సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భక్తుల చిన్న చిన్న కోరికలు తీర్చడానికి బాబా సదా సిద్ధంగా ఉంటారు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత భక్తురాలు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.

2018, సెప్టెంబర్ 27న నా జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన జరిగింది. ఆరోజు ఉదయం 10 గంటల సమయంలో నేను నా భర్తతో బాబా మందిరానికి వెళ్ళాను. నేను బాబాకోసం ఒక పింక్ గులాబీపువ్వు, ఒక కలువ పువ్వు తీసుకుని వెళ్లి బాబా పాదాలకు సమర్పించుకున్నాను. తరువాత మందిరం లోపల బాబా ఎదురుగా నేను, మావారు బాబాను ప్రార్థించుకుంటూ, ఆయన స్మరణ చేసుకుంటూ కాసేపు కూర్చున్నాము. అక్కడ ఇంకా కొంతమంది సాయిబంధువులు కూర్చొని ఉన్నారు. 7-8 నిమిషాలు గడిచాక నేను జయవాహిగారు రచించిన "సాయిబాబా ఈజ్ స్టిల్ అలైవ్” బుక్ చదువుతూ ఉన్నాను. అందులోని ఒక అధ్యాయంలో ఆమె సమర్పించిన రోజాని బాబా ఎలా ఆమోదించి తన కిరిటంపై ధరించారో అన్న అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని చదివాక ఒక్కసారిగా నా మదిలో ఒక ఆలోచన మెదిలింది. పూజారిగారితో నేను సమర్పించిన రోజాని బాబా శిరస్సుపై పెట్టమని చెప్పాలని అనుకున్నాను. "కానీ ఆ పువ్వుని ఇదివరకే బాబా పాదాల చెంత సమర్పించాను కదా! మళ్ళీ దాన్నిప్పుడు ఆయన శిరస్సుపై ఉంచమని ఎలా అడగను?" అని ఆలోచనలో పడ్డాను. అందువలన నేను మావారితో, "వెంటనే ఒక పసుపురంగు రోజాపువ్వు తీసుకొనిరండి, బాబా శిరస్సుపై అలంకరిద్దామ"ని చెప్పాను. మావారు వెంటనే పువ్వు తేవడానికి బయటకు వెళ్లారు. ఆయన అలా వెళ్ళారో లేదో పూజారిగారు బాబా పాదుకలపై నేను ఉంచిన పింక్ రోజాపువ్వుని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన దాన్నేమి చేస్తారోనన్న కుతూహలంతో నేను తదేకంగా చూస్తూ ఉండగా, పూజారిగారు ప్రక్కగది లోపలకి వెళ్లి ఒక కత్తి తీసుకుని వచ్చి రోజాపువ్వు యొక్క తొడిమను కట్ చేసి, ఆ పువ్వుని బాబా శిరస్సుపై అలంకరించారు. అక్కడే కూర్చుని చూస్తున్న నాకు నోట మాట రాలేదు. నా మదిలో ఆలోచన రాగానే అంతర్యామి ఐన బాబా దాన్ని నెరవేర్చారు.

2-3 నిమిషాల తరువాత మావారు పసుపురంగు రోజాపువ్వు తెచ్చారు. నేను పూజారిగారిని ఇది కూడా బాబా శిరస్సుపై ఉంచమని అభ్యర్ధించాను. ఆయన అలానే చేసారు. ఆ అలంకారంలో బాబాని చూడగానే నా కళ్ళు ప్రేమ, వాత్సల్యంతో చెమ్మగిల్లాయి. బాబా ఆ రెండు రోజాపువ్వుల అలంకారంతో ఎంతో అందంగా కనిపించారు. లవ్ యు బాబా! మీ భక్తుల చిన్న చిన్న కోరికలు తీర్చడానికి మీరు సదా సిద్ధంగా ఉంటారు. భక్తులపై మీ ప్రేమ అద్భుతమైనది. అందరికీ మీ ఆశీర్వాదాలు లభించుగాక!

ఓం సాయిరామ్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo