సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1198వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడ్డంకులు తొలగించి క్షేమంగా యు.ఎస్ చేర్చిన బాబా
2. సచ్చరిత్ర రూపంలో బాబా స్పర్శతో నార్మల్ అయిన బాబు
3. బాబా చేసిన గొప్ప అధ్భుతం

అడ్డంకులు తొలగించి క్షేమంగా యు.ఎస్ చేర్చిన బాబా

శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!! 

అనేకమంది సాయి భక్తుల అనుభవాలతో అందాల పూలవనంలా అలరారుతున్న 'సాయి మహారాజ్ సన్నిధి'కి వేలవేల నమస్కారాలు. బ్లాగును ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్న సోదరుడు సాయికి ఆశీస్సులు. నా పేరు నిట్టల సూర్యనారాయణమూర్తి. మాది విజయనగర్ కాలనీ, హైదరాబాద్. నేను ఇంతకుముందు నా అనుభవాలలో శ్రీసాయి దయవలన మా అమ్మాయి యు.ఎస్.ఏ నుండి ఇండియాకు రావడానికి జరిగిన ఏర్పాట్ల గురించి పంచుకున్నాను. ఇప్పుడు తను తిరిగి ఇండియా నుండి యు.ఎస్.ఏకి వెళ్ళే క్రమంలో బాబా ప్రసాదించిన అనుభవం వ్రాస్తున్నాను. మా అమ్మాయి, అల్లుడు తిరిగి యు.ఎస్.ఏ వెళ్లేందుకు తమ పాస్పోర్ట్ స్టాంపింగ్‌ కోసం హైదరాబాదులోని యు.ఎస్. కౌన్స్‌లేట్‌లో 2022, ఏప్రిల్ 20న ఇచ్చి, స్టాంపింగ్ 10 రోజులలో అయిపోతుందని యు.ఎస్.ఏ పోవడానికి మే 6కి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కాని మే 5వ తేదీ వచ్చినా పాస్పోర్ట్ స్టాంపింగ్‌కి సంబంధించి ఎటువంటి సమాచారము రాలేదు. దాంతో వాళ్ళు మరుసటిరోజుకి బుక్ చేసుకున్న టికెట్లను కాన్సిల్ చేసుకుని మే, 17కి టిక్కెట్లు బుక్ చేసుకొన్నారు. కానీ అప్పటికైనా పని అవుతుందో, లేదో అని వాళ్ళు చాలా మధనపడుతూ టెన్షన్ పడ్డారు. అన్ని గమనిస్తున్న నేను అప్పటివరకూ బాబాని ఎటువంటి కోరికలు అడగరాదనే ధృఢనిశ్చయంతో వాళ్ళ విషయమై ఏమీ మ్రొక్కుకోలేదు. అలాంటిది వాళ్ళు చాలా ఆందోళనతో ఉండటం చూసి మే 9వ తేదీన, "బాబా! అమ్మాయి, అల్లుడి పాస్పోర్ట్ స్టాంపింగ్ త్వరగా జరిగేలా చేసి 17వ తారీకఖున వాళ్ళ తిరుగు ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి. అలా జరిగితే, ఈ అనుభవాన్ని వెంటనే బ్లాగుకి పంపుతాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో మే 10 మధ్యాహ్నం 'పాస్పోర్ట్ ఇష్యూడ్' అని మెసేజ్ వచ్చింది. ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరునాడు మే 11న వచ్చి పాస్పోర్టులు తీసుకెళ్ళమని మాకు మెయిల్ వచ్చింది. దాంతో మే 12న బాబావారం అనగా గురువారంనాడు మా అమ్మాయి, అల్లుడు వెళ్లి పాస్పోర్టులు తీసుకున్నారు. తదుపరి మే 17న ప్రయాణమనగా ప్రస్తుత కోవిడ్ నిబంధనలను అనుసరించి మే 16, ఉదయం మా అమ్మాయి, అల్లుడు కోవిడ్ టెస్టుకి శాంపిల్స్ ఇచ్చి వచ్చారు. కానీ మే 14, 15 తేదీలలో మా అల్లుడికి జలుబు ఉన్న కారణంగా కోవిడ్ టెస్టు రిపోర్టు నెగిటివ్ వస్తుందా, రాదా అని ఆందోళన చెందాము. నేను నా మనసులో, "టెస్టు రిపోర్టు నెగిటివ్ వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. మన బాబా ఉండగా భయమెందుకు? దండగ కదా! మే16, సాయంత్రం నాలుగు గంటలకి వచ్చిన రిపోర్టుల్లో అందరికీ నెగిటివ్ వచ్చింది. దాంతో మా అమ్మాయివాళ్ళు సంతోషంగా మే 17, ఉదయం బయలుదేరి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా యు.ఎస్. చేరుకున్నారు.

