సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అద్భుతం! నీటితో దీపం మామూలుగానే వెలిగింది!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఓం సాయిరామ్. నా పేరు హిమబిందు, నేను బెంగుళూరు నివాసిని. రీసెంట్ గా నేనొక ఆశ్చర్యకరమైన, అందమైన బాబా లీలను అనుభూతి చెందాను. దానిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

గత 19 సంవత్సరాలుగా నేను సాయి భక్తురాలిని. ఈ 19 సంవత్సరాలలో బాబా నాకెంతో చేసారు. నేను మహాపారాయణను ప్రారంభించిన తరువాత నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరికీ సాయి పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టాను. బాబాకు నచ్చేవిధంగా నేను పేదలకు ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మొదట్లో నా భర్త బాబాని పెద్దగా నమ్మేవారు కాదు కానీ, బాబాని పూజించడానికి నాకు మాత్రం అభ్యంతరం చెప్పేవారు కాదు. ఒకసారి మావారు కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయిని చూశారు. అప్పటినుండి, తాను కూడా బాబాకి ధృడమైన భక్తుడైపోయారు. అయితే రీసెంట్ గా ఒక అద్భుతం జరిగింది. అసలు అదెలా సాధ్యమనిపించింది. నిజంగా అది చాలా ఆశ్చర్యకరమైనది.

ప్రతి మంగళవారం, శుక్రవారం నేను తులసి మొక్క వద్ద దీపం వెలిగిస్తాను. అలా మంగళవారం నాడు నేను ఎప్పటిలాగానే దీపం వెలిగించాను. తర్వాత వర్షం మొదలైంది. ఆ వర్షపు నీరు ప్రమిదలో పడింది. దీపం నీటి సహాయంతో వెలగదని మనకు చాలా స్పష్టంగా తెలుసు. నేను మళ్ళీ దీపాన్ని వెలిగించబోతు, "సాయి, మీరు నిజంగా ఉన్నట్లయితే ఈ దీపం మామూలుగానే వెలగాలి!" అని ప్రార్థించి తరువాత దీపాన్ని వెలిగించాను. అద్భుతం! నీటితో దీపం మామూలుగానే వెలిగింది! నేను ఆనందంలో మునిగిపోయి సాయిబాబా ఎప్పుడూ నాతో ఉన్నారని భావించాను.

బాబా మీకు నా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని విశ్వసించినందుకు సంతోషంగా ఉన్నాను! పరిపూర్ణమైన విశ్వాసం కలిగి భక్తితో ఆయన యందు దృష్టి నిలిపినట్లైతే ఆయన తనకు తానుగా తనని చేరుకొనే మార్గాలను చూపిస్తారు.

ఓం సాయిరామ్ 
హిమబిందు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo