ఈ భాగంలో అనుభవాలు:
1. ఆటంకం లేకుండా కార్యక్రమం జరిపించిన బాబా
2. బాబా దయతో తగ్గిన కడుపునొప్పి
3. రాషెష్ తగ్గేలా దయచూపిన బాబా
ఆటంకం లేకుండా కార్యక్రమం జరిపించిన బాబా
సాయి పాదాలకు వందనాలు. నా పేరు సుమ. 'బాబా' అని ఏ భక్తుడు పిలిచినా వెంటనే పలుకుతారు మన దైవం. నా జీవితం ఆయన బిక్ష. ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే దానికి కారణం బాబా. ఇక ముందు కూడా వారి ఆశీస్సులు నాపై, అలాగే మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నా అనుభవానికి వస్తే,, నాకు పాప పుట్టిన తర్వాత 3 నెలలో నామకరణం చేయడానికి అయ్యగారు ముహూర్తం పెట్టారు. ఆ కార్యక్రమం కోసం నా అత్తయ్య, మావయ్య చాలా దూరం నుండి వచ్చారు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నాకు సర్జరీ అయిన తర్వాత నెలసరి రాలేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నెలసరి వస్తే కార్యక్రమం ఆగిపోతుంది. పైగా నాకు విపరీతంగా వెన్ను నొప్పి వస్తుంది. అందుకని నాకు చాలా భయమేసి బాబాకు దణ్ణం పెట్టుకొని, "కార్యక్రమం మంచిగా జరిపించు బాబా" అని చెప్పుకున్నాను. శనివారం కార్యక్రమం అయిపోయాక సోమవారం రాత్రి నాకు నెలసరి వచ్చింది. అంతలా బాబా నన్ను కాపాడారు. ఇది చాలా చిన్న విషయమే కావచ్చుగాని ఆ సమయంలో నాకు చాలా పెద్ద విషయంగా అనిపించింది. "ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమం జరిపించినందుకు ధన్యవాదాలు బాబా".
మా బాబుని గత సంవత్సరం ఒక స్కూలులో వేసాము. అది కొత్త బ్రాంచ్. అక్కడ చదువు అంత సంతృప్తిగా లేదు. అందువల్ల మేము ఆ స్కూలు మెయిన్ బ్రాంచ్లో సీటుకోసం ప్రయత్నించాము. మూడు నెలలు ప్రయత్నించాక బాబా దయవల్ల బాబుకి సీటు వచ్చింది. నిజానికి అందులో ఎవరికీ సీటు ఇవ్వమని అనేవారు. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మా బాబుకి సీటు వచ్చిందంటే అది మీ దయే బాబా. బాబుకి చదువు మీద శ్రద్ధ ఉండేలా చూడండి బాబా. అలాగే ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించు బాబా".
బాబా దయతో తగ్గిన కడుపునొప్పి
సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఒకరోజు ఉదయం నిద్రలేచాక మలవిసర్జనకు వెళ్లేముందు నాకు కడుపునొప్పి మొదలైంది. రెండో రోజుకి కడుపునొప్పితోపాటు విరోచనాలు కూడా ప్రారంభమై రోజంతా విరోచనాలు అవుతూనే ఉన్నాయి. దాంతో ఆ రాత్రి విరోచనాలు కట్టడానికి టాబ్లెట్ వేసుకున్నాను. మూడవరోజుకి విరోచనాలు తగ్గాయి కానీ, కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. అందువల్ల నేను, "బాబా! హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా చూడండి" అని బాబాకి చెప్పుకొని ఇంకోరోజు వేచి చూసాను. కానీ నాల్గవ రోజుకి కూడా కడుపునొప్పి తగ్గలేదు. క్వశ్చన్&ఆన్సర్ సైట్లో బాబాని అడిగితే 'హాస్పిటల్కి వెళ్ళమ'ని వచ్చింది. దాంతో వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ చూసి స్టమక్ ఇన్ఫెక్షన్ అని మందులిచ్చారు. బాబా దయవల్ల ఆ మందులు వాడితే సమస్య తగ్గిపోయింది. తర్వాత వేరే ఆరోగ్య సమస్యకోసం ఆయుర్వేద మందులు వాడుతుంటే ఒకరోజు మలవిసర్జనకు ముందు మళ్ళీ కడుపునొప్పి మొదలైంది. అప్పుడు నేను, "బాబా! మళ్ళీ వచ్చిందేమిటి? మరల ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా? దయచూపండి బాబా" అని వేడుకున్నాను. అయితే ఆ మరుసటిరోజు కూడా కడుపునొప్పి వచ్చింది. "బాబా! దయచేసి నా ఇబ్బందిని తగ్గించండి. నాకు భయంగా ఉంది" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఇబ్బంది తగ్గింది. దాంతో ఆది ఆయుర్వేద మందులు వల్ల వచ్చిందని ఊపిరిపీల్చుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
రాషెష్ తగ్గేలా దయచూపిన బాబా
సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సాయిసృజన. ప్రస్తుతం మా పాపకి రెండు సంవత్సరాల 8 నెలల వయసు. తనకి ఒకటిన్నర సంవత్సరం అప్పుడు శరీరం మీద వెనకవైపు ఎర్రగా గుల్లలు, గుల్లలుగా వచ్చాయి. మేము మొదట డైపర్ వల్ల రాషెష్ అని తలచి పాపని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాము. డాక్టరు కూడా రాషెస్ అని చెప్పి డైపర్ రాష్ క్రీమ్ ఇచ్చారు. కానీ పాపకి తగ్గలేదు. నెమ్మదిగా పాప చేత డైపర్ మాన్పించాము. అయినా రాషెస్ తగ్గలేదు. దాంతో మళ్లీ పాపని డెర్మటాలజిస్ట్ దగ్గరకి తీసుకొని వెళ్ళాము. డాక్టరు పాపది చాలా సున్నితమైన చర్మమని చెప్పి, మెడికేటెడ్ సోప్ వాడమని సోప్ ఇచ్చారు. దాంతోపాటు ఒక ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు. అవి వాడినా పాపకి తగ్గలేదు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేసాయి. పాప ఇబ్బందిపడుతుంటే మాకు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఒక మంచి డాక్టర్ని మాకు చూపించవలసిందిగా" ప్రార్థించాను. తర్వాత నెట్లో సెర్చ్ చేస్తే, ఒక డెర్మటాలజిస్ట్ దొరికారు. నేను, 'ఈ డాక్టరైనా పాపకి తగ్గిస్తే బాగుండు' అని అనుకుంటూ భయపడుతూ ఆ డాక్టరు దగ్గరకి వెళ్ళాము. బాబా దయవల్ల ఆ డాక్టర్ పాప సమస్యను గుర్తించి సరైన మందు ఇచ్చారు. ఆ మందు ఒక రెండుసార్లు వాడిన తర్వాత పాపకి తగ్గడం మొదలై ఆ సాయినాథుని దయవల్ల పూర్తిగా తగ్గింది. "ధన్యవాదాలు బాబా".
సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm sai ram ofce lo anta bagunde la chayandi tandri nannu ye project marchakunda chudandi tandri, e kadupu lo noppi tagge la chayandi tandri, amma nannalani kshamam ga chusukondi tandri vaalla badyata meede tandri.
ReplyDeleteOm Sairam!!!
ReplyDeleteసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
sai baba eeroju madava ki computer exam baaga rasetattu devenchandi baba. chandu valla kastalu teeretattu cheyandi baba. vaallu malli sarada colony lo undetatlu cheyandi baba
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sai Ram 🌹🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
SRI Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDelete