శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సింగపూర్ నుండి పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
మొదటి అనుభవం:
మేము యు.కే. లో ఉన్నప్పుడు మా రెండవ బాబు పుట్టే సమయంలో నాకు చాలా ఆరోగ్యసమస్యలు ఎదురయ్యాయి. దానికి తోడు పుట్టుకతోనే బాబుకి పలురకాల అలర్జీ సమస్యలు. నాకున్న సమస్యలకి, వాడి సమస్యకి అసలు కుదిరేది కాదు. వాడికి ఏ ఫుడ్ పడుతుందో, ఏది పడదో అస్సలు అర్థంకాక, తనకి ఫుడ్ ఇవ్వాల్సిన ప్రతిసారీ చాలా ఆందోళనగా ఉండేది. ఈ ఆందోళనల వలన నా ఆరోగ్యం ఇంకా దెబ్బతింది. దానివలన నాకు చాలా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. నేను రోజూ బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొద్దిరోజుల్లో బాబా కృపవలన తన అలర్జీకి ఏవి కారణం అవుతున్నాయో తెలియడంతో నిదానంగా పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటికీ తనకి పాల ఉత్పత్తులు, గోధుమలు, గుడ్లు, వేరుశనగ వంటి గింజలు పడవు. పొరపాటున ఏమాత్రం ఆ పదార్థాలు తనకి అందుబాటులో ఉన్నా చాలా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ సమస్య ముందు మృత్యువు చాలా చిన్నది అనిపిస్తుంది. కానీ నాకు బాబాపట్ల పూర్తి విశ్వాసముంది. ఆయన త్వరలోనే నా బిడ్డని ఈ సమస్యలనుంచి బయటపడేస్తారు.
రెండవ అనుభవం:
క్రమంగా నేను డెలివరీ సమస్యలనుండి బయటపడుతూ సంతోషించే సమయంలో, మేము యు.కే. నుండి సింగపూర్‌కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ పెద్ద సమస్య ఎదురైంది. ఒకరోజు మా పెద్దబాబు ముఖంపై తెల్లమచ్చ కనిపించింది. ఆ సమయంలో దానిని నేనంత పెద్ద విషయంగా తీసుకోలేదు. ఎందుకంటే, మావారు ఎలాగూ డాక్టర్ కాబట్టి ఆయన చూసుకుంటారనుకున్నాను. కానీ, మా దురదృష్టంకొద్దీ అది బొల్లిమచ్చగా నిర్ధారణ అయ్యింది. ఆ వార్త వింటూనే నేను షాకై కుప్పకూలిపోయాను. ఎందుకంటే మా పెద్దబాబే మా కుటుంబంలోని సంతోషానికి కారణం. తనకేమైనా అయితే మా జీవితాలు అంధకారమే. దిగులుతో నేను పూర్తిగా బాబాకి శరణని, "బాబా! ఆ మచ్చ ఇంకా పెద్దది కాకుండా చూడండ"ని ప్రార్థించాను. కానీ తనకి నయమైపోతుందని డాక్టర్స్ ఎవరూ నిర్ధారణగా చెప్పలేదు. అదే సమయంలో బాబా మమ్మల్ని శిరిడీకి తీసుకుని వెళ్లి, ఆ మచ్చ ఇంకా పెద్దది కాకుండా, పూర్తిగా నయమైపోయేలా చూస్తానని నమ్మకం కలిగించారు. నేను శిరిడీ వెళ్లేముందు, "బాబా! మీరు నాకు గ్రీన్ కలర్ డ్రెస్‌లో దర్శనమిస్తే, అది నా బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకుంటానని మీరు ఇచ్చే భరోసాగా తీసుకుంటాను" అని ప్రార్థించాను. తర్వాత మేము శిరిడీ చేరుకొని దర్శనానికి క్యూలో ఉన్నప్పుడు టీవీలో చూస్తే బాబా రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్నారు. కాస్త బాధగా అనిపించినా, బాబాపై పూర్తి విశ్వాసంతో, "శిరిడీనుంచి మేము తిరిగి వెళ్లిపోయేలోపల ఖచ్చితంగా బాబా మిరాకిల్ చూపిస్తార"ని నా మనస్సులో నేను అనుకున్నాను. అప్పటికింకా మధ్యాహ్న ఆరతికి పదినిమిషాలు టైం ఉంది. ఐదు నిమిషాల తరువాత టీవీలో చూస్తే, సమాధిమందిరంలోని పూజారి బాబా కోసం కొత్త బట్టలు తీసుకుని వెళ్తూ కన్పించారు. కొద్దిక్షణాల్లో మేము సమాధిమందిరంలో అడుగుపెట్టాము. అద్భుతం! సాయి పూర్తిగా గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఉన్నారు. అలా బాబాని చూస్తూనే నా కళ్ళలో నీళ్ళు వరదలా తన్నుకొచ్చేసాయి. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలా బాబా నాకు పూర్తి భరోసా కలిగించారు. తర్వాత మేము శిరిడీనుండి సింగపూర్ చేరుకున్నాం. అతికొద్దిరోజుల్లోనే బాబా కృపవలన ఆ మచ్చలు పూర్తిగా మానిపోయాయి. "ఈ ద్వారకామాయిలో కూర్చొని నేనెప్పుడూ అబద్ధం చెప్పన"ని బాబా చెప్పిన మాటలు ఎంత సత్యమో! అలనాడు శ్యామాను పాము కరిచిన సందర్భంలో విషం అతని శరీరంలో విస్తరించకుండా బాబా ఆజ్ఞాపించినట్లుగా, నా బిడ్డ విషయంలో కూడా బహుశా అలాగే ఆజ్ఞాపించి నా బిడ్డను కాపాడారు.
మూడవ అనుభవం:
ఒకసారి మావారికి బహుమతిగా వచ్చిన ఖరీదైన ఆపిల్ వాచ్ కనిపించలేదు. మేమంతా ఇంట్లో ఎంతగా వెతికినా ఎక్కడా కనిపించలేదు. నేను బాబాని ప్రార్థించిన మరుక్షణంలో సూట్‌కేస్ వెనకాల దొరికింది.
మన సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా బాబాపై పూర్తి విశ్వాసం ఉంచండి, ఆయన మన ప్రార్థనలకు తప్పక సమాధానం ఇస్తారు. "బాబా! నా జీవితంలో మీరు కురిపిస్తున్న ఆశీస్సులకు నా ధన్యవాదములు. ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి".

🕉 sai Ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ReplyDelete🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Om Sairam 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ReplyDelete