సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి గాయత్రి మంత్రజపం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ సాయిరామ్. నేను భువనేశ్వర్ నుంచి మాధవి. మేము అక్టోబర్ 18 నుంచి సాయి గాయత్రి మంత్రజపం మొదలుపెడుతున్న సందర్భంగా సాయి గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దీనిని మీ అందరికీ అందజేస్తున్న ఈ బ్లాగు వారికి నా ధన్యవాదాలు.

మన శాస్త్రాలలో గాయత్రి మంత్రానికి చాలా ప్రాశస్త్యముంది. దేవీదేవతలు కూడా గాయత్రి మంత్రోపాసన ద్వారా సిద్ధులు పొందారు. మనం ఇంట్లో చేసుకునే నిత్యపూజ కూడా గాయత్రి మంత్రంతోనే మొదలుపెడతాం. ప్రతి దేవతకు ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. అలాగే మనందరి ఇష్టదైవమైన సాయిబాబాకు కూడా గాయత్రి మంత్రం ఉంది. దానినే సాయి గాయత్రి మహామంత్రం అంటారు. ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా మహిమాన్వితమైన మంత్రం. దీని మహిమ అనంతం, అపూర్వం.

నేను విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం (http://www.viswasaidwarakamai.org/)లో సభ్యురాలిని. ప్రపంచమంతటా ఉన్న మేమంతా సంవత్సరానికి ఒకసారి విశ్వశాంతి కోసం సాయి గాయత్రి మంత్రజపం చేసుకుంటాము. ఆ సమయంలో మాకెన్నో అనుభవాలు బాబా ఇచ్చారు. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

అది 2015వ సంవత్సరం. భువనేశ్వర్ లో మా ఇంట్లో ఒక పదిమందిమి కూర్చొని సాయి గాయత్రి జపం చేసుకుంటున్నాము. బాబా అప్పుడే ఒక లీల చేశారు. అదేమిటంటే, మేమందరం కళ్ళు మూసుకొని మంత్రజపం చేసుకుంటూ ఉండగా ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి వచ్చి, మావారితో, "నేను శిరిడీ నుంచి వస్తున్నాను, మీకోసం ఈ ఊదీ తెచ్చాను. నేను త్వరగా వెళ్ళాలి, ఈ ఊదీ అందుకోండి" అని చెప్పి, రెండు ఊదీ ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. మావారు ఆ ఊదీని బాబా ఫోటో ముందు పెట్టారు. కళ్ళుమూసుకుని జపం చేస్తున్న నేను ఇదంతా గమనించలేదు. కాసేపటికి కళ్ళు తెరిచిన మాతో మావారు పై వివరాలు చెప్పగా మేమంతా ఆనందాశ్చర్యాలతో మౌనంగా ఉండిపోయాము.

ఇంకో అద్భుతమైన అనుభవాన్ని చెప్తాను, చదివి ఆనందించండి. అదేరోజు సాయి గాయత్రి జపానికి నా స్నేహితురాలు, ఆమె భర్త కూడా వచ్చారు. నిజానికి అతను ఆవిడను మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో వచ్చాడు. అతను వెళ్ళిపోబోతుంటే నేను, "కొంచెం ఆగండి, రెండు జపమాలలు అయినా చేసి వెళ్ళండి" అని అడిగాను. అతను నామాట కాదనలేక జపానికి కూర్చున్నాడు. అలా కూర్చున్న అతను మొత్తం అయిపోయేవరకు అలాగే కూర్చున్నాడు. మేమంతా మొత్తం పదివేలసార్లు మంత్రజపం చేసాము. అంటే 10 మాలలు చేసాము. అప్పుడే అద్భుతం జరిగింది. అతను 6 నెలల కిందట ఒక స్నేహితునికి కేవలం స్నేహితునిపై ఉన్న నమ్మకంతో పేపర్స్ ఏమీ వ్రాసుకోకుండా కోటి రూపాయలు అప్పుగా ఇచ్చాడు. తీరా చూస్తే ఆ స్నేహితుడు కోటి రూపాయలు తీసుకొని ఇంక కనపడలేదు. ఇంక ఆ డబ్బులు రావని అనుకున్నాడు ఇతను. అందువలన పాపం చాలా నిరాశగా ఉండేవాడు. ఆరోజు మాఇంట్లో జపం అయిన వెంటనే, అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే, "రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి, మీ డబ్బులు మీకు చెల్లిస్తాను" అని ఆ స్నేహితుడు పెట్టిన మెసేజ్ అది. అప్పుడు అతనికి సాయి గాయత్రి మహిమ అర్థమైంది. నాకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాడతను.

మేము 2016వ సంవత్సరంలో 11లక్షలు, 2017లో 25లక్షలు సాయి గాయత్రి జపం చేసాము. ఇప్పుడు 2018, బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రపంచం మొత్తం కోటిసార్లు సాయి గాయత్రి చేయ సంకల్పించాము. ఆ మంత్రానికి సంబంధించిన ఫ్లయర్ మీ అందరికోసం ఈ లీలతో అటాచ్ చేస్తున్నాను. 

"మీలో ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా దీనిలో భాగస్వాములై సాయినాథుని ఆశీర్వాదాలు పొందండి. సాయి గాయత్రి జపం చేసినవాళ్ళు ఎన్నిసార్లు చేసినది ఆ కౌంట్ నెంబర్ ను క్రింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టమ"ని సాయి బంధువులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. 

+917894359163

ఓం సాయిరాం.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo