ఈ భాగంలో అనుభవాలు:
1. ఏ సమయంలో తలచినా కరుణించే బాబా
2. సరైన సమయానికి లగేజీ అందేలా చేసిన బాబా
3. గండం గట్టెక్కించిన శ్రీసాయినాథుడు
ఏ సమయంలో తలచినా కరుణించే బాబా
సాయి భక్తులందరికీ నమస్తే. నా పేరు కావ్యాంజలి. నాకు 13 నెలల బాబు ఉన్నాడు. తను నాకు బాబా ఇచ్చిన బిడ్డ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. 2025, జనవరి 29, రాత్రి ఒంటి గంట సమయంలో అందరం నిద్రపోతుండగా హఠాత్తుగా బాబు ఏడుస్తూ నిద్రలేచాడు. మాకేమీ అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపలేదు, నిద్రపోలేదు. మేము చేయని ప్రయత్నమంటూ లేదు. అలా రాత్రి 2:30 అయినా బాబు ఏడుస్తూ నిద్రపోలేదు. ఇంకా అప్పుడు నేను మనసులో, "బాబా! నా బాబుకి ఏమైందో తెలియదు. చెప్పడానికి వాడు మాట్లాడే అంత పెద్దవాడు కాదు. ఈ పసివాడి బాధ మీకే తెలుస్తుంది బాబా. ఆ బాధ తీసేసి హాయిగా నిద్రపోయేలా చేయండి బాబా" అని బాధతో ఆర్తిగా బాబాకి చెప్పుకున్నాను. అంతే! పది నిమిషాల్లో నేను అడిగినట్లుగానే బాబా నా కొడుకు బాధ తీసేసి నిద్రపుచ్చారు. "థాంక్యూ బాబా. 'అసలు మీరు నా ప్రార్థన వింటున్నారా?' అని నేను మిమ్మల్ని చాలాసార్లు అనుమానించినందుకు క్షమాపణలు బాబా. సమయానికి తగినట్లుగా మీరు తప్పక సహాయం చేస్తారని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాను బాబా. తెలిసీతెలియక మీ మాటలు పెడచెవినపెడుతుంటే దయతో క్షమించి సరిచేయండి బాబా. లవ్ యూ బాబా. మీ పాదాలకు వేలాది నమస్కారాలు".
సరైన సమయానికి లగేజీ అందేలా చేసిన బాబా
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో బాబా చూపిన మహిమలు ఎన్నో. అందులో ఒకటి మీతో పంచుకుంటున్నాను. 2024, నవంబర్ నెల మొదట్లో మేము అమెరికాలో ఉన్న మా అబ్బాయి దగ్గర నుండి హైదరాబాదుకి ప్రయాణమయ్యాము. మధ్యలో ఖతార్‌లో విమానం మారి బాబా దయవల్ల సక్రమంగా హైదరాబాద్ చేరుకున్నాము. ఫార్మాలిటీస్ అన్ని పూర్తైన తరువాత లగేజీకోసం వెళితే అక్కడ మొత్తం 4 సూట్ కేసులకు మూడే ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రయాణాలు చేసాము కానీ, ఇలా ఎప్పుడూ జరగలేదు. 2 గంటలు వేచి చూసాక తెలిసిందేమిటంటే, ఆ సూట్ కేసు దోహా(ఖతార్) ఎయిర్ పోర్టులో ఉండిపోయిందని. ఆ సూట్ కేసులో ఆస్ట్రేలియాలో ఉన్న మా అమ్మాయి మరియు తన పిల్లలకోసం చేసిన షాపింగ్, ఇంకా వేరే వాళ్ళు ఇచ్చిన విలువైన గిఫ్ట్‌లు చాలా ఉన్నాయి. వాటిని మేము హైదరాబాదు వచ్చిన వారానికి ఆస్ట్రేలియా వెళ్తున్న మా అమ్మాయి అత్తగారితో పంపించాలని అనుకున్నాము. అందువల్ల మాకు చాలా బాధ కలిగింది. ఎయిర్ పోర్టులో కంప్లైంట్ ఇస్తే, 'మీ లగేజ్ వచ్చిన వెంటనే మీ ఇంటికి పంపిస్తామ'ని చెప్పి అడ్రస్, ఫోను నెంబరు తీసుకున్నారు. మరుసటిరోజు 'మీ సామాను దోహా ఎయిర్ పోర్టులో ఉంద'ని మాకు ఒక నెంబరు నుంచి కాల్ వచ్చింది. అంతే, తరువాత ఆ సూట్ చేసు గురించి ఏ విషయమూ తెలియదు. మేము మాకు కాల్ వచ్చిన నెంబరుకి కాల్ చేసినా ఎవరూ ఎత్తలేదు. అలా 3 రోజులు గడిచాయి. మాకు ఏ సమాచారమూ లేదు. అప్పుడు నేను బాబాను, "మా సామాను సురక్షితంగా వచ్చేలా చూడు తండ్రీ" అని ప్రార్థించాను. తర్వాత బాబా దయవలన మా స్నేహితుల సలహ మీద కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే, "మీ సామాను హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి చేరింది. సాయంత్రం లోపల మీ ఇంటికి వస్తుంద"ని చెప్పారు. అలాగే బాబా దయవలన ఆ రోజు రాత్రి 9గంటలకు మా సూట్ కేసు మాకు అందింది. బాబా సరైన సమయానికి అందించడం వల్ల దాన్ని సమయానికి మా అమ్మాయికి కూడా పంపించగలిగాము. "ధన్యవాదాలు బాబా. మీ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".
గండం గట్టెక్కించిన శ్రీసాయినాథుడు
శ్రీసాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు మురళి. గత కొద్దిరోజులుగా నా భార్య తీవ్రమైన దగ్గుతో చాలా బాధపడుతుంది. దగ్గుకు సంబంధించిన కొన్ని మందులు మెడికల్ షాపు నుండి తెచ్చి తీసుకుంటుంటే ఒకరోజు రాత్రి దగ్గు తగ్గలేదు సరికదా! ఒక మందు తనకి సరిపోక నిద్రపెట్టకపోవడంతో పాటు హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది. అసలే తను బీపీ పేషెంట్. పైగా అర్థరాత్రి సమయమైనందున ఏమి చేయడానికి తోచలేదు. నాకు బాబా తప్ప వేరే దారి లేదు. వెంటనే ఊదీ నీళ్లలో కలిపి నా భార్యకిచ్చి, నిరంతరాయంగా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించాను. అరగంటలో హార్ట్ బీట్ తగ్గింది. అపారమైన కృపతో గండం గట్టెక్కించి అంతటి భయంకరమైన ఆందోళన నుండి బయటపడేసారు బాబా. ఆయనకి ఏమి చేసినా, ఏమిచ్చినా తక్కువే. శ్రీసాయినాథునికి శతకోటి వందనాలు.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya sai🙏.. Sai Amma nannalaki Rakshanaga undu Sai.. vallanu tallivale kapadutu undu baba.. Vallaki ayurarogyalu ivvu tandri 🙏.. om Sri Sai arogya kshemadayanamaha
ReplyDeleteOm Sri Sai arogya kshemadayanamaha
Om Sri Sai arogya kshemadayanamaha
Om Sri Sai arogya kshemadayanamaha 🙏om Sri Sai arogya kshemadayanamaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi
ReplyDeleteOm sai ram
ReplyDelete