1. థాంక్యూ బాబా
2. బాబాకి నా మీద ఎంత ప్రేమో!
3. బాబా కృప అనంతమైనది
థాంక్యూ బాబా
సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరికొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని వచ్చాను. ఈ బ్లాగులో నేను ఇటీవల ఒక అనుభవం చదివాను. ఆ అనుభవంలో ఒక భక్తురాలు తన బిడ్డకి తలనొప్పి వస్తే, టాబ్లెట్ ఇచ్చి, బాబా ఊదీ పెట్టి నిద్రపుచ్చింది. తెల్లవారిలేచేసరికి ఆ పిల్లాడి తలనొప్పి తగ్గిపోయింది. అది చదివాక నేను అజ్ఞానం కొద్ది నా మనసులో, 'టాబ్లెట్ వేస్తే, ఎలాగూ తగ్గిపోతుంది కదా!' అని అనుకున్నాను. అక్కడికి రెండు, మూడురోజులకి నాకు తలనొప్పి వచ్చింది. ఎంతకూ తగ్గలేదు. చివరికి టాబ్లెట్ వేసిన తగ్గలేదు. అప్పుడు ఆ భక్తురాలి అనుభవం విషయంలో నేను నా మనసులో అనుకున్న మాట గుర్తొచ్చి, "బాబా! నా అజ్ఞానాన్ని క్షమించు. ఇంకెప్పుడూ ఇలాంటి బుద్ధినివ్వకు తండ్రి. మీ దయతో నా తలనొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అక్కడికి కొద్దిసేపటికి నా తలనొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా". మనం సాయి భక్తులం అయినప్పటికీ ఒక్కోసారి బాబా యందు సందేహం తలెత్తుతుంది. అది బాబా మనకి పెట్టే పరీక్షేమో!
2022, ఏప్రిల్ 30, శనివారంనాడు నేను నా ఆఫీసు లాప్టాప్‍ను ఇంటికి తీసుకొచ్చాను. తరువాత 2022, మే 2, సోమవారంనాడు ఆఫీసుకి వెళ్లేప్పుడు ఆ లాప్టాప్ తీసుకుని వెళ్ళాను. ఆఫీసుకి చేరుకున్నాక హడావుడిలో బైక్‍కి ఉన్న లాప్టాప్ బ్యాగును తీసుకోవడం మర్చిపోయి రెండు అంతస్తుల పైకి ఎక్కేసాను. అప్పుడు లాప్టాప్ గుర్తుకు వచ్చి పార్కింగ్ ప్రదేశానికి పరుగెత్తాను. వెళ్తూ దారిలో, "బాబా! మీ గుడికి వస్తాను, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను, లాప్టాప్‍తో ఉన్న బ్యాగు పోకుండా చూడు తండ్రి" అని బాబాకి మొక్కుకున్నాను. కిందికి వెళ్లి చూస్తే, బ్యాగు బండికి అలాగే ఉంది. ఇది బాబా ప్రసాదించిన అధ్భుతమైన అనుభవం. నేనైతే ఆ బ్యాగు పోతుందనుకున్నాను. ఎందుకంటే, అక్కడ చాలా జనం ఉన్నారు. నేను పైకి వెళ్లి కిందకి వచ్చేంతవరకు బ్యాగు అక్కడే ఉందంటే అది కేవలం బాబా కృపే. "థాంక్యూ బాబా".
నేను మా ఆఫీసులో ఏ డాక్యుమెంట్ కనిపించకపోయినా బాబానే తలచుకుంటూ ఉంటాను. ఆయన కృపతో అవి వెంటనే దొరుకుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఒక ముఖ్యమైన ఫైల్ దొరకలేదు. నేను, "బాబా! ఆ ఫైల్ దొరికితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభావం పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. వెంటనే ఆ ఫైల్ దొరికింది. ఇలా నా జీవితంలో బాబా కార్తవీర్యార్జునునిలా పోయినవన్నీ తిరిగి దొరికేలా చేస్తున్నారు.
మనకోసం మాత్రమే కాదు, పక్క వారికోసం కోరుకున్న వాటిని కూడా బాబా తీరుస్తారు. ఇటీవల నా స్నేహితురాలు ఒక పరీక్ష వ్రాసింది. తను ఆ పరీక్ష పాస్ అయితే, తనకి ఉద్యోగం వస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం బాగుపడుతుంది. అందువలన నేను బాబాని ప్రార్థించి, "నా స్నేహితురాలికి ఉద్యోగం వస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా అద్భుతం చేశారు. నా స్నేహితురాలు ఆ పరీక్షలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుంది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".
బాబాకి నా మీద ఎంత ప్రేమో!
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. మొదటిసారి మీ అందరితో నా అనుభవాలను పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొన్నిరోజుల క్రితం రోజూ పడుకునే సమయంలో, "బాబా! నిన్ను చూడాలని ఉంది. నన్ను శిరిడీకి రప్పించుకోండి, ప్లీజ్ బాబా" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు మా బంధువైన ఒక ఆంటీ మా ఇంటికి వచ్చారు. నేను ఆ సమయంలో పని చేసుకుంటున్నాను. ఆవిడ టీ తాగుతూ మా అమ్మతో మాట్లాడుతుంది. ఆ మాటల మధ్యలో ఆవిడ, "రేపు మేము శిరిడీ వెళ్తున్నాము" అని చెప్పింది. ఆ మాట వింటూనే నేను ఆవిడతో, "నేను కూడా మీతో శిరిడీ వస్తాను" అని అడిగాను. అందుకు ఆవిడ, "సరే, నువ్వు కూడా మాతో రా, నిన్ను మేము శిరిడీ తీసుకెళతాము" అన్నారు. 'బాబా నాకోసం ఆవిడను మా ఇంటికి పంపించారు. ఆయనకి నా మీద ఎంత ప్రేమో!' అని నాకు చెప్పలేనంత ఆనందమేసింది. వెంటనే నేను బాబా ఫోటో దగ్గరకి వెళ్ళి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఐ లవ్ యు సో మచ్ బాబా. నా అనుభవం పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి తండ్రి. మా అమ్మానాన్నలకు అన్ని విషయాలలో తోడుగా ఉండండి బాబా".
మా నాన్నగారు సౌదీలో ఉంటారు. 2022, మే నెల ఆరంభంలో నాన్న వారం రోజులుగా తను దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు. అప్పుడు నేను బాబా పాదాల వద్ద ఉన్న విభూది తీసుకుని నా నుదుటన పెట్టుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని 108 సార్లు స్మరించి, "బాబా! నాన్నగారి దగ్గు, జలుబు, జ్వరం మీరే తగ్గించండి. నాన్నకి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నాన్న ఫోన్ చేసి తనకి జ్వరం తగ్గిందని చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఎల్లప్పుడూ నాన్నకి తోడుగా ఉండి అన్ని విషయాలలో సహాయం చేయండి సాయి".
ఇంకోరోజు మా అమ్మ తనకు బాగా తలనొప్పిగా ఉందని నాతో చెప్పింది. నేను బాబా దగ్గరకి వెళ్లి, కొద్దిగా ఊదీ నీళ్లలో కలిపి బాబా చేతికి తాకిచ్చి ఆ ఊదీ తీర్థాన్ని అమ్మతో త్రాగించాను. ఉదయం లేచేసరికి తలనొప్పి తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా కృప అనంతమైనది
నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను అంటే గిట్టని కొంతమంది నా బట్టలకు ఏదో మందు రాశారు. ఆ విషయం తెలియని నేను బయటికి వెళ్లాల్సిన పని పడటంతో ఆ బట్టలు వేసుకుని వెళ్లి, బస్సు ఎక్కాను. కాసేపటికి దురద మొదలైంది. ఎంతటి దురద అంటే ఎంతకీ తగ్గడం లేదు. దారిలో సాయిబాబా గుడి కనిపిస్తే, "సహాయం చేయమ"ని బాబాను అడిగాను. తరువాత బస్టాండ్‍లో ఒక పౌడర్ డబ్బా కొనుక్కుని, దురద ఉన్న చోట పౌడర్ రాసాను. అయినా దురద తగ్గలేదు. తరువాత మంచినీళ్లకోసం బస్టాండ్ నుంచి బయటికి వస్తుంటే, సాయిబాబా బండి కనపడింది. వాళ్లకు ఒక అయిదు రూపాయలు ఇచ్చి, దణ్ణం పెట్టుకున్నాను. వాళ్లలో ఒకతను ఒక విభూది ప్యాకెట్ ఇచ్చాడు. నేను అది తీసుకుని వెళ్లి బస్సు ఎక్కాను. ఆ విభూది రాసుకోగానే దురద మాయమైంది. మాటల్లో చెప్పలేనంత దురద ఇట్టే పోవడంతో నేను ఆశ్చర్యపోయాను. బాబా కృప అనంతమైనది. "బాబా! మీ ప్రేమకు నా ధన్యవాదాలు".
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి బాబా నిన్ను ఎంత పొగిడిన మాకు మంచి చేస్తున్నావు. తలచిన వెంటనే మా పక్క న వుంటారు. దయ గల దేవుడు మీరు. శత కోటి నమస్కారాలు
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete