1. పిలిచిన ప్రతిసారీ పలుకుతూనే వున్న బాబా
2. బాబా చూపిన లీల
పిలిచిన ప్రతిసారీ పలుకుతూనే వున్న బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నేను ఎలా ధన్యవాదాలు చెప్పగలను? కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు తగినంత పదాలు లేవు, కానీ బాబా ఆశీస్సులు మాత్రం మీకు తప్పకుండా ఉంటాయి. నేనొక బాబా భక్తురాలిని. నా పేరు మృణాళిని. నేను ఇదివరకు ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో అనుభవాలను పంచుకున్నాను. అయితే, వాటిలో నా పేరును గోప్యంగా ఉంచాను. కానీ, ఈరోజు నేను నా పేరును దాచకుండా బాహాటంగా బాబాపట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. బాబా నాకు చాలా విషయాల్లో సహాయం చేశారు. “బాబా! నాకు సహాయం చేయండి” అని బాబాను వేడుకున్న ప్రతిసారీ బాబా నన్ను ఆదుకున్నారు, నన్ను ఎన్నో సమస్యల నుండి కాపాడారు. వాటిలోనుండి కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
మొదటగా, బాబా మావారిని ఒక సమస్య నుండి కాపాడిన విషయాన్ని మీతో పంచుకుంటాను. మావారికి తెలియకుండా జరిగిన ఒక సంఘటన వల్ల ఏర్పడిన సమస్య ఇది. అసలు ఏం జరిగిందంటే, ఒకసారి మా పిల్లలు మావారి ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఏవో బొమ్మల గురించి సెర్చ్ చేస్తుంటే వేరే స్పాం(spam) మెసేజీలు ఓపెన్ అయ్యాయి. ఈ విషయం మావారు గమనించలేదు. పిల్లలు అలా చేయటం వలన HR వాళ్ళు మావారికి ఫోన్ చేసి, “ల్యాప్‌టాప్‌ను ఇలా వ్యక్తిగత అవసరాల కోసం వాడకూడదు కదా” అని అన్నారు. నిజానికి మావారు తన వ్యక్తిగత అవసరాల కోసం ఆఫీస్ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించుకోరు. అందువల్ల, అసలు ఇలాంటి విషయమొకటి జరుగుతుందని మావారు ఊహించలేదు. ఆ తరువాత HR వాళ్ళు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడండి. ఇంతగా కష్టపడి పనిచేసే మావారికి ఇలా జరగటమేంటి? ప్లీజ్, మాకు హెల్ప్ చేయండి బాబా. మీ దయతో మావారు ఈ సమస్య నుండి బయటపడితే, నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను” అని వేడుకున్నాను. అలా బాబా మీద భారం వేసి బాబానే నమ్ముకున్నాను. సరిగ్గా మావారి పుట్టినరోజునాడు HR వాళ్ళు ఆఫీసులో మావారి మేనేజరుతో కలిసి ఈ విషయంపై మీటింగ్ పెట్టారు. మావారి మేనేజర్ మావారికి బాగా సపోర్ట్ ఇచ్చి, “తన గురించి మాకు బాగా తెలుసు. తనకి ల్యాప్‌టాప్‌ను వ్యక్తిగతంగా ఉపయోగించుకునేంత తీరిక సమయం ఉండదు. తను ఒకేసారి రెండు మూడు మీటింగులు అటెండ్ అవుతుంటాడు. తనకి ప్రతి సంవత్సరం బెస్ట్ రేటింగ్ వస్తుంటుంది” అంటూ ఋజువులన్నీ చూపించి మావారి తరఫున బాగా వాదించాడు. HR వాళ్ళు కూడా మావారి ఇన్ని సంవత్సరాల అప్రిసియేషన్స్ అన్నీ అప్పటికే ఎంక్వయిరీ చేసుకుని వచ్చారు కాబట్టి, “ఇకపై ల్యాప్‌టాప్‌ను వ్యక్తిగతంగా వాడవద్దు” అని మావారికి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మావారి మేనేజరు కూడా మావారితో మాట్లాడుతూ, “ఈ విషయం గురించి నువ్వసలు ఆలోచించవద్దు. నీ గురించి మాకు తెలుసు. నువ్వు కనీసం భోజనానికి కూడా వెళ్ళకుండా వర్క్ చేస్తుంటావు. అసలు ఇది జరిగిందని కూడా ఆలోచించకు” అని సపోర్ట్ ఇచ్చారు. ఇదంతా బాబా దయవలన మాత్రమే సాధ్యమైంది. “బాబా! మీకు శతకోటి ధన్యవాదములు”.
ఇంకొక అనుభవం: కొద్దిరోజుల క్రితం మా అందరికీ తీవ్రంగా జ్వరం వచ్చింది. మొదట మా పెద్దబాబుకి వచ్చింది, తన నుండి మిగతా అందరికీ వచ్చింది. ఆ జ్వరం సాధారణ జ్వరంలా లేదు. మేమసలు మంచం పైనుండి లేవలేకపోయాము. మా చిన్నబాబు, నేను మరియు మా పెద్దబాబు అసలు లేవలేకపోయాము. అసలే ఆ సమయంలో కోవిడ్ ప్రభావం పెరగటం ప్రారంభమైంది. దాంతో నాకు బాగా భయం వేసి, బాబాకు నమస్కరించుకుని, “బాబా! మాకు వచ్చిన జ్వరం కోవిడ్ కాకుండా చూడు” అని వేడుకున్నాను. తరువాత అందరం ఇంట్లోనే కోవిడ్ టెస్ట్ చేసుకున్నాము. బాబా దయవలన అందరికీ నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. పిలిచిన ప్రతిసారీ బాబా పలుకుతూనే వున్నారు. తనను నమ్మినవారిని నిరంతరం కాపాడతారని బాబా పదే పదే నిరూపించారు. “బాబా! నీ ప్రేమ, దయ, కరుణ మామీద ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి బాబా”.
ఇక చివరగా ఒక మిరాకిల్ లాంటి అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నాకు కేవలం బాబా అనుగ్రహం వలన మాత్రమే లభించిన ఉద్యోగం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ‘అసలు నాకు ఉద్యోగం రావటమే బాబా దయ’ అని అంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. నేను ఇప్పుడున్న కంపెనీలో కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తున్నాను. “నాకు పర్మినెంట్ ఉద్యోగం ప్రసాదించు బాబా” అని బాబాను నిరంతరం నేను వేడుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడున్న టీంలో చాలా మార్పులు జరిగాయి. ప్రతి మార్పూ కూడా బాబానే నాకోసం చేసినట్లు జరిగింది. అడుగడుగునా బాబా నన్ను రక్షించారు. నేను అదే కంపెనీలో వేరే టీంలో పర్మినెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. తరువాత ప్రాసెస్ అంతా చాలా వేగంగా జరిగి, పర్మినెంట్ ఉద్యోగానికి సంబంధించి నాకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. అంతా చక్కగా జరుగుతోందని అనుకుంటుండగా వెరిఫికేషన్‌లో కొంచెం ఇబ్బంది వచ్చింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! కేవలం నీ దయవలన మాత్రమే ఇది సాధ్యం. ప్లీజ్, నాకు హెల్ప్ చేయండి. నేను ఈరోజే నా అనుభవాన్ని ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటాను” అని మనసారా వేడుకున్నాను. సాయంత్రంలోగానే అన్నీ క్లియర్ అయ్యేలా బాబా అనుగ్రహించారు. ఇదంతా ఒక్క బాబా వలన మాత్రమే సాధ్యమయింది. ఇలా ఎన్నో విషయాలలో బాబా నాకు అడుగడుగునా సహాయం చేస్తున్నారు. “బాబా! మీరు చేసిన ఈ సహాయానికి నేను జీవితాంతం మీకు ఋణపడివుంటాను. ఇందుకు కృతజ్ఞతగా నేను చేయగలిగింది - మీరు చూపించిన సన్మార్గంలో నడుచుకుని, చేతనయినంతవరకు నలుగురికి సహాయం చేయటమే. ఇంతవరకు మీరు ప్రసాదించిన అన్నిటికీ చాలా ధన్యవాదాలు. మీ దయ, ప్రేమ నా మీద, నా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఇలానే వుండేలా ఆశీర్వదించండి బాబా. ఎన్నడూ నాపై కోప్పడవద్దు బాబా. మమ్మల్ని వదిలిపెట్టవద్దు. ప్లీజ్ బాబా, మమ్మల్ని సదా కాపాడండి బాబా”.
ఓం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!!!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా చూపిన లీల
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. ముందుగా సాయి పాదపద్మములకు నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి, తోటి సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు ఉష. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు చెప్పనలవికానివి. వాటినుండి కొన్ని ఇప్పుడు నేను బ్లాగులో పంచుకుంటాను. ఒకసారి మా అమ్మకి వాంతులు అయ్యాయి. ఆమె వాంతి చేసుకునేటప్పుడు అందులో రక్తం కూడా పడడంతో మేమంతా చాలా భయపడిపోయాము. డాక్టరు టెస్టులు చేసి లోతైన విశ్లేషణకు పంపాలని, వారం రోజుల తర్వాత రిపోర్టులు వస్తాయన్నారు. ఈ లోపు నేను ప్రతిరోజు బాబా ముందు కూర్చుని బాధతో, "బాబా! రిపోర్టులు నార్మల్‍గా వచ్చేటట్టు చేయండి" అని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. బాబా దయవలన రిపోర్టులు అన్నీ నార్మల్ అని వచ్చాయి. మా కుటుంబమంతా చాలా సంతోషించాము. నేనైతే బాబా దగ్గరకి వెళ్లి ఆనందంగా కొద్దిసేపు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మా స్థలంలో కొంత భాగం రోడ్డు వైండింగ్‍లో పోతున్న కారణంగా దానికి సంబంధించి గవర్నమెంట్ మాకు ఒక బాండ్ (TDR) ఇచ్చింది. మాకు తెలిసిన ఒకతను ఆ బాండ్ తాలూకు జిరాక్స్ కావాలని అడిగితే, జిరాక్స్ తీసి ఒరిజినల్స్ మా షాపులో పెట్టాము. తరువాత రోడ్డు వైండింగ్ చేసే సమయంలో ఆ బాండ్ మిస్ అయింది. ఆ తరువాత ఎంత వెతికినా అది దొరకలేదు. మున్సిపల్ ఆఫీసువాళ్ళు కనీసం జిరాక్స్ అయినా ఉండాలన్నారు. అది కూడా మా దగ్గర లేకపోవడంతో మేము అదివరకు జిరాక్స్ తీసి ఇచ్చిన అతన్ని అడిగాము. అతను ఇల్లు మారేటప్పుడు ఆ జిరాక్స్ అవసరం ఇక లేదని తీసే పారేశామని చెప్పాడు. ఇక చేసేదిలేక మేము బాబాని, "బాబా! మీ దయతో బాండ్ దొరికితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటామ"ని మొక్కుకున్నాము. తరువాత ఒకరోజు నేను పూజ చేసుకుంటుంటే మావద్ద జిరాక్స్ తీసుకున్న అదే వ్యక్తి నుండి నాకు ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, అతని ఆఫీసువాళ్ళు అతనితో, "మీరు ఒకసారి వచ్చి ఆఫీసులో ఉన్న పాత ఫైల్‍ను చూసి, అవసరం లేదంటే పారేస్తామ"ని చెప్పారు. దాంతో అతను ఆఫీసుకి వెళ్లి ఆ పాత పైల్‍ని చూస్తే, అందులో మా బాండ్ జిరాక్స్ ఉంది. అతను దానిని తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. మాకిచ్చిన బాండ్‍కి సాక్ష్యంగా ఆధారాలు లేవనుకున్న మాకు ఈ విధంగా బాబా తమ లీలను చూపించారు. "ధన్యవాదాలు బాబా. త్వరగా అవి ఆన్లైన్ అయ్యి, సేల్ చేస్తే మంచి ధర వచ్చేలాగా చేయి తండ్రి.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయిబాబా నీవే కలవు.. నీవు తప్ప మాకు ఎవరూ లేరు ఈ లోకంలో.. మా అనారోగ్యాన్ని రూపుమాపి నిర్మూలించి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించిన గొప్ప దేవా.. మీకు ఇవే మా కృతజ్ఞతలు ధన్యవాదాలు సాయినాథ..
ReplyDeleteనీవిచ్చిన అద్భుతమైన జీవితం మాకు గొప్ప వరం.. వ్యాపారాన్ని మరింత గొప్పగా చేసుకునే సువర్ణ ఆకాశాన్ని కల్పించి మీ సేవలో మీకోసం మీ భక్తునిగా నేను.. సాయి బిడ్డగా సాయి రాజ్ కుమార్ గా విలసిల్లే విధంగా దీవెనలు అందించండి సాయినాథ థాంక్యూ సాయిబాబా..
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete