ప్రియమైన సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు కీర్తి. 2018, సెప్టెంబర్ నెలలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. నేను మహాపారాయణ (MP - 64 - అమ్రిత - సాయి) గ్రూపులో ఉన్నాను. మేము ఆగస్టు 11న శిరిడీ వెళ్లి ఆగస్టు 14న తిరిగివచ్చాము. మా ప్రయాణానికి ముందు నుండే బాబా "నీతోనే ఉన్నానని" నాకు అనేక సూచనలిచ్చారు. నేను ఇంటినుండి బయటకు వెళ్లినప్పుడల్లా సీతాకోకచిలుకలు, నాణేలు, శిరిడీ అభిషేక జలం ఇలా ఏదో ఒక రూపంలో నన్ను ఆశీర్వదించారు. శిరిడీ వెళ్ళడానికి రెండు రోజుల ముందు బాబా సీతాకోకచిలుక రూపంలో నా గదిలోకి ప్రవేశించారు. అవి మా పెరటిలో చుట్టూ తిరుగుతూ ఉంటాయిగాని, ఇప్పటివరకు ఎప్పుడూ కూడా నా గది లోపలకి ప్రవేశించలేదు.(నా గైడ్, అర్చనగారు ఒకసారి నాతో సీతాకోకచిలుకలు దేవుని ఉనికిని తెలియజేస్తాయని, దైవదూతలని చెప్పారు. తరువాత నాకు కూడా నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆవిడ చెప్పినప్పటి నుండి నేనెప్పుడూ బాబాను ప్రార్ధించినా ఆ సమయంలో నేను బైక్ నడుపుతున్న కూడా అద్భుతంగా ఒక సీతాకోకచిలుక నాకు ముందుగా వెళ్ళేది. నా బాబా నాకు తోడుగా ఉన్నారని నాకనిపించేది. అందువలన ఇప్పుడు నా గదిలో సీతాకోకచిలుక రూపంలో బాబాను చూసేసరికి నా మనస్సు ఆనందంతో ఉప్పొంగింది. నా 5 సంవత్సరాల కూతురు కూడా "అమ్మా చూసావా! నేను చెప్పినట్లుగానే బాబా మన ఇంటికి వచ్చారు" అంటూ తను కూడా చాలా సంతోషించింది. బాబా "నేను మీతోనే ఉన్నాన"ని హామీ ఇస్తున్నారన్న సంకేతంగా తీసుకున్నాను. ఈ సంకేతంతో మా శిరిడీ యాత్ర సంతోషదాయకంగా ఉంటుందని భావించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కానీ మనస్సులో ఏదో ఒక మూలన మా ఈ ట్రిప్ లో ఏదో దుష్పరిణామం జరగవచ్చని, అయినా మీరు ఆందోళన చెందవద్దని బాబా చెప్తున్నారని కూడా అనిపించింది.
తరువాత మా పర్యటనలో వాహనాలపై, రెస్టారెంట్లో ఇలా ప్రతిచోట బాబా మాకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆయన మాపై చూపుతున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. శిరిడీలో బాబా చక్కటి దర్శనాలతో మమ్మల్ని అనుగ్రహించారు. ఆగస్టు 14 మేము తిరిగి వచ్చే రోజు మా 5 ఏళ్ళ పాప తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడింది. నా హ్యాండ్ బ్యాగ్ లో తీసుకొని వెళ్లిన మెడిసిన్స్ నుండి తనకి మెడిసిన్ ఇచ్చాను. కానీ జ్వరం కొంతసేపు తగ్గినట్లు తగ్గి మళ్ళీ వచ్చింది. ఆ రాత్రి ఆలస్యంగా మేము ఇంటికి చేరుకున్నాము. అప్పటికీ తనకి జ్వరం ఎక్కువగా ఉంది. చాలా ప్రయత్నించాను కానీ జ్వరం తగ్గలేదు. మరుసటిరోజు మేము పిల్లల డాక్టర్ని సంప్రదించాము. దానితో 4-5 రోజులలో బాబా దయవలన తను కోలుకుంది. బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. కానీ తను కోలుకున్న తరువాత నేను, నా 9 సంవత్సరాల పెద్ద పాప కూడా అవే లక్షణాలతో బాధపడ్డాము. బాబా దయవలన నేను 4రోజుల్లో కోలుకున్నాను కానీ మళ్ళీ నా చిన్న కూతురు జబ్బునపడింది. ఆ స్థితిలో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైంది. అంతలో పెద్ద పాపకి కడుపునొప్పి కూడా మొదలైంది. నిజానికి అది ఎపి-గ్యాస్ట్రిక్ నొప్పి. డాక్టర్ అది యాంటీబయాటిక్స్ వాడటం వలన సైడ్ అఫక్ట్ వల్ల వచ్చిందని నిర్ధారించి కొన్ని యాంటాసిడ్స్ ఇచ్చారు. దానితో జ్వరం, జలుబు తగ్గాయి కానీ కడుపునొప్పి ఇంకా ఎక్కువైంది. తను "మమ్మీ, నా కడుపు చాలా నొప్పిగా ఉంద"ని పదేపదే చెప్తుంది. మేము వేర్వేరు గ్యాస్ట్రోఎంటరాజిస్టుల్ని సంప్రదించాము, అల్ట్రాసౌండ్ మొదలైనవి కూడా చేయించాము కానీ తనకా బాధనుండి ఉపశమనం లభించలేదు. ఇలా వారాలు గడుస్తున్నాయి. నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. బాబాయే నా ఏకైక ఆశ్రయం. ఆయనను ప్రార్ధించి ఊదీ తన పొట్టకి రాసి, నీళ్లలో కొంచం కలిపి రోజులో అనేకసార్లు ఇచ్చాను, ఇలా ప్రతిరోజూ చేసినా కూడా ఉపశమనం లభించలేదు.
ఈలోపు మా నాన్నగారు ఇంకో గాస్ట్రోఎంటరాలజిస్ట్ ని సంప్రదించమని సలహా ఇచ్చారు. మేము అక్కడికి కూడా వెళ్ళాము. ఆ డాక్టర్ కొన్ని మందులిచ్చి, కొన్ని ఆహార మార్పులను కూడా చెప్పి, 2 వారాల తరువాత రమ్మని చెప్పాడు. అయినా ఉపశమనం లేదు. నా బిడ్డ బాధని చూడలేక, తనకి ఏమి చేయలేక బాబా ముందు కూర్చొని ఏడుస్తూ మొరపెట్టుకున్నాను. ఒక బుధవారం రాత్రి, నేను సాయిభక్తులు అనుభవాలు ఆమెకు చెప్తూ ఉన్నాను. తను నొప్పి కారణంగా నేను చెప్పే వాటి మీద దృష్టి పెట్టలేకపోతుంది. కానీ నేను తనని శ్రద్ధగా వినమని పట్టుబట్టాను. నేను "బాబా త్వరలోనే వచ్చి నీ నొప్పినంతా తన జోలిలో వేసుకుంటార"ని తనకి చెప్పాను. ఈమాట నేను చాలాసార్లు చెప్పాను కూడా. కొంతసేపటికి తను నిద్రలోకి జారుకుంది. నేను దీనంగా సాయిని ప్రార్ధించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేశాను.
మళ్ళీ డాక్టర్ ని సంప్రదిస్తే అతను కడుపులో అల్సర్స్(పుండ్లు) ఉన్నాయేమో ఎండోస్కోపీ చేద్దామని చెప్పారు. అది చాలా అసౌకర్యవంతమైన పరీక్ష. అసలే చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుందని నేను మరింత భయపడిపోయాను. డాక్టర్ మత్తు ఇస్తామని చెప్పినప్పటికీ, అలా చేయటానికి నేను సిద్ధంగా లేను. నేను నా బిడ్డని అంతటి బాధకు గురి చేయదలుచుకోలేదు.
ఇంతలో నా సాయి స్నేహితురాలు మమత(గత కొద్ది నెలలుగా ఆమె నాకు తెలుసు) గురువారం ఉదయం, నాకు ఒక బాబా చిత్రాన్ని మరియు ఒక సందేశాన్ని పంపించింది. ఆ మెసేజ్ క్రింద ఇస్తున్నాను.
హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ మార్నింగ్ సాయి మార్నింగ్..
సాయిమా says,
"నమ్మకం మరియు విశ్వాసంతో నన్ను అడగండి. సహనంతో వేచి ఉండండి. మీరు అడిగేది ఏమైనా మంజూరు చేయబడుతుంది. మీకేదైతే సమస్య వచ్చిందో అది పూర్తిగా సమసిపోతుంది. ఇప్పటికే నేను మీ గృహంలోకి ప్రవేశించి కొత్త ఆశలు తీసుకొచ్చాను. మీ వేదనలన్నీ ముగుస్తాయి. నా ఆశీర్వాదాలు నీతోనే ఉన్నాయి. బిడ్డా! ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. అందుకోసమే నేను ఈ కలియుగంలో అవతరించాను. ప్రతిరోజూ జీవితానికి ఒక కొత్త అవకాశం. సంతోషంగా ఉండండి."
బ్లెస్సెడ్ సాయిమా రోజు
జై శ్రీ కృష్ణ
ఓం సాయిరామ్
"నేను ఇప్పటికే మీ ఇంటిలో ప్రవేశించాను" అన్న లైన్స్ చదివి నా కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను నియంత్రించలేకపోయాను. పై వాక్యంతో నా కూతురు త్వరలో కోలుకుంటుందని బాబా నాకు హామీ ఇచ్చారని భావించాను.
తరువాత నేను "నా బిడ్డకు తగ్గేవరకూ నాకిష్టమైన టీ త్రాగన"ని బాబా ముందు ప్రతిజ్ఞ చేసాను. గురువారంనాడు అనాథ పిల్లలకు ఆహారం పెడతానని కూడా బాబాకి చెప్పుకున్నాను. కానీ ఒక గంట తరువాత కూడా నా కూతురికి నొప్పి ఉంది. అంతలో మమత గారు మంచి ఆరోగ్యం కోసం "జన్మ్ జన్మో జన్మి, శ్రీ చరణ్ శ్రీ భాగ్య సాయి" అన్న మంత్రాన్ని పంపించి వీలైనన్నీసార్లు ఆ శ్లోకం జపించమని చెప్పారు. వెంటనే నేను జపించడం మొదలుపెట్టాను. నా కళ్ళ నిండి కన్నీళ్లు కమ్ముకుంటున్నాయి, వాటిని బయటకు కనపడకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నాను. "ఓ సాయి! ... ఇది నాకు చాలా కఠినమైన సమయం" అని బాబాను తలుచుకున్నాను.
కొద్ది నిమిషాలలో నా కూతురు "మమ్మీ, ఇప్పుడు నాకు కొంచం బాగుంది" అని చెప్పింది. ఆమాట విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా హృదయం సంతోషంతో నృత్యం చేసింది, సమయానికి విలువైన మంత్రాన్ని నాకు పంపించి దారి చూపిన మమత గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నిజంగా ఆ మంత్రం ప్రభావాన్ని చూపింది. అప్పటి నుండి నా కుమార్తె నొప్పి తగ్గిపోయింది. కానీ అప్పుడప్పుడు కొద్దిగా నొప్పిగా ఉంది అంటూ తను చెప్తుండేది. అది కూడా బాబా తీసేస్తారు అని గట్టి నమ్మకంతో ఉండసాగాను. 3, 4 వారాల పాటు బాధించిన అనారోగ్యం చివరికి బాబా దయతో సమసిపోయింది. సాయినాథ్ మహారాజ్ కి జై!!
నేను సాయికి వాగ్దానం చేసినట్లుగా, గురువారంనాడు పూరీ, కూర ఆర్డర్ ఇచ్చి ఆరోజు సాయంత్రం అనాధ పిల్లలకు పంపిణి చేశాను. వాళ్ళంతా చాలా సంతోషంగా సంతుష్టిగా తిన్నారు.
ఇప్పుడు నొప్పంతా తగ్గిపోయి క్షేమంగా ఉంది నా బిడ్డ. కాబట్టి నేను సాయి దేవాలయానికి వెళ్లి ఆయన చూపిన దయకు, ప్రేమకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని నాకిష్టమైన టీ త్రాగాలని అనుకున్నాను. ఆరోజు శనివారం, చిన్న పాపకి ఆరోజు సెలవుదినం. పెద్ద పాపకు హాఫ్ డే స్కూల్ ఉంది. తను 12.30 గంటలకి ఇంటికి వస్తుంది. ఈలోపు నేను నా పనులతో బిజీగా ఉన్నాను. సడన్ గా టైం చూసేసరికి అప్పటికే 11 గంటలయింది. అప్పటికింకా నేను టిఫిన్ చేయలేదు. నేను "బాబా! నేను ఇప్పటివరకు ఆకలితో ఉన్నాను. ఇప్పుడు తినడానికి ఎక్కువ సమయం లేదు, పెద్దపాప వచ్చే లోపల నేను త్వరగా ఇంటికి తిరిగి రావాలి, కాబట్టి మీరు ఏదో విధంగా నాకు ఆహారం పెట్టండి" అని బాబాకు చెప్పుకున్నాను. నేను బాబాకోసం శీరా తయారు చేసి చిన్న పాపను తీసుకొని సాయిమందిరానికి వెళ్ళాను. బాబాకు పెట్టమని నేను తీసుకొని వెళ్లిన శీరా పూజారికి ఇచ్చాను. అతను బాబాకు పెట్టిన తరువాత శీరాతోపాటు పులిహార ప్యాకెట్ నాకు ఇచ్చారు. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు ఆ ఆలయంలో బాబాకు ప్రసాదం ఇచ్చాను, కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను అడిగినట్లుగా బాబా నా ఆకలి తీరుస్తున్నారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా డార్లింగ్ సాయి నాపై చాలా ప్రేమను చూపారు. ఈప్రేమ చాలు బాబా. లవ్ యు సాయి. థాంక్యూ సాయి. కష్ట సమయంలో నా కూతురి కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన పింకీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నా సాయి స్నేహితులంతా నా బిడ్డకోసం ప్రార్ధించారు. బాబా వారినందరినీ చల్లగా చూడాలి.
ఇంత పెద్ద నా అనుభవాన్ని చదివినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ బాబా ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను.
ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి!!
అమ్మా సాయితల్లీ ,బాబా వారి లీలలతో మీ అనుభూతి, మీ ఆనందము,మీ అనుభవములు సాయి బంధువులు తో పంచుకోడము మాకు చాలా సంతోషంగా వుంది,ఎవ్వరు అయినగాని ఒక్కసారి బాబా వారి పాదాలు పట్టుకొని ఆర్తితో నీ తోడు నీ సహాయం కావాలి అని ప్రార్ధన చేస్తే చాలు,బాబా వారు ఎప్పుడు మీ తోనే వుంటారు,మీరు బాబా వారిని వదిలేసిన కూడా బాబావారు మిమ్మలిని వదలరు ఇది సత్యము.జై సాయిరామ్ సాయి బంధువు సంపూర్ణ శ్రీనివాస్
ReplyDeleteమీరు చెప్పింది 100% నిజం సాయి.
Delete🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me