సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా పంపిన అతిథి


నా పేరు దబ్బరు అరుణ. మేము యుఎస్ఏలో నివాసం ఉంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిని నమ్మడం మొదలుపెట్టిన నాటి నుండి నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి. నా జీవితంలో ప్రతి సందర్భంలో ఆయన నావెంటే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం చాలా చిన్నదే అయినా ఈ అనుభవం ద్వారా బాబా నాతోనే ఉన్నారని మరోసారి ఋజువు చేసారు. దారులన్నీ మూసుకుపోయినప్పుడు బాబానే మనకు మార్గం చూపిస్తారు

నేనొక గురువారంనాడు పారాయణ మొదలుపెట్టి మరుసటి గురువారానికి పూర్తి చేసాను. నా పారాయణ పూర్తి అయ్యాక ఒక అతిథిని పిలిచి ప్రసాదం ఇవ్వాలని మనసులో అనుకున్నాను. సరిగ్గా పారాయణ పూర్తి అయ్యే సమయానికి మా ఇంట్లో రిపేర్ వర్క్ జరుగుతున్నందువల్ల నేను ఎవరినీ ఆహ్వానించలేకపోయాను. మరి అతిథికి ఎలా ప్రసాదం పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో మా అబ్బాయి స్నేహితుడు ఆడుకోవడానికి మా ఇంటికి వస్తున్నట్టు తెలిసింది. నేను వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, "నేనీరోజే పారాయణ పూర్తి చేశాను. కాబట్టి బాబు మా ఇంట్లో లంచ్ చేస్తాడ"ని చెప్పాను. అయితే నా పూజ అంతా అయిపోవస్తున్న చివరిక్షణంలో ఆ అబ్బాయి ఆడుకోవడానికి ఆరోజు రానని నిర్ణయించుకున్నాడు. వేరే ఏ అతిథినీ నేను ఏర్పాటు చేసుకొని ఉండకపోవడం వలన ఇక నాకు ఆందోళన మొదలయ్యింది. ఇక నాకు వేరే ఏ దారీ కనపడలేదు. వెంటనే బాబా ముందు కూర్చొని ఆయనను చూస్తూ, "ఈ స్థితిలో మీరే నాకు మార్గం చూపాలి" అని వేడుకున్నాను.


కొద్దిసేపటి తరువాత నేను క్రింద జరుగుతున్న ఇంటిపనులు చూడటానికి వెళ్ళాను. అక్కడొక ఫిల్లిప్పిన్ వర్కర్ ఉన్నాడు. అతను నాతో తనకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, ప్రత్యేకించి లెమన్ రైస్ అంటే మరీ ఇష్టమని చెప్పాడు. యాదృచ్ఛికంగా నేను కూడా బాబాకి నైవేద్యంగా లెమన్ రైసే చేసాను. బాబా నాకొక అతిథిని చూపారని చాలా సంతోషంగా అనిపించి, అతనిని సాదరంగా పిలిచి ప్రసాదం పెట్టాను. అతను చాలా ఆనందంగా తిన్నాడు. వెంటనే నేను పూజా మందిరంలోకి వెళ్లి, “బాబా! మీరు మాకొచ్చే ప్రతి సమస్యకి చక్కటి మార్గాన్ని చూపిస్తారు, మీకివే నా కృతజ్ఞతల"ని  నమస్కరించుకున్నాను.


3 comments:

  1. Chala bagundi me anubhavam .sai meru fb lo kuda sai maharaj sannidhi s peruto vunara. Inka bagoji shinda anubhavam lo adho photo pataru valu yavaru. Yanduku pataro talusukovacha.

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo