1. ఊదీ మహిమ
2. ఆలస్యం జరిగినా బాబా న్యాయమే చేస్తారు, అన్యాయం చేయరు - ఆలస్యం వెనుక అధ్భుతాలు జరుగుతాయి
3. తల్లికి ఆరోగ్యం ప్రసాదించిన బాబా
4. స్నేహితుని కుమార్తెకు పూర్ణాయుష్షుని ప్రసాదించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక వికలాంగ సాయి భక్తుడిని. బాబా నా జీవితంలో చేసిన అధ్భుత లీలలను ఎల్లప్పుడూ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి భక్తులతో పంచుకుంటానని నేను బాబాకు మాట ఇచ్చాను. అలాగే 2022, మార్చ్ 9వ తేదీన ప్రచురితమైన సాయిభక్తుల అనుభవమాలిక 1073వ భాగంలో కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడూ మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుందామని వచ్చాను.
ఊదీ మహిమ:
ప్రతిరోజు బాబా ఊదీ నుదుటన ధరించడం నాకలవాటు. ఒకసారి నా వద్ద ఉన్న ఊదీ అయిపోవస్తుండటంతో బాబాను తలుచుకుని, "బాబా! నన్ను మీ దర్శనానికి శిరిడీకి రప్పించుకుని మీ ఊదీ ప్రసాదాన్ని నాకు అనుగ్రహించండి" అని వేడుకున్నాను. అక్కడికి రెండో రోజున గ్లోబల్ మహాపారాయణ వాట్సప్ గ్రూప్ ద్వారా నాకు అప్పుడే పరిచయమైన ఒక అక్క మా ఇంటికి వచ్చి బాబా ఊదీ ప్యాకెట్ నాకు ఇచ్చారు. ఆ మరుసటిరోజు ఉదయం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఆసక్తికరమైన ఒక పోస్ట్ నా కంటపడింది. దాని ఆంతర్యం ఏమిటంటే, "నువ్వు ఇక్కడికి రాలేనందున నేను నీకు ఊదీ ప్యాకెట్ పంపించాను. దాన్ని తీసుకున్నావా, లేదా?" అని. అది చదివాక, "బాబా! మీరు సర్వాంతర్యాములు" అని అనుకున్నాను.
ఆలస్యం జరిగినా బాబా న్యాయమే చేస్తారు, అన్యాయం చేయరు - ఆలస్యం వెనుక అధ్భుతాలు జరుగుతాయి:
నేను ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పక్క రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని నమ్మి చాలాకాలం స్నేహం చేశాను. అతను నాతో చాలాసార్లు లాక్‍డౌన్ వల్ల జీవనం సాగించడం, తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని చెప్పేవాడు. అప్పుడు నేను అతనికి బ్రతుకుతెరువు చూపిద్దామని కొంత డబ్బిచ్చి మా ఊరికి వలస రప్పించి, ఇల్లు అద్దెకు ఇప్పించి, బత్రకడానికి చేయబోయే పనికోసం పెట్టుబడిగా అవసరమైన డబ్బు అప్పుగా ఇచ్చాను. సరిగ్గా నెల గడిచేసరికే ఆ వ్యక్తి తన మీద నేను పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేసి ఊరు వదలి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను అతనికి ఫోన్ చేసి నా వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇమ్మని చాలాసార్లు ప్రాధేయపడ్డాను. తను మాత్రం వికలాంగుడై కూడా నాకు బ్రతుకుతెరువు చూపించాడన్న విశ్వాసం, జాలి, దయ, కనికరం వంటివేమీ లేకుండా నాతో ప్రవర్తించాడు. నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. నాకు ఏమి చేయాలో పాలుపోక, "బాబా! ఆ వ్యక్తికి నీవే జ్ఞానోదయం అయ్యేలా చేసి సద్భుద్ధిని ప్రసాదించి నా డబ్బులు నాకు ఇప్పించు తండ్రి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. ఒకరోజు మనశ్శాంతికోసం శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుందామని కొద్దిగా డబ్బులు అప్పుచేసి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. తరువాత ఒకరోజు సచ్చరిత్ర పారాయణ చేస్తూ "పండగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు అప్పు చేయొద్దు" అన్న బాబా మాటను గుర్తు చేసుకుని, "బాబా నన్ను క్షమించండి, మీ దర్శనానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. మీ వద్దకు వచ్చేలోపు ఆ వ్యక్తి వద్ద నుండి నా డబ్బు నాకు తిరిగి ఇప్పించండి. అది జరిగితే నేను వెంటనే నా అనుభవాన్ని, 'సాయి మాహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. వారం, పది రోజులు గడిచాయి. ఆ రోజు గురువారం. నేను పారాయణ చేస్తుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మరెవరిదో కాదు. ఒక సంవత్సరం క్రిందట చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన ఆ వ్యక్తి ఫోన్ అది. అతను మా ఊరు వస్తున్నానని చెప్పాడు. నేను వెంటనే అతని వద్దకు వెళ్లి కలిసాను. తక్షణమే అతను నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు. నేను ఆనందంతో, "బాబా! నిజంగా మీరు నా మొర ఆలకించారు. మీ దర్శనానికి వచ్చేలోపే నా సమస్యను తీర్చి మీపై నాకున్న నమ్మకం మరింత హెచ్చేలా చేసారు. మీరు చేసిన ఈ మేలును నేను ఎప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకుంటాను" అని బాబా ఫొటో ముందు దణ్ణం పెట్టుకున్నాను.
తల్లికి ఆరోగ్యం ప్రసాదించిన బాబా:
2021, ఆగష్టు 20వ తేదిన మా అమ్మ ఉన్నట్టుండి బాత్రూమ్‍లో కళ్ళు తిరిగి పడిపోయింది. నేను వికలాంగుడినైనందున ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. కాబట్టి పక్కింటి వాళ్ళను పిలిస్తే, అమ్మని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. అమ్మకి అస్సలు స్పృహ లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆసుపత్రికి తీసుకువెళ్ళే స్తోమత లేనందున నాకు తెలిసిన ఆర్.ఎం.పి డాక్టరుకి ఫోన్ చేస్తే, అతను వచ్చి టెస్ట్ చేసి, "ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది. ఈమెకు డెంగ్యూ జ్వరం ఉంది. పరిస్థితి చేయిదాటితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్లెట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది" అన్నారు. నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే నా వద్ద ఉన్న బాబా ఊదీని అమ్మ నుదుటిపై పెట్టి, "బాబా! మీరే నా తల్లి ఆరోగ్యం బాగు చేయగల సమర్డులు" అని మనసులో బాబాకి చెప్పుకున్నాను. చాలాకాలం క్రితం 'సంకల్ప విస్మయ సాయి' అనే వాట్సప్ గ్రూప్ ద్వారా నాకు పరిచయమైన ఒక అక్క మా అమ్మ ఆరోగ్య విషయం తెలుసుకుని బాధపడి వెంటనే నిత్య పారాయణ గ్రూపులో అమ్మ పేరు మీద రెండు రోజులు 48 మంది సాయిభక్తులతో పారాయణ పెట్టించింది. ఆ భక్తులందరి ప్రార్దనలు ఫలించి పారాయణ పూర్తయిన రోజు సాయంత్రం ప్లేట్లెట్లు ఎక్కించకుండానే కేవలం బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగించడంతో అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడింది. ఆర్ఎంపీ డాక్టర్ రూపంలో బాబానే అమ్మకు ఆరోగ్యం చేకూర్చారు. "ధన్యవాదాలు బాబా! నిజంగా నీవు మా పాలిట దైవానివి. మీరు అనుగ్రహిస్తే, అమ్మ, నేను శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాం".
స్నేహితుని కుమార్తెకు పూర్ణాయుష్షుని ప్రసాదించిన బాబా:
నాలుగు సంవత్సరాలు క్రితం అనారోగ్యం వల్ల మా అమ్మని తరచూ హాస్పిటల్‍కి తీసుకెళ్లి, వస్తుండేవాడిని. ఆ సమయంలో పరిచయమైన ఒక ఆటోడ్రైవర్ నాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. అతను మృదుస్వభావి. మా మధ్య ఏ రక్త సంబంధమూ లేకపోయినా నన్ను ఆప్యాయంగా అన్నా అని పలకరించేవాడు. ఆ తమ్ముడు పేరు జయరామ్. అతను పదకొండు ఏళ్ల క్రితం ఒక యువతిని ప్రేమించి ఎంతో ఇష్టంగా వివాహం చేసుకున్నాడు. ఏళ్ళు గడిచినా పాపం ఆ దంపతులకు పిల్లలు కలుగలేదు. తిరగని ఆసుపత్రులు, గుళ్ళు, గోపురాలు లేవు. తిరిగితిరిగి వేసారి అలసిపోయిన వాళ్ళిద్దరి మొరను భగవంతుడు ఆలకించాడు. నా తమ్ముడికి పరిచయస్తుడైన మరో స్నేహితుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. అతని భార్యకి ఇటివల మూడో కాన్పు జరిగి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఉండగానే ఆ బిడ్డను చూసిన నా తమ్ముడు ఆ తల్లిదండ్రులతో, "బిడ్డ ముద్దొస్తుంది, మాకు ఇవ్వండి పెంచుకుంటాము" అని భావోద్వేగంతో అడిగాడు. వాళ్ళు నా తమ్ముడి ఆవేదనను అర్థం చేసుకుని మంచి మనసుతో ఆ బిడ్డను నా తమ్ముడికి ఇచ్చారు. నా తమ్ముడు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. ఐదు నెలలు గడిచాక ఒకరోజు ఉన్నట్టుండి ఆ పాప రక్త వాంతులు చేసుకుంటూ కళ్లుతేలేసింది. డాక్టర్లు ఐదునెలల ఆ పాపకు ఎండోస్కోపి చేయాలన్నారు. కానీ ఏ డాక్టరు అందుకు సాహసించలేదు. పాపను ఎన్నో హాస్పిటల్స్‌కి తీసుకుని వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నా తమ్ముడి బాధ వర్ణణాతీతం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిద్రాహారాలు మాని, "నా బిడ్డను ఎలాగైనా బ్రతికించు దేవుడా" అని ఒకటే ఏడుపు. విషయం తెలుసుకున్న నేను వెంటనే మా అక్కను సంప్రదించి బాబా వాట్సప్ గ్రూపులో సాయి భక్తులచేత పాప పేరు మీద ప్రత్యేక పారాయణ చేయించి, "బాబా! ఎన్నో ఏళ్లుగా సంతానం కలగక నా తమ్ముడు చేసిన ఆర్తనాదాలు విని మీరే తన స్నేహితుని రూపంలో కరుణించి నా తమ్ముడికి ఒక బిడ్డను ప్రసాదించారు. ఆ ఆనందంలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఇంతలోనే ఆ బిడ్డకు ఇలా జరగడంతో తల్లడిల్లిపోతున్నారు. అభం శుభం తెలియని ఆ చిట్టితల్లిని కాపాడగల సమర్థులు మీరే బాబా. దయచేసి ఆ బిడ్డకు పూర్ణాయుష్షును ప్రసాదించి ఆ తల్లిదండ్రుల పుత్రశోకాన్ని తీర్చండి. మీరు అనుగ్రహిస్తే, ఆ బిడ్డ కోలుకోగానే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుని మీ పేరిట కలకండ పంచి పెడతాము" అని మొక్కుకున్నాను. సాయి భక్తులందరి ప్రార్దనలు ఫలించి రోజులు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఆ పాప ఆరోగ్యం కుదుటపడుతూ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అంతా బాబా దయ. "బాబా! నిజంగా మీరు దయామయులు. మీ కృప అపారం. ఇంతటి అనుగ్రహాన్ని చూపినందుకు, ఈ అధ్బుత లీలలను 'సాయి మాహరాజ్ సన్నిది' బ్లాగులో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తండ్రి".
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sai ram.
ReplyDelete🙏🕉️✡️🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.. సాయినాద్ మహారాజ్ కీ జై సాయినాథ్ మహరాజ్ కీ జై సాయినాథ్ మహారాజ్ కీ జై. షిరిడీయే మా పండరీపురం సాయినాథ నీవే దిక్కు నీవే కలవు నీవే తప్ప మాకు ఎవరూ లేరు ఈ లోకంలో.. నీవే కాపాడాలి మా అందరికీ మీ ఆశీస్సులు ఎంతో అవసరం ఉన్నాయి దేవా.. నీవు తప్ప మాకు ఎవరూ లేరు ఈ లోకంలో.. జై శ్రీ సమర్ధ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహరాజ్ కీ జై..
ReplyDeleteOm sai ram 🙏🙏🙏♥️💗💓
ReplyDeleteOm sai ram your udi is sai sanjivani.with your udi you can cure any health problem.Devotees can cure from cancer deadly disease.udi is your blessing to all needy man kind.
ReplyDeleteOm sai ram very very nice sai baba leelas.i liked sai saved little baby and udi's mahima.♥️💗💓🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteఓం అపద్భాంధవాయ నమః
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete