1. శ్రీసాయి దయ
2. బాబా కృప
శ్రీసాయి దయ
సాయి దేవుడికి, సాయి బంధువులకు నమస్కారం. నా పేరు రమాదేవి. నేను ఇప్పుడు మా తిరుమల యాత్రలో బాబా చేసిన సహాయం గురించి మీతో పంచుకుంటున్నాను. 2024, డిసెంబర్ 5న స్వామివారి అర్చన సేవకు మాకు టికెట్ లభించింది. అర్చన సేవకు వెళ్లే భక్తులకు స్వామివారిని 45 నిమిషాలపాటు దర్శించుకునే భాగ్యం ఉంటుందని తెలిసి నేను చాలా సంతోషించాను. కానీ అది నాకు నెలసరి సమయం. నెలసరి రాకుండా టాబ్లెట్లు వేసుకుందామంటే, అవి నాకు పడటం లేదు. అందుకని నాకు ఏం చేయాలో తెలియక, "సర్వ దేవతా దర్శనం మీ కృప వలననే జరుగుతుంది బాబా. వేంకటేశ్వరస్వామి అర్చన సేవకు ఆటంకం రాకుండా చూడండి బాబా" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ తీసుకుంటూ బాబా మీద భారమేశాను. ఒకరోజు ఆఫీసులో నా సహోద్యోగితో విషయం చెపితే తను, "ఒకసారి డాక్టర్ సలహా తీసుకుంటే మంచిద"ని చెప్పింది. నేను అంతా బాబా దయ అని డాక్టర్‌ను కలిస్తే, టాబ్లెట్లు వ్రాశారు. అవి వాడుతూ ఉంటే మా తిరుమల ప్రయాణానికి ముందురోజు వరకు బాగానే ఉంది కానీ, ఆ రోజు ఇబ్బంది మొదలవుతుందేమోననిపించి బాబాను, దత్తాత్రేయుని, వేంకటేశ్వరస్వామిని "మీ కృపతో ఏ ఆటంకం లేకుండా దర్శనం జరగాల"ని వేడుకున్నాను. బాబా దయవలన ఏ ఇబ్బందీ లేకుండా స్వామి దర్శనం, అర్చన సేవ ప్రశాంతంగా జరిగాయి. మరుసటిరోజు మేము తిరుచానూరు వెళ్ళాము. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆరోజు చివరి రోజు. చక్రస్నానం చేసేరోజు. మాకు ఆ విషయం తెలియక పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామనుకున్నాం. కానీ బాబా పంపినట్టు పోలీసువాళ్ళు చక్రస్నానం విశిష్ఠత చెప్పి, స్నానం చేసి వెళ్ళమని చెప్పారు. మేము అలాగే చేసి క్షేమంగా ఇంటికి చేసుకున్నాము. అంతా బాబా దయ. "మీకు చాలా కృతజ్ఞతలు సాయిదేవా".
రెండు నెలల నుండి నా చర్మం, తల బాగా దురదగా ఉంటుండేవి. డాక్టర్ని సంప్రదిస్తే, కొన్ని క్రీములు వాడమన్నారు. వాటిని దురద ఉన్న చోట రాస్తే తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండేది.చివరికి నేను బాబాని వేడుకొని ఊదీ తీసుకొని, ఇన్ఫెక్షన్ ఉన్న చోట బాబా అభిషేక జలం రాశాను. బాబా దయవలన దురద పూర్తిగా తగ్గిపోయింది. "శతకోటి నమస్కారాలు బాబా".
ఒక ఆన్లైన్ అకౌంట్ తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు KYC అప్డేట్ అవ్వలేదు. అప్పుడు, "అకౌంట్ ఓపెనింగ్ అవ్వాలి" అని బాబాని వేడుకుంటే ఏ సమస్య లేకుండా అకౌంట్ ఓపెన్ అయింది. "థాంక్యూ సాయిదేవా. అడుగడుగున మీ తోడు మాకు కావాలి బాబా".
Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDeleteBaba Daya valla antha Manche jarugutundi.. om Sai🙏
DeleteSai Sai Sai.. Raksha Raksha Sai.. kapadu Sai🙏.. problems anni clear ayyela chudu tandri.. saranu saranu sai🙏🙏
ReplyDeleteSai SaiSaiSaisaisaisaisaisaisaisaisai🙏
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteKshaminchu baba🥲🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Sai asahaya sahayaya namaha🙏🙏🙏
ReplyDeleteom sai ram
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDelete