సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1961వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా లీలలు ఎవరికీ అర్థం కావు - ఆయన ఎవరిని, ఎప్పుడు, ఎలా ఆశీర్వదిస్తారో తెలియదు


సాయిభక్తుల అనుభవమాలిక 1960వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వేడుకున్నంతనే ట్యాబ్ కనపడేలా అనుగ్రహించిన బాబా
2. అంతలా ఉంటుంది బాబా లీల

వేడుకున్నంతనే ట్యాబ్ కనపడేలా అనుగ్రహించిన బాబా

నా పేరు రాణి. మాది కాకినాడ. సాయి లేకుండా నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను. నా జీవితంలో సాయి ప్రసాదించిన అనుభవాలు చాలానే ఉన్నాయి. సాయి వద్దని చెప్పినవి చేయడం వల్ల రెండు, మూడుసార్లు నష్టం జరిగింది. అలాంటి అనుభవాలు ఎదురైనప్పటినుండి నా జీవితంలో ప్రతి నిమిషం సాయి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇక నా అనుభవానికి వస్తే..  2025, జనవరి 12న సంక్రాంతి పండక్కి శిరిడీలో ఉందామని నేను, నా పెద్దకూతురు స్నేహ శిరిడీ వెళ్ళాము. నా చిన్నకూతురు హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతుంది. మేము శిరిడీలో ఉన్నప్పుడు తను తన పని చేసుకొని లాప్టాప్, ట్యాబ్, ఫోను ఒకచోట పెట్టి తర్వాత లాప్టాప్, ఫోన్ తీసుకుని ట్యాబ్ అక్కడే మర్చిపోయింది. తర్వాత చూస్తే ఆ ట్యాబ్ కనిపించలేదు. దాని ధర 28,000 రూపాయలు. శిరిడీలో నేను, మా పెద్దమ్మాయి బాబా దర్శనం చేసుకొని రూమ్‌కి వచ్చేసరికి చిన్నమ్మాయి నాకు ఫోన్ చేసి ట్యాబ్ కనపడటం లేదని చెప్పి ఏడ్చింది. అది విని నేను "బాబా! ఇదేంటి పండగ సందర్భంగా ఇక్కడికి వస్తే. నాకు విచారం కలగజేస్తున్నావు. మీ దయతో ట్యాబ్ దొరకాలి తండ్రీ" అని అనుకున్నాను. వెంటనే మావారు ఫోన్ చేసి, "ట్యాబ్ బెడ్ షీట్ కింద ఉంది. ఇంతకుముందు చాలాసార్లు వెతికిన కనపడనిది ఇప్పుడు హఠాత్తుగా కనబడింది" అని చెప్పారు. నేను, "సాయిదేవా! కాసేపు ఎంత కంగారుపెట్టావు" అని నమస్కరించుకుని చాలా సంతోషంగా శిరిడీలో గడిపి తిరిగి కాకినాడ వచ్చాము. "ధన్యవాదాలు బాబా. నా స్నేహ అడిగింది కూడా నెరవేర్చు స్వామి. నా తప్పులుంటే క్షమించి కనికరించు బాబా".

అంతలా ఉంటుంది బాబా లీల

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాధిక. 2025, జనవరి 22న బాబా నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా భర్తకి షుగర్ వ్యాధి ఉన్నందున ఆయన జనవరి 21న రెగ్యులర్ చెకప్‌కి వెళ్లి అందులో భాగంగా రెటీనా టెస్టు చేయించుకుంటే, డాక్టరు రిపోర్టు ఆధారంగా, "కంటికి సంబంధించిన గ్లూకోమా వ్యాధి ఉందేమోనని అనుమానంగా ఉంది. ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్లో చూపించుకోండి" అని అన్నారు. ఆ వ్యాధి నా భర్త నాయనమ్మకు వుంది. అది వంశపారంపర్యంగా వస్తుందని డాక్టర్లు చెప్పడంతో నేను, నా భర్త పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేం. ఆ వ్యాధి వల్ల కంటి చూపు మందగించి క్రమంగా అంధత్వంగా పరిణమిస్తుందని మేము చాలా చాలా భయపడ్డాము. నేను సాయిని, "సాయీ! ఆ వ్యాధిని నయం చేయలేమని, పెరగకుండా జీవితాంతం ఐడ్రాప్స్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. కానీ ఆ వ్యాధి పెరగకుండా డ్రాప్స్‌తో తగ్గేలా చేయండి బాబా" అని వేడుకుని ఆయన నామస్మరణ చేయడం మొదలుపెట్టాను. మర్నాడు 2025, జనవరి 22, తెల్లవారుజామున 5 గంటలకు మేము ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్‌కి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకుంటే, ఎన్నో టెస్టుల అనంతరం సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకి డాక్టర్లు, "మీరు భయపడుతున్నట్లుగా ఏమీ లేదు. కంటిలో నరం పెద్దదిగా ఉండటం వలన డాక్టర్ అనుమానం వ్యక్తం చేశార"ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ క్షణం మేము ఎంత సంతోషపడ్డామంటే మాకు నోట్లో నుండి మాట రాలేదు, కళ్ళనుండి నీళ్లు తప్ప. అప్పటివరకు నేను సాయినామస్మరణ చేస్తూనే ఉన్నాను. నేను సాయితో వ్యాధి పెరగకుండా డ్రాప్స్ తో తగ్గేలా చేయమని చెప్పుకుంటే, ఆయన 'అసలు వ్యాధే లేదని' చెప్పేలా చేశారు. అంతలా ఉంటుంది బాబా లీల మరి. ఆయనకు సర్వస్య శరణాగతి వెడితే ఆయన తప్పకుండా మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం నేను మ్రొక్కుకున్నవన్నీ తీర్చేశాను. "బాబా! ఇలానే మీ కరుణ మా మీద సదా ఉంచండి".

సాయిభక్తుల అనుభవమాలిక 1959వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మొదటి శిరిడీ దర్శనం
2. అంతా బాబా లీల

మొదటి శిరిడీ దర్శనం

నా పేరు రాజన్ బాబు. నేను అప్పుడప్పుడే బాబాని నమ్ముతున్న రోజుల్లో నా జీవితంలో ఏవో సమస్యల వల్ల ఇంట్లో మనశాంతి కరువైంది. ఏదేమైనా నా సమస్యలకు పరిష్కారం కావాలంటే బాబాని నమ్మడమే సరైన పని అని పూర్తిగా బాబాపై విశ్వాసముంచి ఆయన్ని వేడుకున్నాను. 2019, అక్టోబర్ 9, దసరాకి ముందు ఇంట్లో గొడవలతో ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడడం లేదు. అందువల్ల ఈ దసరా సమయంలో ఇక్కడ ఉండొద్దని అనుకున్నాను. అంతలోపే శిరిడీ వెళ్దామని ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడే నా ఫోన్లో కాజీపేట నుండి శిరిడీకి ట్రైన్లు ఉన్నాయా అని చూస్తే దసరారోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ట్రైన్ ఉంది. వెంటనే స్లీపర్ టికెట్ బుక్ చేశాను. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పటికీ సరిగా దసరా ముందురోజు కన్ఫర్మ్ అయింది. దాంతో నేను ప్రయాణానికి సిద్ధమయ్యాను. మరో అద్భుతం ఏమిటంటే, నా టికెట్ స్లీపర్ క్లాస్ నుండి సెకండ్ ఏసికి అప్గ్రేడ్ అయిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను ఆనందంగా బాబాకు నమస్కరించుకొని ట్రైన్ ఎక్కాను. కానీ నేను మొదటిసారి శిరిడీ వెళ్తున్నాను. నాకు ఏమీ తెలియనందు వల్ల, "బాబా! నాకు ఏమీ తెలియదు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి తిరిగి వచ్చేదాకా నా వెంట ఉండి చూసుకోవాల"ని వేడుకొని నా సీట్లో కూర్చున్నాను. కాసేపటికి నా బెర్త్ పైకెక్కి పడుకొని ఆలోచిస్తూ, "నా ప్రయాణం ఎలా జరుగుతుంది బాబా? నీవే దిక్కు" అని పదేపదే బాబాను తలుచుకుంటున్నాను. కొంతసేపటికి ట్రైన్ హైదరాబాదులో ఆగింది. కిందకి దిగి తినడానికి కొన్ని కొనుక్కొని మళ్ళీ ట్రైన్ ఎక్కాను. ట్రైన్ బయలుదేరింది. నా ఎదురు బెర్త్లో పడుకొని ఉన్న విజయవాడకి చెందిన ఒక అబ్బాయి హఠాత్తుగా లేచి, "హైదరాబాద్ వచ్చిందా?" అని అడిగాడు. నేను, "ఆ.. ఇప్పుడే వెళ్లిపోయింది" అన్నాను. అతను, "అయ్యో..! ఓకే" అన్నాడు. అతని దగ్గర తినడానికి రేగిపళ్ళు తప్ప ఏవీ లేవు. వాటిని తింటుంటే నాకు బాధేసి నా దగ్గరున్న అరటిపళ్ళు అతనికి ఇచ్చాను. ఒకరినొకరం పరిచయం చేసుకున్నాము. అతను తరచూ శిరిడీ వెళ్లి, వస్తుంటానని చెప్పాడు. నేను ఆనందంగా శిరిడీ తెలిసిన వ్యక్తిని పరిచయం చేసారని బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇద్దరం కలిసి శిరిడీ చేరుకొని ముందుగా ధూళి దర్శనం చేసుకున్నాం. అతను, "నేను రేపు తిరిగి వెళ్తాను" అని అన్నాను. నేను మూడు రోజులుంటాను అని అన్నాను. రూములు చూసి ఒక రూమ్ తీసుకున్నాము. అప్పటివరకు నాతో ఉన్న అతను, "నేను ఎక్కడైనా పడుకుంటాను" అన్నాడు. నేను, "వద్దు. నువ్వు నాతోనే ఉండు" అన్నాను. అతను సరేనని స్నానం చేసాక నన్ను మళ్లీ బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు. ప్రసాదాలయం, ఇంకా అన్నీ చూపించి మర్నాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. నేను అతనితో వెళ్లి, అతన్ని ట్రైన్ ఎక్కించి వచ్చాను. నేను అక్కడున్న మూడు రోజులు కనీసం రోజుకు మూడుసార్లు చొప్పున వీలైనన్నీ సార్లు దర్శనం చేసుకున్నాను. త్రయంబకేశ్వరం కూడా వెళ్ళొచ్చాను. ప్రతి విషయంలో బాబా దగ్గరుండి నన్ను తిరిగి ఇంటికి చేర్చారు. "ధన్యవాదాలు బాబా".

అంతా బాబా లీల

'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు పాఠకులకు నమస్కారాలు. నా పేరు వెంకటేష్. 2024, ఫిబ్రవరి 22న నేను నా కుటుంబంతో మా కజిన్ సిస్టర్ పెళ్లికి వెళ్లాను. అక్కడ ఫంక్షన్ హాల్లో మా కుటుంబానికి కేటాయించిన గదిలో ఉన్నాం. పెళ్ళైపోయాక నేను మా బ్యాగులన్నీ సర్ది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశాను. తర్వాత బ్యాగులన్నీ నేను, నా భార్య బయటికి తీసుకొచ్చాము. నేను గదికి తాళం వేసే ముందు మరోసారి గదిలో అంతా చూసి, మా వస్తువులు ఏవీ లేవన్న నిర్ధారణకొచ్చిన తర్వాత తాళం చేసి, తాళాలు ఇచ్చేసాను. నాకు బాగా గుర్తుంది, నా బ్యాగును నేనే పెళ్లికూతురు గదిలో పెట్టాను. తర్వాత మేము బయలుదేరేముందు పనివాళ్ళు అన్నీ బ్యాగులు మా కారులో పెట్టారు. నేను అన్నీ వచ్చే ఉంటాయని చెక్ చేసుకోలేదు. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే, ఒక బ్యాగు కనిపించలేదు. ఎవరిదా ఆ బ్యాగు అని చూసుకుంటే అది నాదే. ఆ బ్యాగులోని పెళ్లికోసం కొన్న కొత్త బట్టలు, బిజినెస్ కోసం ఉపయోగించే మొబైల్, లాకర్ తాళాలు ఉన్నందున చాలా టెన్షన్ పడ్డాను. ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం అంతా వెతికినా కనిపించలేదు. అప్పుడు పెళ్ళికొడుకువాళ్లకి విషయం చెప్తే, ఫంక్షన్ హాల్ దగ్గర విచారించారు, సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసారు కానీ, ఆ బ్యాగు జాడ తెలియలేదు. నేను చాలా భయపడిపోయి మనసులో బాబాని తలుచుకున్నాను. వాళ్ళు మరుసటిరోజు మళ్లీ వెళ్లి పెళ్లికూతురు గది, మేము ఉన్న గది చెక్ చేశారు. అప్పుడు మేము ఉండిన గదిలోనే ఆ బ్యాగు ఉందట. ఆ విషయం వాళ్లు కాల్ చేసి చెప్తే, నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎందుకంటే, నేను గదికి తాళం వేసే ముందు బాగా చెక్ చేశాను. ఇంకా అప్పుడు అంతా బాబా లీల అనుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1958వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రార్థనలకు బాబా సమాధానం

నా పేరు మాధవి. నా ప్రార్థనలకు బాబా ఎలా సమాధానమిచ్చారో నేనిప్పుడు పంచుకుంటాను. మా అమ్మ, వదినలు మధ్య కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు సన్నిహితంగా మాట్లాడుకునేవారు. అలాంటిది ఒకరోజు మా అమ్మ, "కోడలు నాతో మాట్లాడటం లేద"ని చెప్పింది(కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇక్కడ సమస్య గురించిన వివరాలు ప్రస్తావించలేను). అది విని నేను ఆందోళన చెంది, "బాబా! దయచేసి వదిన అమ్మతో మాట్లాడేలా చేయండి. ఆమె మొండిగా ఉంటుందని నాకు తెలుసు. అలాగని ఏ సంబంధాన్ని వదిలిపెట్టలేం" అని బాబాతో చెప్పుకొని బాధపడ్డాను. ఇక అద్భుతం చూడండి. నేను మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసినప్పుడు మామూలుగా "వదిన  మాట్లాడుతుందా?" అని అడిగాను. అందుకు అమ్మ, "నిన్న ఫోన్ చేసింది. ఏమీ జరగనట్లు చక్కగా మాట్లాడింది" అని చెప్పింది. అది విని నేను సంతోషించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా. నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నానని మీకు తెలుసు. వాళ్లకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా ఇంకేమైనా సమస్యలు వచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంటే వాళ్లే(వదినవాళ్ళు) అండగా ఉండాలి. దయచేసి వారి బంధాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా అనుగ్రహించండి".

2024లో మా అమ్మానాన్న కొత్త ఇంటికి మారి పాత ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నారు. అయితే 2 నెలలు చూసినా ఎవరూ అద్దెకు రాలేదు. ఎవరైనా వచ్చినా ఇల్లు చూసి వెళ్లిపోతుండేవారు. ఈ పరిస్థితి అమ్మవాళ్లకి బాధను కలిగించడంతోపాటు ఆర్థికంగా ఇబ్బందిపెట్టింది. నేను వాళ్ళని ఆ స్థితిలో చూడలేకపోయాను. ఒకరోజు నేను ఈ బ్లాగును చదువుతున్నప్పుడు, ఇదే సమస్యను ఎదుర్కొన్న ఒక భక్తుని అనుభవం చూసాను. అందులో వాళ్ళ ఇంటిని డిసెంబర్‌లో ఎవరో అద్దెకు తీసుకోవోడంతో సమస్య తీరినట్లు ఉంది. అది చదివాక ఖచ్చితంగా చెప్పలేనుగానీ, 'డిసెంబర్ నాటికి అమ్మావాళ్ళింట్లో ఎవరో అద్దెకు వస్తారని బాబా నాకు సూచన ఇచ్చారని' అనుకున్నాను. తరువాత సరిగ్గా అదే జరిగింది. ఎవరో వచ్చి విచారించి, డిసెంబరులో ఇంటిలో దిగుతామని చెప్పారు. అది తెలిసి నేను, 'బాబా మనల్ని ఎంతలా చూసుకుంటున్నారు?' అని ఆశ్చర్యపోయాను. బాబా తమ బిడ్డలు సంతోషంగా లేకుంటే చూడలేరు. ఆయన నా ప్రార్థనలకు వేరే భక్తుల అనుభవం ద్వారా నాకు సమాధానం ఇచ్చారు. "చాలా ధన్యవాదాలు బాబా".

ఒకరోజు అకస్మాత్తుగా నా మేనేజర్ నాకు ఫోన్ చేసి, 'నేను ఒక పనికోసం ఎక్కువ గంటలు నమోదు చేసానని, దాన్ని సర్దుబాటు చేయమని, అన్ని గంటలకి పేమెంట్ ఇవ్వలేమని' చెప్పారు. దాంతో నేను డబ్బు గురించి ఆలోచించలేదు కానీ, నమ్మకం దెబ్బతింటుందని కొంచెం ఆందోళన చెంది చాలా బాధపడ్డాను. అయితే ఆ సమయంలో గంటల సంఖ్యను వేరే పనికింద సర్దుబాటు చేయడానికి కూడా వేరే అవకాశం లేకపోయింది. ఎందుకంటే, అది డిసెంబర్ నెల అయినందున నాకు ఎక్కువ పనులు లేవు. ఏదేమైనా నేను సమస్యను బాబా పాదకమలాల వద్ద ఉంచాను. తర్వాత నేను ఫేస్‌బుక్ పేజీలో చూస్తుంటే సాయిబాబా ఫోటో క్రింద, "నువ్వు పెద్ద ప్రమాదం నుండి రక్షించబడ్డావు. ఇది నువ్వు అనుకున్నట్లు జరగలేదని చింతించకు. ఇది నీ మేలు కోసం నా ప్రణాళిక. అనుకున్నవి సమయానికి నెరవేరుతాయి" అని వ్రాసింది. అది చూసిన నేను, 'బాబాకు మనకు ఏది మంచిదో తెలుసు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు' అని అనుకున్నాను. కానీ నా టీమ్ ఈ అంశాన్ని స్టాండ్-అప్ మీటింగ్ వరకు లాగకూడదని అనుకున్నాను. తర్వాత నేను మీటింగ్‌కి హాజరయ్యే ముందు బాబాని ప్రార్థించి, కేవలం ఆయన నుండి భరోసా కోసం, "బాబా! దయచేసి మీటింగ్‌లో ఆ అంశం రావడం లేదని నాకు ఏదైనా హామీ ఇవ్వండి" అని అడిగాను. సమావేశానికి కొన్ని నిమిషాల ముందు నేను ఫేస్‌బుక్‌లో, "నేను నీకోసం పోరాడతాను. ఆందోళనలన్నీ తీసేసి ప్రశాంతంగా కూర్చో. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నా మాటలు నమ్ము" అని బాబా సందేశం చూసాను. బాబా అలా చెప్పడం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించి మీటింగ్‌కి హాజరయ్యాను. బాబా చెప్పినట్లు మీటింగ్‌లో ఆ అంశం రాలేదు. "చాలా ధన్యవాదాలు బాబా. నా జీవితానికి సృష్టికర్త మీరే. మీకు ఏది కావాలంటే అది చేయండి. అయితే ఎప్పుడూ మాతో ఉండండి. పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా మీ ఉనికిని అనుభవిస్తుంటే నేను భయపడను దేవా. దయచేసి నాకు నమ్మకం కలిగించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 1957వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తిని గెలిపించిన బాబా
2. బాబాని తలచిన వెంటనే కనపడిన చెక్ బుక్



సాయిభక్తుల అనుభవమాలిక 1956వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి దయ
2. బాబా కృప 

శ్రీసాయి దయ

సాయి దేవుడికి, సాయి బంధువులకు నమస్కారం. నా పేరు రమాదేవి. నేను ఇప్పుడు మా తిరుమల యాత్రలో బాబా చేసిన సహాయం గురించి మీతో పంచుకుంటున్నాను. 2024, డిసెంబర్ 5న స్వామివారి అర్చన సేవకు మాకు టికెట్ లభించింది. అర్చన సేవకు వెళ్లే భక్తులకు స్వామివారిని 45 నిమిషాలపాటు దర్శించుకునే భాగ్యం ఉంటుందని తెలిసి నేను చాలా సంతోషించాను. కానీ అది నాకు నెలసరి సమయం. నెలసరి రాకుండా టాబ్లెట్లు వేసుకుందామంటే, అవి నాకు పడటం లేదు. అందుకని నాకు ఏం చేయాలో తెలియక, "సర్వ దేవతా దర్శనం మీ కృప వలననే జరుగుతుంది బాబా. వేంకటేశ్వరస్వామి అర్చన సేవకు ఆటంకం రాకుండా చూడండి బాబా" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ తీసుకుంటూ బాబా మీద భారమేశాను. ఒకరోజు ఆఫీసులో నా సహోద్యోగితో విషయం చెపితే తను, "ఒకసారి డాక్టర్ సలహా తీసుకుంటే మంచిద"ని చెప్పింది. నేను అంతా బాబా దయ అని డాక్టర్‌ను కలిస్తే, టాబ్లెట్లు వ్రాశారు. అవి వాడుతూ ఉంటే మా తిరుమల ప్రయాణానికి ముందురోజు వరకు బాగానే ఉంది కానీ, ఆ రోజు ఇబ్బంది మొదలవుతుందేమోననిపించి బాబాను, దత్తాత్రేయుని, వేంకటేశ్వరస్వామిని "మీ కృపతో ఏ ఆటంకం లేకుండా దర్శనం జరగాల"ని వేడుకున్నాను. బాబా దయవలన ఏ ఇబ్బందీ లేకుండా స్వామి దర్శనం, అర్చన సేవ ప్రశాంతంగా జరిగాయి. మరుసటిరోజు మేము తిరుచానూరు వెళ్ళాము. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆరోజు చివరి రోజు. చక్రస్నానం చేసేరోజు. మాకు ఆ విషయం తెలియక పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామనుకున్నాం. కానీ బాబా పంపినట్టు పోలీసువాళ్ళు చక్రస్నానం విశిష్ఠత చెప్పి, స్నానం చేసి వెళ్ళమని చెప్పారు. మేము అలాగే చేసి క్షేమంగా ఇంటికి చేసుకున్నాము. అంతా బాబా దయ. "మీకు చాలా కృతజ్ఞతలు సాయిదేవా".

రెండు నెలల నుండి నా చర్మం, తల బాగా దురదగా ఉంటుండేవి. డాక్టర్ని సంప్రదిస్తే, కొన్ని క్రీములు వాడమన్నారు. వాటిని దురద ఉన్న చోట రాస్తే తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండేది.చివరికి నేను బాబాని వేడుకొని ఊదీ తీసుకొని, ఇన్ఫెక్షన్ ఉన్న చోట బాబా అభిషేక జలం రాశాను. బాబా దయవలన దురద పూర్తిగా తగ్గిపోయింది. "శతకోటి నమస్కారాలు బాబా".

ఒక ఆన్లైన్ అకౌంట్ తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు KYC అప్డేట్ అవ్వలేదు. అప్పుడు, "అకౌంట్ ఓపెనింగ్ అవ్వాలి" అని బాబాని వేడుకుంటే ఏ సమస్య లేకుండా అకౌంట్ ఓపెన్ అయింది. "థాంక్యూ సాయిదేవా. అడుగడుగున మీ తోడు మాకు కావాలి బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1955వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రమాద తీవ్రతను తగ్గించిన బాబా
2. బాబా ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఇస్తారు!
3. మొర విని ఆరోగ్యంగా ఇంటికి పంపిన బాబా

ప్రమాద తీవ్రతను తగ్గించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః. ప్రియమైన సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు శివగణేష్. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. నేను రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాను. నాకు ప్రతి గురువారం సెలవు దినం. 2024, డిసెంబర్ 11, బుధవారం సాయంత్రం గం.4:30ని.లకు ఎప్పటి మాదిరిగానే నా డ్యూటీ అయిన తర్వాత విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా స్వగ్రామమైన మునగపాకలో ఉన్న నా తల్లిదండ్రులు వద్దకు బయలుదేరాను. వెళ్లేముందు మా ఊరిలో చలి ఎక్కువగా ఉంటుందని మా అమ్మానాన్నలకోసం చలికోట్లు, వాటితోపాటు నా జర్కిన్ బ్యాగులో పెట్టుకున్నాను. నాకు జరగబోయే ప్రమాదం గురించి బాబాకి ముందుగానే తెలుసునేమో! నేను బైక్ మీద 'ఎన్ఏడి' దగ్గరకు వచ్చిన తర్వాత నాకెందుకో జర్కిన్ వేసుకోవాలనిపించి వేసుకున్నాను. తర్వాత నేను నా బైక్ మీద వెళ్తుండగా సరిగ్గా విశాఖ డైరీ సమీపంలోకి రాగానే హఠాత్తుగా ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు బైక్ మీద చాలా వేగంగా నా వెనుకనుండి వచ్చి నా బైక్ హ్యాండిల్‌ని ఢీకొట్టారు. దాంతో నా బైక్ జారి బైక్ తోపాటు నేను కింద పడిపోయాను. క్షణకాలం ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఆ కుర్రాళ్ళు కనీసం ఆగకుండా వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. దాదాపు ఐదు నిమిషాల వరకు నన్ను పైకి లేపడానికి కూడా ఎవరూ రాలేదు. ఆ సమయంలో భారీ వాహనాలు ఏవైనా వచ్చుంటే నా పరిస్థితి వేరుగా ఉండేది. కానీ బాబా దయవల్ల అలాంటిదేమీ జరగలేదు. ఇంకా ఆయన కృపవల్ల రోడ్డుపై పడ్డ నాకు ఎక్కువ గాయాలు కాకుండా నేను వేసుకున్న జర్కిన్, నా తలకు ఏమీ కాకుండా నా హెల్మెట్ కాపాడాయి. అంతేకాదు, బైకుపై నా వెనక పెట్టుకున్న మా అమ్మానాన్నల చలికోట్లున్న బ్యాగు నా నడుము కింద దిండులా పడి నా నడుముకి ఏమీ కాకుండా కాపాడింది. ఇలా అన్నివిధాలా బాబా నన్ను ఒక అతిపెద్ద ప్రమాదం నుండి కాపాడారు. కాకపోతే, నా ఎడమ కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. దానికోసం నేను ఆ రోజు వేసుకున్న టాబ్లెట్ల కారణంగా ఏమోగానీ నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఎంత ప్రయత్నించినా నొప్పి భరించలేకపోయాను. చివరికి బాబాని వేడుకొని ఊదీ కలిపిన నీళ్లు తాగాను. అంతే, అద్భుతం జరిగింది. నిమిషాల్లో అంత నొప్పి మాయమైపోయింది. అప్పుడే అనుకున్నాను, ఈ విషయాన్ని ఖచ్చితంగా బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలని. చివరిగా ఎవరూ కర్మ నుండి తప్పించుకోలేరు కానీ, మన ఇష్టదైవం సులభంగా దానిని నుండి బయటపడేలా చేస్తారు. ఆరోజు నాకు చాలా పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండి ఉంటుంది. కానీ ఆ ప్రమాద తీవ్రతను తగ్గించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

బాబా ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఇస్తారు!

నా పేరు శ్రద్ధ. నేను ఒక సంవత్సరం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వచ్చిన కొన్ని అవకాశాలు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అయి చివరికి రద్దు అయ్యాయి. నేను తట్టుకోలేక, "ఎందుకిలా అవుతుంది?" అని బాబాని చాలా కోపంగా అడిగాను. ఎందుకంటే, అది చాలా కష్టకాలం. నేను ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి అప్పుల్లో ఉన్నాను. ఎందుకో తెలీదు హఠాత్తుగా నా దగ్గరున్న గురుచరిత్ర రోజుకు కనీసం ఒక అధ్యాయం చదవడం మొదలుపెట్టి ప్రతి రాత్రి బాబాని, "నాకు సహాయం చేయమ"ని ప్రార్థిస్తుండేదాన్ని. అద్భుతంగా ఆ పుస్తకం పూర్తయ్యేలోపు నేను సరిగా చేయలేదన్న కంపెనీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు నేను పోగొట్టుకున్న అన్నీ అవకాశాల కంటే ఇది చాలా మంచి ఆఫర్. అప్పుడు అర్థమైంది, 'బాబా మనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఇస్తార'ని. మనం శ్రద్ధ, సబూరి కలిగి ఉంటే బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. "చిన్ననాటి నుండి నాకు తోడుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1954వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కోరుకున్నట్లే ఆడబిడ్డని ప్రసాదించిన బాబా

నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇప్పుడు మేము ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అద్భుత అనుభవం చెప్తాను. బాబా దయవల్ల మాకు ఇదివరకు ఒక బాబు ఉన్నాడు. గత ఏడాది మేము శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాక మళ్లీ నా భార్య గర్భవతి అయింది. ఆ సాయితండ్రి మొదట నుండి ఎటువంటి సమస్యలు రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. నా భార్య మా బాబు పుట్టినప్పటి నుంచి ఈసారి ఆడపిల్ల పుడితే బాగుంటుందని అనుకోసాగింది. నా విషయానికి వస్తే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు క్యాన్సర్‌తో చనిపోయిన మా అమ్మ నా కూతురిగా మళ్ళీ పుడితే బాగుంటుందని, అదే జరిగితే పది మందికి అన్నదానం చేసి, 1000 రూపాయలు బాబా మందిరంలోని హుండీలో సమర్పించుకుంటానని ఆ తండ్రి సాయినాథుని ప్రార్థిస్తూ ఉండేవాడిని. అలా బాబాకి చెప్పుకున్నాక నేను పాపే పుడుతుందన్న నిర్ధారణకు వచ్చేసాను. అయితే కొంతమంది 'బాబు' అని, మరికొంతమంది 'పాప' పుడుతుందని అంటుండేవారు. అది విని నా భార్యకి కాస్త టెన్షన్ మొదలైంది. నేను మాత్రం మొదట్లో పాపే పుడుతుందని విశ్వాసంతో ఉన్నప్పటికీ చివరికొచ్చేసరికి నాకు కూడా కాస్త టెన్షన్ మొదలయింది. కానీ బాబాకి చెప్పుకుంటే జరగనిది ఏమైనా ఉంటుందా!

2024, డిసెంబర్ 16కి 4-5 రోజుల ముందు నుండి నా వీపు ఎడమ భాగంలో నొప్పి వస్తుండేది. మొదట తెలిసిన రైల్వే ఫార్మసిస్ట్‌తో విషయం చెప్తే, "కిడ్నీలో రాళ్ళు ఉంటే అలా నొప్పి వస్తుంది. తొందరగా సోనోగ్రఫీ చేయించుకోండి" అని అన్నారు. అది విని నేను చాలా భయపడ్డాను. తరువాత డాక్టర్ని సంప్రదిస్తే, "శీతాకాలం కదా! కండరాలలో సమస్య అయుండొచ్చు" అని మందులు వ్రాసిచ్చారు. అవి వాడాక రెండు రోజులు కాస్త బాగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ 3, 4 రోజుల తర్వాత మళ్ళీ నొప్పి మొదలయ్యింది. దాంతో నేను మరల హాస్పిటల్‌కి వెళ్తే, ఆ డాక్టర్ లేరు. ఫోన్ చేసి మాట్లాడితే, వేరే డాక్టర్ని కలవమన్నారు. సరేనని వేరే డాక్టర్ని కలిస్తే, బ్లడ్ టెస్టులు, సోనోగ్రఫీ చేయించమని సూచించారు. అలాగేనని నేను ల్యాబ్‌కి వెళ్తే, ఆ సమయంలో ల్యాబ్ క్లోజ్ చేసుంది. అక్కడున్నవాళ్ళు మర్నాడు రమ్మన్నారు. అప్పుడు నేను, "బాబా! టెస్టులు చేయించుకోకుండా నొప్పి తగ్గేలా చేయండి. ఒకవేళ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలంటే, రిపోర్ట్ నార్మల్ వచ్చేలా చూడండి. కిడ్నీలో ఎటువంటి సమస్యలు లేకుండా కరుణించండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఇక బాబా చూపిన కరుణ చూడండి. అదేరోజు సాయంత్రం(2024, డిసెంబర్ 16) హైదరాబాద్‌లో ఉన్న నా భార్య చెకప్‌కని హాస్పిటల్‌కి వెళ్తే డెలివరీ ప్రాసెస్ మొదలుపెట్టి నొప్పులొస్తే రండని, ఒకవేళ రాకపోయినా డిసెంబర్ 18న వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండని అన్నారు. ఇక నేను అర్జెంట్‌గా హైదరాబాద్ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దాంతో నేను ఈ సమస్య గురించి తర్వాత చూద్దాంలే అని వెంటనే సొలాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరాను. నేను మధ్యదారిలో ఉండగా 16వ తేదీ రాత్రి నా భార్యకు నొప్పులు రావడంతో తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నేను మర్నాడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నాను. ఆ సమయంలో నా భార్యకి కాస్త నార్మల్‌గా ఉందనడంలో వేరే హాస్పిటల్లో ఉన్న మా అన్నయ్యని(తనకి డిసెంబర్ 16న ఆక్సిడెంట్ అయి, కాలు, చేయి ఫ్రాక్చర్ అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు) కలిసి ఉదయం 10:30 సమయంలో ఆ హాస్పిటల్ నుండి మా ఆవిడ ఉన్న హాస్పిటల్‌కి బయల్దేరాను. మధ్యలో ఒక బాబా మందిరం కనిపిస్తే, సుమారు 11:00 గంటల సమయంలో బాబా దర్శనం చేసుకొని, "బాబా! ఆరోగ్యకరమైన పండంటి బిడ్డను ప్రసాదించండి. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా చూడండి" అని వేడుకున్నాను. తర్వాత బాబా మందిరం బయట ఉన్న శివలింగంకి కూడా నమస్కరించుకున్నాను. తర్వాత అక్కడినుండి నా భార్య ఉన్న హాస్పిటల్‌కి చేరే సమయానికి సరిగ్గా 11:49కి నా భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ అయింది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. పాప పుట్టిన తరువాత నా వీపు నొప్పి పోయింది. అంతా బాబా చేసిన అద్భుతం. 

ఇకపోతే, పాప పుట్టిన తర్వాత 11వ రోజు అనగా డిసెంబర్ 27న నా భార్య, తన అక్క, అమ్మ హైదరాబాద్ నుండి వాళ్ళ సొంతూరు విజయనగరం వెళ్లాలని అనుకున్నారు. అయితే అది క్రిస్మస్ సమయమైనందున ట్రైన్లలో సీట్లు ఖాళీ లేవు. ముంబయి నుండి విశాఖపట్నం వెళ్లే LTT-VSKP ఎక్ష్ప్రెస్స్‌లో వెయిటింగ్ లిస్టు 4 ఉంటే ముగ్గురికి ముంబయి నుండి విశాఖపట్నంకి బోర్డింగ్ పాయింట్ లింగంపల్లి(హైదరాబాద్) పెట్టి టికెట్ బుక్ చేశాను. తర్వాత ఎందుకైనా మంచిదని ముగ్గురికి చెప్పి ముంబయిలో ఎమర్జెన్సీ కోటాలో సీట్ కన్ఫర్మేషన్ కోసం వేరువేరుగా దరఖాస్తు చేశాను. అయితే ప్రయాణమయ్యే రోజు రాత్రి 7 గంటలకి చార్ట్ తయారుచేసేవరకు టిక్కెట్ ఆర్ఏసిలోనే ఉంది. ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు పిల్లల్తో అంత దూరం ప్రయాణించడం చాలా కష్టం. అందువలన నేను బాబాని తలుచుకొని, "బాబా! చిన్న పిల్లల్తో అంతదూర ప్రయాణం చాలా కష్టం. దయచేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా చూడండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబా కరుణ చూపారు. అరగంటలో అనుకుంట! టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని నాకు మెసేజ్ వచ్చింది. ‌బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి అన్నదానం చేశాను. "మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే బాబా. మీరు నాకు తోడుగా ఉన్నంతవరకు నాకు ఎటువంటి సమస్య ఉండదు తండ్రి".

సాయిభక్తుల అనుభవమాలిక 1953వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీలో పొందిన అనుభూతి
2. కష్టపడి కొనుక్కున్న సైకిల్ దొరికేలా అనుగ్రహించిన బాబా
3. నెలల తరబడి పరిష్కారమవ్వని సమస్యను పరిష్కరించిన బాబా




సాయిభక్తుల అనుభవమాలిక 1952వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పుట్టినరోజున బాబా ఆశీస్సులు
2. అంతా ప్రశాంతంగా జరిపించిన బాబా


అంతా ప్రశాంతంగా జరిపించిన బాబా

సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 2024, దసరా సమయంలో మా అన్నయ్య అయ్యప్పస్వామి మాల వేసుకున్నాడు. శబరిమల వెళ్ళడానికి 11 రోజుల ముందు తన 5 సంవత్సరాల కూతురికి మాల వేసి తనని కూడా శబరిమలకి తీసుకొని వెళ్లాలని అనుకున్నాడు. అయితే చిన్న పిల్ల కదా! మాల ధరించి ఉండగలదా, లేదా అని భయపడ్డాడు. అయినా తనకి, తన కూతురికి ట్రైన్ టికెట్లు ముందుగా బుక్ చేసాడు. తర్వాత ముందుగా అనుకున్నట్లు శబరిమల వెళ్ళడానికి 11 రోజుల ముందు అనుమానపడుతూనే మరేం పర్వాలేదని పాపకి మాల వేసాడు. అప్పటివరకు బాగానే ఉంది. కానీ ఒక ఐదు రోజులయ్యాక పాపకి జ్వరమొచ్చి చర్మంపై నీటి పొక్కులు వచ్చాయి. అన్నయ్య నాకు ఫోన్ చేసి, "చెల్లీ! ఇలా పొక్కులు వచ్చాయి, పర్వాలేదా?" అని చాలా కంగారుపడుతూ చెప్పాడు. అది విని మేమద్దరమూ, 'అమ్మవారేమో!' అని చాలా భయపడ్డాం. అన్నయ్య పాపని మరుసటిరోజు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాడు. నాకు ఏం చేయాలో అర్థంకాక, "ఒక వారంలో ప్రయాణం సాయి. ఇప్పుడేమిటి మాకు ఈ పరీక్ష? డాక్టర్ అమ్మవారు కాదని చెప్పాలి. నువ్వే మమ్మల్ని రక్షించాలి. పాపకి ఏవిధమైన బాధ లేకుండా సంతోషంగా కొండకు వెళ్లి, రావాలి. మీరు సదా తనకి తోడుగా ఉండి తను ఏడవకుండా చూడాలి సాయి" అని సాయిని వేడుకున్నాను. మరుసటిరోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పాపని చూసి, " 'HMFD' వైరల్ ఇన్ఫెక్షన్. మరేం పర్వాలేదు. కంగారుపడకండి" అని చెప్పి జ్వరంకి టాబ్లెట్లు ఇచ్చారు. బాబా దయవల్ల పాపకి వారం రోజుల్లో పూర్తిగా నయమైంది. ఇరుముడి కార్యక్రమమయ్యాక శబరిమల వెళ్ళడానికి బయలుదేరుతారనగా పాప బాగా ఏడ్చింది. కానీ బయలుదేరుతూనే ఏడుపు ఆపేసింది. తిరిగి వచ్చేవరకు మళ్ళీ అస్సలు ఏడవలేదు. అన్నయ్య చాలా భయపడినప్పటికీ బాబా దయవల్ల పాప ప్రయాణంలో ఎక్కడా ఇబ్బంది పెద్దలేదు. అంతేకాదు, ఎప్పుడూ 5 నిముషాలు నడవగానే ఎత్తుకోమనే తను శబరిమల కొండ అంతా నడుచుకుంటూ ఎక్కేసింది. అంత చిన్న వయసులో కొండ ఎక్కడం, దిగడం కేవలం బాబా దయవల్లనే సాధ్యమయ్యింది.  ఇంకో విషయం అన్నయ్య మా డాడీని కూడా శబరిమలకు తీసుకెళ్లాడు. నేను డాడీతో, "ఏమి పర్వాలేదు. నువ్వు ఏం భయపడకు. దేవుడి దయవల్ల ఏం ఇబ్బంది కలగదు. బాబా ఉన్నారు" అని ధైర్యం చెప్పాను. బాబా దయవల్ల డాడీ కూడా ఏం ఇబ్బందిపడకుండా బాగానే కొండ ఎక్కారు. అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. మీరు మాకు తోడుగా ఉండగా మాకు ఏ భయం అవసరం లేదు సాయీ".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo