సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భక్తురాలి బాధ - బాబా ఇచ్చిన ఉపశమనం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు అర్చన. నేను హైదరాబాదు నివాసిని. నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఒకరోజు మా మేనేజర్ కొత్త ప్రాజెక్ట్ ఒకటి నాకిచ్చి, దానిమీద వర్క్ చేయమన్నారు. అది 20 ఏళ్ల నాటి కోడ్. ఆన్ సైట్ లో డెవలపర్స్ దానిమీద చాలా వర్క్ చేసారు, కానీ అది వర్క్ అవలేదు. అటువంటి కోడ్ ను మా మేనేజర్ నాకిచ్చి అది వర్క్ అయ్యేలా చూడమని చెప్పారు. మా లీడ్ బెంగుళూరులో ఉంటారు. అతని సహాయం తీసుకోమని చెప్పి, ఏదైనా ఇష్యూ(సమస్య) ఉంటే ముందే చెప్పమని, చివరి నిమిషం వరకు ఉంచవద్దని కాస్త గట్టిగానే చెప్పారు. దానితో నాకు టెన్షన్ గా అనిపించింది. కానీ తప్పదు కదా! వర్క్ స్టార్ట్ చేశాము. చాలా కోడ్ లు మార్చాము. మా లీడ్ చాలా సహాయం చేస్తూ ఉండేవారు. కానీ ప్రతిసారీ ఏదో ఒకచోట ఇష్యూ వచ్చి ఆగిపోయేది. లీడ్ చెప్పినట్లు చేసేదాన్ని, కానీ ఏదో ఒక సమస్య వస్తుండేది. నా సొంతంగా ఏమీ చేయలేకపోయేదాన్ని. మా లీడ్ డైరెక్షన్ కోసం వేచి ఉండాల్సి వచ్చేది. అతను చాలా బిజీగా ఉంటారు. అందువలన అతనికి పదేపదే ఫోన్ చేసి అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అతను చాలా ఓపికగా నాతో మాట్లాడి, వర్క్ ప్రోగ్రెస్ చూసి, తరువాత ఏమి చేయాలో చెప్తుండేవారు. అతనికి తీరిక దొరకక ఒక్కోసారి సాయంత్రం వేళల్లో ఫోన్ కాల్ చేసేవారు. ఆ సమయంలో పిల్లలు ఉంటే అసౌకర్యంగా ఉంటుందని నేను మా పిల్లల్ని మా ఆడపడుచు, అత్తగారి దగ్గర ఒక గంట ఉంచేదాన్ని. పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి వాళ్ళు అంతగా ఇష్టపడేవారు కాదు. పైగా ఇబ్బందికరంగా మాట్లాడేవారు. కానీ నాకు తప్పనిసరై వాళ్ళ దగ్గరే పిల్లల్ని ఉంచాల్సి వచ్చేది. ఈ పరిస్థితులను తట్టుకోలేక ఒకరోజు బాబా ముందు, "ఎందుకు బాబా ఇలా చేస్తున్నారు? అటు వర్క్ ప్రోగ్రెస్ అవ్వటం లేదు. ఇటు పిల్లల్ని అక్కడ ఉంచాలన్నా కష్టంగా ఉంది. నన్ను ఈ పరిస్థితి నుండి బయటపడేయండి" అని బాధపడ్డాను. అంతే! బాబా ఏమి చేసారో గాని, తరువాత వచ్చిన బుధవారం నాడు మా ఆన్ సైట్ ఓనర్ "ఇక ఈ ప్రాజెక్ట్ వర్క్ ఆపివేయండి. ఇప్పటివరకు చేసిన వర్క్ డాక్యుమెంట్ చేయండి చాలు" అన్నారు. వర్క్ లో ఎందుకు ప్రోగ్రెస్ చూపించలేదని ఒక్కమాట కూడా నన్ను అనలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే విషయం మా లీడ్ తో చెప్తే, అతను "సరే అయితే, డాక్యుమెంట్ చేసి వేరే వర్క్ చేసుకోండి" అన్నారు. బాబాను అడగటమే ఆలస్యమన్నట్లు ప్రాజెక్ట్ వర్క్ ఆపేసి మరీ నన్ను ఆ పరిస్థితుల నుండి బయటపడేసారు.

2018, అక్టోబర్ 7న జరిగిన మరో అనుభవం:-.

రోజూ సాయంత్రం మా పిల్లలు స్నానం చేశాక బాబా ఊదీ పాట పాడుకొని, కొంచెం ఊదీ నుదుటన పెట్టుకుని, కొంచెం నోట్లో వేసుకుంటుంటారు. ముందురోజు అంటే 6వ తేదీ రాత్రి పిల్లలు ఊదీ నోట్లో వేసుకుంటుంటే మావారు చూసి, "నుదుటిపైన పెట్టుకోండి, కానీ నోటిలో వేసుకోవద్దు" అని కోపంగా చెప్పారు. ఆ మాటకు నాకు చాలా బాధ కలిగింది. కానీ మా పిల్లలు బాబా ఊదీ కావాలని గొడవ చేస్తే కొంచెం ఇచ్చాను. మరుసటిరోజే, అంటే 7వ తేదీన సైట్ లో సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే, ఆరోజు అనుభవంలో ఒక భక్తునికి బాబా కలలో దర్శనమిచ్చి, ఊదీ చాలా తినమని చెప్పినట్లు ఉంది. వెంటనే మావారికి అది చదవమని పంపాను. బాబా మన ప్రతి కదలికను గమనిస్తూ, మనల్ని సమాధానపరుస్తారని నాకు అనుభవం అయ్యింది.

2 comments:

  1. Fantastic..Sai..Ninna u.s.a.lo oka devotional nee blog lo chadivindi..saigayatree gurinchi.naaku call chesi..Thanu chesthanu.anindi.thank u for u r cooperation towards this devine work.sairam..From..shirdi

    ReplyDelete
    Replies
    1. అంతా బాబా కృప. ఆయనకు కావలిసింది ఎవరి ద్వారా అయినా చేయించుకుంటారు. సర్వం సాయినాథార్పణమస్తు.

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo