సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దేవీ నవరాత్రులలో బాబా చేసిన లీల - సర్వదేవతా స్వరూపం శ్రీ సాయి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులు అందరికీ సాయిరామ్. నేను భువనేశ్వర్ నుండి మాధవిని. మనకు అర్థంకాని, అంతుచిక్కని దైవలీలలు బాబా భక్తులకు ప్రతిక్షణం జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ దేవీ నవరాత్రులలో బాబా చేసిన అత్యద్భుతమైన లీల ఈరోజు మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.

నేను ఉద్యోగరీత్యా శంబల్పూర్ లో ఉంటున్నాను. ఇక్కడ గ్రామదేవత 'శంబలేశ్వరి'. ఇక్కడ ప్రజానీకానికి ఆమె ఆరాధ్యదైవం. ఇక్కడ చుట్టుపక్కల అంతటా ఆమె చాలా ప్రసిద్ధురాలు. దేవీ నవరాత్రుల సందర్భముగా మొదటిరోజున ఆమె 'ధవళాముఖి'గా దర్శనమిచ్చింది. ఆరోజు అమ్మవారు మొత్తం తెల్లనివర్ణంతో అలంకరించబడి ఉంటుంది. ఆరోజు దర్శనం అత్యంత శ్రేష్ఠమని ఇక్కడి వాళ్ళకి విశ్వాసం ఉండటం వలన అందరూ ఆమె దర్శనం చేసుకోవడానికి శంబలేశ్వరి మందిరానికి వెళ్తారు. Rs.500/- టికెట్ కూడా ఉంటుంది. మా ఆఫీస్ వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చి అమ్మ మహత్యాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. అది విన్నాక, నాకు కూడా వెళ్లి అమ్మ దర్శనం చేసుకోవాలనిపించింది. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో నా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తుండగా ఒక ఆటో నా పక్కగా వచ్చింది. ఆ ఆటో డ్రైవర్, "అమ్మా, శంబలేశ్వరి గుడికి వెళ్తున్నాను, వస్తారా?" అని అడిగాడు. నేను కాస్త ఆశ్చర్యంగానే సరేనని ఆటోలో కూర్చొన్నాను. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ చాలా పెద్ద క్యూ, దాదాపు కిలోమీటరు దూరం వరకు ఉంది. అది చూసి నేను భయపడిపోయాను. అసలే నేను తెల్లవారుఝామున నాలుగు గంటలకు డ్యూటీకి వెళ్లినందువలన చాలా అలసటగా ఉండటంతో, ఈ క్యూలో నిలబడటం నా వల్ల కాదనుకుని తిరుగుముఖం పట్టాను. అప్పుడే ఎవరో వెనకనుంచి "సాయిరామ్ మేడమ్" అని పలకరించాడు. నేను "ఇక్కడ 'సాయిరామ్' అని ఎవరు అంటున్నారు?" అని వెనక్కు తిరిగి చూసాను. ఆయన ఎవరో నాకు తెలీదు, నన్నెందుకు పలకరిస్తున్నారో తెలీదు కానీ, ఎవరో బాబా భక్తుడు అయివుంటాడని నేను కూడా "సాయిరామ్" అన్నాను. "ఏమిటి మేడమ్! దర్శనానికి వచ్చారా?" అని అడిగాడు. నేను "అవునండీ, కానీ పెద్ద క్యూ ఉంది, అందువలన వెనక్కు వెళ్లిపోతున్నాను" అని చెప్పాను. దానికి ఆయన, "అరె! మీరు వెనక్కు వెళ్ళిపోతే ఎలా మేడమ్? రండి! నేను మిమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తాను" అని నన్ను మందిరం లోపలకి తీసుకొని వెళ్లి అమ్మవారి ముందు నిలబెట్టాడు. అయిదు నిమిషాలలో అద్భుతమైన దర్శనం అయింది. నేను ఎంతో ఆనందంతో బయటికి వచ్చి ఆయనకోసం వెతికాను. నాకు ఎక్కడా అతని జాడ కనపడలేదు. అతనెవరు? ఎందుకు ఆ కష్టసమయంలో నా వద్దకు వచ్చి అమ్మవారి దర్శనం చేయించారు? నాకు దర్శనమవ్వదని నిరాశగా ఉండడం అతనికెలా తెలుసు? - ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలే. అమ్మ దర్శనం చేసుకోవాలన్న నా మదినెరిగిన బాబా సమయానికి ఆటోని పంపి నన్ను మందిరం వద్దకు చేర్చారు. పైగా దర్శనం అవ్వదనుకున్న నాకు ఆ వ్యక్తి రూపంలో అమ్మ దర్శన భాగ్యాన్ని కలిగించారు.

తరువాత నేను ఇంటికి వచ్చాక ఆలోచిస్తే నాకర్థమయ్యింది, మేము 'విశ్వసాయి ద్వారకమాయి' సభ్యులం సాయి గాయత్రి మహా మంత్రజపం చేయాలని సంకల్పించాం. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు కోటిసార్లు సాయి గాయత్రి జపం చేయించాలని అందరం తయారవుతున్నాము. అందుకని బాబా, "ఈ శంబలేశ్వరి అమ్మవారు శక్తిపీఠం అని, అందుకే ఆమె దర్శనభాగ్యం నాకు కలిగించారు. నిజానికి ఆరోజు ఆమె గంగా స్వరూపమంట. మన దేవీ నవరాత్రులలో దుర్గాదేవిని గాయత్రిదేవి గా అలంకరిస్తారు. గాయత్రి అష్టోత్తరంలో ఆమెకి "ఓం గంగై నమః" అని కూడా ఒక నామం ఉంది. ఆ రోజు శంబలేశ్వరి గంగా రూపం అంటే గాయత్రి అనే కదా. సాయి గాయత్రి కి, గాయత్రి అమ్మకు తేడా లేదని, సాయిబాబా కూడా దేవీ స్వరూపమేనని నాకు అర్థం అయింది. అది నాకు తెలియచేయడానికి బాబా చేసిన లీల ఇది. సర్వదేవతా స్వరూపం తానేనని బాబా  నాకు తెలియచేశారు. 

ఓం సాయిరాం

3 comments:

  1. ఈ మధ్యన మరి బాబా అనుభవాలు అవుతున్నాయి.సాయి..ఆయనకు నా మీద కృప కలిగినట్లు ఉంది..Thank u very much..Share chesinanduku.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo