సాయి వచనం:-
'నువ్వు ఇక్కడ ఉండొద్దు. శిరిడీ వచ్చేయి. శిరిడీలో ఎంతో ఆనందం ఉంది.'

'మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన చేరగలిగినా అది బాబా చూపిన పవిత్రమార్గం కానప్పుడు అది నిష్ఫలమే అవుతుంది. ఆ అపవిత్రపు మార్గం, బాబా చేర్చాలనుకున్న గమ్యానికి చేరువ కానీయక, మనమే ఏర్పరచుకున్న అడ్డంకియై గమ్యానికి మరింతగా దూరం చేస్తుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1193వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే మనకు రక్ష
2. సాయి ఆశీర్వాదం
3. సమస్యను తీర్చిన బాబా

బాబానే మనకు రక్ష


సాయి బంధువులకు నమస్కారము. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నేను కొంతమందితో కలిసి ఒక టూర్‌కి వెళ్ళినప్పుడు మాతోపాటు వచ్చిన ఒక అమ్మాయికి నెలసరి వచ్చింది. వేరేవాళ్ళు ఈ అమ్మాయిని తమతో దర్శనానికి రమ్మన్నారు. ఆ రాత్రి నేను నా మనసులో 'ఈ అమ్మాయి మా వాహనంలో వస్తుందేమో! అయినా తెలిసి ఈ సమయంలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో' అని అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి వేరే కారులో వచ్చింది. కానీ మనసులో నేను ఆమె గురించి అనుకున్నదానికి శిక్ష నాకు మరునాడు పడింది. ఎప్పుడో రెండేళ్ల క్రిందట ఆగిపోయిన నెలసరి హఠాత్తుగా నాకు మళ్ళీ వచ్చింది. దాంతో నేను, "బాబా! ఆ అమ్మాయి విషయంలో నేను అలా అనుకోవడం తప్పు. నన్ను క్షమించండి. నాకు బ్లీడింగ్ అవ్వకుండా చూడండి. బాబా దయవలన నాకు మూడవరోజు బ్లీడింగ్ ఆగిపోయింది. ఆ అమ్మాయిని అలా మనసులో అనుకున్నందుకే నాకు అలా జరిగింది. మనం ఏదైనా ఎవరినైనా అనే ముందు ఆలోచించాలని బాబా నాకు  ఈ అనుభవం ద్వారా తెలియజేసారు.


బాబా మా పిల్లలందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. యు.ఎస్.ఏలో ఉంటున్న మా పిల్లలు ఇదివరకు వేరే స్టేట్‍లో దక్షిణ సింహద్వారం ఉన్న ఒక పెద్ద ఇల్లు కొన్నారు. దాన్ని అమ్మాలని అమ్మకానికి పెడితే, అందరూ చూసి వెళుతుండేవారుకానీ ఎవరూ కొనడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఒకరోజు నేను నా మనసులో, "బాబా! మాకు ఏది మంచిదో అది చేయండి" అని అనుకున్నాను. మరునాడు ఇండియాకి చెందినవాళ్ళు ఇల్లు చూడటానికి వచ్చి, ఆ ఇంట్లో ఉన్న బాబాను చూసి, "ఇది బాబా మాకు ఇస్తున్న ఇల్లు. ఇంకెవరికీ చెప్పకండి. మాకే ఇచ్చేయండి" అని అన్నారు. పిల్లలు నాకు ఆ విషయం చెపితే, నేను వాళ్లతో, "మన ఇంట్లో బాబాని పూజిస్తే, మనకి మంచిది. వాళ్ళకే ఇచ్చేయండి" అని అన్నాను. వాళ్ళు చాలా ఆనందించారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. బాబా ఉండగా మనకి భయమేల? తరువాత పిల్లలు బాబా ఆజ్ఞతో యు.ఎస్.ఏలో మరో ఇల్లు కొన్నారు. మేము కూడా బాబా దయతో మా ఊరిలో ఒక ఇల్లు కట్టుకున్నాము. ఈమధ్య ఆ ఇంటి గృహప్రవేశం వేడుక బాగా జరిగింది. ఊరిలో అన్ని చోట్ల వర్షం కురుస్తున్నప్పటికీ మేముండే చోట వర్షం లేకుండా బాబా చేసారు.


నేను ఈ మధ్య మావారికి టెస్టులు చేయించి రిపోర్టలన్నీ నార్మల్ రావాలని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్ వచ్చాయి. బాబానే మనకు రక్ష.


సాయి ఆశీర్వాదం


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు లక్ష్మి. నేను బాబా భక్తులందరూ అదృష్టవంతులని  భావిస్తాను. బాబా ఒక్కరు తోడుగా ఉంటే చాలు, ఆయనే మన దైర్యం. నాకు 30 సంవత్సరాల వయసొచ్చాక పెళ్లి నిశ్చయమైంది. అబ్బాయివాళ్ళది మంచి కుటుంబం, అబ్బాయి కూడా మంచివాడు. నేను అంతా బాబా దయ అనుకున్నాను. ఎందుకో తెలీదుకానీ నా ఇష్టాయిష్టాలు కాదని బాబానే ఆ బంధం కలిపారని నాకు అనిపిస్తుంటుంది. కానీ ఎందుచేతనో పెళ్ళైన తరువాత మా జీవితంలో ఊహించని కష్టాలు, ఆపార్దాలు వస్తున్నాయి. "సాయీ! మీరే అన్నిటినీ ఎదురుకునే ధైర్యాన్ని ఇస్తావని నమ్ముతున్నాను. మీరే నాకు అన్నీ. ఏ కష్టమొచ్చినా నేను మీ వైపే చూస్తున్నాను తండ్రి. నాకు తోడు ఉండవా బాబా?".


ఒకసారి నేను నా రెండు జతల చెవి కమ్మలు ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు 'అవి దొరికాల'ని బాబాకి చెప్పుకున్నాను. తరువాత అమ్మ మళ్ళీ వెతికితే బాబా దయవల్ల ఆ చెవి కమ్మలు కనిపించాయి. "ధన్యవాదాలు బాబా. మీ కృపకు పాత్రురాలినైన నేను ఎప్పటికీ మీ భక్తురాలిని తండ్రి. జీవితంలో నాకు చాలా చేశావు, చాలా ఇచ్చావు. నాకు చాలా మంచి ఉద్యోగ జీవితాన్ని అందించావు. ఇకపోతే ఈ భూమి మీద నాకంటూ ఉన్న ఏకైక వ్యక్తి మా అమ్మ. తను లేకుంటే నా మనసులో మాట చెప్పుకోడానికి నాకు ఎవరూ లేకుండా పోతారు సాయి. తనకి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి, అవి విషమించకుండా చూడండి బాబా".


సమస్యను తీర్చిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. నా పేరు సృజన హర్ష. నేను చెన్నై నివాసిని. మా పాప 'అనఘ' పుట్టినప్పుడు మావారి అమ్మమ్మగారు బంగారు మురుకులు చేయించారు. 2022, మే మొదటి వారంలో ఒకరోజు మా పాప ఆ గాజులతో ఆడుకుంటూ ఒక గాజుని ఎక్కడో పడేసింది. ఆ గాజు పడేసిందని రెండో గాజు‌ తీసి వేరేచోట భద్రపరిచాను. కాసేపైన తరువాత నేను ఆ రెండు గాజుల గురించి పూర్తిగా మర్చిపోయాను. రాత్రి పది గంటలప్పుడు ఆ గాజులు గురించి నాకు గుర్తు వచ్చింది. మొదటి గాజు పాప ఎక్కడ పడేసింది ఎలాగూ తెలియదు, రెండో గాజుని ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకుందామంటే ఎంత ప్రయత్నించినా నాకు గుర్తుకు రాలేదు. అర్ధరాత్రి 12:30 వరకు ఇల్లంతా వెతికానుకానీ ఆ గాజులు కనిపించలేదు. అప్పుడు ఇంకా, "గాజులు గనక దొరికాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తరువాత మళ్ళీ వెతకడం మొదలుపెడితే ఒక గాజు మాత్రమే కనిపించింది, ఇంకొకటి కనిపించలేదు. ఒక పక్క ఆనందం, మరోపక్క భయంతో, "ఆ గాజు కూడా ఎక్కడున్నా దొరకాల"ని బాబాకి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని నిద్రకి ఉపక్రమించాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేచాక మళ్ళీ వెతకడం ప్రారంభిస్తే బాబా దయవల్ల రెండో గాజు కూడా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. సమస్యను తీర్చినందుకు బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!


6 comments:

  1. Om sai ram with your krupa we are living happy.please bless my children and husband and grand sons with health and longveti life.om sai ram

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  4. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo