సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబాపై విశ్వాసముంటే చాలు ...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయి బంధువు తన రీసెంట్ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికి సాయిరామ్, ముందుగా బ్లాగు ద్వారా సాయి భక్తులందరిని కనెక్ట్ చేసే విధంగా మంచి పని  చేస్తున్న మీకు ధన్యవాదాలు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, వాటిలో ఇక్కడ మీతో ఇటీవల జరిగిన రెండు అనుభవాలను తెలియజేస్తాను.

మొదటి అనుభవం: ఒకసారి మేము సెలవు రోజుల్లో మా స్వంత ఊరికి వెళ్ళాము. ఒక రాత్రి అకస్మాత్తుగా మా బాబు ఏడుస్తున్నాడు. చూస్తే తనకి జ్వరం ఉంది. అప్పుడు సుమారు 2:00 గంటలయింది. నాకు చాలా భయం వేసింది ఎందుకంటే తనకి ఎప్పుడూ జ్వరం వచ్చినా తను తీవ్రంగా ఏడుస్తాడు, జ్వరం మందు ఇవ్వకపొతే నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంటాడు. సాధారణంగా నేనెప్పుడూ మెడిసిన్స్ నా హ్యాండ్ బ్యాగులో ఉంచుకుంటాను కానీ ఆ సమయంలో నా వద్ద జ్వరానికి సంబంధించిన మందులేవీ లేవు. నేను ఊరికి వచ్చే ముందు వాటిని చెక్ చేసుకోవడం మర్చిపోయాను. మా పేరెంట్స్ వేరే గదిలో నిద్రపోతున్నారు. వాళ్ళకి నిద్రాభంగం కలిగించడం నాకిష్టంలేదు. నా భర్త వేరే ఊరు వెళ్లారు. నేనొక్కదాన్నే గదిలో ఏడుస్తున్న బాబుతో ఉన్నాను. ఏ దిక్కులేని సమయంలో బాబాయే దిక్కు కదా! వెంటనే హృదయపూర్వకంగా సాయిబాబాను ప్రార్ధించి, బాబు నుదుటిపైన ఊదీ వ్రాసాను. అద్భుతం బాబా ఊదీ మహిమ. అరగంటలో వాడు నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారే వరకు ఏ కలత లేకుండా హాయిగా నిద్రపోయాడు. అదంతా సాయిబాబా ఆశీర్వాదమే. బాబాపై విశ్వాసం ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితి నుండైనా ఆయన మనకు రక్షణ కల్పిస్తారు.

రెండవ అనుభవం: ఒకసారి నా ఐ-ఫోన్ పనిచేయలేదు. మా బాబు ఎక్కువగా దానితోనే ఆడుతూ ఉంటాడు. చాలాసార్లు క్రిందకు విసిరేసాడు అందువలన ఫోన్ పనిచేయట్లేదని భావించాను. అప్పుడు కూడా నేను బాబానే ఫోన్ పనిచేసేలా చూడమని ప్రార్థించాను. 5 నిమషాలలోనే అది సాధారణంగా పని చేయడం మొదలు పెట్టింది. సాయిబాబా పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండాలేగాని ఆయన మన చిన్న చిన్న కోరికలను సైతం వింటారు. జీవితాంతం నేను సాయిబాబా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

1 comment:

  1. Yee leela chaduvutunte naku yee madhya jarigina leela gurtostondi. Ma school lo okasari na handbag jip mottam fail ayindi anukokunda.jip yennisarlu pettadaniki try chesinaa jip kurcholedhu. Mottam jip padayindi . Yela baba yee bag
    tho yee rojanthaa ani just anukuni oka student yedo adugutunte tanaki ans cheppi tirigi bag jip yadhalapamga lagesariki tight Ga jip kurchundi. Yila chala chinna alochanayinaa baba grahistaru.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo