ఈ భాగంలో అనుభవాలు:
1. సాయికి చెప్పుకుంటే చేకూరిన ఆరోగ్యం
2. సాయి కృప అధ్భుతం
3. బాబాను ప్రార్థించి ప్రయాణమవ్వటం వలన పొందిన ప్రయోజనం
సాయికి చెప్పుకుంటే చేకూరిన ఆరోగ్యం
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు అంజలి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా తమ్ముడు ప్రసాద్ వెన్నునొప్పితో బాగా ఇబ్బందిపడ్డాడు. కొన్నిరోజుల తరువాత నేను, "బాబా! తమ్ముడికి నొప్పి తగ్గితే, ఆ అనుభవాన్ని ఈ గురువారం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల తనకి నొప్పి తగ్గింది. కానీ గురువారం నాడు నాకు బాగాలేక అనుభవాన్ని బ్లాగులో పంచుకోలేకపోయాను. మరుసటిరోజు తను మళ్ళీ కొంచెం నొప్పిగా ఉంది అని అన్నాడు. "బాబా! బ్లాగులో పంచుకోవడం ఆలస్యం చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి. దయతో తనకి పూర్తిగా తగ్గిపోయేలా చూడండి బాబా".
తమ్ముడు ప్రసాద్ వాళ్ళ అమ్మకు ఓపెన్ హార్ట్ సర్జరీ మంచిగా జరిగిన తరువాత ఆమె తొందరగా కోలుకోవాలని మేము బాబాను కోరుకున్నాము. ఇంకా ఆమెకోసం సంకల్ప పారాయణ గ్రూపులో 3 సార్లు ప్రేయర్ పెట్టించాము. బాబా దయవల్ల ఆమె మంచిగా కోలుకుంది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు క్షమించండి బాబా. అలాగే ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా అందరిని చల్లగా చూడండి బాబా".
ఈమధ్య మా బాబుకి హఠాత్తుగా జ్వరం వచ్చింది. తెల్లారితే ఒక ఫంక్షన్ కోసం ఊరు వెళ్ళాలి. అందువల్ల నేను, "బాబా! ఉదయానికల్లా బాబుకి జ్వరం తగ్గిపోవాలి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి బాబుకి జ్వరం తగ్గిపోయింది. సంతోషంగా ఫంక్షన్‍కి వెళ్ళొచ్చాము. మరుసటిరోజు ఉదయం నుండి నాకు జ్వరం మొదలై నా ఆరోగ్యం ఏమీ బాగాలేకుండా పోయింది. చాలా నీరసంగా అనిపించింది. అయినప్పటికీ ఆఫీసుకి సెలవు పెట్టే పరిస్థితి లేనందున ఆ రాత్రి నేను, "బాబా! తెల్లవారేసరికి నా ఆరోగ్యం అంతా నార్మల్ అయిపోవాలి. నా అనుభావాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి నా ఆరోగ్యం దాదాపు నార్మల్ అయింది. మరుసటిరోజుకి పూర్తిగా కోలుకుంటానని నమ్మకంతో ముందుగానే నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను. "బాబా! మీ దయ మా అందరి మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
సాయి కృప అధ్భుతం
నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. మీరు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. మేము దత్త భక్తులం. సాయినాథుడు దత్తావతారమని తెలిసిన తరువాత మేము సాయిని నమ్మడం మొదలైంది. సాయి మా జీవితంలోకి వచ్చి రెండు నెలలు అయింది. నేను ఒక విషయంలో కొన్నిరోజులుగా బాధపడుతున్న సమయంలో ఒకరోజు నా ఫోన్ పక్కన పెట్టి వంట చేస్తుంటే, దానంతటదే నా ఫోన్‍లో యూట్యూబ్ ఓపెన్ అయి ఇంగ్లీషులో ఉన్న ఒక సాయి వీడియో ప్లే అయింది. 'జరిగిన దానికోసం చింతపడకు. అంత మంచి జరుగుతుంది. నేను నీతోనే ఉన్నాన'ని అన్నది ఆ వీడియో సారాంశం. నాకు ఒక్కసారిగా కొండంత దైర్యం వచ్చింది. అది ఖచ్చితంగా బాబా చేసిన అధ్భుతమే! ఇక ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయి మిరాకిల్స్ వింటూ వింటూ మేము సాయి భక్తులమయ్యాం. తరువాత ఒకరోజు సాయి మిరాకిల్స్ అని గూగుల్‍లో సెర్చ్ చేస్తే ఈ బ్లాగు కనిపించింది. అప్పటినుండి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే నేను, మా పాప సాయి భక్తుల అనుభవాలు చదువుతున్నాం. ఆ క్రమంలో మాకు ఊదీ మహిమ తెలిసింది. మా పాపకి ఊదీ అంటే ఇష్టం. ఒకరోజు మా పాపకి, బాబుకి కడుపునొప్పి వచ్చింది. అప్పుడు ఊదీ నీళ్ళలో కలిపిస్తే వాళ్ళకి నొప్పి తగ్గింది. మరొకరోజు పాపకి కాలు నొప్పిగా ఉంటే ఊదీ రాస్తే మరుసటిరోజుకి నొప్పి తగ్గింది. ఒకరోజు రాత్రి నా చేయి బాగా నొప్పి పెట్టింది. నొప్పి తగ్గాలని బాబాకి చెప్పుకుని ఊదీ రాసుకున్నాను. రెండురోజుల్లో నొప్పి తగ్గింది. ఇంకోసారి ఐరన్ బాక్స్ తగిలి కాలితే ఆ చోట ఊదీ రాసాను. తొందరగా ఆ గాయం తగ్గిపోయింది. ఇవన్నీ చెప్పాలా అనుకుంటారేమో! కానీ ఇలా ఈ రెండునెలల్లో ఎన్నోసార్లు ఎన్నో సమస్యలకి ఊదీని వాడి బాబా మహిమను చూసాము. ఇప్పుడు బాబా ఊదీ ఉందని మాకు ధైర్యంగా ఉంది. ఇప్పుడు మేము ఏదైనా సమస్య గురించి తేల్చుకోలేనప్పుడు 'క్వశ్చన్ & ఆన్సర్' సైటులో బాబాను అడుగుతున్నాము.
మా పాప తన పరీక్ష ఫలితాలకోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఆఫీసులో పని ఉండటం వల్ల స్కూలుకెళ్ళి ప్రోగ్రెస్ కార్డు తీసుకోలేమని మేము అనుకున్నాము. కానీ బాబా దయవల్ల నాకు సెలవు ఉన్నరోజు స్కూలువాళ్ళు ప్రోగ్రెస్ కార్డు తీసుకోవడానికి డేట్ ఇచ్చారు. దాంతో మేము సంతోషంగా వెళ్లి ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నాము. బాబా కృపవల్ల పాపకి 97.1% వచ్చింది. మా పాప చాలా సంతోషించింది. "థాంక్యూ సాయిదేవా! లవ్ యు బాబా! మేము సొంతిల్లుకోసం చాలా ప్రయత్నిస్తున్నాము. మా సమస్యలు మీకు బాగా తెలుసు. ఎలాగైనా ఆ సమస్యలు తొలగించి ఇంటిని ప్రసాదించండి. అప్పుడు నా అనుభవాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి బాబా. మిమ్మల్ని నమ్మే ప్రతి ఒకరిని కాపాడండి".
సర్వం శ్రీదత్తసాయి కృప!!!
బాబాను ప్రార్థించి ప్రయాణమవ్వటం వలన పొందిన ప్రయోజనం
ఓం శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
నా పేరు రవీందర్. కొన్నేళ్ల క్రితం నేను పానిక్ యాంగ్జైటీతో(తీవ్రమైన భయాందోళనలు) బాధపడ్డాను. వైద్యం ద్వారా అది నయమైంది. కానీ కొన్ని నెలల నుంచి ఏ ఊరు వెళ్దామన్నా నాకు కాస్త భయంగా ఉంటుంది. దానివల్ల నేను ప్రయాణాలు దాదాపు మానుకున్నాను. కానీ 2022, ఏప్రిల్ నెలలో తప్పనిసరై నేను హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. ఇంకా నేను బాబా మీద నమ్మకంతో ఆయన్ను ప్రార్థించి బయల్దేరాను. బాబా దయవలన నాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. అంతేకాదు నాలో ఆత్మవిశ్వాసం కొద్దిగా పెరిగింది. బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Om Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ దత్త సాయి ఆశీస్సులతో నా కడుపు నొప్పి కి సరైన వైద్యం నాకు లభియించింది.ధన్యవాదాలు సాయి మా అబ్బాయి డాక్టర్ మీ ఆశీస్సులతో వాడికి ఆ ఆలోచన వచ్చింది.
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete