సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1214వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. అంతా సవ్యంగా జరిపించిన బాబా
3. "నువ్వేమీ భయపడొద్దు. నా దగ్గరకి రా" అన్న సందేశంతో శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా 

శ్రీసాయి అనుగ్రహం


బ్లాగు నడుపుతున్న సాయికి నా ప్రణామాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇప్పుడు సాయి నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటాను. ముందుగా ఆలస్యమైనందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఈమధ్య మేము ఒక ఇల్లు కట్టించుకున్నాము. కొంచెం పనులు మిగిలి ఉన్నప్పటికీ అద్దెకున్న ఇల్లు సరిగా లేదని గృహప్రవేశం చేసుకున్నాం. బాబా అనుగ్రహ సూచకంగా ఆ ముందురోజే మాకు శిరిడీ  నుంచి ఊదీ అందింది. ఇది మాకు మరువలేని అనుభూతి.


మేము ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటి ముందు మెట్లు తరువాత పెట్టుకుందాంలే అని వదిలేసాము. అయితే పునాది ఎత్తుగా ఉండటం వల్ల అమ్మ ఒకరోజు కింద పడిపోయింది. ఆ దుర్ఘటనలో అమ్మ కాలు బెణికి చాలా లావుగా వాచి పోయింది. డాక్టరు దగ్గరకి వెళ్లొచ్చాక కొంచెం తగ్గినట్టే తగ్గి తరువాత ఇంకా ఎక్కువైంది. ఇక డాక్టరు చుట్టూ తిరగడానికే మాకు సరిపోయింది. కానీ అమ్మ తన కాలి వాపు తగ్గక చాలా వేదన అనుభవించింది. నేను ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదివి అందులో చెప్పినట్లుగా బాబా ఊదీ కొంచెం తీసుకుని స్ప్రేతో కలిపి అమ్మ కాలిపై మర్థించి, "అమ్మకు నయమైతే బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. సాయి నా మొరను ఆలకించారు. అమ్మ కాలు వాపు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. "సాయీ! మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి".


మా బంధువులలో నాకు కూతురు వరసయ్యే ఒక అమ్మాయి ఉంది. తనకి పెళ్ళై రెండు సంవత్సరాలే అయింది. కానీ తన తరువాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టేస్తుంటే ఆ అమ్మాయి తను మాత్రమే గర్భవతిని కావడం లేదని చాలా బాధపడుతుండేది. నేను తన బాధ చూడలేక, "తండ్రీ! తనేమీ కోరకూడనిది కోరడం లేదు, తన కోరికలో నిజాయితీ ఉంది కదా! తనకి సహాయం చేయండి. మీ కృపతో తనకి సంతానం కలిగితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. సంబంధం లేని ఇతరులు గురించి నేను ప్రార్థన చేయడం అదే మొదటిసారి. నేను ఇలా సాయిని ప్రార్థించిన విషయం తనకు చెప్పలేదు. సాయికి మాత్రమే చెప్పుకుని ఊరుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. తనకి ఇప్పుడు కూతురు పుట్టింది. "సాయీ! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి".


నేను ఒక ముఖ్యమైన పని పూర్తవ్వాలని ఎదురు చూస్తున్నాను. దానికి సంబంధించి 'క్వశ్చన్&ఆన్సర్' వైబ్సైట్‍లో బాబా సమాధానం సానుకూలంగా వస్తుంది. కానీ నాకు ఏం ఫలితం కనిపించడం లేదు. అయినా నేను రాబోయే రెండు నెలల్లో నా సమస్య పరిష్కరిస్తారని నా సాయితండ్రి మీద ధృఢమైన నమ్మకంతో ఉన్నాను. నా వస్తువు దొరికినంతనే మరింత వివరంగా మీ ముందుకు వస్తాను. "సాయీ! ఈ ప్రాణం మీ వలనే ఇంకా ఈ భూమి మీద ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి నాకు సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాను తండ్రి".


ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి సూక్ష్మాయ నమః!!!


అంతా సవ్యంగా జరిపించిన బాబా

 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. సాయినాథుని పాదపద్మములకు నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి, తోటి సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు ఉష. 2022, మే 30 ఉదయం శివునికి అభిషేకం చేయిద్దామని నేను, ప్రదక్షణాలు చేసి మొక్కు తీర్చుకుందామని నా చిన్నకొడుకు గుడికి వెళ్ళాము. నా కొడుకు ప్రదక్షణలు చేస్తుండగా నేను లైన్‍లో నిలుచుని జరుగుతున్న అభిషేకం చూస్తున్నాను. అభిషేకం పూర్తి కావస్తుందనగా ఒక్కసారిగా నాకు కళ్ళు తిరగటం, ఇంకా వాంతి వస్తున్న అనుభూతి కలగడంతో తట్టుకోలేక లైన్‍లో నుండి బయటకు వచ్చేసాను. దైవ దర్శనం కాకుండానే హాస్పిటల్‍కి వెళ్ళాల్సి వస్తున్నట్లుందని నాకు అనిపించింది. ఒక పక్క నా పరిస్థితి ఇలా ఉంటే, అవతల నా కొడుకు ఏమీ తినకుండా ప్రదక్షిణలు చేస్తున్నాడు. అసలే తను బరువు తగ్గాలని ఆహారం తీసుకోవడం తగ్గించి, బాగా నీరసించిపోయి ఉన్నాడు. అందువలన తను మొత్తం ప్రదక్షణాలన్నీ పూర్తి చేయగలడో, లేదో అని దిగులుపడ్డాను. వెంటనే నేను బాబాని, శివుణ్ణి తలుచుకుని, "తండ్రీ! నువ్వే సాయివి, శివునివి. నా దృష్టిలో అన్ని రూపాలు మీరే. మీ దయతో ఏ ఇబ్బంది లేకుండా నేను మీకు అభిషేకం, అనంతరం మీ దర్శనం చేసుకోవాలి, అలాగే నా కొడుకు మీకు ప్రదక్షణలు సవ్యంగా చేసుకోవాలి. ఆపై మేము మా ఇంటికి జాగ్రత్తగా చేరుకుంటే, నా అనుభవాన్ని ఈరోజే మీ బ్లాగుకి పంపుతాను" అని మ్రొక్కుకున్నాను. అలా మ్రొక్కుకున్నంతనే బాబా దయతో నాకు కలిగిన ఇబ్బందిని తమ చేతితో తీసి వేసినట్లుగా అనిపించింది. అంతే మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. నా కొడుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రదక్షణలు పూర్తిచేసి శివున్ని దర్శించుకుని వచ్చాడు. ఇద్దరమూ స్వామి ఆశీస్సులతో క్షేమంగా ఇంటికి చేరామంటే అది బాబా దయే. "ధన్యవాదాలు సాయితండ్రీ. నాకు కొన్ని సమస్యలున్నాయి. వాటినన్నిటిని పరిష్కరించి శిరిడీలో మీ దర్శన భాగ్యాన్ని మాకందరికీ ప్రాప్తింపజేయండి నాయనా. నాకు ఎన్నాళ్ళనుంచో నా కుటుంబంతో మిమ్మల్ని శిరిడీలో దర్శించుకోవాలని ఉంది తండ్రి. శిరిడీలో ఆనందంగా మీ దర్శనం చేసుకుని తర్వాత కూడ అదే ఆనందంలో మేము ఉండేలా అనుగ్రహించు తండ్రి. మనస్సు స్థిమితంగా ఉండక చెడు ఆలోచనలు(అశుభకరమైన ఆలోచనలు) వస్తున్నాయి. వాటిని తొలగించి సంతోషంగా ఉండేలా చూడు నాయనా".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


"నువ్వేమీ భయపడొద్దు. నా దగ్గరకి రా" అన్న సందేశంతో శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా 


ముందుగా శ్రీసాయినాథునికి నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి కృతజ్ఞతలు. నాపేరు లక్ష్మీ. నేను బెంగుళూరు నివాసిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను సాయి బంధువులతో పంచుకున్నాను. 2022, ఏప్రిల్ మొదటివారంలో నేను మా చిన్నబ్బాయి కుటుంబంతో కారులో శిరిడీ వెళ్లాలని అనుకున్నాను. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున 'నేను అంత దూరప్రయాణం చేయగలనా?' అని నాకు అనిపించింది. సరిగా అప్పుడే, "నువ్వేమీ భయపడొద్దు. నా దగ్గరకి రా" అన్న బాబా సందేశం వచ్చింది. ఆ సందేశం చూసాక చాలా ఆనందంగా అనిపించి నా సాయినాథుని దర్శనానికి బయలుదేరాను. ఆ సద్గురు సాయినాథుని దయవలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన సన్నిధి శిరిడీకి చేరుకున్నాము. మాకు కరివేన అన్నదాన సత్రంలో వసతి దొరికింది. అందరం ఫ్రెషప్ అయ్యాక నన్ను వీల్ చైర్లో దర్శనానికి తీసుకుని వెళ్లారు. నాతో ఒక్క అటెండెంట్‍ను మాత్రమే పంపుతామని చెప్పినప్పటికీ బాబా కరుణవలన మొత్తం అందరినీ నేరుగా సమాధి మందిరంలోని బాబా దర్శనానికి పంపారు. 10 సంవత్సరాల తర్వాత బాబా దర్శనం చేసుకున్న నేను పట్టలేని ఆనందాన్ని పొందాను. హృదయపూర్వకంగా బాబాకు దణ్ణం పెట్టుకుని, కన్నులనిండా ఆయన రూపాన్ని నింపుకుని సంతోషంగా బయటకి వచ్చాను. నేను ఎప్పుడో బాబాకు మ్రొక్కుకుని రాత్రిపూట అన్నం తినడం మానేసాను. అందుకని నేను ద్వారకామాయి దగ్గర అందరికి పెరుగన్నం పంచిపెట్టాను. వీల్ చైర్ వాళ్లని ఆరతికి అనుమతించరని అన్నందున నా కొడుకు, కోడలు ఆరతికి లోపలకి వెళ్లగా, నేను ద్వారకామాయి దగ్గర టీవీలో బాబా అరతి వీక్షించాను. మరునాడు ఉదయాన్నే మేము ఆనందంగా శిరిడీ నుండి బయలుదేరి బెంగుళూరుకు వచ్చేసాము. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని పంపించడానికి ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. నాకున్న ఆరోగ్య సమస్యలను దయతో తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను సాయితండ్రి".


7 comments:

  1. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  2. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram i am suffering from bad thoughts.i am having fear of evil something happens to my family members.with that I feel fear.i know that Sai maa takes care of everything.But my mind is not accepting.This is my weakness.sorry baba.please forgive.i. Am feeling sad also.please change my thoughts into positive and give mental peace.Bless my family and be with us

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. సాయీ! ఈ ప్రాణం మీ వలనే ఇంకా ఈ భూమి మీద ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి నేను ఉన్న పరిస్థితుల్లో మీ సహాయం నాకూ చాలా చాలా అవసరం . నాకు మీరు తప్పా వేరే దిక్కు లేదు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏 నన్ను కాపాడు తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo