శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువు ద్వారకసాయి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు: .
2019, ఫిబ్రవరి 10, ఆదివారంనాడు నేను దిల్‌షుక్‌నగర్ బాబా గుడికి వెళ్లాలనుకున్నాను. కానీ అనుకోని కారణాలవలన బాగా ఆలస్యమైపోయింది. దానితో మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి బయలుదేరాను. దారిలో బాబాకు కోవా తీసుకుని వెళ్తూ, "బాబా! నేను వచ్చేవరకు హారతి మొదలుకాకుండా చూడండి" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన మన్నించారు. సరిగ్గా నేను మందిరం గేటు దగ్గరకు రాగానే హారతి మొదలైంది. తరువాత నేను లోపలకి అడుగుపెడుతూనే పూజారి నన్ను చూసి, పరుగున వచ్చి నా చేతిలోని కోవా తీసుకుని బాబాకి నైవేద్యం పెట్టారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, అప్పటికే బాబాకు నైవేద్యం పెట్టి, హారతి మొదలుపెట్టారు. ఇంకో విషయం ఏమిటంటే, నా తరువాత వచ్చిన భక్తులు తెచ్చిన పదార్థాలు కూడా బాబాకు పెట్టారు. కానీ, పూజారి నావద్ద తీసుకున్నంత ఆత్రంగా వాళ్ళవద్ద తీసుకోలేదు. భక్తులు తెచ్చే నైవేద్యం కోసం బాబా ఆత్రంగా ఎదురుచూసి, వాటిని ఎంతో ఇష్టంగా ఆరగించిన సన్నివేశాలు మనకు శ్రీసాయిసచ్చరిత్రలో ఉన్నాయి. అదేవిధంగా బాబా నేను తీసుకుని వెళ్ళిన నైవేద్యాన్ని ఆత్రంగా స్వీకరించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందంలో హారతి పాడుతూ ఉండగా ఆయన చూపిన ప్రేమకు నా కళ్ళనుండి ఆనందభాష్పాలు వచ్చేసాయి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" అని చెప్పుకుని, బయటకి వస్తూనే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఆ ఆనందాన్ని పంచుకున్నాను.
తర్వాత ఇంటికి చేరాక మళ్ళీ మొబైల్‌లో శిరిడీ ప్రత్యక్ష ప్రసారం పెట్టుకుని, శేజారతి చూశాను. ఆరతి పూర్తయ్యేసరికి గం.10:50ని. అయ్యింది. ఆ సమయంలో మా చెల్లి, "అన్నయ్యా, భోజనం చేసేయొచ్చు కదా" అని అంది. నేను కాసేపట్లో ప్రత్యక్ష ప్రసారం ఆగిపోతుంది కదా, తరువాత తిందామనే ఉద్దేశ్యంతో బాబాని చూస్తూ ఉన్నాను. 11గంటలవుతుండగా, సరే, మొబైల్ పక్కన పెట్టుకుని, చూస్తూ భోజనం చేద్దామని కూర్చున్నాను. సాధారణంగా పదకొండు గంటలకి ప్రత్యక్ష ప్రసారం ఆగిపోవాలి. కానీ,11:10 దాటుతున్నా ఆగకపోయేసరికి, "ఏమిటి బాబా! నా భోజనం అయ్యేవరకు ఉంటారా ఏమిటి?" అని అనుకున్నాను. తరువాత ఐదు నిమిషాలకి సమాధిమందిరంలో లైట్లు ఆఫ్ చేస్తుంటే, ఇక ప్రత్యక్ష ప్రసారం ఆగిపోతుందని నేను నా మొబైల్‌లో ఆఫ్ చేయడానికి మొబైల్ తాకబోతుండగా అంతా చీకటిగా అయిపోయి, బాబా విగ్రహం, సమాధి మాత్రం బ్లాక్&వైట్ లోకి మారి ప్రత్యక్ష ప్రసారం అలానే వస్తోంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం స్టక్ అయిందేమోనని సందేహం వచ్చి, రెండు, మూడుసార్లు రిఫ్రెష్ చేసినా కూడా బాబా దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఇక నేను కూడా ఆఫ్ చేయకుండా అలానే చూస్తూ ఉన్నాను. గం.11:30ని. దాటుతుండగా నా మనస్సులో, "బాబా! అక్కడ మీ బిడ్డ ఎవరో ప్రత్యక్ష ప్రసారం ఆఫ్ చేయడం మర్చిపోయినట్లున్నారు. పాపం, అనవసరంగా అతను తిట్లు తింటాడు బాబా" అని అనుకున్నాను. కాసేపటికి ఇక్కడ నా భోజనం పూర్తికావడం, అక్కడ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోవడం రెండూ ఒక్కసారే జరిగాయి. బాబా నాపై చూపిన కరుణకు, ప్రేమకు ఆనందాశ్చర్యాలతో నా కళ్ళనుండి కన్నీళ్లు రాబోయాయి. కాని, మా చెల్లి వాళ్ళు 'ఎందుకు ఏడుస్తున్నావు?' అని అంటారని కంట్రోల్ చేసుకున్నాను. నిజానికి కొన్నిరోజులుగా, "బాబా నా మాటలు వింటున్నారా, లేదా?!" అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఈ రెండు అనుభవాల ద్వారా నా ప్రతి మాట తాను వింటున్నానని బాబా నిదర్శనం ఇచ్చారు.
2019, ఫిబ్రవరి 7, గురువారంనాడు నేను ఆఫీసునుండి తిరిగి వస్తూ బస్సులో కూర్చుని మొబైల్‌లో శిరిడీ ప్రత్యక్ష దర్శనం పెట్టుకుని హారతి చూస్తూ పాడుకుంటున్నాను. ఆశ్చర్యం! హారతి మొదలైన దగ్గరనుండి హారతి ముగిసి, తెరలు వేసి, ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయేవరకు ఊదీ వాసన గుబాళించింది. ఆవిధంగా బాబా నన్ను ఆశీర్వదించారనిపించి సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
కొన్నిరోజుల క్రిందట ఒకసారి నేను షర్ట్ తీసుకుందామని ఒక షాపుకి వెళ్ళాను. అక్కడ నాకు ఒక ఆక్సమ్‌బర్గ్ షర్ట్ బాగా నచ్చి, ధర చూస్తే చాలా ఎక్కువ ఉంది. అంతపెట్టి తీసుకోలేక తిరిగి వచ్చేసాను. ఒక వారం తరువాత వేరే షాపుకి వెళ్ళి షర్ట్స్ వెతుకుతూ ఉంటే, వారం క్రితం ధర ఎక్కువ అని వదిలేసిన షర్ట్ లాంటి షర్టే ఉంది. షాపు అతనిని ధర ఎంతో చెప్పమంటే, "అది నాకోసమని ఉంచుకున్నాను. మీకు అదే నచ్చిందా?" అని అడిగాడు. మళ్ళీ తానే, "సరే, మీకు నచ్చింది కదా, తీసుకోండి" అని చాలా చాలా తక్కువ ధర చెప్పారు. నేను ఆశ్చర్యపోతూ ఆ షర్ట్ తీసేసుకున్నాను. ధర ఎక్కువ అని నేను వదిలేస్తే, బాబా నాకు అతితక్కువ ధరలో ఆ షర్ట్ ఇప్పించారు. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా".

🕉 sai Ram
ReplyDelete