నా పేరు శ్రీకాంత్. మాది ఒంగోలు. నా భార్య రెండోసారి గర్భవతి అయినప్పుడు మేము ముందు నుంచి అబ్బాయి కావాలని బాబాని ప్రార్థించాము. 2019 జనవరి 23, బుధవారంనాడు సాయంత్రం నా భార్యకి నొప్పులు మొదలు అయ్యాయి. నేను నా భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్ళాను. హాస్పిటల్లో చేరిన వెంటనే బాబా ఊదీ నీళ్లలో కలిపి నా భార్య చేత త్రాగించాను. నొప్పులు ఎక్కువగా రావడం కోసం వైద్యులు వాకింగ్ చేయమని చెప్పారు. నా భార్య ఎంత వాకింగ్ చేసినా ఆరోజు డెలివరీ కాలేదు. నేను నా ముందు బాబా ఫోటో పెట్టుకుని, "బాబా! మొదటిసారి లాగానే ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయ్యేలా చూడండి" అని చెప్పుకుని, ఆయన స్మరణ చేస్తూ వున్నాను. మరుసటిరోజు నొప్పులు రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. అయినా కూడా నొప్పులు రాలేదు. అలా మూడుసార్లు టాబ్లెట్స్ ఇచ్చినప్పటికీ నొప్పులు రాలేదు. పాపం, వాకింగ్ చేసి చేసి నా భార్యకు కాళ్ళనొప్పులు కూడా వచ్చాయి. తను పడుతున్న బాధను చూడలేక నేను బాధతో, "ఎందుకు బాబా మమ్మల్ని ఇంతలా పరీక్షిస్తున్నారు? పాపం! తాను చాలా కష్టపడుతోంది. త్వరగా డెలివరీ అయ్యేలా చూడండి" అని వేడుకున్నాను. అంతలో డాక్టర్ పరీక్షించి, "బేబీ బరువుగా ఉంది. అందువలన నార్మల్ డెలివరీ అవడం కష్టం" అన్నారు. నేను చాలా బాధపడి, "ఏమిటి బాబా, ఇలా చేసారు?" అని అనుకున్నాను. ఇక తప్పనిసరై ఆ రాత్రే ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ అయిన వెంటనే పిల్లల డాక్టర్ బయటకు వచ్చి, "బిడ్డ అంత వెయిట్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అస్సలు జరగదు. మీరు ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌కి సమ్మతించడం మంచిదైంది" అన్నారు. అప్పుడుగానీ మాకు అర్థంకాలేదు, బాబా మా మంచి కోసం ఆపరేషన్ జరిగేలా చేసారని! మేము కోరుకున్నట్లుగానే బాబుని మాకు వరంగా ప్రసాదించారు బాబా. బేబీ బరువు ఎక్కువ ఉండటం వలన ఇతర సమస్యలు కూడా వస్తాయి. కానీ బాబా దయవలన ఎలాంటి సమస్యలు లేకుండా బాబు ఆరోగ్యంగా వున్నాడు. "బాబా! ఆరోగ్యవంతమైన చక్కని బాబుని ఇచ్చారు. మీకు చాలా చాలా ఋణపడి వున్నాను బాబా".
సాయి వచనం:-
|
|
This comment has been removed by the author.
ReplyDeletehttps://www.facebook.com/Sadgurunilayam999/videos/538153526677032/ edi chudu bhagundhi
ReplyDeletethis was not opening sai
Deleteplease send the exact url