ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి అనుగ్రహమున్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవు
2. బాబా దయ
సాయి అనుగ్రహమున్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవు
నా పేరు సాయి ఈశ్వర్. నా చిన్న వయసులో మా ఊరిలో ప్రతి ఆదివారం సాయినాథుని సత్సంగాలు జరుగుతుండేవి. ఆ సత్సంగంలో సాయినాథుని కథాశ్రవణం, భజనలు, ధ్యానం, ఆయన మహిమలు పంచుకోవడం వంటివి జరుగుతుండేవి. వాటికి మేము హాజరవుతూ ఉండేవాళ్ళము. సాయినాథుని చింతనలో ఆయన కరుణాకటాక్ష వీక్షణాలతో సత్సంగానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కాలం ఆ వారం రోజులు ఆనందంగా గడిచేది. మళ్లీ ఆదివారం జరిగే సత్సంగంతో సాయినాథుని శక్తి రీఛార్జ్ అయ్యేది. నేను నా చిన్ననాటినుండి శ్రీసాయిని ఎటువంటి కోరికలు లేకుండా ఆయనే నాకు సర్వం అనే నిష్కామ భక్తి, ప్రేమలతో ఉండేవాడిని. ఆయనను నేను తలుచుకోకుండా ఒక గంట కూడా గడిచేది కాదు. నా తల్లి కూడా సాయినాథుని పరమ భక్తురాలు. ఆమె ఏ పని చేస్తున్నా నిరంతరం సాయినాథుని పాదాలు, ఆయన యొక్క దివ్యమైన రూపం ధ్యానిస్తుండేవారు. మనం సాయినాథుని నిష్కామ భక్తి, ప్రేమలతో నీవే మాకు దిక్కు, సర్వం అని నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో చేయని మహిమ ఉండదు. ఆయన అనుగ్రహమున్న వారిపై ప్రకృతి నియమాలు కూడా పని చేయవని చెప్పే లీలను నేను ఇప్పుడు పంచుకోబోతున్నాను.
నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు విజయదశమికి ముందు పరీక్షలు పూర్తై సెలవులు ఇచ్చారు. పిల్లలమంతా బస్సులో ఆనందంగా ఎవరింటికి వాళ్ళం తిరుగు ప్రయాణమవుతున్నాము. టీచర్ ఏ పిల్లల ఇల్లు దగ్గరకు వస్తుందో వాళ్ళని బస్సు డోర్ దగ్గర నిలబడమన్నారు. నేను మా ఇల్లు దగ్గరకి రావడంతో బస్సు డోరు వద్దకి వెళ్లి చివరి మెట్టుపై నిల్చున్నాను. ఆరోజు ఎప్పుడూ వచ్చే డ్రైవర్ సెలవు పెట్టడంతో బస్సు నడుపుతున్న కొత్త డ్రైవర్ బస్సు మా ఇంటి దగ్గర ఆపలేదు. ఈలోగా నా వెనక పిల్లల గలాటా వల్ల నేను జారీ కదులుతున్న బస్సులో నుంచి కింద పడిపోయాను. ఆ క్రమంలో నా ఎడమ కాలికున్న బూట్ ఊడిపోయింది. నా కాలు వెళ్లి బస్సు వెనక చక్రాలు వస్తున్న మార్గంలో పడింది. అంతే, బస్సు వెనక చక్రాలు నా ఎడమ కాలు పాదం మీద నుంచి వెళ్ళాయి. అంత పెద్ద బస్సు కాలిపై నుంచి వెళితే కాలికి ఏమీ కాలేదు. కేవలం పాదంపై చర్మం చిన్నగా లేచింది. కనీసం చిన్న బొట్టు రక్తం రావడం గానీ, నొప్పి గానీ లేవు. నా పాదం మాత్రం తిమ్మిరి ఎక్కినట్లుగా అయ్యింది. అయినా నేను వెంటనే లేచి నిల్చొని మిత్రుని సహాయంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయాను. అంత ప్రమాదం జరిగినా నా కాలికి, పాదానికి ఏమీ కాకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఇంటికి వెళ్లిన కాసేపటికి సాఫీగా మామూలుగా నడవగలిగాను. ఇంటిలో విషయం చెప్తే అంగవైకల్యం రాకుండా పెద్ద ప్రమాదం నుంచి ఆ సాయినాథుడు నన్ను రక్షించారని ఆయన అనుగ్రహానికి అందరూ అనందశ్చర్యాలకు లోనయ్యారు.
తర్వాత ఒకసారి నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డుపై నాకు జరిగినట్టే ఒక ఆమె కాలిపై నుంచి బస్సు వెళితే ఆమె కాలు చితికిపోయి ఎముక, కండరాలు అన్నీ బయటకి వచ్చేసాయి. అంబులెన్స్ వచ్చేలోపే నోప్పి భరించలేక ఆమె మరణించింది కూడా. ఆ సంఘటనని చూసినప్పుడు ఆరోజు సాయిబాబా రక్షణ నాపై ఉండి ఉండకపోతే ఆమె కాలు వలే నా కాలు కూడా చితికిపోయి అంగవైకల్యం ఏర్పడుండేది లేకుంటే నా ప్రాణం పోయుండేదనిపించింది. అటువంటి యాక్సిడెంట్లు చూసినప్పుడు, వాటి గురించి విన్నప్పుడు సాయినాథుడు నాకు చేసిన ఉపకారం గుర్తుకు వస్తుంది. ఆయన మనకు చేసే ఉపకారాలకి మనం ఏమిచ్చినా ఆయన ఋణం తీర్చుకోలేము. అందరికీ అన్నీ ఇచ్చే ఆయనకి మనం ఏమి ఇవ్వగలం అసలు? కేవలం నిష్కామంగా, నిష్కల్మషంగా, భక్తి,ప్రేమలతో ఆయనను సేవించడం తప్ప. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలు మన కాలిపై నుంచి వెళితే కాలు చితికిపోవడం ప్రకృతి ధర్మం. కానీ సాయి అనుగ్రహమున్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవని నాకు జరిగిన ఈ సంఘటన ఒక నిదర్శనం.
బాబా దయ
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. మేము ఆరేళ్లపాటు మూడో అంతస్తులోని ఒక ఇంటిలో అద్దెకు ఉన్నాము. ఆ ఇల్లు మాకు బాగా కలిసి వచ్చింది. అయితే ఈమధ్య నాకు మోకాళ్ళ నొప్పులు ఉండటంతో ఇల్లు మారాలా, వద్దా అని చీటీలు వేసి బాబాని అడుగుదామని అనుకున్నాము. అనుకున్నట్లే ఒకరోజు బాబా ముందు చీటీలు వేస్తే, ఇల్లు మారమని వచ్చింది. దాంతో కొత్త అద్దె ఇంటికోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆ క్రమంలో ఒక ఇంటి యజమాని తమ ఇల్లు మాకు అద్దెకి ఇస్తామని అన్నారు. కానీ తరువాత వేరే వాళ్లకి ఇచ్చాను అన్నారు. సరే బాబానే మాకు మార్గనిర్దేశం చేస్తారని నేను అనుకున్నాను. నా భార్య మాత్రం ఆ ఇల్లు మనకే ఇస్తారని నాకనిపిస్తోందని అంటుం డేది. అందుచేత మేము బాబాని, "బాబా! ఆ ఇల్లు మాకు అద్దెకి ఇచ్చేలా చూడు" అని ప్రార్థించాము. బాబా దయవలన మేము కోరుకున్నట్లే ఆ ఇల్లు మాకు అద్దెకి ఇచ్చారు. ఇకపోతే, 2024, జూలైలో నేను నా స్నేహితులతో కలిసి శబరిమల వెళ్లాలని ప్రణాళిక చేశాను. తదనుగుణంగా ఆ రోజు ప్రయాణానికి బయల్దేరాము. అప్పుడు మా పాప, బాబు వెళ్లోద్దని ఏడ్చారు. 'వీళ్లు ఇలా ఏడుస్తున్నారేంటి?' అని నాకు భయమేసి, "బాబా! నా ప్రయాణంలో, శబరిమల కొండ ఎక్కడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి. అలాగే స్వామి దర్శనం బాగా జరిగేటట్టు చూడు తండ్రీ" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అంతా బాగా జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Baba na meeda Daya chupinchandi nannu na kutumbanni meere kapadali. Om Sairam!!
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chusukondi tandri vaalla badyata meede vaallaki naaku manchi arogyanni prasadinchandi tandri pls, ofce lo anta bagunde la chesi e roju anta bagunde la chudandi tandri, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeletebaba madava chedu snehalu cheyakunda chudandi swamy. chandu kutumbaanni aadukondi baba.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sairam
ReplyDeleteOm Sai Ram before Friday we did Vara Lakshmi vratamu.you bless us like mother.But my mood at that time not nice.sorry baba take care of us and family.
ReplyDelete.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai
ReplyDelete