సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా అనుగ్రహం విశ్వమంతటా వ్యాపించి, ఎక్కడ ఉన్నా తన బిడ్డలను రక్షిస్తుంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1982 అక్టోబర్ 8న, డోంగర్ జీ(జానీ), అతని అల్లుడు వార్ధా నుంచి రాజస్థాన్‌ లోని బస్వాడాకు వెళ్తున్నారు. వాళ్ళు రైలులో రత్లామ్ వరకు ప్రయాణించి, అక్కడనుంచి బస్సులో బస్వాడా వెళ్లాలని బస్ స్టేషన్‌కి వెళ్ళారు. వాళ్ళు బస్సు ఎక్కే సమయానికి ఇద్దరు ప్రయాణీకులు తప్ప బస్సంతా ఖాళీగా ఉంది. అందువల్ల ఇద్దరూ ఒక్కో సీటులో కూర్చున్నారు. బస్సు కదిలే సమయానికి 15 మంది ప్రయాణీకులు పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా బస్సు ఎక్కారు. వాళ్ళు జానీని, "దయచేసి మీరిద్దరు వెనకాల కూర్చుంటారా? మేమంతా ఒకే కుటుంబం వాళ్ళం, కాబట్టి అందరం కలసి కూర్చోవాలని అనుకుంటున్నాము" అని అభ్యర్థించారు. జానీ అందుకు అంగీకరించి, తన అల్లుడితో పాటు బస్సులో వెనుకకు వెళ్లి కూర్చున్నారు.

బస్సు ముందుకుసాగుతూ, హైవే మీదకు వెళ్ళగానే వేగం అందుకుంది. రాత్రి 9 గంటల సమయంలో బస్సు ఒక గ్రామం గుండా వెళ్తూ, మధ్యలో ఉన్న వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. ప్రయాణీకులందరికీ ఏం జరిగిందో అర్థమయ్యేలోపు బస్సు వంతెననుంచి 15 అడుగుల లోతులోకి పడిపోయింది. ప్రయాణీకులందరూ ఆర్తనాదాలు చేసారు. అయితే జానీ, అతని అల్లుడు మాత్రం సహాయం కోసం బాబాని ప్రార్థించారు. తరువాత గ్రామస్థులు, పోలీసులు కలిసి బస్సును బయటకు లాగి, ప్రయాణీకులందరినీ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. జానీకి, అతని అల్లుడికి ఎటువంటి దెబ్బలు తగలని కారణంగా వెంటనే డిశ్చార్జ్ చేసారు. మరునాడు వార్తాపత్రికలో వీళ్లిద్దరు తప్ప మిగతా ప్రయాణీకులంతా చనిపోయారని చదివి జానీ నిర్ఘాంతపోయాడు. వెంటనే మనస్సులోనే, ప్రయాణీకుల అభ్యర్థనను మన్నించి బస్సులో వెనుక సీటుకు వెళ్ళే విధంగా చేసి తమ ప్రాణాలు కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బాబా అనుగ్రహం విశ్వమంతటా వ్యాపించి, ఎక్కడ ఉన్నా తన బిడ్డలను రక్షిస్తుంది.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక 1993 (దీపావళి సంచిక).

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo