సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబానే మా వైద్యుడు - ఊదీయే మాకు పరమౌషధం...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

యు.ఎస్.ఎ. నుండి పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తన అనుభవాన్నిలా చెప్తున్నారు.

సాయి కుటుంబసభ్యులందరికీ సాయిరామ్. కొన్ని నిర్ణయాలు తీసుకునేముందు బాబాను అడగటం నాకు, నా కూతురికి అలవాటు. మా అమ్మాయి తన స్కూల్లోని కుస్తీ టీం లో చేరాలని ఆశిస్తూ ఉంది కానీ, ఆ క్రీడ యొక్క స్వభావం కారణంగా నాకు అంతగా ఇష్టం లేదు. ఈ విషయమై మేము బాబాను అడిగినప్పుడు ఆయన కుస్తీ(మల్లయోధుల) బృందంలో చేరమని సూచించారు. కాబట్టి తను జట్టులో చేరింది. అంతా సాఫీగా సాగుతూ కుస్తీల సీజన్ ముగింపుకి చేరుకుంటున్న దశలో ఇంక 2 రోజులు మాత్రమే మిగిలాయి. ఆ సమయంలో కుస్తీ ప్రాక్టీస్ చేస్తుండగా తన మెడ ఎముక(collarbone) ఫ్రాక్చర్ అయ్యింది.

డాక్టరు శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పి, ఒక పట్టీ వేసి, తనని 2 నెలలపాటు ఎటువంటి క్రీడలు మరియు శారీరక వ్యాయామాలు చేయకూడదని చెప్పారు. కానీ 2 వారాలలో క్రీడలను ప్రారంభించమని బాబా మాకు సూచన ఇచ్చారు. "బాబా! కేవలం నీ ఊదీ కలిపిన నీళ్ళే మాకు పరమౌషధం, నేను దానినే నా కూతురికి ఇస్తాను, మీరే తన ఫ్రాక్చర్ నయమయ్యేలా చూడండి" అని బాబాను ప్రార్థించి, రోజుకు మూడుసార్లు తనకి ఊదీ నీళ్లు ఇవ్వడం ప్రారంభించాను.

2 వారాలలో తను పట్టీ తీసేసి, డాక్టరు సలహాకు వ్యతిరేకంగా తన క్రీడలను మొదలుపెట్టింది. బాబా దయవలన తనకి క్రీడలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అంతా సాఫీగా సాగింది. 2 నెలల తరువాత డాక్టరు దగ్గరకు వెళ్ళినప్పుడు, అతను  X- రే తీసి ఎముక ఫ్రాక్చర్ నయమైపోయిందని చెప్పారు. బాబా మహిమ అద్భుతం కదా! బాబా తన భక్తులనెప్పుడూ వదిలిపెట్టరు. ఆయన తన వాగ్దానాన్ని సదా నిలబెట్టుకుంటారు.

ఇంకోరోజు నా కూతురు పాఠశాల నుండి 102.7 డిగ్రీల అధిక జ్వరంతో ఇంటికి వచ్చింది. మేము బాబాను "ఏమి చేయాల"ని అడిగాము. ఆయన "ఏ ఔషధం తీసుకోవద్దు, కేవలం ఊదీ నీటిని తీసుకో" అని సూచించారు. వెంటనే నేను నా కూతురికి ఊదీ నీటిలో కలిపి ఇచ్చాను. ఆశ్చర్యం! ఒక్క గంటలో తన జ్వరం తగ్గిపోయింది. బాబానే మా వైద్యుడు, తల్లి, తండ్రి. "బాబా! ప్రతిక్షణం మాకు తోడుగా ఉంటూ మాకు రక్షణనిస్తూ, మా బాగోగులు చూసుకుంటూ మార్గదర్శకత్వం చేస్తున్న మీకు మా ధన్యవాదాలు".

లవ్ యు బాబా!

10 comments:

  1. Anthati klishta paristiti lo nuu, baba mata pai dhruda nammakam tho vunnappude, ilanti baba leelalu manam anubhavinchagalamu. Admin gariki naa abhivandanaalu. Jai SAI

    ReplyDelete
  2. Anthati klishta paristiti lo nuu, baba mata pai dhruda nammakam tho vunnappude, ilanti baba leelalu manam anubhavinchagalamu. Admin gariki naa abhivandanaalu. Jai SAI

    ReplyDelete
  3. Sairam. Admin garu, na vadda sharath babuji gari samstha ki sambandhinchina cultural program(baba song py dance) video vundi. Kavalante send chestanu.

    ReplyDelete
    Replies
    1. సాయిరామ్ సాయి, అంత బాబా కృప విశేషం. వీడియో పంపండి సాయి చూస్తాను.

      Delete
    2. Sairam sai, Videos mee mail Id ki pampaanu. check chesukondi. chalaa bagunnayi songs

      Delete
    3. మాకు కూడా సండ్ చేయరా సాయి

      Delete
  4. Ma babu Peru sai Siddharth ,5 years 10.1.2020 fever vachindi 2days tarvatha dengue ani doctor chepparu. Nenu Baba temple velli 51 rs vesi mokkukunna. Fever taggi na kuda platelets stable ga unnayi . Eppudu normal ayyindi. Ma devdu ma doctor Anni Baba gare. Jai sai ram

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo