ఈ భాగంలో అనుభవాలు:
1. చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడే విధంగా బాబా మీద ఆధారపడాలి
2. ఒక్కోసారి తుఫాన్ రేపినా మళ్ళీ ప్రశాంతతను కలిగించేది బాబానే
చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడే విధంగా బాబా మీద ఆధారపడాలి
సాయికి, సాయి బంధువులకు నమస్కారం. నా రమాదేవి. అడుగడుగునా సాయిబాబా నాకు, నా కుటుంబానికి చేసే సహాయానికి నేను ఏం ఇవ్వగలను? కృతజ్ఞతతో సాష్టాంగ నమస్కారం తప్పా. 2024, జూలై మొదటివారంలో మా బాబు స్కూల్లో మెట్ల మీద నుండి పడి మోకాలికి గట్టి దెబ్బ తగిలించుకొని వచ్చాడు. వాడు అస్సలు కాలు కింద పెట్టలేక నొప్పిగా ఉందని ఏడ్చాడు.
అసలేమైంది తెలియలేదు
.నేను వెంటనే బాబుకి ఊదీ పెట్టి, మరికొంత ఊదీ నోట్లో వేసి, "ఏం కావద్దు బాబా" అని బాబా నామస్మరణ కొంతసేపు చేశాను. బాబా దయవల్ల బాబు కాలు కింద పెట్టి కొద్దిగా నడవగలిగాడు. కానీ ఎక్స్ రే తీయలేమోనని బాబుని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాము. డాక్టర్ చూసి, "దెబ్బ గట్టిగా తగిలింది. నొప్పి అయితే ఉంటుంది. కానీ ఏం కాదు, తగ్గిపోతుంది. ఎక్స్‌రే అవసరం లేదు" అని మందులు ఇచ్చారు. రెండో రోజుకి నొప్పి ఉన్నాసరే బాబు స్కూలుకి వెళ్ళాడు. కానీ సాయంత్రం జ్వరంతో ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో బాబుని మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకువెళితే జ్వరం తగ్గటానికి ఇంజక్షన్ చేశారు. అయితే రెండు రోజులైనా జ్వరం తగ్గలేదు, వస్తూనే ఉంది. కాలునొప్పి కూడా తగ్గలేదు. బాబా ఊదీ, మందులు వేసుకోటానికి బాబు ఇష్టపడలేదు. అందుచేత నేను, "బాబా! బాబుకి తగ్గిపోవాలి" అని బాబాను వేడుకున్నాను. తర్వాత బాబా దయవల్ల జ్వరం రాలేదు. కానీ కాలునొప్పి మాత్రం అలాగే ఉంది. బాబు సరిగా నడవలేకపోతుంటే నాకు బాధగా అనిపించి బాబా ఫోటో వైపు చూస్తూ, "ఏంటో బాబా ఉన్నాసరే బాబుకి ఇంత దెబ్బ తగిలింది" అని అనుకొని ఇంట్లో నుండి బయటకి వెళ్ళాను. మా బాబుతో ఆడుకునే ఒక పిల్లడు చేతికి కట్టుతో కనిపింంచాడు. ఆటలో వాడి చేయికి చిన్న దెబ్బ తగిలితే విరిగిందట. నాకు వెంటనే 'మా బాబుకి అంత పెద్దదెబ్బ తగిలిన ఏం అవలేదు. బాబా దయతో నా కొడుకు కర్మను ఎంత తగ్గించారో! కేవలం నొప్పి, జ్వరంతో తీసేశారు' అని అర్థమై.'ఆలస్యం చేయకుండా ఈ విషయం నాకు తెలిసేలా చేశారు బాబా' అని క్షమించమని బాబాను అడిగాను. మనం ఎంత నమ్మకంతో ఉన్నాసరే ఒక్కోసారి బాధలో పొరబడతాము. మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి. ఎన్నో వేల రెట్ల బాధను తగ్గించి ఇచ్చినా సరే దానిని కూడా భరించలేక బాబాను అంటాము. అసలు విషయానికి వస్తే, ఒక వారంలో మా బాబు మామూలు అయ్యాడు. ఈ బ్లాగు ద్వారా బాబాని క్షమించమని మరోసారి అడుగుతున్నాను.
ఒకసారి మా పాపకి హఠాత్తుగా జ్వరం వచ్చింది. జ్వరం 103 డిగ్రీలు ఉంది. డాక్టర్ ఇంజక్షన్ చేసి, :వైరల్ అయి ఉంటుంది, జాగ్రత్త!" అని అన్నారు. నేను పాపకి బాబా ఊదీ పెడుతూ, మందులు వేస్తుంటే 2 రోజులలో తగ్గిపోయింది. దాంతో పాప మామూలుగా స్కూలుకి వెళ్ళింది. 4 రోజుల తరువాత చిన్నగా ఒళ్లునొప్పులు మొదలై రెండో రోజుకు మోకాళ్ళు కూడా నొప్పి పెట్టసాగాయి. పాప అస్సలు నడవలేకపోయింది. 'చిన్నపిల్లకు మోకాళ్ళ నొప్పి ఏంటి బాబా? ఏం చేయాలి?' అనుకొని ఊదీ ఇస్తూ ఉండసాగాను. పాప పరీక్షలని ఎలాగో స్కూలుకి వెళ్ళింది. నాకు 'పాపకి జ్వరం లేదు కానీ, నొప్పి వల్ల చేతితో ఏం పట్టుకోలేకపోతుంది, నడవలేకపోతుంది. ఏం చేయాలి?' అని నా ఆఫీసు డాక్టరును సంప్రదించాలనిపించి కలిసాను. ఆ డాక్టర్, "ముందు వచ్చిన జ్వరం డెంగ్యూనో, చికెన్గున్యానో అయి ఉంటుంది. ఒకసారి అన్ని టెస్టులు చేయించండి" అని అన్నారు. సరేనని టెస్టులు చేయిస్తే రిపోర్టులు స్పష్టంగా రాలేదు. "అర్ధం కావడం లేదు, ఒకసారి డాక్టరుని కనుక్కోండి" అని అన్నారు. అప్పుడు రాత్రి 9.30 అయింది. ఆ డాక్టర్ డ్యూటీ అయిపోయి ఫోన్ తీయలేదు. ఆ స్థితిలో నాకు బాబానే దిక్కు అని 'బాబా' అనుకోగానే హాస్పిటల్ రిసెప్షన్‌కి ఫోన్ చేయాలనినిపించింది. వెంటనే ఫోన్ చేసి నర్సును డాక్టరుతో మాట్లాడి చెప్పమన్నాను. అప్పుడు పాపకు డెంగ్యూ వచ్చి తగ్గిందని తెలిసింది. మాకు ఇబ్బందిలేకుండా జ్వరం రావడం, తగ్గడం బాబా దయకాక ఇంకేంటి? ఇప్పుడు నొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నాంగాని పాప బాగానే ఉంది. "శతకోటి నమస్కారాలు బాబా",
2024, జూలై 21న ఒక క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చి చేస్తే, రెండుసార్లు ఫెయిల్ అయింది. అదేరోజు ఆ పని పూర్తి చేయాల్సి ఉన్నందున నా భర్త కార్డుతో ప్రయత్నం చేసినా పని అవ్వలేదు. అప్పుడు బాబాని తలుచుకొని, "బాబా! ఎలా అయినా ఈ పని కావాలి" అని అనుకున్నాను. తర్వాత ఒక గంటలో వేరే మార్గం ద్వారా పని పూర్తి అయ్యింది. అంత బాబా కృప. "ధన్యవాదాలు సాయిదేవా".
ఒకరోజు ఆఫీసుకి సమయం అవుతుంటే కారు తాళాలు దొరకలేదు. నిజానికి అవి నా బ్యాగులోనే ఉంటాయి, కానీ ఎంత వెతికినా దొరకలేదు. బాబానే దిక్కు అని 'బాబా' అనుకొని వెతికితే వెంటనే దొరికాయి. ఏంటి సిల్లిగా అన్నిటికీ బాబాయేనా! ఇది కూడా అడగాలా అనుకోకండి. అవును అడగాలి. మనం ప్రతిదీ బాబానే అడగాలి. మనకు కావాల్సింది చిన్నదైనా, పెద్దధైనా బాబానే ఇవ్వాలి. ఒక చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడే విధంగా మనం బాబా మీద ఆధారపడాలి. మన కర్మ ప్రకారం మన జీవితం నడవటం ఎలాగూ తప్పనప్పుడు బాబా చేయి పట్టుకొని ఆయన తోడుతో నడిస్తే తప్పేంటి\? అలా చేస్తే ఆ కర్మ ప్రభావం మనకు తెలియకుండా బాబా చూసుకుంటారు కదా!! చివరిగా ఒక విన్నపం. మన అందరి జీవితాలలో చిన్నవి, పెద్దవి బాబా దయతో చాలా అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. బాబా కృప వర్షించటంలో ఆలస్యం లేనప్పుడు మనం పంచుకోవటంలో ఆలస్యం చేయడం ఎందుకు? దయచేసి వెంటనే అనుభవాలు బ్లాగులో పంచుకోండి.
ఒక్కోసారి తుఫాన్ రేపినా మళ్ళీ ప్రశాంతతను కలిగించేది బాబానే
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సంధ్య. నేను 10 సంవత్సరాల నుండి సాయి భక్తురాలిని. మా అక్కవాళ్ళు తిరుపతి శ్రీవారి సేవకు వెళ్ళారు. వాళ్ళలో కొంతమంది అమాయకులు. అందువల్ల నేను, 'ఇటువంటి వాళ్ళని తీసుకొని అక్క ఎలా వెళ్తుందో, ఏమో' అని భయపడి, "బాబా! మీరే వాళ్ళ యాత్రను విజయవంతంగా పూర్తి చేయించాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వాళ్ళు 7 రోజుల సేవ పూర్తి చేసారు. చివరిరోజున వాళ్ళని స్వామి దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే వాళ్ళు దర్శనానికి వెళ్లినప్పుడు వాళ్లలో ఇద్దరిని తిరస్కరించి వెనక్కి పంపేశారు. మిగతావాళ్ళు ఆ ఇద్దరినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయి స్వామి దర్శనం చేసుకొని బయటకి వచ్చారు. చూస్తే, వెనక్కి పంపబడ్డ ఇద్దరు ఎటు వెళ్ళారో తెలియలేదు. సుమారు 10 గంటలైనా వాళ్ళు రాకపోయేసరికి భయమేసి మా అక్క నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అందరం, "అయ్యో.. బాబా! వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చేటట్టు చూడండి" అని బాబాని ప్రార్థించసాగాము. అలా ప్రార్థిస్తుండగా 10 నిమిషాల్లో వాళ్ళు స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. అందరూ ఊపిరి పీల్చుకొని సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఒక్కోసారి బాబా తుఫాన్ రేపినా మళ్ళీ ఆయనే ప్రశాంతతను కలిగిస్తారు. అప్పుడప్పుడు మన సహనానికి పరీక్ష పెడతారు. "థ్యాంక్ బాబా".
Om Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram, ofce lo na health condition chusi permission eche la chayandi tandri emi anakunda, ofce lo ye project marchakunda chudandi tandri pls. Amma nannalani kshamam ga chusukondi tandri vaalla badyata meede, vaallaki naaku manchi arogyanni prasadinchandi tandri pls.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba ninna ratri naa kalu naram pattesindi. ventane baba baba ani chanu . ventane noppi taggindi. antha baba daya.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl
ReplyDeleteOm.Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete