1. ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా
2. గొంతునొప్పి తగ్గించిన బాబా
3. బాబా దయవల్ల కోరుకున్నట్లే గురువారం డెలివరీ అయిన కారు
ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా
|
సాయి వచనం:-
|
|
|
1. ఆందోళన నుండి బయటపడేస్తున్న బాబా
2. గొంతునొప్పి తగ్గించిన బాబా
3. బాబా దయవల్ల కోరుకున్నట్లే గురువారం డెలివరీ అయిన కారు
1. విపత్కర పరిస్థితి నుండి కాపాడిన బాబా - సమాధిమందిరంలో ప్రసాదించిన అద్భుత లీల
2. దర్శనంతో సంతానభాగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. పెద్ద సమస్యలో పడకుండా తక్షణమే కాపాడిన బాబా
విపత్కర పరిస్థితి నుండి కాపాడిన బాబా - సమాధిమందిరంలో ప్రసాదించిన అద్భుత లీల
శ్రీసాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు ఇందిర. మాది హైదరాబాద్. నేనిప్పుడు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. ఒకసారి రోడ్డు ప్రమాదంలో మా నాన్న తలకు పెద్ద గాయమై మెదడులో రక్తం గడ్డకట్టింది. మా అమ్మ డాక్టరుతో మాట్లాడుతుండగా, 'ఆపరేషన్ చేయడం కష్టం' అంటున్న డాక్టర్ మాటలు నేను ఫోనులో విన్నాను. నాకు ఏమి చేయాలో దిక్కుతోచక విపరీతమైన దుఃఖంతో ఇంట్లోని బాబా పాదాల చెంత, "బాబా! మా నాన్నకి ఆపరేషన్ జరగాలి. ఇంతకుముందులా మాతో సంతోషంగా ఉండాలి" అని వేడుకున్నాను. వెంటనే మా అమ్మ నుండి నాకు ఫోన్ వచ్చింది. అమ్మ నాతో, "ఆపరేషన్ చేస్తారు. ఏ ప్రమాదం లేదు" అని చెప్పింది. అది విన్న వెంటనే, "ఏ ఇబ్బందీ లేకుండా సర్జరీ విజయవంతమైతే శిరిడీ వస్తాను బాబా" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా సర్జరీ పూర్తికావడం, నాన్న తొందరగా కోలుకుని నార్మల్ అవడం జరిగాయి. "శతకోటి ధన్యవాదాలు సాయీ".
శిరిడీ ప్రయాణం: ఇప్పుడొక అద్భుతమైన బాబా లీలను పంచుకుంటాను. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో మా పిన్నీవాళ్ళు తమ శిరిడీ ప్రయాణం గురించి చెప్పారు. నాకు వెంటనే బయలుదేరి వాళ్ళతో శిరిడీ వెళ్ళాలనిపించింది. అలాగే వాళ్ళతో కలిసి శిరిడీ వెళ్ళాను. నేను సమాధిమందిరం దర్శనానికి వెళ్ళేటప్పుడు 'ఒక ఆరెంజ్ రంగు శాలువాను బాబాకి సమర్పించి, తరువాత దాన్ని బాబా ప్రసాదంగా మా నాన్నకి ఇస్తే బాగుంటుంద'ని అనుకున్నాను. కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు నాకు ఆ విషయం గుర్తులేదు. తీరా సమాధిమందిరం లోపలికి వెళ్ళాక చూస్తే, బాబా ఆరంజ్ రంగు శాలువా ధరించి ఉన్నారు. అది చూసి, 'అయ్యో! బాబా కోసం శాలువా కొనడం మర్చిపోయాన'ని ఎంతో బాధపడుతూ ముందుకు కదులుతున్నాను. బాబాను సమీపిస్తుండగా ఒక భక్తుడు కొన్ని ఆరంజ్ కలర్ శాలువాలు పట్టుకుని కనిపించాడు. ఆ భక్తుడు తన వద్దనున్న ఆరు శాలువాలలో ఐదు శాలువాలను బాబాకి సమర్పించుకోదలచి మిగిలిన ఒక శాలువా ఎవరికైనా ఇద్దామని చూస్తూ అక్కడ అంతమంది ఉండగా నాతో, "నీకు శాలువా కావాలా? ఇదిగో తీసుకో" అంటూ ఆ శాలువాను నాకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతి, ఆనందం నా జీవితంలో మరువలేనిది. "మీకు కోటికోటి ప్రణామాలు సాయీ". ఆ శాలువాను సాయికి సమర్పించి, వారి అనుగ్రహ ప్రసాదంగా తిరిగి తీసుకుని ఇంటికి వచ్చాను. ఇలా నా జీవితంలో మరెన్నో అనుభవాలు, లీలలు బాబా అపార అనుగ్రహం వల్ల జరిగాయి. వాటిని ముందు ముందు మీతో పంచుకుంటాను.
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
దర్శనంతో సంతానభాగ్యాన్ని ప్రసాదించిన బాబా
సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు సువర్చల. నా వయసు 50 సంవత్సరాలు. నేనిప్పుడు బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం అయింది. పెళ్ళైన అయిదేళ్ల వరకు మాకు సంతానం కలుగలేదు. ఎన్నో దేవాలయాలను దర్శించి, ఎన్నో పూజలు చేసినా ఫలితం లేకపోయింది. అటువంటి తరుణంలో మాకు తెలిసిన ఒక సాయిబంధువు ద్వారా మేము సాయిబాబా గురించి తెలుసుకుని మా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక ఊరిలోని సాయిమందిరంలో విగ్రహప్రతిష్ఠ జరుగుతుంటే నేను, మావారు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. బాబా దర్శనంతో మాకు సంతానభాగ్యం కలిగింది. మొదట బాబు, తర్వాత పాప పుట్టారు. ఇంకో విషయమేమిటంటే, అప్పట్లో మావారు దేవుడిని నమ్మేవారు కాదు, నాస్తికుడిగా ఉండేవారు. అలాంటివారు బాబా మహత్యం వల్ల ఆస్తికత్వంలోకి మారారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు చేసిన మేలు జీవితంలో నేను మరువను సాయీ".
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
పెద్ద సమస్యలో పడకుండా తక్షణమే కాపాడిన బాబా
నా పేరు మురళీమోహన్. 2022, ఫిబ్రవరి 1న ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోవలసిన నన్ను బాబా తృటిలో కాపాడారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ కాసేపు రిలాక్స్ అవుదామని నేను, నా ఫ్రెండు వెంచర్ గ్రౌండులో కూర్చున్నాము. అప్పుడు సమయం సాయంత్రం 7 గంటలు. కాస్త చీకటిగా ఉంది. హఠాత్తుగా సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులు కొందరు అక్కడికి వచ్చి, "మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీ మీద కేసు బుక్ చేస్తాం" అన్నారు. కారణం, అక్కడికి కొంచెం దూరంలో ఎవరో డ్రింక్ చేస్తున్నారట, అక్కడ మర్డర్లు జరుగుతుంటాయట, ఇంకా ఆ ప్రదేశంలో బ్లేడ్ బ్యాచ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయట. ఈ విషయాలు గానీ, ఆ చీకటిలో ఎవరు ఎక్కడున్నారో అన్నది గానీ మాకు తెలియదు. అయినా పై కారణాల వల్ల పోలీసులు మమ్మల్ని కూడా అనుమానించారు. అప్పటికీ నేను, "మాకు ఈ ప్రదేశం కొత్త. తెలియక వచ్చాం. సారీ" అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు వినిపించుకోకుండా "ఎస్పీగారు వస్తారు. అప్పుడు చూద్దాం" అని అన్నారు. నేను వెంటనే మనసులో బాబా నామస్మరణ చేస్తూ, "రక్షించు బాబా" అని అదేపనిగా బాబాను ప్రార్థించసాగాను. కాసేపటికి ఎస్పీ తదితర ఆఫీసర్లందరూ వచ్చి అక్కడున్న అందరిమీదా కేసులు బుక్ చేయసాగారు. బాబా దయవల్ల ఒక పోలీసు నాతో, "వెంటనే ఈ చోటు విడిచి వెళ్ళిపోండి" అని చెప్పి మమ్మల్ని మాత్రం విడిచిపెట్టారు. ఒక్క నిమిషంలో ఈ అద్భుతం జరిగింది. లేకుంటే నేను చాలా పెద్ద సమస్యలో పడేవాడిని. ఇలా సాయినాథుడు అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. "బాబా! మీకు అనంతకోటి కృతజ్ఞతలు. నిన్నే నమ్ముకున్నాము తండ్రీ. బాబా, నాకు ఒక మంచి ఉద్యోగాన్నిచ్చి ప్రతిక్షణమూ టెన్షన్‌గా ఉండే ప్రస్తుత ఉద్యోగం నుంచి కాపాడు తండ్రీ. మీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాను బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
1. పెద్ద సమస్యను ఎటువంటి సమస్యా లేకుండా పరిష్కరించిన బాబా
2. బాబా ప్రసాదించిన కొత్త జీవితం3. ప్రత్యక్ష అనుభవంతో సంశయాన్ని తీర్చిన బాబా
పెద్ద సమస్యను ఎటువంటి సమస్యా లేకుండా పరిష్కరించిన బాబా
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాటి సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి నేను ఇదివరకే నా అనుభవం ఒకటి పంచుకున్నాను. ఈమధ్యకాలంలో జరిగిన మరో రెండు అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. కొంతకాలం క్రితం మేము మా స్థలం ఒకటి వేరేవాళ్లకు అమ్మాము. వాళ్ళు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అంతా బాగానే జరిగి ఇల్లు పూర్తయింది. ఆ తరువాత వేరేవాళ్ళు(బడాబాబులు) వచ్చి, "ఈ స్థలం మాది, నువ్వు ఇల్లు ఎందుకు కట్టావు?" అని ప్రహరీగోడను పడగొట్టి పెద్ద గొడవ చేశారు. దాంతో, మా దగ్గర ఆ స్థలం కొన్న వ్యక్తి మా వద్దకొచ్చి జరిగిందంతా చెప్పారు. మేము డాక్యుమెంట్లు చూపించాం. కానీ వాళ్ళు వినకుండా గొడవ చేశారు. అవతలివాళ్ళు పెద్దమనుషులు అవటంతో మేము ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు నేను ఈ విషయం గురించి బాబాను అడిగాను. అందుకు బాబా సమాధానంగా '16వ అధ్యాయం 16 వారాలు చదవమ'ని వచ్చింది. నేను బాబా ఆదేశానుసారం ఆ అధ్యాయం చదవడం మొదలుపెట్టాను. ఆ అధ్యాయంలో చెప్పబడిన జ్ఞానం బహుశా వాళ్లకు కలిగింది కాబోలు! 16 వారాలు పూర్తయ్యేసరికి సమస్య లేదు. ఆ స్థలం గురించి అడిగేవాళ్లెవరూ లేరు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాబా దయవలన అంత పెద్ద సమస్య ఎటువంటి సమస్యా లేకుండా సమసిపోయింది. "థాంక్యూ బాబా".
నాకు ఈమధ్య గొంతునొప్పి వచ్చినప్పుడు కరోనా ఏమోనని చాలా భయమేసింది. బాబాకి దణ్ణం పెట్టుకుని, "గొంతునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని ఊదీ పెట్టుకున్నాను. తెల్లారేసరికి ఏ నొప్పీ లేదు. వెంటనే బ్లాగులో పంచుకుంటానని ఏరోజుకారోజు వాయిదా వేస్తూ ఉండేసరికి మళ్ళీ నొప్పి వచ్చింది. అందుకే ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే నా అనుభవాన్ని బ్లాగుకి పంపుతున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోతుందని ఆశిస్తున్నాను. "బాబా! రెండు అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైంది, నన్ను క్షమించండి. ప్లీజ్ బాబా! నొప్పిని తగ్గించి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. థాంక్యూ బాబా".
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా ప్రసాదించిన కొత్త జీవితం
నా పేరు లావణ్య. నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయ్యింది. ఒకప్పుడు మావారు చెడువ్యసనాల వల్ల ఏ పనీ చేసేవారు కాదు. నన్ను, పిల్లలను పట్టించుకోకుండా తిరిగేవారు. ఇలాంటి పరిస్థితులకు తోడు మా తమ్ముడు కూడా మరణించడంతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎనిమిది నెలల గర్భిణిని అయిన నాకు ఏం చేయాలో తోచలేదు. పెళ్లికాకముందు నేను ట్యూషన్ చెప్పేదాన్ని. అప్పట్లో ఒక విద్యార్థి నన్ను 'అక్కా' అని పిలిచేవాడు. ఆ పిల్లాడి పేరు 'సాయి కిరణ్'. ఆ సాయిబాబా నాకోసమే ఆ పిల్లాడి రూపంలో వచ్చారని నాకు అప్పుడు తెలీదు. ఒకరోజు నేను ఆ పిల్లాడిని తీసుకుని కొండపై ఉన్న బాబా గుడికి వెళ్లి, "బాబా! నా భర్తకు ఒక ఉద్యోగం చూపించండి. ఆయనకి ఉద్యోగమొస్తే ఐదు వారాలు మీ గుడికి వస్తాను" అని బాబాను వేడుకున్నాను. రెండు వారాలు గడిచేసరికి మావారికి బాబా గుడిలో పూజారిగా పని దొరికింది. మావారు తన చిన్నతనంలో తన తండ్రిగారి దగ్గర కొద్దిగా పౌరోహిత్యం నేర్చుకున్నారు. తన తండ్రితో కొన్ని కార్యక్రమాలలో హాజరయ్యేవారు. కానీ పౌరోహిత్యానికి సంబంధించి మొత్తం రాదు. అయినా ధైర్యం చేసి మా చెల్లెలి భర్త చూపించిన గుడికి వెళ్ళాము. అక్కడ మావారు ఒక సంవత్సరం తీర్థప్రసాదాలు ఇస్తూ నెమ్మదిగా అన్నీ నేర్చుకుని ఒక మంచి పూజారిగా పేరు తెచ్చుకున్నారు. బాబా దయవల్ల ఇప్పుడు అన్ని చెడు అలవాట్లు వదిలేసి నన్ను, నా పిల్లలను బాగా చూసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. అంతా అయిపోయిందనుకున్న నా జీవితంలోకి ఆ సాయిబాబా దయవల్ల మళ్లీ సంతోషాలు వచ్చాయి. ఇలా మొదలైన నా కొత్త జీవితంలో ప్రతి అడుగులో బాబా దయవల్ల జరిగిన అద్భుతాలను, అనుభవాలను ముందు ముందు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ బాబా తన భక్తులను ఎలా అనుగ్రహిస్తారో, ఆయన ప్రతి విషయంలోనూ ఒక తండ్రిలా ఎలా ఆదుకున్నారో చెప్పడానికి ఈ జీవితం సరిపోదేమో! ఏమైనా ఇలా తోటి భక్తులతో నా అనుభవం పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాబా దయవల్ల నా అనుభవం బ్లాగులో ప్రచురితమవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
ప్రత్యక్ష అనుభవంతో సంశయాన్ని తీర్చిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు శిరీష. నేను దాదాపు రెండు సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిరోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. తద్వారా నాకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతున్నాయి. 2022, జనవరి నెల చివరిలో ఒకేరోజు నేను, మా పాప కోవిడ్ బారినపడ్డాము. ఇద్దరికీ మూడు రోజులపాటు చాలా తీవ్రంగా జ్వరం ఉండేది. కానీ నేను, 'బాబా తోడు ఉండగా భయమెందుకు?' అని కొద్దిగా ఊదీని నా నుదుటన ధరించి, పాప నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి నేను త్రాగి, పాపచేత త్రాగించేదాన్ని. నాల్గవరోజు జ్వరం తగ్గి బాగుంది అనుకున్నాము, కానీ ఐదవరోజు మళ్ళీ జ్వరం వచ్చింది. దాంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాకు చాలా భయమేసి, "బాబా! మాకు ఏమీ కాకుండా ఉంటే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకుని, ఊదీనీళ్లు నేను త్రాగి, పాపకి కూడా ఇచ్చాను. తరువాత బ్లడ్ టెస్టు చేయించుకుంటే పాప విషయంలో చాలా తేడాలు కనిపించాయి. కానీ బాబా దయవల్ల క్రమంగా మేమిద్దరమూ కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము. అదివరకు నేను భక్తుల అనుభవాలు చదివేటప్పుడు ఎవరైనా భక్తులు 'బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకున్నాము' అని వ్రాసినప్పుడు 'అలా మ్రొక్కుకుంటే నిజంగా అనుకున్నది జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా?' అని నాకు అనిపించేది. ఆ సంశయాన్ని బాబా ఈ ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడం ద్వారా తీర్చారు. "థాంక్యూ బాబా".
1. కోరుకున్నంతనే సహాయం చేసిన బాబా
2. బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
3. సమస్య ఏదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది
కోరుకున్నంతనే సహాయం చేసిన బాబా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి బంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడలో ఉంటాము. మా అమ్మాయి బి.టెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం కోసం తను చాలా ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల తన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. దాంతో తను చాలా బాధపడుతుండేది. నేను ఒక గురువారంనాడు బాబాకి దణ్ణం పట్టుకుని, "బాబా! మా అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా మా మీద దయ చూపించారు. మరుసటి వారం బుధవారంనాడు మా అమ్మాయి కాలేజీ నుండి వస్తూనే చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తనకి ఉద్యోగం వచ్చిందని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా మంచి కంపెనీలో మా అమ్మాయికి ఉద్యోగాన్ని అనుగ్రహించారు. ఇంకా లొకేషన్ ఇవ్వలేదు. మేము బెంగుళూరులో వస్తే బాగుండు అనుకుంటున్నాము. కానీ బాబాకి తెలుసు కదా మనకేది మంచిదో. "బాబా! మీకు ఎక్కడ మంచిది అనిపిస్తే, అక్కడ వచ్చేలా చేయండి. థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".
మా అబ్బాయి బి.టెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్కు ఇచ్చి, దానికి ఒక సార్‌ని గైడ్‌గా పెట్టారు. ఆ సార్ ఏమీ పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయండి అని వదిలేసారు. అయితే మా అబ్బాయి చాలా ప్రాజెక్టులు ప్రయత్నించినప్పటికీ ఆ సార్ దేన్నీ ఆమోదించేవారు కాదు. దాంతో మా అబ్బాయి చాలా డిప్రెస్ అయ్యాడు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! బాబుకి మంచి ప్రాజెక్ట్ దొరికేలా చేయండి" అని వేడుకున్నాను. మరుసటిరోజే మా అబ్బాయి ఒక ప్రాజెక్టుని ఎంపిక చేసుకుంటే దాన్ని వాళ్ళ సార్ ఆమోదించారు. అయితే ఆ ప్రాజెక్టు చేయాలంటే కార్పెంటర్‌తో పని ఉంటుంది. ఈ విషయంలో బాబా తమ లీలను చూపించారు. అసలు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించని మా ఇంటికి పనిచేసే కార్పెంటర్ ఒక్క ఫోన్ కాల్కే స్పందించి, "నేను వచ్చి మీకు కావాల్సింది చేస్తాను" అని చెప్పారు. మేము చాలా సంతోషించాము. అక్కడితో అయిపోలేదు. ఆ కార్పెంటర్ పని పూర్తి అయ్యేదాక రోజూ వచ్చి అన్ని వివరాలు అడిగి మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసారు. పైగా చేసిన పనికి డబ్బులు కూడా తీసుకోలేదు. బాబానే ఆ కార్పెంటర్ ద్వారా మా అబ్బాయి ప్రాజెక్టుని పూర్తి చేయించారని నా నమ్మకం. కోరుకున్నంతనే సహాయం చేసిన బాబాకు చాలా చాలా ధన్యవాదాలు. "లవ్ యు సో మచ్ బాబా".
బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను. ఆమధ్యకాలంలో నా నిర్లక్ష్యం వలన వ్యాపారం కొంచెం డల్ అయింది. అప్పుడు నేను బాబాతో, "బాబా! మీ దయవలన మళ్లీ వ్యాపారం బాగా జరిగేల" అని చెప్పుకున్నాను. తర్వాత బాబా దయవలన వ్యాపారం కొంచెం బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా".
కరోనా సమయంలో ఒకసారి మా నాన్నకి కొంచెం చలిజ్వరం, దగ్గు వచ్చాయి. నాకు భయమేసి బాబాతో, "బాబా! నాన్నకి ఏ ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోవాల"ని చెప్పుకున్నాను. బాబా దయతో నాన్నకి చాలా తొందరగా నయం అయింది. "థాంక్యూ బాబా".
మా బాబు పదవ తరగతి చదువుతూ హాస్టల్లో చేరుతానని పట్టుబట్టాడు. అది మాకు ఇష్టం లేకపోయింది. కానీ మేము ఎంత చెప్పినా బాబు వినలేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! బాబు హాస్టల్లో చేరుతానన్న నిర్ణయం మార్చుకోవాల"ని చెప్పుకున్నాను. బాబా దయవలన మా బాబు చాలా తొందరగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరినీ ఇలాగే దయతో కాపాడు తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సమస్య ఏదైనా బాబాకు చెప్పుకుంటే తీరిపోతుంది
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి బంధువులందరికీ 'సాయి మహారాజ్' ఆశీస్సులు ఉండాలి. నేను 'సాయీ' అంటే 'ఓయీ' అనే పలికే దైవం సాయినాథుడి భక్తుడిని. నేను బాబాకి దగ్గరై సుమారు 5 సంవత్సరాలు అయింది. ఈ ఐదు సంవత్సరాలలో నేను బాబా చేసిన ఎన్నో లీలలు చూసాను. ఒకసారి మలబద్దకం సమస్య మొదలై మలంలో రక్తం రావడం నేను చాలారోజులు గమనించాను. మందులు వాడాను కానీ, తగ్గలేదు. నాకు తీరిక సమయంలో ఈ బ్లాగును చదవడం అలవాటు. అలా ఒకరోజు బ్లాగులో కొన్ని అనుభవాలు చదివాక మనసులో బాబాను ధ్యానించి, "నా ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరకాల"ని వేడుకున్నాను. తరువాత బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. అలా ఊదీ నీళ్లు రెండు రోజులు త్రాగాక గమనించాను. ఆశ్చర్యం! ఊదీ మహిమ వలన నా సమస్య పరిష్కారమైంది. అదివరకు కూడా నా సమస్యలు కొన్నింటిని బాబా ఊదీతో తీర్చారు. తమను నమ్మిన భక్తుల వెన్నంటి ఉంటూ కాపాడే కల్పవృక్షం సాయినాథుడు. ఎలాంటి సమస్య వచ్చినా బాబాకు చెప్పుకుంటే తప్పకుండా పరిష్కారం చూపిస్తారు.
శుభమస్తు! లోకా సమస్తా సుఖినో భవంతు!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!
1. తామున్నామని నమ్మకమిస్తున్న బాబా
2. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకుంటే ఆయన తప్పక తీరుస్తారు
3. తోటి భక్తుల అనుభవాల విషయంలో ఆలోచనను సరిచేసిన బాబా
తామున్నామని నమ్మకమిస్తున్న బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నాపేరు సంగీత. మాది నిజామాబాద్. ముందుగా సాయి బంధువులకు, బ్లాగు నిర్వాహకులకు నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదువుతుంటాను. నేను కూడా ఇదివరకు నా అనాభవాలు చాలా పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.
ఒకసారి మా ఆడపడుచు కడుపునొప్పితో రాత్రుళ్ళు నిద్రపట్టక వారం రోజుల పాటు చాలా బాధపడింది. హాస్పిటల్‌కి వెళితే, "కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అందుకే అంతలా నొప్పి వస్తుంది" అని అన్నారు. మా ఆడపడుచు తట్టుకోలేక బాధతో ఏడుస్తుంటే నేను, "బాబా! ఆ నొప్పి నుంచి మా ఆడపడుచుకి ఉపశమనం కలిగిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండు గంటల్లో నొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".
నేను ఆరోగ్యం బాగాలేక మందులు వాడుతున్నాను. ఆ మందుల వల్ల నాకు విపరీతంగా ఆకలి వేస్తుంటే తింటూ ఉండేదాన్ని. దాంతో నేను మూడు నెలల్లో మూడు కిలోల బరువు పెరిగాను. అంతకుముందు కూడా ఇలాగే మందులు వాడుతూ చాలా లావైతే, సంవత్సరంపాటు అన్నం తినకుండా డైటింగ్ చేస్తూ చాలా కష్టపడి 8 కిలోల బరువు తగ్గాను. అందువల్ల నేను మళ్లీ ఇలాగే బరువు పెరుగుతూ పోతే సమస్య మొదటికి వస్తుందని భయపడి, "బాబా! నాకు ఆకలి వేయకుండా ఉండేలా చూసి నా బరువు తగ్గేలా చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. మనం ఏది కోరినా బాబా తీరుస్తారు. ఆయన దయవల్ల నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు, సన్నగా కూడా అయ్యాను. "థాంక్యూ బాబా".
ఒకరోజు మా పాప ఆడుకుంటూ కింద పడింది. దాంతో కాలు వాచి నడవడానికి రాలేదు. హాస్పిటల్‌కి వెళ్తే, ఎక్స్-రే తీయించమన్నారు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల పాపకి ఫ్రాక్చర్ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఫ్రాక్చర్ కాలేదు. కానీ కాలికి బలంగా దెబ్బ తగలడం వల్ల పట్టి వేసి 15 రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. "ధన్యవాదాలు బాబా".
నేను ఈ మధ్య స్కూటీ నడపడం నేర్చుకున్నాను. అయితే నేను ఒక్కదాన్ని, ఇంకా పిల్లలను తీసుకుని నడపగలిగేదాన్ని గాని, వెనక సీటు మీద ఒకవైపే కూర్చునేవాళ్ళని ఎక్కించుకుని నడపాలంటే భయం వేసేది. ఆ విషయమై నేను, "బాబా! మీ దయవల్ల వెనకాల ఒకవైపు కూర్చునేవాళ్ళని కూర్చోబెట్టుకుని స్కూటీ నడపగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత మా అక్కని వెనుక ఎక్కించుకుని బాబా ఉన్నారనే దైర్యంతో స్కూటీ నడిపాను. బాబా దయవల్ల బాగా నడపగలిగాను. అంతా బాబా దయ. "థాంక్యూ బాబా".
మావారు ప్రభుత్వోద్యోగి. మా ప్రాంతంలో జోనల్ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకు బదిలీలు చేస్తుంటే మావారికి ఎంత దూరం బదిలీ అవుతుందో ఏమిటో అని భయమేసి, "బాబా! మావారికి బదిలీ కాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇప్పటివరకూ మా వారికి బదిలీ కాలేదు. ఇకముందు కూడా బదిలీ కానివ్వరని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".
నాకు చాలా సంవత్సరాల నుంచి కళ్ళు తిరగడం, తల తిరగడం జరుగుతుంది. మొదటిసారి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టరు మూడు సంవత్సరాలపాటు మందులు వాడాలని చెప్పారు. తరువాత ఈ మధ్య ఒకసారి నేను హాస్పిటల్‌కి వెళ్తూ, "బాబా! నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలి" అని బాబాకి మ్రొక్కుకుని వెళ్ళాను. ఆయన దయవల్ల ఆరునెలలు చికిత్స తీసుకుంటే సరిపోతుంది అన్నారు. "థాంక్యూ బాబా".
మాకు కొన్ని అప్పులు ఉన్నాయి. ఒకసారి మా అన్నయ్య మాకు ఒక ప్లాటు ఇస్తానన్నాడు. అయితే మూడు సంవత్సరాలు అయినా ఇవ్వలేదు. ఈమధ్య ఒకసారి నేను అన్నయ్యతో, "మీరు ప్లాట్ ఇస్తే, అమ్మేసి అప్పులు తీర్చుకుంటాము" అని అన్నాను. అన్నయ్య సరే అన్నారు. కానీ వారం అయినా ఆ విషయం గురించి మళ్లీ ఏమీ మాట్లాడలేదు. నాకు మళ్లీ అడగాలి అనిపించక, "బాబా! మీ దయవల్ల అన్నయ్య వాళ్ళు ప్లాట్ అమ్మేసుకోండి అని చెప్పాలి" అని అనుకున్నాను. అంతే, ఆరోజు సాయంత్రం మా అన్నయ్య ప్లాట్ నెంబర్ చెప్పి అమ్మేసుకోండి అని అన్నారు. ఇలా ఎన్నో అనుభవాల ద్వారా నాకు ఏ సమస్య వచ్చినా తామున్నామని నమ్మకం ఇస్తున్నారు బాబా. "థాంక్యూ బాబా. మా అన్నయ్య, వదినల మధ్య ఉన్న ఒక సమస్యను మీరే పరిష్కరించండి బాబా".
ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకుంటే ఆయన తప్పక తీరుస్తారు
సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయి భక్తులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులో రెండవసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా తీర్చేది బాబానే. ఆయనే నా తండ్రి. 2021, డిసెంబరులో నా రెండు కాళ్ళ నరాలు పట్టేసి చాలా నొప్పి పెట్టాయి. పదిహేను నిమిషాలైనా తగ్గలేదు. ఏమైందోనని నేను చాలా భయపడ్డాను. వెంటనే మనసులో బాబాను తలుచుకుని, "నొప్పి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. చాలా ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".
2022, జనవరి నెల చివరిలో నాకు జలుబు, జ్వరం వచ్చాయి. బాబా దయవల్ల జ్వరం ఒక్క రోజులోనే తగ్గింది కానీ, నాలుగు రోజులైనా జలుబు తగ్గలేదు. ఏదైనా మింగుతుంటే టాన్సిల్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉండేది. నాకు ఏం చేయడానికి తోచక, "బాబా! రేపు పొద్దున్నకల్లా నాకు నయం కావాలి. అలా జరిగితే బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. మరుసటిరోజు(జనవరి 31) ఉదయం లేచేసరికి నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. బాబా నా ప్రార్థనను మన్నించారు. జలుబు, జ్వరం అన్నీ తగ్గాయి. ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతగా వెంటనే నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి పంపించాను. ఎవరికి ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో బాబాకి చెప్పుకోండి. ఆయన తప్పకుండా తీరుస్తారు. "బాబా అందరినీ చల్లగా చూడు తండ్రీ. ఎప్పుడూ మా వెంటే ఉండి మమ్మల్ని రక్షించు తండ్రీ. మీరే మాకు దిక్కు సాయి. తల్లీ, తండ్రీ, గురువు, దైవం, వైద్యుడు అన్నీ మీరే సాయి. ఐ లవ్ యు సాయి".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
తోటి భక్తుల అనుభవాల విషయంలో ఆలోచనను సరిచేసిన బాబా
అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, జనవరి 8న నేను ఇంస్టాగ్రామ్లో చీరలు ఆర్డరు పెట్టాను. వాళ్ళు 6, 7 రోజాల్లో ఆర్డర్ డెలివరీ చేస్తామని అన్నారు. అయితే రెండు వారాలైనా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను మెసేజ్ చేస్తే చూసేవాళ్ళు గాని, సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే వాళ్ళు కాదు. నేను ఆసమయంలో చాలా టెన్షన్ పడి, "బాబా! నేను పెట్టిన ఆర్డరు డెలివరీ అయితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయవల్ల 2022, జనవరి 31న నా ఆర్డరు డెలివరీ అయ్యింది. ఇక్కడ నేను ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ బ్లాగులో కొంతమంది భక్తులు బాబాకి చెప్పుకోవడం వల్ల వాళ్ల ఆర్డర్లు డెలివరీ అయ్యాయని తమ అనుభవాలు పంచుకున్నప్పుడు వాటిని చదివిన నేను 'ఇలాంటి వాటిని కూడా బాబాని అడగాలా? టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యమై ఉండొచ్చు కదా' అని నవ్వుకున్నాను. తోటి భక్తుల అనుభవాల విషయంలో నేను అలా అనుకోవటం తప్పే కదా. అందుకే బాబా నాకు ప్రాక్టికల్ అనుభవాన్ని ఇచ్చారు. తద్వారా డబ్బులు ఎవరివైనా ఒకటేనని, డబ్బులు కట్టిన తరువాత వస్తువు రాకపోతే అందరి టెన్షన్ ఒకేలా ఉంటుందని నాకు తెలిసేలా చేసారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు చెప్పినట్టుగానే నా తప్పుని ఒప్పుకుంటూ నా అనుభవాన్ని బ్లాగ్లులో పంచుకున్నాను. అలాగే నా తప్పుకు మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటున్నాను".
1. నిజంగా బాబా ఉన్నారు - వేడుకున్నంతనే అనుగ్రహిస్తున్నారు
2. రానున్న సమస్యకు ముందుగానే సందేశమిచ్చిన బాబా
3. తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా
నిజంగా బాబా ఉన్నారు - వేడుకున్నంతనే అనుగ్రహిస్తున్నారు
ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. 2022, జనవరి రెండవ వారంలో ఒకరోజు నేను బాబా ముందు నిలుచుని, "బాబా! మేము ఏమన్నా మొక్కులు మర్చిపోయి ఉంటే, వాటిని గుర్తు చేయండి. అలాగే ఆ మొక్కులు తీర్చుకునే శక్తినివ్వండి. మొక్కులు తీర్చుకోనందుకు అనేకానేక క్షమాపణలు" అని వేడుకున్నాను. మరుసటిరోజు మా అత్తయ్యగారు మాటల్లో తను మొక్కుకున్న ఒక మొక్కు గురించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రెండు రోజుల తర్వాత ఇంకో మొక్కు గురించి చెప్పారు. నాకు పెళ్ళై రెండు సంవత్సరాల రెండు నెలలు అయింది. ఇంతకాలంగా మొక్కుల గురించి ఎప్పుడూ చెప్పని అత్తయ్య హఠాత్తుగా బాబాని వేడుకున్నంతనే చెప్పడం బాబా అనుగ్రహానికి నిదర్శనం. నిజంగా బాబా ఉన్నారు.
2022, జనవరి నెల చివరి వారంలో మా అత్తయ్యగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎప్పుడూ ఉల్లాసంగా ఆఫీసు పని, ఇంట్లో పని చేసుకునే ఆమె ఒక్కసారిగా గృహనిర్బంధంలోకి వెళ్లడంతో ఇల్లంతా బోసిపోయి ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఇంకా ఆపరేషన్ అయి 3 నెలలు కూడా పూర్తి అవ్వని నేను పనులన్నీ చేసుకోవాల్సి వచ్చింది. నా బాబా దయవల్ల నా భర్త, మా మామయ్యగారు మంచివాళ్ళు అవటం వలన నాకు చాలా సహాయం చేసారు. అయితే మా ఇంట్లో వయస్సు పైబడిన మావారి నాన్నమ్మ ఉన్నారు. ఆవిడకి రెండు కళ్ళు కనపడవు. ఆమెకోసం పనిమనుషులు ఉన్నారు. వాళ్ళకి టిఫిన్లు, కాఫీలు చేయడం, మూడు నెలలు కూడా నిండని మా పాపని చూసుకోవడం వంటి వాటివల్ల నాకు కాస్త కష్టంగా అనిపించింది. అప్పుడు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గుర్తొచ్చి, 'అత్తయ్యకి కరోనా తగ్గి ఇంకా ఎవరికీ ఆ మహమ్మారి అంటుకోకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అంతే, ఆ మరుసటిరోజు మా అత్తయ్యగారికి వచ్చింది 'కరోనా కాదు, ఒమిక్రాన్ అని, దానివల్ల అసలు భయమే లేదు' అన్నారు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అత్తయ్య మునుపటిలా చక్కగా ఆఫీసుకి వెళ్లొస్తున్నారు. ఇంకా ఇంట్లో ఎవరికీ ఆ ఒమిక్రాన్ అంటుకోలేదు. ఇదంతా బాబా దయవల్లనే.
అత్తయ్యగారికి కరోనా ఉన్న సమయంలో పగలంతా మా పాప పడుకునేది. ఆ సమయంలో నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని. అయితే పగలు నిద్రపోవడం వల్ల పాప రాత్రిళ్ళు నిద్రపోయేది కాదు. అందువలన నాకు రాత్రి నిద్ర ఉండక పగలు బాగా అలసటగా ఉంటూ నిద్ర వస్తుండేది. అలా మూడురోజులు గడిచాక నాల్గవరోజు రాత్రి నేను, "బాబా! మీ ఊదీ పాపకి పెడుతున్నాను. పాప కనీసం 4 గంటలైనా నిద్రపోవాలి. అలా జరిగితే నేను కూడా నిద్రపోయి పొద్దున్న ఉల్లాసంగా పని చేసుకోగలుగుతాను. నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని కొద్దిగా ఊదీ పాపకి పెట్టాను. అంతే ఆరోజు పాప చక్కగా నిద్రపోయింది. నేను కూడా నిద్రపోయాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మా పాప ఆరోగ్యం బాగు అయ్యేట్టు చూడండి. నా బిడ్డకు పూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించండి".
రానున్న సమస్యకు ముందుగానే సందేశమిచ్చిన బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. నాకు మళ్ళీ ఇంత త్వరగా నా అనుభవాలను పంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఒకరోజు బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, "ఆమెకు నయమవుతుంది. నువ్వేమీ దిగులు చెందకు. నా ఊదీ నీళ్లలో కలిపి ఇవ్వు చాలు" అన్న సందేశం కనిపించింది. అయితే అప్పటికి మా ఇంట్లో అందరమూ బాగానే ఉన్నందున నేను ఆ మెసేజ్ నాకు కాదేమో అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో మా పాపకు విపరీతమైన జ్వరం వచ్చింది. నాకు భయమేసి బాబాను ప్రార్థించి పాపకి టాబ్లెట్ ఇచ్చాను. మరుక్షణం ఉదయం బ్లాగులో కనిపించిన మెసేజ్ గుర్తుకు వచ్చింది. వెంటనే ధైర్యం తెచ్చుకుని పాపకి ఊదీ కలిపిన నీళ్ళు ఇచ్చాను. అంతే, పాపకి జ్వరం తగ్గి మళ్ళీ రాలేదు. ఇదివరకు చెప్పానుగా 'నా బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నార'ని. కానీ నాకు టెన్షన్ ఎక్కువని బాబాకి తెలుసు. కాబట్టే ముందుగా "నువ్వేమి దిగులుకు చెందకు" అని చెప్పారు. "ఇలా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే బాబా!".
ఈ మధ్య మా ఫోన్ ఒకటి కనిపించలేదు. కాల్ చేస్తే, 'కవరేజ్ ఏరియా'లో లేదని వస్తుండేది. ఆ ఫోన్ కోసం రెండు రోజులు ఎంత వెతికినా అది కనిపించలేదు. అప్పుడు మా పాప, "ఫోన్ దొరికితే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకుంది. తర్వాత బాబా దయవల్ల ఫోన్ దొరికింది. "ధన్యవాదాలు తండ్రీ! ఎన్ని జన్మలైనా నేను మీ బిడ్డగానే పుట్టాలి. ఇంకా నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
తొందరగా కోలుకునేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తులకు బాబా ప్రసాదించిన తమ అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిచ్చిన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నాపేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇటీవల ఒమిక్రాన్ వైరస్ భయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, మేము దానికి మినహాయింపు కాదు. భయపడినట్లే మొదట నా కొడుకు తరువాత నేను అనారోగ్యం పాలయ్యాము. మేము ముఖ్యంగా వయసుపైబడిన నా తల్లిదండ్రుల గురించి భయపడి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒంటరిగా గదిలో ఉండసాగాము. అయినప్పటికీ ముందు మా అమ్మ, తరువాత మా నాన్న కూడా అనారోగ్యం పాలయ్యారు. అప్పుడింక ఒమిక్రాన్ లక్షణాలు తెలుసుకుని, మన ప్రియమైన సాయిమహరాజ్ని, "ఎక్కువ బాధకలగకుండా తొందరగా నా తల్లిదండ్రులకు ఉపశమనం చేకూర్చండి బాబా. అదే జరిగితే మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. నా ప్రార్థనను సాయిమహరాజ్ ఆమోదించి నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడకుండా చాలా త్వరగా కోలుకునేలా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బాబాకి మాటిచ్చినట్లు నేను ఈ అనుభవాన్ని నా ప్రియ సోదర సాయి భక్తులతో ఇప్పుడిలా పంచుకున్నాను. సాయిమహరాజ్‌కి నా వినయపూర్వక నమస్కారాలు.
శ్రీసమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
1. బాబా దయకు ప్రతిరూపమైన అనుభవాలు
2. దయ చూపిన బాబా
1. క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడిన బాబా
2. శ్రీసాయినాథుని కృపాకటాక్షాల వలన తగ్గిన బిపి
3. వెర్టిగో నుండి కాపాడిన బాబా
క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడిన బాబా
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నా పేరు కుమార్. నేను, నా భార్య వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాము. 2022వ సంవత్సరం తొలి నెలల్లో నా భార్య ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మూడునెలలు శిక్షణ ఇచ్చిన తరువాత ప్రాజెక్టులో వేస్తారు. కొన్నిరోజులు శిక్షణ బాగానే జరిగింది. తరువాత నా భార్యకి శిక్షణనిచ్చే కోచ్ ఏదో ఒక వంకతో తన మీద ప్రతిరోజూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాక శిక్షణ కూడా సరిగా ఇవ్వకుండా ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి వాళ్ళ మేనేజరుతో చెప్తుండేవాడు. అలా రోజురోజుకి ఆ కోచ్ ఆగడాలు మరింత ఎక్కువ అవుతూ ఉండేవి. అందువల్ల నా భార్యపై ఒత్తిడి ఎక్కువైపోయి ప్రతిరోజూ బాధపడుతూ చివరికి ట్రైనింగ్‌కి వెళ్లాలంటేనే భయపడే స్థితికి వచ్చి, 'అసలే కొత్త కంపెనీ, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల ముందు ముందు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోన'ని నా భార్య చాలా ఆందోళన చెందసాగింది. ఇలా ఉండగా ఒకరోజు తను తెలియక చేసిన ఒక పొరపాటు వలన ఆ కంపెనీకి 12 లక్షల రూపాయల నష్టం వచ్చే పరిస్ధితి ఏర్పడింది. అదే అదనుగా తీసుకుని ఆ కోచ్ నా భార్యను ఉద్యోగంలో నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నించాడు. నిజానికి అదంతా ఆ కోచ్ వల్లనే జరిగింది. అతను సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి ఉంటే ఆ సమస్య వచ్చేదే కాదు. ఇక ఆ రోజు నా భార్య ఇంట్లో గట్టిగా ఏడుస్తూ జరిగినదంతా చెప్పి, "తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తార"ని చాలా బాధపడింది. ఏ కష్టం వచ్చినా నా తండ్రి సాయినాథునికి చెప్పుకోవడం ఎప్పటినుండో నాకు అలవాటు. అందుచేత నా భార్య అలా ఏడవడం చూసిన నేను వెంటనే పూజగదిలోకి వెళ్ళి బాబా పటం ముందు నిల్చొని, దణ్ణం పెట్టుకుని సమస్యను ఆయనతో చెప్పి, "ఈ సమస్య నుండి నా భార్యను కాపాడి, ట్రైనింగ్‌లో తనకి సహాయం చేసి ఉద్యోగం నిలబడేలా చేయండి" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. నా తండ్రి సాయినాథుడు ఎంతో పెద్ద అద్బుతం చేశారు. సరిగ్గా మూడవరోజున మేనేజర్ నా భార్యకి ఫోన్ చేసి, "జరిగిన దాని గురించి ఆలోచించకుండా ట్రైనింగ్‌లో శ్రద్ధగా ఉంటూ అన్నీ సవ్యంగా నేర్చుకో" అని చెప్పారు. ఆ మాటలు విని మేమంతా చాలా ఆశ్చర్యపోయాము. నా తండ్రి సాయినాథుని దయవలన మాత్రమే మేము ఇంత పెద్ద సమస్య నుండి బయటపడ్డాము. అంతేకాదు బాబా ఆశీస్సులతో నా భార్య తన ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌లో జాయిన్ అయింది. ఇప్పుడు సాయినాథుని దయవలన తన పని తను చక్కగా చేసుకోగలుగుతుంది. అంత పెద్ద క్లిష్ట పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడిన మా సాయినాథునికి కోటానుకోట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటూ...
అఖిలాండకోటి అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!