ఈ భాగంలో అనుభవాలు:
1. సాయిబాబా నిజంగా ఉన్నారు - సదా రక్షిస్తున్నారు
2. పూజారిగా అనుగ్రహించిన బాబా
3. బాబాను తలుచుకున్నంతనే కనిపించిన వస్తువు
సాయిబాబా నిజంగా ఉన్నారు - సదా రక్షిస్తున్నారు
సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు నా జీవితంలో జరిగిన అతి పెద్ద అనుభవాన్ని, అలాగే మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను. ప్రస్తుతం ఏడవ నెల నడుస్తున్న మా పాపకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది. అందువల్ల తనని ప్రతి నెల హాస్పిటల్‌కి తీసుకెళ్లి సాచ్యురేషన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉండాలి. మొదటి నెల సాచ్యురేషన్ 100%, రెండు, మూడు నెలల్లో 98% ఉండగా 4వ నెలలో 94% కి వచ్చింది. మాకు చాలా ఆందోళనగా అనిపించింది కానీ, డాక్టర్లు 'ఏమి కాద'ని ధైర్యం చెప్పారు. తరువాత రెండు నెలలు బాగానే ఉన్నా 7వ నెలలో చూపించినప్పుడు సాచ్యురేషన్ 87% అని రెడ్ కలర్(డేంజర్)లో చూపించింది. నాకైతే చాలా చాలా టెన్షన్‍గా అనిపించింది. ఇంక పాపను నేరుగా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తారేమోనని మేము చాలా భయపడ్డాము. అప్పటి నా భయం మాటల్లో వర్ణించలేనిది. వెంటనే, "బాబా! పాపకి 94% సాచ్యురేషన్ కన్నా ఎక్కువ వచ్చేలా చూడండి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత డాక్టరు ఒక 5 నిమిషాలు వేచి చూసి మళ్లీ సాచ్యురేషన్ చెక్ చేయండి అన్నారు. 5 నిమిషాల తరువాత చెక్ చేసి, సాచ్యురేషన్ 94-95% ఉందని నిర్థారించారు. అది వినగానే నాకు, మావారికి చాలా ఉపశమనంగా అనిపించింది. ఆ క్షణం నా ఆనందానికి అవధులు లేవు. సాయిబాబా నిజంగా మాతోనే ఉన్నారు, మా కుటుంబాన్ని సదా రక్షిస్తున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".
నేను నా పనులు చేసుకునే సమయంలో మా పాప నిద్రపోతుంది. నేను నా పనులు ముగించుకుని నిద్రపోదామనుకునే సమయానికి తను లేస్తుంది. ఇక నాకు పాపతో సమయం గడపాల్సి వస్తుంది. ఆ కారణంతో ఒకరోజు నాకు అస్సలు నిద్రలేకపోయింది. అందువల్ల నాకు చాలా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. సాధారణంగా నాకు తలనొప్పి వస్తే, విశ్రాంతి తీసుకుంటాను. కానీ ఆసారి పాపతో నిద్రపోలేక, పాపని ఆడించలేక నా తలనొప్పి ఇంకా ఇంకా పెరగసాగింది. దాంతో నేను ఒక డోలో 650 టాబ్లెట్ వేసుకున్నాను. మామూలుగా ఆ టాబ్లెట్ వేసుకుంటే, ఒక గంటలోపు నాకు తలనొప్పి తగ్గుతుంది. కానీ ఈసారి 4, 5 గంటలైనా తలనొప్పి తగ్గలేదు. ఇంక ఆ నొప్పిని తట్టుకోవడం నావల్ల కాదనిపించింది. కానీ ఇంట్లోవాళ్ళకి చెప్తే, 'ఎప్పుడూ జబ్బులే అంటార'ని చెప్పలేదు. వెంటనే, "బాబా! నా తలనొప్పి తగ్గించండి" అని బాబాకి చెప్పుకొని బాబా ఊదీ పెట్టుకున్నాను. అద్భుతం! అప్పటికి ఎన్ని గంటలైనా తగ్గని తలనొప్పి కాసేపట్లో తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. నిజంగా ఇది మీ అనుగ్రహం. ప్లీజ్ బాబా, ఏ ఆపరేషన్ లేకుండా నా బిడ్డ జీవితాన్ని కాపాడండి".
ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
పూజారిగా అనుగ్రహించిన బాబా
నా పేరు మధు. మాది నెల్లూరు దగ్గర నక్కవారిపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. నాకు చిన్నప్పటినుంచి బాబాతో చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. నేను ఒక బాబా మందిరంలో పూజారిని. అది నాకు చాలా విచిత్రంగా వచ్చింది. ఒకప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్న ఈదూర్ అనే గ్రామంలో బాబా మందిరం నిర్మాణం జరుగుతుండేది. అప్పుడు ఒకరోజు నాకు తెలిసిన ఒక పూజారి నాదగ్గరికి వచ్చి, "నేను ఆ బాబా గుడిలో చేరాలనుకుంటున్నాను. మన ఇద్దరం కలసి వెళ్లి మాట్లాడి వద్దాం" అని అన్నారు. సరేనని, నేను అతనితో వెళ్ళాను. ఇద్దరమూ ఆ గుడికి సంబంధించిన వాళ్లతో మాట్లాడాము. వాళ్ళు, "ఒక 15 రోజుల తర్వాత కనిపించండి" అని చెప్పారు. సరేనని మేము తిరిగి వచ్చేసాము. తర్వాత నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. కానీ ఆ గుడికి సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకుని మరీ నన్ను పిలిచి, "గుడిలో బాబాకి పూజలు చేయమ"ని చెప్పారు. బాబా అనుగ్రహానికి నేను చాలా సంతోషించి వారి సేవలో నిమగ్నమయ్యాను. సరిగ్గా 7 సంవత్సరాల తర్వాత వేరొక ఊరిలో 'బాబా నగర్' అనే చోట పూజారి కావాలని పిలుపు వచ్చింది. నేను అక్కడ 9 సంవత్సరాలుగా పూజ చేస్తున్నాను. అక్కడ బాబాతో నా అనుభవాలు లెక్కలేనన్ని. "బాబా! నాకు ఆపద" అని అంటే, "ఓ! నేను ఉన్నానుగా" అంటారు బాబా. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఈమధ్యనే పెళ్లి అయింది. కానీ వైవాహిక జీవితం చాలా గొడవలతో నడుస్తుంటే, "ఇదేంటి బాబా" అని అనుకున్నాను. బాబా నాకు ఏ చెడ్డ పేరు లేకుండా నన్ను కాపాడారు. "బాబా! నా జీవితాంతం మీకు ఋణపడి ఉంటాను".
బాబాను తలుచుకున్నంతనే కనిపించిన వస్తువు
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
ముందుగా శ్రీసాయినాథుని దివ్య పాదాలకి శిరస్సు వంచి ప్రణామాలర్పిస్తున్నాను. సాటి సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నాపేరు విజయలక్ష్మి. 2022, మే 17న బాబా నాకు ఒక మంచి అనుభవం ప్రసాదించారు. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మావారు తన ఆఫీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన వస్తువును నాకిచ్చి దాన్ని జాగ్రత్తగా భద్రరపరచమని చెప్పారు. నేను దాన్ని జాగ్రత్తగా ఒక బ్యాగులో పెట్టి ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ మావారు దాని గురించి అడిగినప్పుడు దాన్ని ఎక్కడ పెట్టింది నాకు అస్సలు గుర్తు రాలేదు. మావారు చాలా టెన్షన్ పడ్డారు. నేను బాబాని తలుచుకుని, "బాబా! మీ దయతో అది కనిపించాలి" అని అనుకున్నాను. అలా బాబాను తలుచుకున్నంతనే మా పాప, "బ్యాగులో చూడు అమ్మ" అని అంది. బ్యాగులో చూస్తే, ఆ వస్తువు కనిపించింది. ఆనందంతో బాబాకి కోటి నమస్కారాలు చెప్పుకుని వెంటనే ఆయన దయను, నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి బ్లాగుకు పంపించాను. "ధన్యవాదాలు బాబా. దయచేసి నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి. నాకు ఏదైనా చేయాలని ఉంటుంది. కాని వాయిదాలు వేసుకుంటూ పోతుంటాను. మీ దయతో ఆ అలవాటు పోవాలి బాబా".
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sai rakshak saranam deva
ReplyDeleteOm sai ram today is guru powranmi i went with baba blessings to temple.with out rain and I am not feeling well.He gave health to me.He was with me.i have wish to take darshan of baba.He full filled my wish.Thank you baba.
ReplyDelete