ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా అనుగ్రహధారలు
2. అనుకూలమైన ఉద్యోగం ప్రసాదించిన బాబా
బాబా అనుగ్రహధారలు
నా పేరు దివ్య. బ్లాగులో వచ్చే అనుభవాలు చదవడం వల్ల జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా బాబా ఉన్నారని, సాయం చేస్తారని అనిపిస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా అమ్మవాళ్ళింట్లో ఉండగా జామకాయలు తినాలని చాలా అనిపించడం వల్ల తిన్నాను. అది కొంచెం గట్టిగా ఉంది. పైగా గింజలతో తినడం వల్ల చాలా కడుపునొప్పి వచ్చింది. వెంటనే నేను ఊదీ నీళ్లు తీసుకుని, నొప్పి తగ్గాలని బాబాకి చెప్పుకున్నాను. ఆ రాత్రంతా కూడా నేను బాబాని ప్రార్థిస్తూ గడిపాను. బాబా దయవల్ల తెల్లారేసరికి నొప్పి తగ్గింది. అలానే మరొకరోజు కూడా కారణమేంటో తెలీదుగాని చాలా కడుపునొప్పి వచ్చింది. అప్పుడు కూడా నేను మా అమ్మవాళ్ళింట్లో ఉన్నాను. గర్భవతిగా ఉన్న నా ట్రీట్మెంట్ అంతా హైదరాబాద్‌లో జరుగుతుంది. అందువల్ల ఎలాంటి సమస్య లేకుండా నొప్పి తగ్గాలని బాబాను వేడుకున్నాను. కానీ సాయంత్రం వరకు తగ్గలేదు. అప్పుడు డాక్టర్ని సంప్రదించి మందులతోపాటు ఊదీ నీళ్లు తీసుకుంటే రెండు రోజుల్లో తగ్గిపోయింది.
నేను 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు 2024, జూలై నెల చివరి వారంలో నాకు గొంతు నొప్పి వచ్చింది. ఏది తిన్నా మండటం, పడుకుందామంటే అస్సలు నిద్రపట్టకపోవడం, గొంతులో ఏదో అడ్డం అడ్డుపడుతున్నట్లు ఉండటం జరిగింది. హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టర్ మందులు ఇచ్చారు. ఆ మందులు నాలుగు రోజులు వాడితే తగ్గింది. అయితే 2024, జూలై 30న మళ్ళీ అదే సమస్య మొదలైంది. అప్పుడు నేను రేపు మధ్యాహ్నానికల్లా నొప్పి తగ్గాలని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల నేన్ను కోరుకున్నట్లే మర్నాడు మధ్యాహ్నానికి నొప్పి తగ్గింది.
ఒకసారి మా రెండో అక్కకి అన్నం తిన్న వెంటనే కనీసం పది నిమిషాలు కూడా కాకముందే మళ్ళీ తీవ్రంగా ఆకలి వేయటం, కడుపులో తిప్పటం, వాంతి వస్తున్నట్లు ఉండటం జరిగింది. అక్కకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచాక మా పెద్దక్క, 'ఇలాంటి సమస్యే ఉన్న ఒక భక్తురాలు సమస్య తగ్గితే, బ్లాగులో తమ అనుగ్రహాన్ని పంచుకుంటానని బాబాకి చెప్పుకుంటే సమస్య తగ్గిందట" అని రెండో అక్కతో చెప్పింది. అప్పుడు తను కూడా ఆ భక్తురాలిలానే బాబాని వేడుకొని హాస్పిటల్‌కి వెళ్ళింది. బాబా దయవల్ల కొన్ని రోజులకు సమస్య తగ్గింది. "థాంక్యూ బాబా. పిచ్చి ఆలోచనలు, మానసిక భయాలు చాలా ఎక్కువవుతున్నాయి బాబా. దయచేసి నన్ను కాపాడండి. నాకున్న గుండె సమస్య వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా కాన్పు సాఫీగా అవ్వాలి తండ్రీ. అలాగే బిడ్డకు అనారోగ్య సమస్యలు లేకుండా చూడండి బాబా".
అనుకూలమైన ఉద్యోగం ప్రసాదించిన బాబా
నా పేరు సత్యసాయి. 2023, దసరా పండుగ తర్వాత నాకు మా ఆఫీసు నుంచి ఒక మెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, లే ఆఫ్ కారణంగా నా ఉద్యోగం పోయిందని. అక్కడికి మరో 50 రోజుల్లో నా పెళ్లి ఉన్నందున బాబా లీల ఏంటో తెలియని నేను 'ఇలాంటి సమయంలో ఇలా అయ్యిందేంటి?' అని చాలా బాధపడ్డాను. అదేరోజు రాత్రి బాబా నాకు కలలో కనిపించి, "రేపటినుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతిరోజూ శివాలయంకి వెళ్లి పూజ చేసి రా. అలానే ప్రతిరోజూ హనుమాన్ గుడికి కూడా వెళ్ళు. ఇంకా నా ప్రయత్నాలు నువ్వు చేయి" అని చెప్పారు. నేను నిద్రలేచి అమ్మకి బాబా చెప్పింది చెప్పాను. ఆమె బాబా ఆదేశం పాటించమని ప్రతిరోజూ ఉదయం మర్చిపోకుండా నన్ను గుడికి పంపింది. నేను రోజూ గుడికి వెళ్ళడం, వచ్చాక అన్ని కంపెనీలకు నా రెజ్యుమ్ పంపి బాబా మీద భారమేసి రిప్లైకోసం వేచి చూస్తుండేవాడిని. అలాగే ఒక సోమవారంనాడు గుడి నుంచి వచ్చాక ఒక కంపెనీకి నా రెజ్యుమ్ మెయిల్ చేశాను. అదేరోజు సాయంత్రం నా మెయిల్‌కి రిప్లై వచ్చింది. అక్కడినుంచి మూడు వారాల్లో ఆ కంపెనీలో నాకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. అక్కడికి 3 వారాల్లో నా పెళ్లి బాబా దయతో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. 3 వారాల తర్వాత నేను కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు అర్థమైంది బాబా లీల ఏంటో? నేను ముందు పనిచేసిన కంపెనీలో 2 సంవత్సరాల 5 నెలలు పని చేశాను. ఈ కాలంలో కంపెనీ షిఫ్ట్ టైమింగ్ సరిగా లేక నా ఆరోగ్యం కొంచం పాడైంది. జీతంలో కూడా ఎటువంటి పెరుగుదల లేదు. అదీకాక రెండో సంవత్సర ప్రారంభంలో ఆఫీసుకి రమ్మంటే నేను వెళ్లని కారణంగా నాకిచ్చే అలవెన్స్ కూడా తగ్గించారు. అందువలన నేను ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అందుకున్న జీతం కంటే తక్కువ జీతం నాకు వస్తుండేది. బాబా నా ఆరోగ్యం కోసం మంచి టైమింగ్, మంచి వర్క్ కల్చర్, మునుపటికంటే ఎక్కువ జీతం ఉన్న మంచి కంపెనీలో నాకు ఉద్యోగం అనుగ్రహించారు. ఈ అనుభవం ద్వారా బాబా మీద శ్రధ్ధ, ఆయన మనకు మంచి చేస్తారన్న సబూరి మనకు ఉంటే చాలు, మొత్తం బాబా చూసుకుంటారని నాకు అర్థమైంది. "ధన్యవాదాలు బాబా. మీ పట్ల శ్రద్ధ-సబూరి ఎప్పుడూ కలిగి ఉంటూ ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా".
సర్వం సాయినాథార్పణమస్తు.
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chusukondi vaalla badyata meede tandri, vaallaki manchi arogyanni prasadinchandi tandri pls, ofce lo anta bagundi WFH eche la chayandi tandri pls, naaku manchi arogyanni prasadinchi na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls.
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba madava ki enka ekkuva marks vachetattu aseervadinchandi baba.maa attagariki naameeda kopam poyelaga chudandi baba
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai,🙏🙏🙏
ReplyDelete