సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1189వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఏదైనా సజావుగా సాగుతుంది
2. సమస్య నుంచి గట్టెక్కించిన బాబా
3. కంటిచూపు తిరిగిచ్చిన సాయితండ్రి

బాబా దయతో ఏదైనా సజావుగా సాగుతుంది

"బాబా! మీకు శతకోటి వందనాలు". 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు సభ్యులకు నా ప్రణామాలు. నాపేరు కృష్ణవేణి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో నా భర్త రెండేళ్ళుగా కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారని, చికిత్సకోసం హాస్పిటల్‍కి వెళ్తే, అక్కడ "నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటాన"ని బాబా దర్శనం ఇచ్చారని, ఆయన కృపతో 2022, మార్చి రెండో వారంలో మావారి ఒక కంటికి సర్జరీ అయిందని పంచుకున్నాను. ఇటీవల మావారి రెండో కంటి సర్జరీ కూడా బాబా దయవల్ల మంచిగా జరిగింది. "థాంక్యూ సో మచ్ బాబా".

ఈమధ్య మా బాబుకి పరీక్షలు ఉండగా నేను, "బాబా! బాబుకి పరీక్షల్లో మంచి మార్కులు వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అయితే బాబు మొదటి పరీక్ష రోజే మావారి కంటికి సర్జరీ జరిగే రోజు అయింది. అందువలన మేము బాబుని సరిగా చదివించలేకపోయాము. వాడు ఆరోజు పరీక్షకి వెళ్లనని బాగా ఏడ్చాడు. అప్పుడు నేను, "బాబు మనసు మార్చండి బాబా" అని బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యంగా బాబు పరీక్షకి వెళ్ళడానికి సరే అన్నాడు. బాబా దయవల్ల బాబుకి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు శతకోటి వందనాలు తండ్రి".

నేను ఈమధ్య మా కజిన్ పెళ్లికి వెళ్లాలని బయలుదేరినప్పుడు హఠాత్తుగా నాకు కడుపునొప్పి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో నొప్పి తగ్గి, ఏ ఇబ్బందీ లేకుండా నేను పెళ్ళికి వెళ్లి రాగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో నొప్పి తగ్గింది. దాంతో సంతోషంగా పెళ్ళికి వెళ్లి వచ్చాను. "పెళ్ళికి వెళ్లేలా చేసినందుకు థాంక్యూ సో మచ్ బాబా".

సమస్య నుంచి గట్టెక్కించిన బాబా

ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!! 

'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయి బంధువులకు ననమస్కారాలు. నా పేరు రమాదేవి. ఒకసారి మావారి ఏ.టి.ఎమ్ కార్డు కనపడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను, "ఏ.టి.ఎమ్ కార్డు కనపడితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అంతకుముందు ఎంత వెతికినా దొరకనిది బాబాకి చెప్పుకోగానే దొరికింది. కానీ నేను నా అనుభవాన్ని పంచుకోలేదు.

తరువాత మా వారికి మోషన్ ప్రాబ్లమ్ వచ్చి రెండు రోజులైనా విరోచనం కాలేదు దాంతో మావారు నరకం అనుభవించారు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి, నీరసంతో నోట మాట కూడా రాలేదు. అసలే మావారికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉంది. అందువల్ల ఆయనని హాస్పిటల్‍కి తీసుకుని వెళదామనుకున్నాను. అయితే పిల్లలు ఎవరూ మా దగ్గర లేనందున హాస్పిటల్‍కి వెళ్ళడానికి భయమేసి చిట్కా వైద్యాన్ని ప్రయత్నించాను. కానీ ఎటువంటి లాభమూ లేకపోయింది. ఇప్పుడెలా అని బాబా దగ్గరకెళ్ళి, "స్వామీ! గతంలో నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని పంచుకోలేదు. అందుకు నన్ను క్షమించి మావారికి ఏ సమస్య లేకుండా మోషన్ అయ్యేలా అనుగ్రహించండి. అది జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. తరువాత బాబా దయవల్ల నాకు ఒక విషయం గుర్తు వచ్చింది. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మకి ఇలాగే ఐతే కాఫీలో ఆముదం కలుపుకుని త్రాగితే సమస్య తీరింది. వెంటనే నేను మావారికి కాఫీలో ఆముదం వేసి ఇచ్చాను. ఒక్క గంటకల్లా మావారికి మోషన్ అయ్యింది. బాబా దయవల్లే సమస్య నుంచి మావారు గట్టెక్కారు. "ఈ సమస్య నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు బాబా. అలాగే మా కష్టాలన్నీ తీర్చు స్వామి. ఇంకెప్పుడూ ఇదేముందిలే, ఇది వ్రాస్తే బాగుండదేమో అని అనుకోకుండా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాలను పంచుకుంటాను. తప్పులుంటే క్షమించండి బాబా".

కంటిచూపు తిరిగిచ్చిన సాయితండ్రి
 
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి, సాటి సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు స్వాతి. మాది ఏలూరు. నేను మొట్టమెదటిసారిగా బాబా నాకు ప్రసాదించిన నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను. సంవత్సరంన్నర క్రితం నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదని అనుమానం వచ్చి హాస్పిటల్‍కి వెళ్ళాను. డాక్టరు, "కళ్లకి ఇన్ఫెక్షన్ ఉంది. శుక్లాలు కూడా ఉన్నాయి" అని ఐ డ్రాప్స్ ఇచ్చారు. వాటిని వాడినా నా కంటిచూపులో ఏ మార్పులేదు. అయినా ఆ ఐ డ్రాప్స్ తోపాటు రోజూ కళ్ళకి బాబా ఊదీ కూడా రాసుకుంటూ ఇంకో హాస్పిటల్‍కి వెళ్ళాను. ఆ డాక్టరు కూడా, "ఇన్ఫెక్షన్ ఉంది" అని రెండు కళ్ళకి ఇంజక్షన్ చేసారు. అయినాసరే, కంటిచూపులో మార్పులేదు. బాబా నాకు పెడుతున్న పరీక్ష అనుకుని ఇంకో హాస్పిటల్‌కి వెళితే, టెస్టులు చేసి, "పవర్ఫుల్ స్టెరాయిడ్స్ లేదా క్యాన్సర్‌కి వాడే మెడిసిన్ వాడాలి" అన్నారు. అయితే ఈసారి నేను ఆ మందులు ఏవీ వాడలేదు. ఎందుకంటే, నా సాయితండ్రి మీద 'ఆయన నాకు అన్యాయం చేయడన్న' పూర్ణ విశ్వాసం. అయితే రోజురోజుకు కంటిచూపు క్షీణిస్తూ వచ్చింది. సాయి సచ్చరిత్ర కూడా చదవలేకపోయేదాన్ని. ఇలా కొన్నిరోజులు గడిచాక నాకు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి తెలిసింది. దాంట్లోని కంటిచూపుకు సంబంధించిన ఒక భక్తుని అనుభవం గురించి విన్నాక, "బాబా! నాకు కంటిచూపు వస్తే, నా అనుభవాన్ని మీ ఈ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. కొన్నిరోజులకి ఊహించని విధంగా మా చుట్టాలలో ఒక ఆయన మాఇంటికి వచ్చారు. నా పరిస్థితిని చూసి నన్ను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఇంకా ఆయనే 2022, ఏప్రిల్ 9కి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా సచ్చరిత్ర తీసుకుని వెళ్లడం నాకలవాటు. ఆరోజు కూడా సచ్చరిత్ర తీసుకుని హైదరాబాద్‌కి ప్రయాణమయ్యాను. దారిలో హఠాత్తుగా సచ్చరిత్ర చదవాలనిపించి, పుస్తకం తెరిస్తే, 19వ అధ్యాయం వచ్చింది. నేను ఆ అధ్యాయం అంతా చదవగలిగాను(నేను సచ్చరిత్ర చదివి అప్పటికి సంవత్సరంపైనే అవుతుంది). నా కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. బాబా నాతోనే ఉన్నారన్న విశ్వాసం మరింత బలపడింది. హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టరు పరీక్షించి, "ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది. ఒక కన్నుకి ఆపరేషన్ చేయాలి" అన్నారు. తరువాత గురువారం ఆపరేషన్ అనడంతో బాబాపై నాకున్న విశ్వాసం ధృఢపడింది. బాబా ఆశీస్సులతో ఆపరేషన్ బాగా జరిగింది. తర్వాత కన్ను బాగా నొప్పి వచ్చినప్పుడు నేను ఎక్కువ సమయం సాయి నామస్మరణలో ఉన్నాను. నా నొప్పి అంతా బాబా తీసుకున్నారు. నాకు నొప్పి తగ్గింది. వారం తర్వాత మళ్ళీ గురువారంనాడు నా రెండవ కన్నుకి ఇంజక్షన్ ఇచ్చారు. నా కంటిచూపు కొంచం కొంచంగా మెరుగుపడసాగింది. చూపు వచ్చాక నేను వ్రాసిన మొదటి అక్షరాలు ఈ అనుభవమే. దీని ద్వారా ఈ బ్లాగుకున్న శక్తిని బాబా నాకు తెలియచేసారు. ఆయన నాకు ప్రసాదించిన అనుభవాలు ఒకటా, రెండా! వాటిలో నుండి ఏది ఈ బ్లాగులో పంచుకోవాలో అర్ధం కావట్లేదు. ఆ భారాన్ని బాబా మీదే వేసాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి".

8 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సాయి దేవా మా పాలిట మీరు దివ్యమైన దేవుడు.. అని తెలుసు.. మీరు అనేక సంవత్సరాలనుండి మాకు అందించిన గొప్ప గొప్ప అనుభవాలు అనుభూతులు మాకు అద్భుతమైన వరాలు.. మీ ఆశీస్సులు మమ్మల్ని ఎంతో దీవించినవి.. నిత్యం సాయి సాయి నామ స్మరణ చేయటమే మాకు రక్షణ.. మీ పాదాల పై భక్తి రోజురోజుకు పెరిగే విధంగా దీవించండి బాబా. మా అనారోగ్యాన్ని ఇప్పటికిప్పుడు రూపుమాపి నిర్మూలించండి.. సాయి దేవ బాబా..

    ReplyDelete
  4. మీకు వేల కోట్ల నమస్కార సాష్టాంగ ప్రణామములు సాయిరాం బాబా దేవా

    ReplyDelete
  5. సాయి బాబా నా కడుపు నొప్పి తగ్గించండి. మిమ్మల్ని నమ్ముకుని వున్నాను దేవా.రక్షణ కలిగించు.నీకు శత కోటి వందనాలు తండ్రి. ఆరోగ్యం ప్రసాదించు.

    ReplyDelete
  6. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  7. ఓం సాయి తండ్రీ నమో నమః

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo