సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ఆశీర్వాదంతో తెలుగు సఛ్చరిత్ర పారాయణ.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

యూ.ఎస్.ఎ నుండి ఒక సాయిబంధువు తన అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయి బంధువులతో పంచుకోవాలనే కోరికతో ఇలా వ్రాస్తున్నారు.

సాయి బంధువులందరికీ నమస్కారం. మొదటినుండి నేను బ్లాగులో సాయి భక్తుల అనుభవాలు చదువుతూ ఉన్నాను. ప్రత్యేకించి ఒక భక్తుని అనుభవం చదివిన తరువాత బాబా యందు నాకున్న నమ్మకం ఇంకా ఇంకా రెట్టింపు అయ్యింది. ఇంత చక్కటి బ్లాగు నిర్వహిస్తున్న మీకు నా కృతజ్ఞతలు. కొన్ని కారణాల రిత్యా నా పేరు, వివరాలు తెలియజేయవద్దని అభ్యర్ధిస్తున్నాను. మీరు నాకీ సహాయం చేయగలిగితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీతో పంచుకోవడానికి బాబా నాకు లెక్కలేనన్ని అనుభవాలు ఇచ్చారు. ముందుగా అంతగా తెలుగు చదవడం రాని నాతో తెలుగు సచ్చరిత్ర పారాయణ ఎలా చేయించారో ఇప్పుడు మీతో పంచుకుంటాను.

మాది ఒక మధ్య తరగతి కుటుంబం. నా చిన్నతనంలో ఒకసారి మా పక్కింటి ఆంటీతో కలిసి సాయిబాబా భజనకి వెళ్ళాను. అక్కడ నాకు చాలా సంతోషంగా అనిపించి, అప్పటినుండి ప్రతి గురువారం ఆమెతో భజనకు వెళ్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి ఎలాగో నాలో సచ్చరిత్ర పారాయణ చేయాలని ప్రేరణ కలిగింది. కానీ మా ఇంట్లో సచ్చరిత్ర లేదు, ఎలా ఆ పుస్తకం సంపాదించాలని ఆలోచిస్తుండగా ఆశ్చర్యంగా నాకు గొప్ప ఆనందం కలిగేలా మా ఆంటీయే సచ్చరిత్ర బుక్ ఇచ్చారు. కానీ అది తెలుగులో ఉంది, ఆవిషయం నన్ను కాస్త నిరాశపరిచింది. ఎందుకంటే నాకు తెలుగు చదవడం అంతగా రాదు. అందువలన ఎలా చదవాలని చాలా బాధపడ్డాను. కానీ సంస్కృతం చదవడం రాదన్న నిమోన్కర్ చేత భాగవతం చదివించడమే కాకుండా ఇతరులకు భోదించగల శక్తిని కూడా అతనికిచ్చిన బాబా కు నా చేత తెలుగు చదివించడం ఒక విషయమా! ఒక గురువారం నాడు బాబాని ప్రార్థించి పారాయణ చేయడం మొదలుపెట్టాను. మొదట్లో చదవడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది అయినాసరే బాబా ఆశీర్వాదం, కృపతో ఒక వారంలో పారాయణ పూర్తి చేయగలిగాను. బాబా నాతో పారాయణ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా బాబాపట్ల నాకు నమ్మకం స్థిరమైంది. అప్పటినుండి ఇప్పటివరకు బాబా నా ప్రతి కష్టసుఖల్లో నా వెన్నంటే ఉన్నారు. ఆయన అనుగ్రహంతోనే నేను ఎం.సి.ఎ పూర్తి చేసాను, మంచి వ్యక్తితో నా పెళ్లి జరిగింది, ముత్యాల్లాంటి ఇద్దరు ఆడ పిల్లల్నిచ్చారు. ఆయన కృపతోనే  నేనిప్పుడు ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. బాబా అవకాశం ఇస్తే మరికొన్ని అనుభవాలతో మళ్ళీ కలుస్తాను. తప్పులు ఉంటే మన్నించండి.

ఓం సాయిరాం!!!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo