శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.
సమస్యల వలన దిగులుగా ఉన్నప్పుడు సాయిపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ బ్లాగు ఎంతగానో ఉపకరిస్తుంది. బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు.
నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. అయితే ఒకసారి మూడునెలల పాటు మా డిపార్టుమెంటుకి పెద్దగా వర్కు లేదు. ఆ సమయంలో హఠాత్తుగా ఒకరోజు మా మేనేజరు, "ఈ డిపార్టుమెంటులో వర్క్ లేదు, వేరే డిపార్టుమెంటులో ఎక్కువ వర్క్ ఉంది. కాబట్టి అందులోకి మారండి" అని చెప్పారు. కానీ, ఆ డిపార్టుమెంటులో పని చేయడం అంత సులువేం కాదు. పైగా నేనొకవేళ ఆ డిపార్టుమెంటులోకి మారితే ఇంటి పనులు, ఆఫీసు పనులు రెండూ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇంకా ఆ డిపార్టుమెంటులో ఉండే వర్క్‌లో నాకెటువంటి అనుభవం లేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఈ ఆలోచనలతో బుర్రంతా పిచ్చెక్కినట్లయింది. నేను మా మేనేజరుతో, "వేరే ఉద్యోగం చూసుకోవడానికి రెండు నెలల సమయం కావాలి" అని అడిగాను. అందుకాయన, ఒక నెల మాత్రం ఇవ్వగలనని చెప్పారు. "సరే సార్! చాలా థాంక్స్" అని చెప్పి నేను బయటకు వచ్చాను. కానీ నెల గడుస్తున్నా ఉద్యోగ అవకాశం ఏదీ రాలేదు. చాలా ఇంటర్వ్యూలకి హాజరైనా ఏ ఉపయోగం లేకుండా పోయింది. నేను, "బాబా! మీరే నాకున్న ఆశ. నేనింక తట్టుకోలేను, నన్ను పరీక్షించకండి. దయచేసి నాకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి" అని ప్రార్థించాను. నేను ఎప్పుడూ ప్రోడక్ట్ ఆధారిత కంపెనీలోనే పని చేసి ఉన్నందువలన, అదే ఫీల్డ్‌లో ఉద్యోగం రావాలని నాకు ఆశగా ఉండేది. 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్' లో బాబాని అడిగిన ప్రతిసారీ అనుకూలమైన సమాధానాలే వచ్చేవి. ఇలా ఉండగా ఒకరోజు నేను బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, ఒక భక్తురాలు తన అనుభవంలో 'సప్తాహ పారాయణం' చేసిన 15 రోజుల్లో తనకి ఉద్యోగం వచ్చినట్టు వ్రాసారు. ఆ అనుభవం ద్వారా బాబా నన్ను కూడా సప్తాహ పారాయణం చేయమని సూచిస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే నేను ఆలస్యం చేయకుండా గురువారం నుండి పారాయణ మొదలుపెట్టాను. వెంటనే అద్భుతం మొదలైంది. పారాయణ మొదలుపెట్టిన రెండోరోజు రాత్రి 7:30కి మరుసటిరోజు ఇంటర్వ్యూ ఉందని కాల్ లెటర్ వచ్చింది. ఆరోజు నన్ను ఇంటర్వ్యూ చేసే గదిలో బాబా ఫోటో దర్శనమిచ్చింది. దాంతో, "బాబా నాతో ఉన్నారు. ఇక దిగులుపడాల్సిన అవసరం లేద"ని నాకెంతో ధైర్యం వచ్చింది. తరువాత మూడు రౌండ్ల ఇంటర్వ్యూ బాగా జరిగింది.
తరువాత ఒకరోజు నాకొక కల వచ్చింది. కలలో నేను కూర్చుని ఉద్యోగం గురించి ఆందోళన పడుతున్నాను. అంతలో బాబా వచ్చి, "నేనుండగా, నువ్వెందుకు దిగులుపడుతున్నావు?" అని అన్నారు. ఆ మాటలు నాకెంతో సంతోషాన్నివ్వడంతో ఆందోళనపడటం మానుకున్నాను. అంతటితో కల ముగిసింది.
సరిగ్గా ఇంటర్వ్యూ జరిగిన వారంరోజుల తరువాత నేను సెలెక్ట్ అయినట్లు కంపెనీ వాళ్ళు తెలియజేసారు. నేను కోరుకున్న విధంగా బాబా నాకు యం.యన్.సి. ప్రోడక్ట్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. "థాంక్యూ బాబా! కృతజ్ఞత తెలుపుకోవడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. బాబా! నా చిన్న చిన్న సమస్యలు మీకు తెలుసు. దయచేసి నాకు తోడుగా ఉండి వాటిని పరిష్కరించండి. నా ఒకేఒక కోరిక - నిత్యం మీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి." బాబా ఎప్పుడూ తన బిడ్డలను విడిచిపెట్టరు. సాయి నామస్మరణ చేస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది.

🕉 sai Ram
ReplyDeleteఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏నా ఒక కోరిక - నిత్యం మీ నామస్మరణ చేసుకుంటూ మీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించండి తండ్రీ!!!!." బాబా నీవే నాకు దిక్కు 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