సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 1


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1. సాయిభక్తురాలు చాందిని దొంతుకుర్తి గారి రీసెంట్ అనుభవం:

సాయిబంధువులందరికీ నమస్కారం. నా జీవితంలో ఇటీవల బాబా ఇచ్చిన అద్భుత అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. గత నెలలో నేను తీవ్రమైన సైనస్ సమస్యతో చాలా బాధపడ్డాను. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉండి ముక్కు నుండి తీవ్రంగా రక్తస్రావమయ్యేది. దానితోపాటు జ్వరం కూడా రావడంతో చాలా ఇబ్బందిపడ్డాను. నేను హృదయపూర్వకంగా, "బాబా! నా వ్యాధిని నయం చేసినట్లయితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాన"ని ప్రార్థించి, బాబా ఊదీని ఔషధంగా తీసుకున్నాను. బాబా కృపవలన 3, 4 రోజుల్లో రక్తస్రావం ఆగిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా!". దయచేసి నా అనుభవాన్ని సాయిబంధువులకు అందేలా పబ్లిష్ చేయండి.

2. ఆస్ట్రేలియానుండి ఒక సాయిభక్తురాలు ఇలా చెప్తున్నారు.

ఒకసారి మా బాబుకి రోజుకు 20 కన్నా ఎక్కువసార్లు విరోచనాలు కావడంతో మేము చాలా బాధపడ్డాము. ఎన్నో మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఏమి చేయాలో అర్థంకాని స్థితిలో బాబుని బాబా మందిరానికి తీసుకుని వెళ్ళి, "బాబా! బాబుకి నయం చేయండి" అని ప్రార్థించాను. వెంటనే అద్భుతం జరిగింది. అంతవరకూ ఎన్ని మందులకూ తగ్గనిది ఆ క్షణంనుండి సాయి ఆశీస్సులతో పూర్తిగా మాయమైపోయింది. "ధన్యవాదాలు బాబా!".


3. బెంగళూరునుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు..

ఓం సాయిరామ్! బాబాతో నా అనుభవాన్ని పంచుకోవడానికి ముందు, సాయిభక్తుల అనుభవాలను పంచుకునేందుకు బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను బెంగుళూరు నివాసిని. ఇటీవల నా భర్త కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజూ మేము వైద్యుల వెనుక తిరుగుతుండేవాళ్ళము. కానీ ఎటువంటి ఫలితం లేకపోయేది. నేను చాలా ఆందోళనపడుతూ, "బాబా! మా వారి ఆరోగ్య సమస్యలన్నింటినీ పరిష్కరించండ"ని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నవ గురువార వ్రతం కూడా మొదలుపెట్టాను. చివరగా మేము ఒక వైద్యుని కలవడానికి వెళ్ళాము. OPD (అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశిస్తుండగా, ఒక వ్యక్తి బాబా ఫోటో ఉన్న బ్యాగు పట్టుకొని వెళ్తుండటం నేను గమనించాను. దానితో నాకు బాబా దయవలన మేము సరైన వైద్యుడి దగ్గరకు చేరుకున్నామని నమ్మకం కలిగి, అన్ని రోజులుగా మేము పడుతున్న ఆందోళననుండి కాస్త ఉపశమనంగా అనిపించింది. అప్పటినుండి మావారి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. "బాబా! మీకు నా ధన్యవాదాలు. మంచి నడవడి గల వ్యక్తులుగా ఉండటానికి మాకు మార్గనిర్దేశం చేయండి. మీ బిడ్డలందరికీ మీ చల్లని దీవెనలు ఇవ్వండి".

4. పాకిస్తాన్ నుండి శిరిడీ సాయిభక్తురాలు సురియా తన అనుభవాన్నిలా చెప్తున్నారు..

నేను పాకిస్తాన్ లోని కరాచీలో నివసిస్తున్నాను. నేను సాయిబాబాకు అంకిత భక్తురాలిని. ప్రస్తుతం నాకు 84 సంవత్సరాలు. నేను ముగ్గురు పిల్లలకు తల్లిని. బాబా దయవలన అమ్మమ్మని కూడా. అయితే నేను టీచర్‌గా ఉద్యోగం చేసి, ఉద్యోగ విరమణ అనంతరం ఒంటరిగా జీవిస్తున్నాను. ఒకరోజు నా ఎడమచేతి బొటనవేలుకి, అరచేతికి తీవ్రమైన నొప్పి, బాధ కలిగాయి. ఆ నొప్పిని అస్సలు భరించలేకపోయాను. నా కూతురు డాక్టరు వద్దకు తీసుకునిపోయి x-ray తీయిద్దామని అనుకుంది. కానీ నేను, "నా డాక్టరు సాయి. నేనెక్కడికీ రాన"ని తనకి చెప్పాను. నేను పడుకోవడానికి వెళ్లేముందు బాబా పటం ముందు ఉన్న కొంత బూడిద తీసుకుని, బాబాను ధ్యానించుకొన్న తరువాత దానిని బామ్‌ లో కలిపి, నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసి, కట్టు కట్టుకొని నిద్రపోయాను. ఉదయాన కట్టు విప్పేసరికి నొప్పి పూర్తిగా పోయింది. ఆయన నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. బాబా! మీ దివ్య పాదాల చెంత నాకు సదా చోటివ్వండి".
-మీ సురియా.

2 comments:

  1. సాయి మంచి నడవడి గల వ్యక్తులుగా ఉండటానికి మాకు మార్గనిర్దేశం చేయండి.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo