ఈ భాగంలో అనుభవం:
- శ్రీసాయి అనుగ్రహ వీచికలు
నేను ఒక సాయి భక్తుడిని. ఒకసారి గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి ఎక్కువై నాకు మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయింది. అప్పుడు నేను బాబా ఊదీ నోట్లో వేసుకొని, "బాబా! ఈ సమస్యని తొందరగా తగ్గించు తండ్రి. నేను ఇద్దరికి అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల రెండు, మూడు రోజుల్లో సమస్య చాలావరకు తగ్గింది.
ఒకసారి నేను పని మీద వేరే ఊరు వెళ్ళినపుడు ఇంట్లో ఉన్న మా బాబుకి విరోచనాలు మొదలయ్యాయి. మరుసటిరోజు నేను వచ్చాక విషయం నా భార్య నాతో చెప్పింది. నేను వెంటనే మా రైల్వే డాక్టరుకి కాల్ చేసి, ఆయన చెప్పిన మందులు వాడటం మొదలుపెట్టాను. వాటితోపాటు బాబా ఊదీ బాబు నుదుటన పెట్టి, కొంచం నోట్లో వేసి, "బాబా! బాబుకొచ్చిన ఈ సమస్య తగ్గితే మందిరంలో పాలకోవా సమర్పించుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఒక్క రోజులో బాబుకి నయం అయింది.
ఇంకోసారి బాబుకి జలుబు బాగా ఎక్కువై ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. సరిగా తినేవాడు కాదు, పాలు తాగలేకపోయాడు. రెండు రాత్రులైతే ముక్కు దిబ్బడ వల్ల నిద్రపోలేక రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, "బాబా! బాబుకి త్వరగా నయమయ్యేలా చూడు తండ్రీ" అని ప్రార్థించి కొద్దిగా ఊదీ తన నోట్లో వేసి, నుదుటన కూడా పెట్టాను. ఇంకా 'బాబుకి నయమై ఆరోగ్యంగా ఉంటే ముగ్గురికి అన్నదానం చేస్తాన'ని అనుకొని మందులు వాడాను. బాబా దయ చూపారు. బాబుకి నెమ్మదిగా నయమవ్వడం మొదలై పూర్తిగా కోలుకున్నాడు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం అన్నదానం చేసి, పాలకోవా మందిరంలో బాబాకి నివేదించి భక్తులకి పంచాము.
మా అమ్మానాన్నలు అపార్ధాలతో మాతో గొడవలుప డుతూ కొంతకాలం మాట్లాడడం మానేశారు. నా భార్య రెండోసారి గర్భవతి అవ్వడంతో అమ్మానాన్నలని మా ఇంటికి పిలిచాము. వాళ్ళు చూస్తామన్నారు కానీ, ఎప్పుడు వస్తారో చెప్పలేదు. తర్వాత ఒకరోజు ఉదయం 6:30కి హఠాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే, 'ఎవరా!' అని చూసేసరికి ఎదురుగా మా అమ్మ, నాన్నలు ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఆనందమేసినప్పటికీ దాంతోపాటు 'ఏ గొడవపడతారో' అని భయం కూడా వేసింది. నేను, "బాబా! ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. వాళ్ళు ఉన్నంతవరకు నాకు ఎటువంటి అత్యవసర విధులు పడకుండా చూడండి. ఒకరికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అంతా బాగానే గడిచింది.
నా భార్య ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అనోమోలీ స్కాన్‌కోసం స్కానింగ్ సెంటర్‌కి వెళ్ళాం. చాలా సమయం తర్వాత నా భార్యను పిలిచి స్కాన్ చేశారు కానీ, బిడ్డ పొజిషన్‌లో లేదని కొంతసేపు బయట తిరిగి మళ్ళీ రమ్మన్నారు. సరేనని, వాళ్ళు చెప్పినట్లు చేసి వెళితే, మళ్ళీ అదే సమస్య వచ్చింది. మరోసారి బయటకి వెళ్లి తిరిగి వచ్చినా కూడా అదేవిధంగా పొజిషన్‌లో లేదని తిరిగి పంపారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా భార్య తన ఆఫీసుకి వెళ్ళింది. గంట తర్వాత మళ్ళీ మేము స్కానింగ్ సెంటర్‌కి వెళ్ళాము. నేను 'బాబా'ని తలుచుకొని, 'ఓం శ్రీసాయి సులభదుర్లభాయ నమః', 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'శ్రీసాయి అసహాయసహాయాయ నమః' అని స్మరిస్తూ, 'స్కానింగ్ బాగా వస్తే, ఇద్దరికి అన్నదానం చేస్తాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఈసారి బిడ్డ పొజిషన్‌లో ఉండటంతో స్కానింగ్ బాగా వచ్చింది. అదేరోజు రాత్రి డాక్టర్‌కి రిపోర్ట్ చూపిస్తే, "అంతా బాగానే ఉంది" అని అన్నారు. అంతా సాయి ఆశీర్వాదం. బాబాకి చెప్పుకున్నట్టు గురువారంనాడు ఐదుగురికి అన్నదానం చేశాను. "ధన్యవాదాలు బాబా. మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా అనుగ్రహించండి".
ఇంకోసారి ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ చెక్ చేసి "బిడ్డ కదలిక తెలియట్లేదు బీపీ డౌన్ అయింది. వెంటనే అడ్మిట్ అవ్వాలి" అని అన్నారు. మేము కాస్త టెన్షన్ పడ్డాం కానీ, 'బాబా ఉన్నార'న్న ధైర్యంతో నా భార్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసి, "బాబా! నా భార్య బీపీ నార్మలై బిడ్డ కదిలికలు తెలిసేటట్లైతే మీ మందిరంలో పాలకోవా సమర్పించుకుంటాను" అని అనుకున్నాను. నా భార్యకి రెండు సలైన్లు ఎక్కించారు. ఆ రోజు రాత్రి నా భార్య బీపీ నార్మల్ అయింది. అప్పుడు చెక్ చేస్తే బిడ్డ కదలికలు తెలిసాయి. దాంతో బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. "ధన్యవాదాలు బాబా".
మరోసారి నా భార్యకి నడుంనొప్పి బాగా వచ్చింది. రెండోరోజుకి కూడా తగ్గకపోవడంతో ఉదయం తనని హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశాను. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడంతో సిస్టర్ ఇంజెక్షన్ వేసింది. డాక్టర్ ఫోన్లో మాట్లాడి మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో ఉండమన్నారు. నేను వెంటనే, "బాబా! మధ్యాహ్నం వరకు నా భార్యకు తగ్గితే ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత డాక్టర్ చెక్ చేసి తగ్గిందని చెప్పి జెల్ వ్రాసి ఇచ్చారు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి అన్నదానం చేసి ఈ అనుభవాన్ని ఆధునిక సచ్చరిత్ర అని పిలువబడే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఇలా పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా అనుగ్రహించండి".
Baba, bless my children and fulfill their wishes in education. Baba, please join my daughter in govt Siddharth medical college vijayawada in PG obstetrics and gynocology branch and give Phd degree to my son.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteOm sai ram, anta bagunde la chayandi tandri, amma nannalani kshamam ga chudukondi tandri vaalla badyata meede tandri, vaallaki naaku manchi arogyanni prasadinchandi tandri pls, ofce lo anta bagunde la chayandi tandri pls.
ReplyDeleteOm sai ram, anta bagunde la chayandi tandri, amma nannalani kshamam ga chusukondi tandri vaalla badyata meede tandri, vaallaki naaku manchi arogyanni prasadinchandi tandri pls, ofce lo anta bagunde la chayandi tandri pls.
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeletebaba madava lo, maa varilo, maa attagarilo maarpu ravali baba.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDelete