- బాబా యొక్క పర్ఫెక్ట్ టైమింగ్
- బాబా పరిష్కరించిన ఆరోగ్య (అలర్జీ) సమస్య
బాబా యొక్క పర్ఫెక్ట్ టైమింగ్
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మాధవి. మేము భువనేశ్వర్‌లో నివసిస్తున్నాము. 2021, సంక్రాంతి రోజున బాబా నాకు ఒక చక్కని లీలను ప్రసాదించారు. నేను కష్టంలో ఉన్నానని తెలిసిన బాబా తమ ఉపస్థితిని (సన్నిధిని) ఈ లీలల ద్వారా నాకు తెలియజేస్తున్నారేమోనని నా అభిప్రాయం. ఇంక బాబా లీలకు వస్తే..
2021 ఆరంభంలో నేను బాబా కోసం 6 రకాల డ్రెస్సులు తీసుకొని, వాటిని టైలరుకి ఇచ్చి, "వీటిని అందంగా కుట్టి సంక్రాంతికల్లా సిద్ధంచేయమ"ని చెప్పాను. సుమారు వారం, పది రోజుల తరువాత, పండుగ దగ్గర పడుతుండటంతో సంక్రాంతికి మూడు రోజుల ముందు నుంచి ఆవిడకు ఫోన్ చేయడం మొదలుపెడితే, ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ కూడా పెట్టాను, కానీ సమాధానం లేదు. బహుశా సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌లోని వాళ్ళ సొంతూరు పలాసకు వెళ్లిందేమో అనుకున్నాను. "అయ్యో, బాబా డ్రెస్సులు ఇవ్వకుండానే ఊరికి వెళ్ళిందే" అని చాలా బాధపడ్డాను. సంక్రాంతి రోజున నా దుఃఖం ఇంకా ఎక్కువైంది. "బాబా! నీకోసం ఎన్నో డ్రెస్సులు కొన్నాను. వాటిని నీకు వేసి మురిసిపోయే ప్రాప్తం నాకు లేదు. క్రొత్త డ్రెస్సు వేసుకోవాలన్న కోరిక నీకు లేదేమో! ఇదంతా నా దురదృష్టం..." ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. క్రొత్త డ్రెస్ లేకపోవటంతో బాబాకు వేయడానికి పాత డ్రెస్ ఒకదానిని తీసి, “ఈరోజు నీకు క్రొత్త డ్రెస్సు వేయలేకపోతున్నాను, దీనితో సరిపెట్టుకో బాబా” అనుకున్నాను. తరువాత బాబా పూజకు కూర్చున్నాను. బాబాకు అభిషేకం చేద్దామని అంతకుముందు బాబాకు వేసివున్న డ్రెస్సును విప్పాను. బాబాను ప్లేటుపై కూర్చోపెట్టాను. నా మనసంతా క్రొత్త డ్రెస్సు పైనే ఉంది. ఇంతలో ఆ టైలర్ అమ్మాయి దగ్గర్నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఫోన్ తీసి ఆతృతగా, “నా బాబా డ్రెస్ ఎక్కడ?” అని తనను అడిగాను. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి పండుగకి వాళ్ళ ఊరు వెళ్ళిందట. కానీ ఏదో చెప్పలేని వెలితిగా అనిపించి ఇక వాళ్ళ ఊరిలో ఉండలేకపోయిందట. దాంతో వెంటనే బయలుదేరి ముందురోజు రాత్రి 10 గంటలకు భువనేశ్వర్ వచ్చిందట. ఇంటికి వచ్చాక నా మెసేజ్ చూశానని చెప్పి, “ఒక్క డ్రెస్ సిద్ధంగా ఉంచాను, వచ్చి తీసుకెళ్ళండి” అని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో నేను ఒక్కదాన్నే వున్నాను. పైగా బాబాకు పూజ చేస్తున్నాను, మధ్యలో వదిలి వెళ్లలేను. మా చిన్నబ్బాయేమో కారు రిపేర్ చేయించుకోవటం కోసం మెకానిక్ షాపుకి వెళ్ళాడు. “ఇప్పుడెలా బాబా?” అనుకున్నాను. ఇంతలో ఆశ్చర్యంగా మా అబ్బాయే ఫోన్ చేశాడు. "అమ్మా, నేను టైలర్ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చాను, నీకేమైనా కూరగాయలు కావాలా?" అని అడిగాడు. "అక్కడికెందుకు వెళ్ళావు? నువ్వు కారు రిపేరు చేయించుకోవడం కోసం వెళ్లావు కదా?" అని అడిగాను. అందుకు తను, “ఏమో, నేను ఇటువైపు ఎందుకు వచ్చానో నాకే తెలీదు" అన్నాడు. అప్పుడు నేను, "టైలర్ అమ్మాయి బాబా డ్రెస్ ఇస్తుంది, తీసుకొని వచ్చి నాకు ఇవ్వు" అని చెప్పాను. తరువాత నా బాబాకు అభిషేకం చేశాను. ఇంతలో బాబా డ్రెస్ తీసుకొని మా అబ్బాయి వచ్చాడు. ఎంతో ఆనందంగా ఆ క్రొత్త డ్రెస్సును బాబాకు వేసి ఎంతో మురిసిపోయాను. అలా సంక్రాంతిరోజున ఆ క్రొత్త ఎరుపురంగు డ్రెస్సును ధరించి బాబా నా మనసులోని కోరికను అద్భుతమైన రీతిలో తీర్చి, నాకు తోడునీడగా ఉన్నారని నిరూపించారు.
బాబా పరిష్కరించిన ఆరోగ్య (అలర్జీ) సమస్య
సృష్టిస్థితిలయకారకుడైన సాయినాథ మహారాజుకి శతకోటి వందనాలు! సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్. నేను తెలంగాణలోని కరీంనగర్ నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. నేను 2018 నుండి మూడు సంవత్సరాలు అరికాళ్ళకి, ఎడమ అరచేతికి అలర్జీ సమస్యతో బాధపడ్డాను. ఎన్ని మందులు వాడినా అలర్జీ తగ్గలేదు. ఒకరోజు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకున్న ఈ అలర్జీ సమస్యను తొలగించండి, నాకు ఇష్టమైన టీ త్రాగడం మానివేస్తాను” అని బాబాకు మనస్ఫూర్తిగా మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో కొద్దిరోజులలోనే నా అలర్జీ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “ధన్యవాదాలు బాబా!”
సర్వేజనాః సుఖినోభవంతు!
శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు.


ఓం సాయి రామ్ నాకు ఎలరిజ్ ఉం ది. తగ్గిo చు బా బా
ReplyDeleteOm sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteసాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
631 days
ReplyDeletesairam
Om sai ram baba amma problem toliginchi arogyani prasadinchu thandri
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDelete