సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1224వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను నమ్ముకుంటే జరగనిదంటూ ఉండదు
2. బాబా సహాయం
3. సాయికి మ్రొక్కుకున్నంతనే క్రెడిట్ అయిన డబ్బులు

బాబాను నమ్ముకుంటే జరగనిదంటూ ఉండదు

నేను ఒక సాయి భక్తురాలిని. నేను బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. మేము ఒక అపార్ట్‌మెంట్లో నివాసముంటున్నాము. నేను ఆ అపార్ట్‌మెంట్ కమిటీకి సెక్రటరిని. ఒకసారి నేను ఒక సమస్య విషయంలో నా సొంత డబ్బు పెట్టాను. తరువాత నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వడానికి కమిటీవాళ్ళు ఆరు నెలలపాటు నన్ను చాలా బాధపెట్టారు. చివరికి నేను బాబాకి నా కష్టాన్ని చెప్పుకుని, "బాబా! దయతో నాకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చేయండి" అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఆ డబ్బులు నాకు తిరిగి వచ్చాయి. సంతోషంగా బాబాకి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను తనని చివరిసారిగా చూసుకోవాలని విజయవాడ నుండి బయలుదేరాను. అయితే నేను అమ్మవాళ్ళ ఊరు వెళ్ళి అక్కడి నుండి బయలుదేరి వెళ్లేటప్పటికి అమ్మమ్మను స్మశానానికి తీసుకుని వెళ్లిపోయారు. నేను బాబాతో, "బాబా! అమ్మమ్మ చివరి చూపు దక్కేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. మేము వెళ్ళి అమ్మమ్మను చూసుకున్నాకే దహన సంస్కారాలు అయ్యేలా బాబా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

మా చిన్నబాబు వీసాకోసం దరఖాస్తు చేసుకుంటే, 2022, జూన్ 6న వీసా స్లాట్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మా బాబుకి ఏ ఆటంకం లేకుండా వీసా వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. దయామయుడైన మన సాయి అనుగ్రహించారు. మా బాబుకి ఏ సమస్య లేకుండా వీసా వచ్చింది. నేను చాలా సంతోషించాను. మనం బాబాను నమ్ముకుంటే, జరగనిదంటూ ఏమీ ఉండదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం మా మీద, మా కుటుంబసభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి".

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బాబా సహాయం

సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిత్యం చదువుతుంటాను. ఈరోజు బాబా నాకు చేసిన రెండు సహాయాల గురించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా పనిలో బాబా నాకు చేసిన సహయం గురించి చెప్తాను. నేను గత ఆరు నెలలుగా ఒక సంస్థలో పని చేస్తున్నాను. నేను ఈ ఉద్యోగంలో క్రొత్తగా చేరడం వలన కొద్దిరోజులు నాకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయిన తరువాత నేను నా పనిని సొంతంగా చేయడం మొదలపెట్టాను. అంతలోనే నా ట్రైనర్ సెలవు మీద వెళ్లారు. తను సెలవులో ఉన్న సమయంలో నాకు ఒక క్లిష్టమైన పనిని అప్పగించారు. అది పూర్తి చెయ్యడానికి వేరే వాళ్ళ సహాయం తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. నా ట్రైనర్ మాత్రమే దాని గురించి స్పష్టంగా చెప్పగలరు. కానీ తను సెలవులో ఉన్నారు. అందుచేత నేను, "బాబా, నా ట్రైనర్ సెలవు నుంచి తిరిగి వచ్చేవరకు ఈ పని వాయిదా పడేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‍లో నాకు ఇచ్చిన పనిని వాయిదా వేసినట్టుగా ఉంది. ఇక నా సంతోషానికి అవధులు లేవు.

ఒకసారి నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి రైలులో వెళ్ళాను. అదే నేను మొదటిసారి ఒంటరిగా రైలు ప్రయాణం చేయడం. నేను దిగవలసిన స్టేషన్, ఆ ట్రైన్ ఆగే చివరి స్టేషన్ కాబట్టి అంతకుముందు వచ్చే రెండు, మూడు స్టేషన్లు చేరుకునేసరికి రైలు దాదాపు ఖాళీ అయిపోతుంది. ఆ రోజు కూడా అలానే జరిగింది. ట్రైన్ దాదాపు ఖాళీగా ఉండటం వల్ల నాకు కాస్త భయమేసి, "బాబా! నన్ను క్షేమంగా ఇంటికి చేర్చండి" అని బాబాని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా ఇంటికి చేర్చారు. "థాంక్యూ బాబా. ఇలాగే ఎల్లప్పుడూ మీ కృపను మాపై చూపండి".

సాయికి మ్రొక్కుకున్నంతనే క్రెడిట్ అయిన డబ్బులు

సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు శిరీష. నేను మొదటిసారి నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. 2021, జూన్ నెలలో మా అమ్మవాళ్ళు నాకు ఒక పొలం రాసిచ్చారు. తరువాత అమ్మ చనిపోయింది. జనవరిలో రావలసిన పొలం తాలూకు పంట డబ్బులు చాలాకాలం వరకు అంటే 2022, జూన్ నెల వచ్చినా నా చేతికి రాలేదు. ఆ విషయంలో మా నాన్న అస్సలు పట్టించుకునేవారు కాదు. చివరికి నేను, "బాబా! నా పంట డబ్బులు నాకు వచ్చేలా దయ చూపండి" అని సాయిని వేడుకున్నాను. అలా సాయికి మ్రొక్కుకున్న ఒక వారానికి 2021, జూన్ 10న డబ్బులు నా అకౌంటులో క్రెడిట్ అయ్యాయి. అంతా సాయి కరుణ. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".

అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo