శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
స్మిత బద్గవాకర్, తన భర్త విశ్వనాథ్‌తో పూనాలో నివసిస్తుండేవారు. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నాడనుకున్న ఆమె భర్త, హఠాత్తుగా 2002, జులై 1 న వాంతులు, కడుపునొప్పితో బాధపడసాగాడు. ఆమె అతనికి అల్లం టీ ఇచ్చినా కూడా వాంతులు ఆగలేదు. వెంటనే ఆమె అతన్ని సంజీవనీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతనికి గుండెపోటుగా సందేహించారు. అతనికి నొప్పి తగ్గిన తరువాత, ఇసిజి, ఆంజియోగ్రామ్ చేసారు. ఆంజియోగ్రామ్ రిపోర్టులో గుండెకు సంబంధించిన మూడు పెద్దనాడులు మూసుకుపోయాయని వచ్చింది. దానితో వైద్యులు, "గుండెపోటు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా బైపాస్ సర్జరీ చెయ్యాల"ని సూచించారు. దాంతో స్మిత పెద్ద సమస్యలో పడ్డారు. సర్జరీకి రెండు లక్షలు ఖర్చవుతుంది. ఆమె దగ్గర అంత డబ్బులేదు. పైగా ఎక్కడినుంచైనా తీసుకుని రాగలిగే పరిస్థితి కూడా లేదు. అటువంటి నిస్సహాయస్థితిలో ఆమె పరిష్కారం కోసం బాబాని ప్రార్థించి, భారం బాబా మీద వేశారు.
ఆమె భర్త విద్యుత్తు బోర్డు(M.S.E.B)లో ఇంజనీరుగా పనిచేస్తుండేవారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతని సహాయార్ధం అతని మిత్రులు ముందుకొచ్చారు. వారు బోర్డునుండి సగం బిల్లు చెల్లించే విధంగా ఏర్పాటు చేసి, ముంబయి హెడ్ ఆఫీస్ నుండి చెక్కు తెచ్చి ఆసుపత్రిలో అందజేసారు. మిగతా డబ్బు స్మిత తను దాచుకున్న సేవింగ్స్ నుండి, మరికొంత అతని సహచరుల వద్దనుండి సేకరించి మొత్తం బిల్లు చెల్లించారు. వెంటనే సర్జరీకి తేదీ నిర్ధారించారు.
సర్జరీకి ముందురోజు ఆమె తన భర్త మంచం ప్రక్కన కూర్చుని ఉండగా, హఠాత్తుగా అక్కడ బాబా కనిపించారు. ఆయన తన భర్త ఛాతీమీద ఏదో మందు రాసి, చిన్నగా ఒక గుద్దు గుద్ది అదృశ్యమైపోయారు. వెంటనే ఆమె భర్త లేచి, "దేనినో కొడుతున్నారు, ఎవరు?" అని అడిగారు. నిజానికి దేనినో కొడుతున్న శబ్దమైతే వినపడుతుంది కానీ, ఆమెకు ఎవరూ కనపడటం లేదు. ఆవిధంగా బాబా తన భర్తకు చికిత్స చేస్తున్నట్లుగా, సర్జరీ విజయవంతం అవుతుందని సూచిస్తున్నట్లుగా ఆమె భావించింది. అదే నిజమైంది. మరుసటిరోజు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమయ్యింది. వాళ్ళిద్దరూ బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ రీతిన స్మిత భర్త ప్రాణాలను బాబా కాపాడారు.
బాబా భక్తుల కర్మను తీసివేసే విధానం కంటికి కనపడదు, అనుభవిస్తేనే తెలుస్తుంది.

మూలం: శ్రీసాయి సాగర్ పత్రిక, 2007
No comments:
Post a Comment