సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి మనందరినీ ఒకేలాగా ప్రేమిస్తారు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక సాయిబంధువు బాబా తనపై కురిపించిన ప్రేమని మనతో ఇలా పంచుకుంటున్నారు.

సాయి బంధువులందరికీ నమస్కారం. ముందుగా బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. బ్లాగ్ ద్వారా బాబాపై నాకు ఉన్న నమ్మకం, ప్రేమలు ఇంకా ఇంకా బలపడుతున్నాయి. కానీ నా అనుభవాన్ని వ్రాస్తుంటే నాకు తెలియకుండానే చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను. నిజానికి నేను మీలో చాలామందిలా సాయికి పెద్ద భక్తుడిని మాత్రం కాదు. ఒకానొక సమయంలో నేను బాబాని తప్ప ఎవరినీ అంతగా ప్రేమించలేదు. కానీ ఎప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడ్డానో అప్పుడు నాలో అహంకారం మొదలై నెమ్మదిగా బాబా చేయి కూడా వదిలేసాను. ఒక 3 సంవత్సరాలపాటు నేను అందరితో ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా అసలు తెలుసుకోలేకపోయాను. “సమస్యలు ఎదురయినప్పుడే మానవులు భగవంతుడిని ఆశ్రయిస్తార"ని అందరూ చెబుతుంటారు కదా! అలాగే నేను కూడా సాయి దగ్గరకి ఒక అసాధారణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పరుగులు తీసాను. అలా బాబా దగ్గరకి వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు, అన్ని రోజులు నేను సాయిని మరచి ఎలా ఉన్నానా అని. కానీ సాయి ఎప్పుడూ నా చేయిని విడువలేదు. నేను ఎప్పుడూ ఆయన రక్షణలోనే ఉన్నాను. నేను బాగానే ఉన్నాననే నమ్మకం ఆయన నాకు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు.

ప్రియమయిన సాయిభక్తులారా! మీరు నా మాటలు నమ్మినా, నమ్మకపోయినా సాయిబాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనం అయన కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. ఆయన ప్రతిక్షణం మనతోనే ఉన్నారని అనుభూతి చెందండి. ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేస్తూ  ఉంటారు. సాయి చూసుకున్నంత ప్రేమగా ఇంకెవరూ మనల్ని చూసుకోలేరు.

నేను శిరిడీ చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు మీ అందరికీ నేను రెండవసారి శిరిడీ వెళ్ళినప్పటి నా అనుభవాన్ని తెలియజేస్తాను. 

నేను బాబా దర్శనం కోసం క్యూలో ఉన్నప్పుడు హఠాత్తుగా, నేను కోరుకునే రంగు వస్త్రాలలో నాకు దర్శనం ఇమ్మని బాబాని అడగాలనిపించింది. వెంటనే, "బాబా! నాకు ఇష్టమైన నీలం రంగు వస్త్రాలలో నాకు దర్శనం ఇస్తావా?" అని అడిగాను. కొంతసేపటికి క్యూ మెల్లిగా కదులుతూ మేము మెయిన్ హాల్లోకి చేరుకున్నాం. అక్కడ టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చూడగా బాబా కాషాయ రంగు వస్త్రాలు ధరించి ఉన్నారు. అది చూసి ఒకింత నిరాశకు లోనయ్యాను. కానీ, వెంటనే తేరుకొని, “బాబాని ప్రేమించే భక్తులు ఎంతోమంది ఉన్నారు, నా ఒక్కడి కోరిక తీర్చడానికి బాబాకి ఎలా కుదురుతుంది? ఇక్కడ నాతోపాటు క్యూలో ఉన్నవారు కూడా నాలాగే వారివారి ఇష్టానుసారం ఆయా రంగు వస్త్రాలలో బాబాని చూడాలని అనుకోవచ్చు కదా!” అని నన్ను నేను సమాధానపరచుకున్నాను. ఇలా పలురకాలుగా ఆలోచిస్తూ క్యూలో నిల్చొని ఉన్నాను.

అంతలో ధూప్ ఆరతి సమయం అవుతుండడంతో హారతికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. కొందరు పూజారులు బాబాకి వస్తాలు మారుస్తున్నారు. వాళ్ళు బాబాకి కడుతున్న వస్త్రాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇప్పుడు నా బాబా నేను కోరుకున్న, నాకు ఇష్టమైన నీలం రంగు వస్త్రాలు ధరించి ఉన్నారు. నాకు నోట మాట రాలేదు, ఎలా స్పందించాలో కూడా అర్ధం కాలేదు. ఈ అనుభవంతో బాబాపై నాకు ఉన్న నమ్మకం ఇంకా బలపడింది.

మరునాడు దర్శనానికి వెళ్తూ, "బాబా! ఈరోజు పింక్ రంగు వస్త్రాలలో దర్శనం ఇవ్వండి" అని అడిగాను. నాకు మళ్ళీ ఆశ్చర్యం కలిగేలా సాయి పింక్ రంగు వస్త్రాలలోనే దర్శనం ఇచ్చారు. బాబాకి తన భక్తులంటే అమితమైన ప్రేమ, వాళ్ళు ఏమి కోరినా అవి తక్షణమే తీరుస్తారు.

"బాబా! అహంకారంతో నేను చేసిన తప్పులు, పాపాలు అన్నీ మన్నించండి. మీ చేయి ఎప్పటికీ విడువను. నాకు మార్గదర్శిగా ఉండి నేను ఏ చిన్న తప్పు చేసినా నన్ను శిక్షించి సరైన దారిలో నడిపించండి బాబా! మీ భక్తులందరినీ సదా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి. వారిని సరైన మార్గంలో నడిపించండి. అందరూ సంతోషంగా ఉండేలా చూడండి బాబా!"

ఓం సాయిరాం!!!

3 comments:

  1. సాయి రాం!!

    ReplyDelete
  2. sarigga ilanti anubhavanne nenuu pondaanu. shiridi okasari nenu na birthday ki vellaanu.na birthday roju q lo nadusthuu,nenu vesuknna dress colour lo baba dress vunte yenta baguntundi anukunnanu. kany chusthe , baba ki vere color dress vundi. badha paddanu,sayantram harathi ki sarigga nenu vesukunna colour dress ni baba vesukunnaru. marusati roju, aa marusati roju kudaa aashcharyam gaa nenu vesukunna color dress baba vesukuni nannu vuuradinchaaru.. sai prema varninchalenidhi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo