సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా జీవితంలోని రెండు బాబా అనుగ్రహచిహ్నాలు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బెంగళూరునుండి సుంకర సూర్యప్రకాష్ తన అనుభవాన్నిలా చెప్తున్నారు:

ముందుగా నా వృత్తికి సంబంధించిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను. ఇంత ఆలస్యమైనందుకు ముందుగా నన్ను క్షమించమని బాబాను ప్రార్థిస్తున్నాను. 2017లో నేను ఒక ప్రాజెక్టులో ఉండేవాడిని. అందులో ఎటువంటి ఎదుగుదలా ఉండేది కాదు. కానీ కుటుంబంతో సమయం గడపడానికి ఎక్కువగా అవకాశం ఉండటంతో అందులోనే కొనసాగుతూ వచ్చాను. హఠాత్తుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు బాబా అనుగ్రహమేనని నేను అప్పుడు గుర్తించలేకపోయాను. ఆ సమయంలో మా లీడర్‌షిప్ టీమ్ వాళ్ళు వేరే ప్రాజెక్టు కోసం టెక్నికల్ ఇంటర్వ్యూలు తీసుకోమని నాకు చెప్పారు. నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశానుగాని, ఎవరూ సెలెక్ట్ కాలేదు. ఇక చివరికి 2017, జులైలో అప్పటికే కేటి(నాలెడ్జ్ ట్రాన్స్ఫర్) మొదలైన ఆ ప్రాజెక్టులోకి నన్ను బలవంతంగా తోశారు. ఇక చేసేదిలేక నేను పని మొదలుపెట్టాను. కేటి సెషన్స్ ఆఫ్ సోర్స్‌లో, అంటే ఇండియాలోనే జరిగాయి. ఆగస్టులో మా క్లయింట్ ఒక టీమ్‌ని యూఎస్ఏ పంపమని మా మేనేజ్‌మెంట్ కి చెప్పారు. ఆ టీమ్‌కి నన్ను కూడా సెలెక్ట్ చేశారు. బాబా అనుగ్రహంతో పదేళ్లకు బిజినెస్ వీసా వచ్చింది. తరువాత ఆరువారాల కోసం యుఎస్ వెళ్లి అక్కడ రివర్స్ కేటి వర్క్ విజయవంతంగా పూర్తి చేశాను. క్లయింట్ నుండి లీడర్స్ టీమ్ వరకు అందరినుండి నాకు చాలా ప్రశంసలు లభించాయి. యుఎస్ వీసా, అక్కడికి వెళ్లే అవకాశం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నిజానికి అటువంటి అవకాశాలు నా ముందు ప్రాజెక్టులో లేవు కూడా. ఇదంతా కేవలం మూడునెలల్లో బాబా కృపవల్లనే సాధ్యమైంది. ఆ సమయంలోనే నేను బాబా అనుగ్రహంతో మహాపారాయణ గ్రూపులో కూడా జాయినయ్యాను.

రెండవ అనుభవం:

ఈ అనుభవం పవిత్రమైన శిరిడీలో జరిగింది. బాబా అనుగ్రహంతో గత ఆరేడేళ్లుగా సంవత్సరానికి ఒకసారి శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని వస్తున్నాను. 2017, ఫిబ్రవరి నెలలో నేను శిరిడీ వెళ్ళినప్పుడు అద్భుతమైన బాబా దర్శనంతో చాలా ఆనందించాను. తరువాత తిరుగు ప్రయాణమయ్యే రోజు మళ్లీ ఒకసారి బాబా దర్శనం చేసుకుందామనిపించి క్యూలో వెళ్లి నిలుచున్నాను. క్యూలో ఉండగా బాబాకి పువ్వులు సమర్పించుకుంటే బాగుండునని ఆలోచన వచ్చింది. కానీ పువ్వులు తీసుకునే అవకాశం లేకపోవడంతో దిగులుపడుతూ క్యూలో ముందుకుసాగాను. అప్పుడే బాబా మిరాకిల్ జరిగింది. నేను సమాధిమందిరంలోకి అడుగుపెడుతున్న సమయంలో చేతిలో ఒక పూలదండ, మరికొన్ని విడిపూలు పట్టుకున్న ఒక అపరిచితవ్యక్తి నేరుగా నా వద్దకు వచ్చి, నా చేతిలో పూలదండ పెట్టి తీసుకోమని చెప్పాడు. నేను షాకై అలానే చూస్తుండగా, అతను ఆ విడిపువ్వులను క్యూలో ఉన్న మరో వ్యక్తి చేతిలో పెట్టి క్యూ దాటుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు కానీ నాకర్థం కాలేదు, బాబా నా కోరిక తీర్చడానికి ఆ పువ్వులు అతని ద్వారా ఇచ్చారని. ఆనందంతో నేను ఆ పూలమాలని పూజారి ద్వారా బాబాకు సమర్పించుకున్నాను. అందుకు ప్రతిగా నాకొక పుష్పగుచ్ఛం బాబా ఆశీర్వాదంగా లభించింది. ఈవిధంగా శిరిడీ ప్రయాణంలో అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చారు బాబా. బాబా ఆశీస్సులు పొందిన ఆ ఆనందంతో తిరిగి ఇంటికి చేరుకున్నాను. 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo