ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి చల్లని చూపు
2. ఎమ్.ఆర్.ఐ రిపోర్టులో అంతా బాగుండేలా అనుగ్రహించిన బాబా
సాయి చల్లని చూపు
సాయి మహారాజ్ కి జై!!! నా పేరు కుమార్. నేను ఒక సాయి బిడ్డను. నాకు నా సాయి మీద చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. ఈ బ్లాగును అనుగ్రహించిన సాయి దేవునికి నా శతకోటి వందనాలు. ఇందులోని తోటి భక్తుల అనుభవాలను చదువుతుంటే సాయిపై ఎంతో విశ్వాసం పెరుగుతుంది. "సాయీ! మీ పాదాల వద్ద నాకు కాస్త చోటు ఇవ్వండి తండ్రి". ఇక నా అనుభవానికి వస్తే...
ఒకసారి నాకు, నా భార్యకి మధ్య చాలా చాలా గొడవలు జరిగాయి. నేను నా సహనాన్ని కోల్పోయి నా భార్యను, నా కొడుకుని వదిలి మా సొంత ఊరికి వెళ్ళిపోయాను. నా తల్లిదండ్రులు నాతో, "కొన్నిరోజులు ఇక్కడే ఉండు, తరువాత నీ ఇంటికి వెళ్ళు" అన్నారు. నా జీవితం ఇలా అయిపోయిందేమిటని నాకు చాలా బాధగా ఉండేది. ఆ బాధను నేను తట్టుకోలేకపోయేవాడిని. కానీ తిరిగి నా ఇంటికి వెళ్ళాలని నాకస్సలు అనిపించలేదు. కానీ మా అమ్మకి నా జీవితం ఇలా అయిపోయినందుకు చాలా కష్టంగా ఉండి బాధపడుతూ ఉండేది. అమ్మ బాధని చూసి తట్టుకోలేక నా తల్లిదండ్రులతో కలిసి నేను, నా భార్య కలిసి ఉండిన అద్దె ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి పక్కనే మా అత్తగారి ఇల్లు ఉంది. నేను నా సొంత ఊరు వెళ్లిపోతూనే నా భార్య నా కొడుకుని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మాకు నా భార్య వైపు వాళ్ళకి అస్సలు మాటలు లేవు. అందువల్ల మా అత్తగారితో పెద్ద గొడవ అవుతుందని చాలా టెన్షన్ పడ్డాను. అయితే బాబా నాకు, "ఏం భయపడకు. అంతా సవ్యంగా జరుగుతుంది" అని మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఇచ్చిన దైర్యంతో నేను మాట్లాడటానికి ముందుకు వెళ్ళాను. బాబా దయవల్ల గొడవేమీ లేకుండా మాట్లాడుకున్నాం. కానీ నా భార్య నాతో ఉండటానికి ఇష్టపడేలేదు. దాంతో నేను నా సామాను సర్దుకుని అద్దె ఇంటిని ఖాళీచేసి మా సొంత ఊరుకి బయలుదేరాను. మా ప్రయాణం సురక్షితంగా జరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "బాబా! మీ దయవల్లే గొడవేమీ జరగలేదు. కానీ 'ఏమిటీ పరిస్థితి' అని నేను చాలా గందరగోళంలో ఉన్నాను సాయి. అయితే, 'ఈ కష్టం వెనుక చాలా సంతోషాలు దాగి ఉన్నాయి' అన్న మీ మెసేజ్ నాకు గుర్తు ఉంది బాబా".
మేము మా సొంత ఊరుకి వచ్చేమందు ఇంట్లోని సామాన్లన్నీ ఒక ట్రాన్స్పోర్టేషన్ వాళ్లకిచ్చి మా సొంతూరుకి చేర్చమని అందుకుగానూ మొత్తం డబ్బులు చెల్లించాను. అయితే, వాళ్ళు వారం రోజులైనా సామాను పంపలేదు. నేను రోజూ వాళ్ళకి ఫోన్ చేసి "సామాను ఎప్పుడు పంపిస్తారు?" అని అడుగుతుంటే, వాళ్ళు ఏ రోజుకారోజు, "ఈరోజు పంపిస్తామ"ని చెప్తుండేవాళ్ళు. ఇక నాకు అనుమానమొచ్చి ఒకరోజు సాయంత్రం ఫోన్ చేస్తే, వాళ్ళు లిఫ్ట్ చెయ్యలేదు. సరేలే, అని రాత్రి మళ్ళీ చేశాను. వాళ్ళు నా కాల్ లిఫ్ట్ చెయ్యకుండా కట్ చేస్తూపోయారు. సుమారు 20 సార్లు కాల్ చేసాక ఇక కట్ కూడా చెయ్యలేదు. 'ఇక్కడికి, అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. నా సామాన్లను మరియు వాటి తరలింపుకోసం ఇవ్వాల్సిన మొత్తం డబ్బులను ఇచ్చేసాను. ఇప్పుడు చూస్తే, వీళ్ళు స్పందిచట్లేదు' అని చాలా టెన్షన్ పడి సాయితో చెప్పుకుని చాలా బాధపడ్డాను. రాత్రి చాలాసేపు నిద్రలేదు. మర్నాడు ఉదయం లేవగానే మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను. మామూలే, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా 'నా సామాన్లు, డబ్బు పోయినట్లేన'ని నేను ఒక నిర్ధారణకు వచ్చి, 'బాబా!' అని మనసులో అనుకున్నాను. కాసేపటికి వాళ్లే ఫోన్ చేసి, "మీ సామాను గురించి ఏమీ భయపడకండి, ఈరోజు ఉదయమే తరిలిస్తాము" అని చెప్పి, "ఇంకో 5000 రూపాయలు కావాలి" అని అన్నారు. నాకు మరో ఆప్షన్ లేక వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చాను. బాబా దయవల్ల వాళ్ళు నిజంగానే నా సామాను తరలించారు. రాత్రికి మా ఇంటికి చేరుకున్నాయి. "బాబా! నన్ను క్షమించు. నా మనసులో వేరే ఉద్దేశంతో బాధపడ్డాను. కానీ మీ మీద నమ్మకంలేక కాదు తండ్రి".
నేను, నా తల్లిదండ్రులతో కలిసి నా అద్దె ఇంటికి వెళ్లేరోజు అమ్మ మా ఇంట్లో ఉన్న మొక్కలకు ఎండ తగలకుండా నీడలో పెట్టింది. కానీ ఐదు రోజుల వరకు మొక్కలకు నీళ్లు పోయకుండా ఉంటే ఎలా అని అమ్మ బాధపడింది. అప్పుడు నేను, "బాబా! మేము తిరిగి వచ్చేవరకు మొక్కలను మీరు బాగా చూసుకోండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మంచి ఎండలు కాసే మే నెలలో వర్షాలు వచ్చి మొక్కలన్నీ ఏమీ కాకుండా బాగున్నాయి. "ధన్యవాదాలు బాబా. నేను బాధపడినా పర్లేదుకానీ నా తల్లిదండ్రులకి నావల్ల ఎప్పుడూ బాధ కలుగకూడదు బాబా. వాళ్ళ సంతోషానికి నేను కారణం కావాలి కానీ బాధకి కాదు. నేను వాళ్ళని సంతోషంగా చూడాలి. దయచేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి. ప్లీజ్ సాయి, ప్లీజ్. వాళ్ళు సంతోషంగా ఉంటే, అందుకు మీరే కారణమని నమ్మి ఆ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను బాబా".
2022, మే 11 మధ్యాహ్నం 2 గంటలకు గాలివాన వల్ల మా ఇంట్లో కరెంట్ పోయి 4:30 వరకు రాలేదు. మా పక్కింటివాళ్లకి, కిందింటివాళ్ళకి ఉంది. పోల్ మీద వైర్ లూజ్ కనెక్షన్ అయి మాకు మాత్రమే కరెంట్ పోయింది. నేను పవర్ స్టేషన్‌కి ఫోన్ చేసి కంప్లైంట్ పెడితే, సర్వీసువాళ్ళు వచ్చారుకానీ వర్షంలో నిచ్చెనేసి కరెంట్ పోల్ ఎక్కడం మంచిది కాదని వెళ్ళిపోయారు. నేనైతే, 'పవర్ ఇంకా రేపే వస్తుంది. దేవుడి గుడిలో వెలుగు లేద'ని అనుకున్నాను. తరువాత బాబా లీలలు చదువుతూ, "బాబా! పవర్ వస్తే, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు మళ్లీ వచ్చి వైర్ కనెక్ట్ చేసి వెళ్లారు. "చాలా చాలా సంతోషం సాయి. మీరు నాకు తోడుగా ఉన్నారు. మీ అనుగ్రహం ఇంత అని చెప్పలేము. నాకున్న కష్టం మీకు తెలుసు, దయచేసి నాకు సహాయం చెయ్యండి సాయి. మీ అనుగ్రహాన్ని మళ్లీమళ్లీ మీ భక్తులతో పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి సాయి".
ఎమ్.ఆర్.ఐ రిపోర్టులో అంతా బాగుండేలా అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయి భక్తుడిని. ప్రప్రధమంగా నా సాయికి ప్రణామాలర్పిస్తూ నేను నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. ఇలా బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడం నా మనస్సుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఒకరోజు సాయంత్రం నేను, నా శ్రీమతి నడుస్తూ ఉండగా ఉన్నట్టుండి హఠాత్తుగా విపరీతమైన కాలునొప్పితో నా శ్రీమతి నడవలేకపోయింది. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్‍కి వెళ్ళాము. డాక్టర్ చూసి, "మరుసటిరోజు ఎమ్.ఆర్.ఐ చేయించి ఎక్స్-రే కూడా తీయించండి" అని చెప్పారు. సుమారు 2 సంవత్సరాల ముందు నా శ్రీమతి వెన్నెముకకు కొద్దిగా ఫ్రాక్చర్ అయ్యింది. దానికి సంబంధించి ఇప్పుడేమైనా మార్పులు వచ్చాయేమోనని నాకు భయమేసి, "బాబా! ఎమ్.ఆర్.ఐ రిపోర్టు బాగుండాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఎమ్.ఆర్.ఐ చేసాక రిపోర్టులో అంతా బాగుందని వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మీ దయ మా మీద ఇలాగే ఉండాలి. ఇంకా మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను". చివరిగా ఒక మాట, 'మాకున్న అన్ని సమస్యలు తీరిపోవాలని ఆ సాయిబాబాను మాకోసం ప్రార్థించండి'.
Om sai ram
ReplyDeleteOm sai ram baba please give me health after root canal therapy i am feeling weekness .2nd sitting is there i am timid person.please give courage to me.Be with me.please bless my loved ones with health and full life to them.please change my thoughts.
ReplyDeleteఓం సాయి బాబా మేము నీ బిడ్డలం.అందరికీ నీ ఆశీస్సులు అందించు తండ్రి.నా బిడ్డ లకి.నా భర్త కి నా మనవలకి ఆరోగ్యం, పూర్తి ఆయుష్షు ప్రసాదించు బాబా
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete