శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకిచ్చిన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.
నేను బెంగుళూరు నివాసిని. నేనిప్పుడు మీకు చెప్పబోయే అనుభవాలు 2018, ఫిబ్రవరి నెలలో జరిగినవి. సాయి కృప వల్ల నేను నా చదువు 2016లో పూర్తి చేశాను. కానీ చదువు పూర్తైన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు తీవ్రంగా ఉద్యోగం కోసం వెతికినా ఉద్యోగం మాత్రం పొందలేక పోయాను. ఈ సంవత్సరం జనవరిలో నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయ్యింది. చాలా డిప్రెస్ ఫీల్ అయ్యాను. 2016లో చదువు పూర్తి చేసిన నాకు 2018లో ఉద్యోగం దొరకడం చాలా కష్టమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో నాకున్న ఒకేఒక్క సంతోషం - సోనీ టీవీలో ప్రసారమవుతున్న "సాయి సీరియల్". ఆ సీరియల్ చూస్తుంటే నా మనసుకెంతో ఆనందంగా ఉంటుంది. సాయి సీరియల్ ను చూసినప్పుడు మాత్రమే సంతోషంగా ఉండేదాన్ని. అందుచేత పునరావృతమయ్యే భాగాలను కూడా వదలకుండా చూసేదాన్ని. ప్రతి ఎపిసోడ్ రోజుకు 5 సార్లు (5.30am, 8.30am, 1 pm, 3.30 pm మరియు 7.30pm) ప్రసారమవుతుంది. నాకున్న ఆలస్యంగా నిద్రలేచే చెడు అలవాటు వలన 5.30am మరియు 8.30am షో చూడలేకపోయేదాన్ని. ఫిబ్రవరి 15న ప్రసారమైన ఎపిసోడ్ నాకెంతగానో నచ్చింది. అందువలన ఆలస్యం చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ ఆరోజు భాగం చూడాలనిపించింది. అది మరుసటిరోజు ఫిబ్రవరి16వ తేదీన ఉదయం 5.30 గంటలకు మొదటిసారి పునః ప్రసారమవుతుంది. కానీ, ఆ సమయంలో మా ఇంటిలో ప్రతిఒక్కరూ నిద్రపోతుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకిష్టంలేదు. కాబట్టి ఉదయం 8.30 గంటలకు చూద్దామని అనుకుని రాత్రి నిద్రించే ముందు అమ్మతో, "నేను ఉదయం సీరియల్ చూడాలి, అందువలన నేను మంచి నిద్రలో ఉన్నా కూడా మరచిపోకుండా ఉదయం 8.30 గంటలకు నన్ను నిద్రలేపమ"ని చెప్పాను. నేను నా తల్లిదండ్రులకు ఒక్కతే కూతుర్ని కాబట్టి వాళ్ళు నన్ను చాలా ముద్దుగా చూస్తారు. అందువలన అమ్మ నన్ను నిద్రలేపలేదు. సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక మధ్యవయస్కుడైన వ్యక్తిని చూశాను. అతను పైకి చూస్తున్నాడు. నేను కూడా పైకి చూస్తే ఛానల్(సోని) లోగో కనిపిస్తుంది. హఠాత్తుగా నాకు మెలుకువ వచ్చి కన్నులు తెరిచాను. చూస్తే సమయం గం. 8.30ని. అయ్యింది. వెంటనే లేచి టివి ఆన్ చేశాను. అప్పటికే టైం అయినప్పటికీ సీరియల్ ప్రారంభం కాలేదు. నాకోసమే అన్నట్లు ఆలస్యంగా 8.34కి సీరియల్ ప్రారంభమైంది. కాస్త కూడా మిస్ కాకుండా మొదటినుండి సీరియల్ చూసాను. ఖచ్చితంగా ఇది సాయి చేసిన అద్భుతం.
అనుభవము 2: ప్రతిరోజు నేను శ్రీ సాయిసచ్చరిత్రలో ఒక అధ్యాయం చదువుతాను. ఎప్పుడు బాబా మహాసమాధికి సంబంధించిన అధ్యాయాలు చదివినా ఏడుస్తూనే ముగిస్తాను. ఇప్పటికి ఎన్నోసార్లు చదివాను, కానీ ప్రతిసారి ఏడ్చేస్తుంటాను. ఈసారి చదివినప్పుడు ఏడవకూడదని కొద్దిరోజుల ముందు నిర్ణయించుకున్నాను. కానీ ఈసారి కూడా నన్ను నేను నియంత్రించుకోలేక ఏడ్చేసాను. మరుసటిరోజు కలలో బాబా కన్పించి, "ఎందుకు ఏడుస్తావు? నేనెల్లప్పుడూ నీతో ఉన్నాను, కాబట్టి ఏడవకు" అని చెప్పారు.
అనుభవము 3: ఇది 2018, ఫిబ్రవరి 22న జరిగింది. అది నా 2వ అనుభవం జరిగిన మూడురోజులకి జరిగింది. ఆరోజు గురువారం, కాబట్టి నేను సాయిసచ్చరిత్రలో మిగిలిన అధ్యాయాలు పూర్తి చేసి సాయంత్రం సాయి మందిరానికి వెళ్ళాలనుకున్నాను. అనుకున్నట్లుగానే ఉదయం పారాయణ పూర్తి చేసి సాయంత్రం అమ్మతో కలిసి సాయి మందిరానికి వెళ్ళాను. దర్శనానంతరం మేము ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చున్నాము. మాకు ఎదురుగా సాయి విగ్రహాలను అమ్మే ఒక చిన్న దుకాణం ఉంది. అందులో అందమైన చిన్న సాయి విగ్రహాలు చాలా ఉన్నాయి. అంత అందమైన బాబా విగ్రహాలు చూశాక ఒక విగ్రహం తీసుకోవాలని నాకనిపించింది. కానీ, మా ఇంట్లో చాలా సాయి విగ్రహాలున్నందున మా అమ్మ అందుకు సమ్మతించదని నాకు తెలుసు, అందుకే మౌనంగా నేను వాటిని చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి మందిరంలో జరుగుతున్న భజన విని ఆరతి చూడటానికి మళ్లీ లోపలికి వెళ్లాలని నిర్ణయించుకొని అమ్మని పిలిచాను. కానీ, తాను రానని, అక్కడే కూర్చుంటానని చెప్పి ఒంటరిగా నన్ను పంపారు. నేను లోపలికి వెళ్లి బాబా ఆరతి తృప్తిగా చూసి బయటకు వచ్చాక, అమ్మ నాతో, "ఒక అమ్మాయి నా చేతికి ఒక కొత్త సాయి విగ్రహం ఇచ్చింది, పైగా అందుకు డబ్బులు కూడా అడగకుండా విగ్రహం నా చేతిలో పెట్టి వెళ్లిపోయింద"ని చెప్పింది. నేను ఆ పెట్టె తెరచి బాబాని చూసి ఆశ్చర్యపోయాను. అది అందమైన సాయి విగ్రహం. కాసేపటి క్రితం నేను అదే విగ్రహాన్ని కొనాలని అనుకున్నాను. అదే విగ్రహాన్ని బాబా నాకు అందించడంతో నేను పట్టలేని ఆనందాన్ని పొందాను. సాయి నన్నెప్పుడూ నిరాశ పరచలేదు. 2018 ఫిబ్రవరి నెలలోనే నేను ఈ అద్భుతాలను అనుభవించాను. అందుకే నేను అద్భుతాల నెల అని అంటాను.
ఓం సాయిరామ్.

No comments:
Post a Comment