చివరిగా ఇంకో విషయం మే 15న నేను, మా అమ్మాయి, అల్లుడు ఇంకా మా కుటుంబమంతా బాబా మాపై చూపిన ప్రేమకు కృతజ్ఞతగా పంజాగుట్ట బాబా మందిరానికి వెళ్లి బాబాకు వస్త్రం, ప్రసాదం సమర్పించుకుని ధూప్ హారతిలో పాల్గొని చాలా ఆనందించాము. మా అమ్మాయి అందరికీ ప్రసాద వితరణ కూడా చేసింది. ఆనాటి అలంకారంలో బాబా అందాన్ని వర్ణింప సాధ్యం కాదు. మా కుటుంబసభ్యులను చూసి ఒక తండ్రిగా సంతోషిస్తున్నట్లు నవ్వు మోముతో బాబా వెలిగిపోయారు. ఈ విషయాన్ని మే, 19, గురువారం నాడు ఈ బ్లాగుకి వ్రాసి పంపుతానని బాబాకి మ్రొక్కుకున్న ప్రకారం తోటి సాయి బంధువులతో పంచుకున్నాను. ఆ సద్గురువు పాదాలకు శిరసా నమస్సులు.

 ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

సచ్చరిత్ర రూపంలో బాబా స్పర్శతో నార్మల్ అయిన బాబు

సాయి భక్తులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవం పంచుకోబోతున్నాను. నాకు రెండు సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. 2022, మే రెండో వారంలో వాడు టాయిలెట్‍కి వెళ్లిన ప్రతిసారీ బాగా ఏడుస్తుండేవాడు. నాలుగు రోజులు నన్ను వదలకుండా నా దగ్గరే ఉంటుండేవాడు. వాడిని అలా చూసి నాకు చాలా బాధేసి, "ఏమిటిది, బాబు ఎప్పుడు ఇలా ఏడవడు. ఆడుకోకుండా ఉండడు. ఏమైంది వాడికి?' అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎన్నోసార్లు, "బాబా! వాడికి ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నాడు" అని బాబాను అడిగాను. తరువాత మా అక్కకి కాల్ చేసి, "బాబు ఇలా ఉన్నాడు, ఏడుస్తున్నాడు" అని చెప్పాను. తను, "వాడికి వేడి చేసినట్టుంది" అని అంది. ఇంక మేము ఆ మరుసటిరోజు నుండి బాబుచేత నిమ్మకాయ నీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ త్రాగించాము. అయినా వాడి స్థితిలో ఏ మార్పు రాలేదు సరికదా సాయంత్రమయ్యేసరికి బాగా చిరాకు చేసేవాడు. ఇంక లాభం లేదు అనుకుని, "బాబా! మీ చేతి స్పర్శ తగలనిదే వాడికి తగ్గేలా లేదు తండ్రి. నా కొడుకుని మీరే కాపాడాలి. మీకు, మీ సచ్చరిత్రకి తేడా లేదు. మీరు సచ్చరిత్ర రూపంలో నా కొడుకుని తాకి వాడిని మళ్లీ మంచిగా మార్చండి" అని 'సాయి సచ్చరిత్ర' పుస్తకం తీసుకుని బాబా నా కొడుకుని తాకుతున్నట్లు భావించుకుంటూ బాబు ఒంటిమీదుగా 3 సార్లు తుడిచాను. తరువాత, "బాబా! ఎలాగైనా రేపటికి వాడు మంచిగా అవ్వాలి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. మరుసటిరోజు వాతారణం ఒక్కసారిగా చాలా చల్లగా మారిపోయింది. ఆ రోజు బయట కూడా చల్లగా ఉంది. బాబు చేత పుచ్చకాయ తినిపించాను. సాయంత్రం ఏసీ రిపేర్ చేసేవాళ్ళు వచ్చి ఏసీ బాగుచేసే సమయానికి బాబు మామూలుగా అయ్యాడు. రోజూ సాయంత్రం 4 - 5 అయ్యేసరికి బాగా ఏడ్చేవాడు. అలాంటిది ఆ రోజు చాలా ఆనందంగా ఆడుకున్నాడు. బాబా ఇంకొంచం ఆలస్యంగా వాడికి తగ్గేలా చేసి ఉంటే ఏసీ పెట్టడం వల్లే వాడికి తగ్గిందని అనుకునేదాన్ని. కానీ బాబా అంతకన్నా ముందే తగ్గించి వారి మహిమను చాటుకున్నారు. "ఏమి ఇచ్చినా మీ ఋణం అయితే తీర్చుకోలేను బాబా. మీ ఆశీర్వాదం సదా మా పైన ఉండాలి తండ్రి".

బాబా చేసిన గొప్ప అధ్భుతం

నా పేరు కవిత. సాయి బంధువులకు నమస్కారం. ఒకప్పుడు సాయి అంటే నాకు పిచ్చి. ఆయన నన్ను అంతలా కాపాడారు. నేను చదువులో చాలా పూర్. సరిగా చదవలేకపోయేదాన్ని. ఆ కారణంగా నేను పదవ తరగతి ఫెయిల్ అయి ఒక సంవత్సరమంతా చాలా భాదపడ్డాను. తరువాత ఎగ్జామ్స్ ఫీజ్ కడదామని వెళితే, అప్పటికే ఫీజ్ కట్టే తేదీ దాటిపోయిందని చెప్పారు. నేను చాలా భాదపడ్డాను. అయితే బాబా గొప్ప అద్భుతం చేశారు. అక్కడ పనిచేసే ప్యూన్ నా ఫీజ్ కట్టారట. అది తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. తరువాత బాబా అనుగ్రహంతో ఎలాగోలా పదవ తరగతి పాస్ అయ్యాను. ఆ తరువాత నా చదువు సాఫీగా సాగి M.A చదవడానికి క్యాంపస్ సీట్ కూడా సాధించాను. అంతా బాబా దయ. కానీ బాబా నా విషయంలో ఒక్కటే అన్యాయం చేసాడు. నేను బాబా ప్రశ్నలు-సమాధానాలు అనే పుస్తకంలో బాబాను అడిగితే, 'నాకు జాబ్ వస్తుంది' అని చెప్పారు. అది జరిగి 12సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు. నాకు ఉద్యోగం వస్తుందని చెప్పిన బాబా నాకు ఉద్యోగం ఇస్తారని ఆశతో ఎదురుచూస్తున్నాను. బాబా నాకు ఉద్యోగం ఇచ్చాక మళ్లీ నా అనుభవం మీతో పంచుకుంటాను.

జై సచ్చిదానంద సద్గురు సాయిబాబా!!!

5 comments:

  1. ఓం సాయి నా థాయ కుశాభవు గురించి తెలిపారు చాలా ఆనందంగా అనిపించింది. మాకు తెలియని సంగతులు చెప్పారు.2 సాయి అనుభవం లో బాబా సత్ చరిత్ర ఒంటికి తాకించి.బాబు ని నవ్వుతూ చేసిన సాయి సత్ చరిత్ర మహిమ చాలా గొప్ప విషయం. ఎలా గైనా బాబా మనల్ని కాపాడుతారు.

    ReplyDelete
  2. బాబా ని మనసు పూర్తిగా నమ్మితే. మనం ప్రశాంతంగా జీవించ వచ్చు.రేపు గురు పౌర్ణమి ముందుగా బాబా భక్తులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. బాబా మనల్ని నిరంతరం కాపాడుతారు .

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Eapcet lo qualify ayyi manchi ravali thandri Sashi ki

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo