శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువు హేమంత్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు.
నేను, నా కుటుంబం నూతన సంవత్సర సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు క్లబ్ కి వెళ్ళాము. క్లబ్ అంతా ఒకటే సందడిగా ఉంది. పాటలు, డాన్స్ లతో అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. పార్టీని ఆస్వాదించడానికి వచ్చిన వారికోసం అనేక ఫుడ్ స్టాల్ల్స్ అక్కడ ఏర్పాటు చేసారు. కొంతసేపటి తరువాత మా కుటుంబమంతా స్నాక్స్ తినడానికి అక్కడికి వెళ్ళాము. తింటున్న సమయంలో అనుకోకండా నా ఎడమచేయి కోటు జేబులో పెట్టాను. నాలుగు శాశ్వత డిజిటల్ పాసులలో ఒకటి కనబడక పోవడంతో నేను చాలా ఆందోళన పడ్డాను. వెంటనే ఆత్రుతతో అంతా వెతికాను కానీ ఫలితం లేకపోయింది. "బాబా! నా పాస్ తిరిగి దొరికేలా చేయండ"ని బాబాను ప్రార్థించాను. అద్భుతం మొదలైంది, 5 నిమిషాల్లో ఒక బాలుడు తన చేతిని పైకెత్తి, "అంకుల్ మీ కాలి దగ్గర ఏదో పడి ఉంది చూడండి" అని చెప్పాడు. నేను కిందకు చూసి ఆశ్చర్యపోయాను. పోయిన పాస్ నా కాలి దగ్గరే ఉంది. నా ఆశ్చర్యానికి కారణమేమిటంటే అదే చోట నేను అంతకు ముందు చాలాసార్లు చూసాను, అప్పుడు అక్కడ నా పాస్ కనబడలేదు. బాబాను ప్రార్థించిన మరుక్షణం అదేచోట పాస్ కనిపించింది. బాబా అనుగ్రహానికి నాకు చాలా సంతోషం కలిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరే మాకు ఏకైక రక్షకుడవు, ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపించండి. జీవితంలో మేము ఏ పరిస్థితిలో ఉన్నా మీ దివ్యపాదాల యందు స్థిరమైన విశ్వాసం ఉండేలా మాకు సహాయం చేయండి". నిజాయితీగా విశ్వాసంతో బాబాను ప్రార్థించండి, అనేక అద్భుతాలు జరుగుతాయి. ఓం సాయి రామ్! అనంత కోటి బ్రహ్మండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
🕉 sai Ram
ReplyDelete