శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
బెంగళూరు నుండి వి.వెంకటేశన్ తమ అనుభవాన్నిలా చెప్తున్నారు:
నా పేరు వెంకటేశన్. నేను మాత్రమే కాదు, మా కుటుంబమంతా శిరిడీ సాయి భక్తులం.
ఇటీవల మా అబ్బాయికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. సాధారణంగా చిన్న శస్త్రచికిత్సలు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతాయి. రోగిని కొద్ది గంటలు పర్యవేక్షణలో ఉంచి సాయంత్రానికి ఇంటికి పంపించేస్తారు. అయితే, మా అబ్బాయి విషయంలో శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ, తన ఊపిరితిత్తులలో ఏవో ద్రవపదార్థాలు చేరుకోవడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. కావల్సినంత ఆక్సిజన్ తీసుకోవడానికి తన ఊపిరితిత్తులు వ్యాకోచించడం మానేశాయి. వైద్యులు తనని ఐ.సి.యు.కి తరలించి చికిత్స చేస్తున్నారు. కానీ వాళ్ళ ముఖాలు భయం భయంగా, చాలా ఆందోళనగా కనిపిస్తున్నాయి. మాకు మాత్రం ఏమీ చెప్పట్లేదు. మాకేమీ అర్థంకాక చాలా ఆందోళన చెందాము. మా జీవితాలలోనే అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి అది. నేను మా అబ్బాయి గురించి ప్రార్థించమని కొందరు సాయిభక్తులను అభ్యర్థించాను. వాళ్ళలో ఒక సాయిభక్తురాలు నాకు ఫోన్ చేసి, "బాబా ఊదీ అబ్బాయి నుదుటి మీద, నాలుక మీద ఉంచండి" అని సూచించారు.
నేను, నా భార్య ఇటువంటి పరిణామాలను ఉహించనేలేదు. అందువలన మేము మాతో ఊదీ తీసుకుని వెళ్ళలేదు. అప్పటికే రాత్రి పదిగంటలైంది. పోనీ ఊదీ తీసుకుని రావడానికి ఇంటికి వెళదామంటే నా భార్య తీవ్రంగా టెన్షన్‌పడుతూ,తనని ఒంటరిగా వదిలి వెళ్ళొద్దని ప్రాధేయపడింది. నాకు ఏమీ అర్థంకాక నా మనసుకెందుకనిపించిందో గాని, నా పర్సు తీసి అందులో వెతికితే, ఆశ్చర్యంగా ఒక చిన్న ఊదీ ప్యాకెట్ కనిపించింది.
వెంటనే వైద్యుల అనుమతితో ఐ.సి.యు. లోపలికి వెళ్లి, మా అబ్బాయి నుదుటిపైన, నాలుకపైన కొంచెం ఊదీ పెట్టి, "బాబా! మా అబ్బాయిని కాపాడండి" అని ప్రార్థించాను. తరువాత రాత్రంతా నేను, నా భార్య బాబాను ప్రార్థిస్తూ హాస్పిటల్ కారిడార్‌లో కూర్చున్నాము. మరుసటి ఉదయం నేను మళ్ళీ లోపలికి వెళ్లి మా అబ్బాయికి బాబా ఊదీ పెట్టి వచ్చాను. మధ్యాహ్నానికి మా అబ్బాయి పరిస్థితి బాగా మెరుగుపడింది. 4 రోజులలో డిశ్చార్జ్ కూడా అయ్యాడు.
పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో బాబానే నా జేబులో ఊదీ పెట్టి మా అబ్బాయిని కాపాడారని నా పూర్తి నమ్మకం. ఎందుకంటే, ఊదీ పర్సులో పెట్టుకునే అలవాటు నాకు లేదు. ఒకవేళ ఎప్పుడైనా పెట్టిన గుర్తు కూడా నాకు లేదు. బాబా మార్గాలు అనూహ్యమైనవి. ఆయన మనకి తోడుగా మన చుట్టూ ఉన్నారని నిరూపించింది ఈ అనుభవం. ఒక్క పిలుపు చాలు, తప్పకుండా ఆయన వస్తారు, మనకి సహాయం అందిస్తారు.

🕉 sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయినాధాయ నమః
ReplyDelete