సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా దయ - క్యాన్సర్ మటుమాయం!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా చెప్తున్నారు..

నాకు, నా భర్తకు బాబాపట్ల ఎంతో భక్తి విశ్వాసాలు. క్రమం తప్పకుండా 'ఓం సాయి మందిరాని'కి వెళ్తూ, బాబాపట్ల అంకితభావంతో ఉండేవాళ్ళం. నేనెప్పుడూ నా భర్తతో(నాకు నేను కూడా) 'నేను బాబాకు ముద్దుబిడ్డన'ని చెప్పుకునేదాన్ని. ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉండేది మా జీవితం. అలాంటిది అనుకోకుండా 2013, నవంబర్ నెలలో బయాప్సీ రిపోర్ట్ ద్వారా నా రొమ్ము భాగంలో తిత్తి(క్యాన్సర్) ఉన్నట్లు నిర్దారించబడింది. అన్ని పరీక్షలు చేసి, ఫిబ్రవరి 2014, 4వ తేదీన తిత్తిని తీసివేయడానికి శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. ఒక్కసారిగా ప్రతికూలమైన ఆలోచనలు నన్ను చుట్టుముట్టి చాలా భయాందోళనలకు లోనయ్యాను. నాకేదన్నా అయితే నా భర్త, బిడ్డల పరిస్థితి ఏమిటన్న దిగులుతో కన్నీళ్లు ఆగేవి కావు.  నా భర్త నాకు అండగా ఉంటూ ఎంతో ధైర్యం చెప్పేవారు. నేను కూడా "బాబా ముద్దుబిడ్డకు ఎప్పుడైనా సమస్యలు వస్తాయా?" అని మోముపై చిరునవ్వుతో సాధారణంగా ఉండటానికి ప్రయత్నంచేస్తూ ఉండేదాన్ని. కానీ సర్జరీ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ లోలోపల ఆందోళనపడుతూ ఉండేదాన్ని.

సర్జరీకి ఇంకా వారం ఉందనగా ఒకరాత్రి హఠాత్తుగా బాబా నా దగ్గరకు వచ్చి నా నుదుటిమీద చెయ్యిపెట్టి నిలుచున్నట్లు కనిపించింది. తరువాత బాబా నాతో, "ఎందుకంత బాధపడుతున్నావు? కేవలం రెండు టెంకాయలు 'ఓం సాయి మందిరం'లో సమర్పించు! అంతా బాగైపోతుంది" అని చెప్పారు. మరుసటిరోజు నిద్రలేస్తూనే ముందురాత్రి నేను చూసినది గుర్తుకు తెచ్చుకుని నన్ను నేను నమ్మలేకపోయాను. వెంటనే నా భర్తతో అంతా చెప్పాను. తరువాత మేము బాబా చెప్పినట్లే చేసాము. 

సర్జరీ చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఆరోజు తెల్లవారుఝామునే మేమిద్దరం ఆసుపత్రికి బయలుదేరాము. ఆసుపత్రికి వెళ్ళేముందు, మా ఇంట్లో ఉన్న చిన్న బాబా విగ్రహాన్ని పూజించి, విభూది నా నుదుట పెట్టుకున్నాను(ఇది నా రోజువారీ అలవాటు). ఆసుపత్రికి వెళ్ళి ఫార్మాలిటీలు పూర్తిచేసిన తరువాత, నర్సు నా భర్తను బయట వేచివుండమని చెప్పి, నన్ను తనతో తీసుకెళ్ళింది. అప్పటికే నేను ఏడుస్తున్నాను. నేను తేరుకునేసరికి ఆపరేషన్ థియేటర్‌లో  స్ట్రెచర్ మీద ఉన్నాను. పక్కనే ఇదివరకు తిత్తిని నిర్ధారించిన బ్రెస్ట్ (రొమ్ము) సర్జన్ ఉన్నారు. ఆయన నన్ను సమాధానపరచడానికి ప్రయత్నిస్తూ నాకు అర్థమయ్యే విధంగా సర్జరీ గురించి వివరించారు.

తరువాత సర్జరీకి ముందు ఆపరేషన్ చేసి తీసివేయాల్సిన తిత్తిని డాక్టర్ మళ్ళీ ఒకసారి పరీక్షగా చూస్తున్నారు. ఆయన ముఖకవళికలనుబట్టి తను ఆశ్చర్యపోతున్నట్లు, నిశ్చేష్టుడైనట్లు నాకు అనిపించింది. ఆయన ఇంకా ఏవో రిపోర్ట్స్ తెప్పించి, వేరే సర్జన్‌ని కూడా పిలిపించి రిపోర్ట్స్‌ను పరిశీలనగా చూస్తున్నారు. ఏమి జరుగుతోందో అర్థంకాక నేను చాలా ఆందోళనపడ్డాను. ఇదిలా ఉంటే నేను ఆ సమయమంతా నా మనస్సులో 'సాయిరాం! సాయిరాం! సాయిరాం!' అన్న ఒక్క పదం స్మరిస్తూనే ఉన్నాను. కొన్నినిమిషాల తరువాత డాక్టర్ నాకు దగ్గరగా వచ్చి చిన్న స్వరంతో, "మిస్సెస్ ------, మేము దీన్ని 'మిలియన్లో ఒక కేసు'గా పరిగణిస్తాము. మీ రొమ్ముభాగంలో ఉండాల్సిన తిత్తి ఇప్పుడు ఎంత మాత్రం లేదు. ఎంత వెతికినా ఏ తిత్తీ కనపడటం లేదు. కాబట్టి మేమింక సర్జరీ చెయ్యాల్సిన అవసరం లేదు!" అని చెప్పారు. ఆ క్షణాన నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మళ్ళీ మా జీవితాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా!"

సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!

3 comments:

  1. Chala bagundi.sai.great devoti..Appudu ame anandam oohisthene ascharyam.om sai ram.

    ReplyDelete
  2. చదువుతుంటే ,బాబా కరుణ కి కన్నీళ్లొస్తున్నాయి.. సాయి నాధుడికి జై !

    ReplyDelete
  3. Baba baba.. nijam ga meeru baba muddubidda.. adruahtavamthulu.. adbhutamaina anubhavam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo