సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1887వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి చెప్పుకున్నాక సమసిపోయిన సమస్యలు
2. అడగటమే ఆలస్యం - అనుగ్రహించే బాబా

       3. అడిగినంతనే దయతో ఇల్లు అద్దెకు చూపించిన బాబా 


బాబాకి చెప్పుకున్నాక సమసిపోయిన సమస్యలు

సాయి కుటుంబీకులకు నా నమస్కారం. నా పేరు కిషోర్. నేను ఈ బ్లాగులో అనుభవాలు చదువుతూ రోజూ ఆనందభరితుడనవుతున్నాను. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు జరిగిన కొన్ని అనుభవాలు తోటి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. 2024, జనవరి 1న నేను ప్రతి గురువారం సాయి దివ్యపూజ చేయాలని తీర్మానం చేసుకున్నాను. తర్వాత ఏ కోరిక కోరకుండా ముడుపుకట్టి ప్రతి గురువారం క్రమం తప్పకుండా సాయి దివ్యపూజ చేయనారంభించాను. ఇలా ఉండగా ఫిబ్రవరి నెలలో నా నోట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. మందులు అధికంగా వాడటం వల్ల నోటిలో విపరీతమైన ఎలర్జీ రియాక్షన్ జరిగి నోరంతా తీవ్రమైన మంటగా ఉండేది. నిజానికి మంట అన్నది చాలా చిన్న పదం. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లినా వాళ్ళు నా బాధ అర్థం చేసుకోలేదు. అంతా బాగుందని, మందులు ఇస్తుండేవారు. అవి వాడితే పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. వృత్తిరీత్యా టీచరునైనా నేను ఆ సమస్య కారణంగా కాలేజీలో పాఠాలు చెప్పలేకపోయేవాడిని. సాయి దివ్యపూజ పుస్తకం చదవలేకపోయేవాడిని. ఇంచుమించు మూడు నెలలు ఆ నొప్పిని భరించాక ఇంకా భరించలేక ఒకరోజు.సాయిబాబాకు కట్టిన ముడుపు పట్టుకొని, "బాబా! నేను దివ్యపూజ మొదలుపెట్టిన రోజున ఏ కోరిక కోరలేదు. ఇదిగో ఇప్పుడు కోరుకుంటున్నాను. నా నోటిలో ఎలర్జీ తగ్గిపోయేలా చూడండి. శిరిడీ వస్తాన"ని మొక్కుకొని వీలున్నప్పుడు బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగుతుండేవాడిని. అలాగే హోమియో మందులు కూడా వాడుతుండేవాడిని. సుమారు నాలుగు నెలల తర్వాత నాకు ఆ సమస్య నుండి ఉపశమనం లభించింది. బాబా దయవల్ల నా పరిస్థితి మెరుగుపడింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఈమధ్య మా మామయ్యకి ఆపరేషన్ చేసి కడుపులో నుండి ఒక కణితి తీసి, దానిని బియోప్సీ టెస్టుకి పంపించారు. మా కుటుంబమంతా చాలా టెన్షన్ పడి, "బాబా! ఎటువంటి క్యాన్సర్ ఉండకూడద"ని ప్రార్థించాము. బాబా దయవల్ల రిపోర్టులో కాన్సర్ లక్షణాలు ఏమీ లేవని వచ్చింది. ఇంకోరోజు నేను టవల్ దులిపినప్పుడు ఆ టవల్ చివరి భాగం నా కన్నుకు బలంగా తాకింది. వెంటనే కన్ను వాచిపోయి, కన్ను నుంచి నీరు కారడం జరిగింది. వాపు వలన నేను కన్ను తెరవలేకపోయాను. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, కన్ను బాధ తగ్గించమని చెప్పుకున్నాను. బాబా దయవల్ల కన్ను నెమ్మదిగా నయమైంది. "వేలవేల కృతఙ్ఞతలు బాబా. మీ యందు మనస్సు కేంద్రీకరించేలా, రోజురోజుకు భక్తి పెరిగేలాగా ఆశీర్వదించండి. మీ కృప అనంతకోటి జీవరాశుల మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ". ఓపికగా నా అనుభవాలు చదివిన ప్రతి సాయి భక్తుడికి కృతజ్ఞతలు.

సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

అడగటమే ఆలస్యం - అనుగ్రహించే బాబా

నా పేరు వసంతకుమార్ రెడ్డి. మాకు రెండు పోర్షన్లు ఉన్న ఇల్లు ఉంది. వాటిలో ఏదో ఒక పోర్షన్ గత 5, 6 సంవత్సరాలుగా ఎప్పుడూ ఖాళీగా ఉంటూ ఉండేది. 2024, జనవరిలో రెండోది కూడా ఖాళీ అయింది. అప్పుడు వాటికి అవసరమైన మరమ్మత్తులు చేయించి, పెయింటింగ్స్ వేయించి అద్దెకు ఇవ్వడానికి సిద్ధం చేశాము. కానీ రెండు నెలలపాటు అవి ఖాళీగా ఉండిపోయాయి. అప్పుడు ఈ బ్లాగులోని  ఒకరి అనుభవం చదివి, 'ఒక్క పోర్షన్లో అయిన వారం రోజుల్లో ఎవరైనా అద్దెకు దిగితే, బాబా హుండీలో 101 రూపాయలు సమర్పించుకుంటానని, అలాగే అన్నప్రసాదంకి సమర్పించుకుంటానని' బాబాకి మొక్కుకున్నాను. అద్భుతంగా మర్నాడే ఒక అతను ఫోను చేసి, అడ్వాన్స్ ఇచ్చాడు. మరుసటిరోజున నేను సాయి మందిరానికి వెళ్లి 101 రూపాయలు హుండీలో వేసి, 501 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించి వచ్చాను. మనిషికి ఆశ ఎక్కువ కదా! వెంటనే రెండో పోర్షన్ కోసం బాబాకి విన్నవించుకున్నాను. కానీ వెంటనే ఆ పోర్షన్‌లోకి ఎవరూ రాలేదు. అప్పుడు నేను, 'జ్యేష్ఠమాసం పూర్తి కాబోతోంది, ఆషాఢం మొదలైతే ఇంకో నెల ఖాళీగా ఉండాల్సి వస్తుంది స్వామి' అని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల 2024, జూలై 3న రెండో ఇంట్లోకి కూడా అద్దెకు దిగారు. గురువారంనాడు సాయి మందిరానికి వెళ్లి 101 రూపాయలు హుండీలో వేసి, 501 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించి వచ్చాను.

మా వదిన గ్రామంలో ఉంటారు. ఆవిడ కాలికి పుండయితే, ఎవరో చెప్పారని ఏదో ఆకుతో కట్టు కట్టారు. ఆ పుండు తగ్గలేదు సరికదా కాలు బాగా వాచిపోయింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిన అవసరముందని 2024, జూలై 15న హాస్పిటల్లో చేర్చుకున్నారు. కానీ మర్నాడు అంతా కూడా ఆపరేషన్ చేయలేదు. దూర ప్రాంతంలో ఉన్న మాకు ఏం చేయడానికి తోచక రాత్రి 11 గంటల వరకు 'ఓం సాయిరాం' అని సాయి నామం తలచుకుంటూ, "దయచూపు తండ్రీ" అని వేడుకొన్నాను. మరునాడు పొద్దున్న 'రాత్రి 12.00 గంటలకు ఆపరేషన్ జరిగిందని, అంతా బాగా బాగుందని' మాకు తెలిసింది. నిజంగా బాబా అద్భుతం చేశారు. అత్యవసర పరిస్థితి కాని కేసు విషయంలో అర్దరాత్రి ఆపరేషన్ జరిగిందని వినడం నేను ఇదే మొదటిసారి. "ధన్యవాదాలు బాబా. ఆవిడ త్వరగా కోలుకొని తన కొడుకు, కోడలితో కలిసి ఉండేటట్లు అనుగ్రహించు తండ్రీ. నా పరిస్థితులు మీకు తెలుసు. వాటినుండి తొందరగా బయటపడేసి మనశ్శాంతితో ఉండేలా అనుగ్రహించు తండ్రీ. మీ నామస్మరణ నా మనస్సులో, నా నాలుకపై సర్వదా సర్వకాల సర్వావస్థలయందు జరిగేటట్టు అనుగ్రహించు తండ్రీ".


18 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐

    ReplyDelete
  4. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  5. Om sai ram 🙏🙏🙏

    ReplyDelete
  6. Please for give me 🙏

    ReplyDelete
  7. Om sai ram, anta bagunde la chesi amma nannalani kshsmam ga chusukondi vaalla badyata meede tandri, vallaki manchi arogyanni prasadinchandi tandri pls, naaku manchi arogyanni prasadinchi na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, ofce lo anta bagunde la chayandi tandri pls.

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. baba madava ki maa varu balance fee 2000/- kadite Rs 101/- dakshina samarpinchukuntanu edina baba mandiram lo, madava lo maarpuni teesuku randi baba

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. ఓమ్ శ్రీ సాయిరామ్..
    🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  12. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu

    ReplyDelete
  13. ఓం సాయిరామ్

    ReplyDelete
  14. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  15. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo