో కలిగించారు బాబా. వెంటనే బాబా స్ఫురణ కలిగించిన చోట వెతికాను. ఆశ్చర్యంగా ఆ కార్డు అక్కడే ఉంది. ఆనందంతో బాబాకి హృయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
Om Sai Ram 🙏🍒
ReplyDeleteEapcet qualify avvali please baba
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram 🙏🙏
ReplyDeleteOm Shri Sairajaram🌺🌹🙏🙏🙏🌹🌺
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDeleteOme sai Ram🙏🙏🙏
ReplyDelete